'ఆ శిశువులను నేనే చంపాను' | German woman confesses to killing babies | Sakshi
Sakshi News home page

'ఆ శిశువులను నేనే చంపాను'

Published Sun, Nov 15 2015 4:48 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

'ఆ శిశువులను నేనే చంపాను' - Sakshi

'ఆ శిశువులను నేనే చంపాను'

బెర్లిన్: దక్షిణ జర్మనీలోని ఓ ఇంట్లో టవల్, పాస్లిక్ బ్యాగుల్లో ఎనిమిది శిశువుల మృతదేహాలు లభ్యమైన ఘటనలో మిస్టరీ విడిపోయింది. ఆ శిశువుల్లో కొందరిని తానే చంపినట్టు కన్నతల్లి అంగీకరించింది. ప్రస్తుతం తమ అదుపులో ఉన్న ఆమెను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

మునిచ్‌, బెర్లిన్‌కు నడుమ ఉన్న చిన్న పట్టణమైన వాలెన్‌ఫెల్స్‌లోని ఓ ఇంట్లో రెండురోజుల కిందట ఎనిమిది శిశువుల మృతదేహాలు టవళ్లు, ప్లాస్టిక్ బ్యాగుల్లో చుట్టిపెట్టి లభ్యమయ్యాయి. కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న వాటిని పోస్టుమార్టంకు తరలించి పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ శిశువుల తల్లి అయిన 46 ఏళ్ల ఆండ్రియా జీ అనే మహిళను అరెస్టు చేశారు.

కొన్నివారాల కిందట భర్తతో తీవ్రంగా గొడవపడి.. వీడిపోయిన ఆమె ప్రస్తుతం క్రోనాచ్‌ పట్టణంలో ఓ 55 ఏళ్ల వ్యక్తితో కలిసి నివాసముంటున్నది. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు తానే కారణమని, కొందరు శిశువులను తానే చంపానని, మరికొందరు మృతశిశువులు జన్మించారని ఆమె పోలీసులు ముందు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement