German woman
-
సౌండ్ వినలేక పేషెంట్ వెంటిలేటర్‌నే ఆపేసింది! నివ్వెరపోయిన పోలీసులు
వెంటిలేటర్‌పై పేషెంట్ ఉన్నాడంటే ప్రతిక్షణం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు లెక్క. ఐతే అదే గదిలో ఉన్న మరో మహిళా పేషెంట్ తన సహ పేషెంట్ వెంటిలేటర్ శబ్దాన్ని భరించలేక ఆపేసింది. దీంతో ఆమె హత్యానేరం కింద జైలుపాలైంది. వివరాల్లోకెళ్తే...72 ఏళ్ల జర్మన్ మహిళ తన రూమ్మేట్ వెంటిలేటర్‌ని స్విచ్ఆఫ్ చేసింది. ఆమెకి మెషిన్ శబ్ధం చికాకు కలిగించిందని ఆపేసింది. ఇలా రెండు సార్లు వెంటిలేటర్‌ని స్విచ్ ఆఫ్ చేసింది. ఈ ఘటన నవంబర్ 29న జర్మన్‌లోని మాన్హీమ్ నగరంలోని ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఐతే వైద్యులు సదరు మహిళకి పేషెంట్‌కి వెంటిలేటర్ ఎంత కీలకమో చెప్పినా కూడా మళ్లీ ఆపేసిందని వైద్యులు చెబుతున్నారు. అంతేగాదు వెంటిలేటర్‌పై ఉన్న పేషెంట్ ప్రమాదంలో లేడని, ఇంకా ఇంటిన్సెవ్ కేర్‌లో ఉంచి చికిత్స అందిచాల్సి ఉండటంతో ఆ పేషెంట్‌ని అలా ఉంచినట్లు తెలిపారు. దీంతో పోలీసులు సదరు వృద్ధ మహిళను కావలనే ఇలా చేసి సదరు రోగిపై హత్యయత్నానికి పాల్పడి ఉండవచ్చని అనుమానించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆమెను బుధవారం న్యాయస్థానం ముందు హాజరుపరిచి జైలుకి తరలించారు. -
మూడు దేశాల ముచ్చటైన కళ్యాణం
డెన్వర్: జర్మనీ అమ్మాయి, విశాఖ అబ్బాయి ప్రేమ వివాహం పెద్దల సమక్షంలో అమెరికాలో వైభవంగా జరిగింది. లిండా ముల్లర్, దైవిక్ శశాంక్ స్నేహ బంధం ప్రేమగా మారింది. దీంతో పెద్దలను ఒప్పించి వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఎస్బీఐ విశ్రాంత అధికారి, ప్రసిద్ధ గాయకులు, విశాఖ కళాసాగర్ వ్యవస్దాపక అధ్యక్షులు వానపల్లి శ్రీమన్నారాయణ ఏకైక కుమారుడు శశాంక్‌తో లిండా ముల్లర్ వివాహం ముచ్చటగా జరిగింది. ప్రకృతి సోయగాల అందాల నడుమ సాంప్రదాయ పద్ధతిలో అమెరికాలో హిందూ బంధుమిత్రుల నడుమ వేద మంత్రాలతో వైభవంగా ఈ వివాహ వేడుక జరగడం విశేషం. -
‘ఆమెకు ఉగ్రసంస్థలతో సంబంధం ఉండొచ్చు’
తిరువనంతపురం : కేరళ వచ్చిన ఓ జర్మన్ దేశస్థురాలు నాలుగు నెలలుగా కనిపించకపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సదరు మహిళకు ఉగ్రసంస్థలతో సంబంధాలున్నట్లు ఇంటర్‌పోల్ భావిస్తోంది. ఈ క్రమంలో సాధ్యమైనంత తొందరగా ఆమె ఆచూకీ కనుక్కోవాలంటూ కేరళ పోలీసుల మీద ఒత్తిడి తెస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. వివరాలు.. జర్మనీకి చెందిన లీసా వైసే(31) అనే మహిళ ఈ ఏడాది మార్చి 7న యూకేకు చెందిన అలీ మహ్మద్ అనే వ్యక్తితో కలిసి తిరువనంతపురం వచ్చింది. వల్లికావు, కొల్లంలో ఉన్న మాతా అమృతానందమయి మఠాన్ని దర్శించడానికి ఇండియా వచ్చినట్లు లీసా తన ఎంబార్కేషన్ ఫామ్‌లో పేర్కొంది. 2011లో కూడా లీసా ఈ మఠాన్ని సందర్శించడానికి వచ్చిందని.. 2 నెలల పాటు ఇండియాలోనే ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మార్చి 7న తిరువనంతపురం వచ్చిన లీసా.. అదే నెల 10వ తేదీ వరకూ తన కుటుంబ సభ్యులతో కాంటాక్ట్‌లో ఉంది. ఆ తర్వాత లీసా నుంచి ఎటువంటి ఫోన్ రాలేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అవ్వడమే కాక గూగుల్ అకౌంట్స్ కూడా డిలీట్ చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో లీసా తల్లి కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు 11 రోజుల పాటు లీసా గురించి వెతికినప్పటికి ఆమె ఆచూకీ మాత్రం దొరకలేదంటున్నారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా పోలీసులు మాతా అమృతానందమయి మఠానికి వెళ్లి విచారించగా లీసా, మహ్మద్ అనే వ్యక్తులు తమ ఆశ్రమానికి రాలేదని వారు తెలిపారు. లీసా వీసా గడువు ఏప్రిల్ 5తో ముగిసింది. దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నప్పటికి లీసా గురించి ఎటువంటి సమాచారం లభించలేదు. దాంతో కేరళ పోలీసులు లీసా ఫోటో, వివరాలను ఇతర రాష్ట్రాల పోలీస్ స్టేషన్లకు పంపడమే కాక లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. అంతేకాక ఈ కేసు విషయంలో ఇంటర్‌పోల్ సాయం కూడా కోరారు. అయితే లీసాకు ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్నట్లు ఇంటర్‌పోల్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి కేరళ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ‘లీసా, మహ్మద్ కోవలంలోని ఓ హోటల్లో దిగారని, వర్కాల వెళ్లారని మా దర్యాప్తులో తెలీంది. అయితే లీసా, మహ్మద్‌లు ఇద్దరు.. విదేశీయులు ఇండియాలోని హోటల్లోలో కానీ ఇళ్లలో కానీ నివాసం ఉండటానికి అవసరమైన అతి ముఖ్యమైన ఫామ్ సీని నింపలేదు. లీసాతో పాటు వచ్చిన మహ్మద్ మార్చి 15న యూకే వెళ్లినట్లు తెలిసింది. కానీ లీసా మాత్రం ఇప్పటి వరకూ ఇండియాను విడిచి వెళ్లలేదు. మా అనుమానం ప్రకారం లీసా మత సంస్థలు నడుపుతున్న హస్టల్లో లేదా.. ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలో ఉండి ఉండవచ్చు’ అని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఎవరీ లీసా.. జర్మన్ దేశస్థురాలైన లీసా యూదు మతస్తురాలు. అయితె 2012లో ఆమె ఇస్లాంలోకి మారారు. అప్పటి నుంచి ఆమె ఈజిప్ట్‌లోని ఓ ఎన్జీవీతో కలిసి పని చేస్తుంది. కొద్దికాలానికి లీసా అమెరికాకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ హషీమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. కానీ 2016లో లీసా, తన భర్త నుంచి విడిపోయింది. -
'ఆ శిశువులను నేనే చంపాను'
బెర్లిన్: దక్షిణ జర్మనీలోని ఓ ఇంట్లో టవల్, పాస్లిక్ బ్యాగుల్లో ఎనిమిది శిశువుల మృతదేహాలు లభ్యమైన ఘటనలో మిస్టరీ విడిపోయింది. ఆ శిశువుల్లో కొందరిని తానే చంపినట్టు కన్నతల్లి అంగీకరించింది. ప్రస్తుతం తమ అదుపులో ఉన్న ఆమెను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మునిచ్, బెర్లిన్‌కు నడుమ ఉన్న చిన్న పట్టణమైన వాలెన్ఫెల్స్లోని ఓ ఇంట్లో రెండురోజుల కిందట ఎనిమిది శిశువుల మృతదేహాలు టవళ్లు, ప్లాస్టిక్ బ్యాగుల్లో చుట్టిపెట్టి లభ్యమయ్యాయి. కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న వాటిని పోస్టుమార్టంకు తరలించి పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ శిశువుల తల్లి అయిన 46 ఏళ్ల ఆండ్రియా జీ అనే మహిళను అరెస్టు చేశారు. కొన్నివారాల కిందట భర్తతో తీవ్రంగా గొడవపడి.. వీడిపోయిన ఆమె ప్రస్తుతం క్రోనాచ్ పట్టణంలో ఓ 55 ఏళ్ల వ్యక్తితో కలిసి నివాసముంటున్నది. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు తానే కారణమని, కొందరు శిశువులను తానే చంపానని, మరికొందరు మృతశిశువులు జన్మించారని ఆమె పోలీసులు ముందు వెల్లడించారు.