![German woman wedded Indian Man in Denver America - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/15/NRI.jpg.webp?itok=Xj3i6Uui)
డెన్వర్: జర్మనీ అమ్మాయి, విశాఖ అబ్బాయి ప్రేమ వివాహం పెద్దల సమక్షంలో అమెరికాలో వైభవంగా జరిగింది. లిండా ముల్లర్, దైవిక్ శశాంక్ స్నేహ బంధం ప్రేమగా మారింది. దీంతో పెద్దలను ఒప్పించి వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
ఎస్బీఐ విశ్రాంత అధికారి, ప్రసిద్ధ గాయకులు, విశాఖ కళాసాగర్ వ్యవస్దాపక అధ్యక్షులు వానపల్లి శ్రీమన్నారాయణ ఏకైక కుమారుడు శశాంక్‌తో లిండా ముల్లర్ వివాహం ముచ్చటగా జరిగింది. ప్రకృతి సోయగాల అందాల నడుమ సాంప్రదాయ పద్ధతిలో అమెరికాలో హిందూ బంధుమిత్రుల నడుమ వేద మంత్రాలతో వైభవంగా ఈ వివాహ వేడుక జరగడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment