
వాష్టింగన్: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలి కాలంలో వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం మంటల్లో దగ్ధమైంది. విమానం నుంచి ప్రయాణీకులు దిగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి.
వివరాల ప్రకారం. అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం(Denver International Airport)లో శుక్రవారం తెల్లవారుజామున(భారత కాలమానం ప్రకారం) విమానంలో మంటలు చెలరేగాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం-1006.. మంటల్లో దగ్ధమైంది. విమానాశ్రయమంలో ల్యాండ్ అయిన కాసేపటికే మంటలు చెలరేగాయి. దీంతో, ప్రయాణీకులు విమానం నుంచి హుటాహుటినా బయటకు వచ్చి.. ప్రాణాలు రక్షించుకున్నారు. దట్టమైన పొగలో నుంచి ప్రయాణీకులు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

BREAKING: An American Airlines plane just caught fire at Denver International Airport.
What the hell is going on with all these plane incidents since Trump took office?!pic.twitter.com/LsAOVQr8fX— Republicans against Trump (@RpsAgainstTrump) March 14, 2025
అయితే, ప్రమాదం కారణంగా ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో 172 మంది ప్రయాణీకులు, ఆరుగురు విమాన సిబ్బంది ప్రయాణం చేసినట్టు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. వారంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినట్టు సమాచారం.
Passengers exiting the plane via the wing. American Airlines plane on fire at the Denver international airport. ✈️ 🔥 #Denver #Denverinternationalairport #PlaneFire pic.twitter.com/36e7NrBb9G
— VeLore (@Oddland66) March 14, 2025
🚨 #UPDATE American Airlines Flight 1006, a Boeing 737-800, diverted to Denver International Airport due to engine vibrations during its journey from Colorado Springs to Dallas. After landing safely, one of the engines caught fire, prompting an emergency evacuation. Six… https://t.co/dyQONtD4ZT pic.twitter.com/mGK8cSpqjE
— SyeClops (@SyeClops) March 14, 2025
Comments
Please login to add a commentAdd a comment