వెంటిలేటర్‌పై పేషెంట్ ఉన్నాడంటే ప్రతిక్షణం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు లెక్క. ఐతే అదే గదిలో ఉన్న మరో మహిళా పేషెంట్ తన సహ పేషెంట్ వెంటిలేటర్ శబ్దాన్ని భరించలేక ఆపేసింది. దీంతో ఆమె హత్యానేరం కింద జైలుపాలైంది.
వివరాల్లోకెళ్తే...72 ఏళ్ల జర్మన్ మహిళ తన రూమ్‌మేట్ వెంటిలేటర్‌ని స్విచ్‌ఆఫ్ చేసింది. ఆమెకి మెషిన్ శబ్ధం చికాకు కలిగించిందని ఆపేసింది. ఇలా రెండు సార్లు వెంటిలేటర్‌ని స్విచ్ ఆఫ్ చేసింది. ఈ ఘటన నవంబర్ 29న జర్మన్‌లోని మాన్‌హీమ్ నగరంలోని ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఐతే వైద్యులు సదరు మహిళకి పేషెంట్‌కి వెంటిలేటర్ ఎంత కీలకమో చెప్పినా కూడా మళ్లీ ఆపేసిందని వైద్యులు చెబుతున్నారు.
అంతేగాదు వెంటిలేటర్‌పై ఉన్న పేషెంట్ ప్రమాదంలో లేడని, ఇంకా ఇంటిన్సెవ్ కేర్‌లో ఉంచి చికిత్స అందిచాల్సి ఉండటంతో ఆ పేషెంట్‌ని అలా ఉంచినట్లు తెలిపారు. దీంతో పోలీసులు సదరు వృద్ధ మహిళను కావలనే ఇలా చేసి సదరు రోగిపై హత్యయత్నానికి పాల్పడి ఉండవచ్చని అనుమానించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆమెను బుధవారం న్యాయస్థానం ముందు హాజరుపరిచి జైలుకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment