ఆరిలోవ: విశాఖ కేంద్రకారాగారంలో ఖైదీలకు గంజాయి సరఫరా చేసే యత్నంలో ఓ ఉద్యోగి అధికారులకు చిక్కాడు. జైలు సిబ్బంది తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్ వివరాలు ప్రకారం.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కడియం శ్రీనివాస్ ఫార్మసిస్ట్‌గా ఏడాది నుంచి డిప్యుటేషన్‌పై విశాఖ కేంద్ర కారాగారం ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఈ జైలుకు సంబంధించి ప్రత్యేకంగా నియమించిన వైద్యులు, ఫార్మసిస్టులు లేకపోవడంతో డిప్యూటేషన్‌పై వచ్చినవారే పనిచేయాల్సి ఉంటుంది.
శ్రీనివాస్ మంగళవారం డ్యూటీకి వచ్చేటప్పుడు భోజనం క్యారేజీ తీసుకొచ్చారు. అందులో గంజాయి ఉన్నట్లు జైలు ప్రధాన ద్వారంవద్ద సిబ్బంది తనిఖీల్లో బయటపడింది. ప్రధాన ద్వారం సెక్యూరిటీ సిబ్బంది జైలులో పనిచేస్తున్న ఉద్యోగుల రాకపోకల సమయంలో తనిఖీలు చేస్తుంటారు. దీన్లోభాగంగా చేపట్టిన తనిఖీల్లోనే శ్రీని వాస్ క్యారేజీలో 90 గ్రాముల గంజాయి పట్టుబడింది. దీంతో శ్రీనివాస్‌పై ఆరిలోవ పోలీసులకు సూపరింటెండెంట్ ఫిర్యాదు చేశారు. గంజాయి స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. రిమాండ్‌పై సెంట్రల్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment