Pharmacist
-
గంజాయి సరఫరా చేస్తున్న ఫార్మసిస్ట్ అరెస్టు
ఆరిలోవ: విశాఖ కేంద్రకారాగారంలో ఖైదీలకు గంజాయి సరఫరా చేసే యత్నంలో ఓ ఉద్యోగి అధికారులకు చిక్కాడు. జైలు సిబ్బంది తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్ వివరాలు ప్రకారం.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కడియం శ్రీనివాస్ ఫార్మసిస్ట్‌గా ఏడాది నుంచి డిప్యుటేషన్‌పై విశాఖ కేంద్ర కారాగారం ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఈ జైలుకు సంబంధించి ప్రత్యేకంగా నియమించిన వైద్యులు, ఫార్మసిస్టులు లేకపోవడంతో డిప్యూటేషన్‌పై వచ్చినవారే పనిచేయాల్సి ఉంటుంది.శ్రీనివాస్ మంగళవారం డ్యూటీకి వచ్చేటప్పుడు భోజనం క్యారేజీ తీసుకొచ్చారు. అందులో గంజాయి ఉన్నట్లు జైలు ప్రధాన ద్వారంవద్ద సిబ్బంది తనిఖీల్లో బయటపడింది. ప్రధాన ద్వారం సెక్యూరిటీ సిబ్బంది జైలులో పనిచేస్తున్న ఉద్యోగుల రాకపోకల సమయంలో తనిఖీలు చేస్తుంటారు. దీన్లోభాగంగా చేపట్టిన తనిఖీల్లోనే శ్రీని వాస్ క్యారేజీలో 90 గ్రాముల గంజాయి పట్టుబడింది. దీంతో శ్రీనివాస్‌పై ఆరిలోవ పోలీసులకు సూపరింటెండెంట్ ఫిర్యాదు చేశారు. గంజాయి స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. రిమాండ్‌పై సెంట్రల్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. -
Nikhila Vengala: బ్యూటీ కాంటెస్ట్‌లో ‘నువ్వు ఫిట్ కావు’ అన్నారు..
‘సాయం చేయాలన్న ఆలోచన ఉండగానే సరిపోదు ఆ ఆలోచనను ఆచరణలో కూడా పెట్టాలి’ అంటారు వెంగళ నిఖిల. హైదరాబాద్ వాసి అయిన నిఖిల కిందటేడాది మిసెస్ హైదరాబాద్, మిసెస్ తెలంగాణ, మిసెస్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకుంది. బ్యూటీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయడమే కాదు బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొనేవారిని ట్రైన్ చేస్తుంది. ఫార్మసిస్ట్‌గా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వర్క్ చేస్తుంది. ఒక బిడ్డకు తల్లిగా, కుటుంబ బాధ్యతలూ నిర్వర్తిస్తుంది. ‘సమయమే కాదు దానిని సద్వినియోగం చేసుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది’ అని చెబుతున్న నిఖిల జర్నీ నేటి మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తుంది. ‘‘యాక్టర్స్, మోడల్స్ కే కాదు ఇటీవల జరిగిన మిస్టర్ ఇండియా కాంటెస్ట్‌కు మెంటార్‌గా ఉన్నాను. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే ఫైనల్స్‌కి 51 మంది ఎంపికయ్యారు. వారిని ట్రైన్, గ్రూమ్ చేయడానికి టీమ్‌లో నేనొక మెంబర్‌గా పనిచేశాను. యాసిడ్ బాధితులకు మద్దతుగా నిలిచే లక్ష్మీ ఫౌండేషన్ గురించి అవగాహన కలిగించడానికి చేసిన కాంటెస్ట్ అది. కంటెస్టెంట్స్ అందరినీ పక్కన పెడితే టీమ్‌లో ఉండి ఆ ఫౌండేషన్‌కు సపోర్ట్ చేయాలనే ఆలోచనతో అందరికన్నా ఎక్కువ నిధులు సమకూర్చగలిగాను. దీనికి మిసెస్ గోల్డెన్ ఆఫ్ హార్ట్ సౌత్ ఇండియా క్రౌన్ వచ్చింది. ► కష్టమైనా .. సులువే.. ఎమ్‌ఫార్మసీ చేశాను. నా రీసెర్చ్ వర్క్‌పై చాలా ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి. డయాబెటిస్, ఒబేసిటీ పైన ఎక్కువ వర్క్ చేశాను. కార్పొరేట్ హాస్పిటల్స్‌కి, క్యాన్సర్ హాస్పిటల్‌కి మెడికల్ రైటర్‌గా ఉన్నాను. వృత్తినీ, కుటుంబాన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూనే నా కలలనూ నెరవేర్చుకుంటున్నాను. బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొనడం నాకో ప్యాషన్. అందరిలాగే మా అమ్మానాన్నలు కూడా ‘ఏం చేయాలనుకున్నా పెళ్లి తర్వాత నీ ఇష్టం’ అన్నారు. దీంతో పెళ్లివైపే మొగ్గు చూపాను. బాబు పుట్టాక, ఇంటిపనులతో క్షణం తీరిక లేకుండా ఉండేది. కానీ కొన్ని రోజుల్లోనే నా గురించి నేను ఆలోచించుకోవడం మొదలుపెట్టాను. మావారి సపోర్ట్‌తో ఇలాంటి కాంటెస్ట్‌లో పాల్గొనడం మొదలుపెట్టాను. ► టైమ్ ప్రకారం ప్లానింగ్.. నా పెళ్లికి ముందు యోగా, జిమ్ చేసేదాన్ని. క్లాసికల్ డ్యాన్సర్‌ని కూడా. ప్రెగ్నెన్సీ తర్వాత అన్ని యాక్టివిటీస్‌కి దూరమయ్యాను. రెండేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి నన్ను నేను మార్చుకోవాలి అనే ప్రయత్నంలో చాలా ఒత్తిడికి లోనయ్యాను. టైమ్‌కి తినాలి, టైమ్ ప్రకారం వ్యాయామాలు, టైమ్‌కి నిద్ర.. అన్నీ ప్లాన్ చేసుకోవాలి. వీటితోపాటు ఇంటినీ, బాబునూ చూసుకోవాలి, అలాగే ఆఫీస్ వర్క్ కూడా చూసుకోవాలి. వీటన్నింటికీ నన్ను నేను సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టాను. కష్టమనిపించినా ప్రతి రోజూ ప్రయత్నించడమే. ఒక్కరోజు కూడా నా రొటీన్ వర్క్‌ని బ్రేక్ చేయకూడదు అనుకున్నాను. మా బాబుకు ఏడాదిన్నర వయసు ఉన్నప్పటి నుంచీ మిస్ కాకుండా చూసుకోవచ్చు అనే ఆలోచనతో వాడినీ బ్యూటీ కాంటెస్ట్ దగ్గరకు తీసుకెళుతుంటాను . నా ప్యాషన్‌ని, డ్రీమ్‌ను నెరవేర్చుకోవడానికి కృషి చేస్తూనే ఉంటాను. ► నువ్వు ఫిట్ కావు అన్నారు... బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనడానికి ముందు నేను అమ్మను. బ్యూటీ ఇండస్ట్రీలో ఉండాలంటే అందంగా కనిపించాలి. బాహ్య సౌందర్యమే కాదు, అంతఃసౌందర్యం కూడా బాగుండాలి. నిజానికి అప్పుడు నేనంత సిద్ధంగా లేను. బరువు, ఫేస్ గ్లో .. సమస్యలు ఉన్నాయి. దాంతో‘నువ్వు ఈ బ్యూటీ కాంటెస్ట్‌కు ఫిట్ కావు’ అన్నారు నన్ను చాలా మంది. కానీ, నేను అవేమీ పట్టించుకోలేదు. నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. నా జర్నీని నేను మళ్లీ మొదలుపెట్టాలి అని నన్ను నేను పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నాను. ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా ఫిట్‌గా మార్చుకున్నాను. ఈ విషయంలో మావారు తప్ప ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదు. నేనూ అవేమీ పట్టించుకోలేదు. ‘మానసికంగా నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను’ అనే ఆలోచనతో టైటిల్స్ సాధించాను. దీంతో నా చుట్టూ ఉన్న అందరిలోనూ ఒక మంచి గుర్తింపు లభించింది. అదే నన్ను మంచి పొజిషన్‌కి తీసుకువచ్చింది. ► యాసిడ్ దాడి బాధితులకు.. కొన్నేళ్ల క్రితం రాష్ట్రంలో ఇద్దరు అమ్మాయిలపై యాసిడ్ దాడి జరిగింది. ఆ కాలేజీకి, మా కాలేజీ దగ్గర. ఆ ఇన్సిడెంట్ నేను చూశాను. చాలా బాధనిపించింది. ఇప్పుడు యాసిడ్ దాడి బాధితులకు సాయం చేసే అవకాశం వచ్చింది. వదులుకోవద్దు అనుకున్నాను. ఏదీ నేను ఆశించలేదు. ఒక మంచి పని కోసం కృషి చేస్తున్నాం. ఎంత వచ్చినా అవసరమైన వారికి చేరుతుంది అనే ఆలోచనతోనే పనిచేశాను. ► అవగాహన కలిగిస్తూ... చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ల కోసం ఒక బ్యూటీ కాంటెస్ట్ ఏర్పాటు చేశాం. అప్పుడు మంచి స్పందన వచ్చింది. చిన్నారుల ఆపరేషన్లకు ఆ డబ్బును డొనేట్ చేశాం. ఇప్పుడు కూడా ఇలాగే ఈ బ్యూటీ కాంటెస్ట్‌ను ఏర్పాటు చేశాం. ఎవరినీ ఒత్తిడి చేయం. మా బంధుమిత్రులకు, తెలిసినవారికి మా ఆలోచనను తెలియజేశాం. ఈ కాంటెస్ట్ ద్వారా చర్మదానం పట్ల ఒక అవగాహన కల్పించాం. మంచి గుర్తింపు లభించింది. ఇక ముందు కూడా లక్ష్మీ ఫౌండేషన్‌కి జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి కాంటెస్ట్‌లు చేయాలని, వాటిలో పాల్గొని యాసిడ్ దాడి బాధితులకు ఆసరాగా ఉండాలనుకుంటున్నాను’’ అని చెప్పారు నిఖిల వెంగళ. – నిర్మలారెడ్డి -
కుష్టు వ్యాధి నియంత్రణ యూనిట్ల ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో హేతుబద్దీకరణ ప్రారంభమైంది. రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు వైద్యాధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో కుష్టు వ్యాధి నియంత్రణ, మెటర్నరీ హెల్త్, టెంపరరీ హాస్పిటలైజేషన్ తదితర సేవలు ఉన్నాయి. అయితే కాలక్రమేణా ఆయా సేవలన్నీ ఆసుపత్రుల్లో సాధారణ సేవలుగా ప్రధాన స్రవంతిలో కలిసిపోయాయి. దాంతో ఈ యూనిట్లు నిరుపయోగంగా మారాయని వైద్య ఆరోగ్యశాఖ భావించింది. అలాగే చిన్న జిల్లాల ఏర్పాటుతో సబ్–డివిజనల్ స్థాయిలో ఉన్న డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయాలు కూడా నిరుపయోగంగా మారాయి. ఈ నేపథ్యంలో వాటిని కూడా ఎత్తివేసి అందులోని సిబ్బందిని ఇతర చోట్ల సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 235 యూపీహెచ్‌సీల్లో వైద్యులు, నర్సులు, ఫార్మసిస్ట్ పోస్టులను కాంట్రాక్ట్ సిబ్బందితో భర్తీ చేసి నడిపిస్తున్నారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, వ్యాక్సినేషన్, అంటువ్యాధుల సమయంలో పర్యవేక్షించడం తదితర సేవల్లో యూపీహెచ్సీల సిబ్బంది కీలకం. దీంతో.. ఎత్తివేసే యూనిట్ల నుంచి సిబ్బందిని వీటిల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. 40 మండలాల్లో పీహెచ్‌సీలు, 6 డీఎంహెచ్వోలు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం (పీహెచ్సీ) లేని మండలాలు రాష్ట్రంలో 40 ఉన్నాయి. సిబ్బందిని హేతుబద్దీకరించడం, పునర్విభజించడం వల్ల ఆ 40 మండలాల్లోనూ పీహెచ్‌సీలను ప్రారంభించడానికి వీలు కలుగుతుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల సంఖ్య 10 నుంచి 33కి పెరిగింది. కొత్తగా రూపొందించిన 23 జిల్లాల్లోని డీఎంహెచ్‌వో కార్యాలయాలు కాంట్రాక్టు సిబ్బందితో నడుస్తున్నాయి. ఈ కార్యాలయాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో సిబ్బందిని డీఎంహెచ్‌వో కార్యాలయాలకు తిరిగి పంపిస్తారు. జీహెచ్ఎంసీ జనాభా పెరుగుదలతో ప్రజారోగ్య పరిపాలనను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆరు డీఎంహెచ్వోలను కొత్తగా నియమిస్తారు. 80 శాతం డాక్టర్లు ఇతర ప్రాంతాల్లోనే నివాసం గ్రామాల్లో వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్లు పట్టణాలకే పరిమితమవుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి గతంలో ఓ నివేదిక సమరి్పంచింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)లో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బందిలో 80 శాతం మంది ఇతర ప్రాంతాలు, పట్టణాల్లో నివాసం ఉంటున్నారని ఆ నివేదిక వెల్లడించింది. దీంతో వారు పనిచేసే ఆసుపత్రికి వెళ్లి రావడానికే ఎక్కువ సేపు ప్రయాణం చేయాల్సి వస్తోందని పేర్కొంది. ఎక్కువమంది విధులకు డుమ్మా కొడుతున్నారని, 40% గైర్హాజరు ఉంటోందని నివేదిక స్పష్టం చేసింది. దీంతో ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందించడం ప్రధాన సవాల్‌గా మారిందని ఆ నివేదిక అభిప్రాయపడింది. అధికంగా ఉన్న చోట నుంచి లేని చోటకు సిబ్బంది ఇక రాష్ట్రంలో కొన్ని ఆసుపత్రుల్లో ఎక్కువ మంది, కొన్నిచోట్ల మరీ తక్కువ సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతం, అక్కడి జనాభా అవసరాలకు అనుగుణంగా వైద్యులు, ఇతర సిబ్బందిని సర్దుబాటు చేయాలని ఆ నివేదిక సర్కారుకు ప్రతిపాదించింది. ఆ ప్రకారమే ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖ రంగం సిద్ధం చేసింది. ఎంతమంది సిబ్బందిని ఒకచోట నుంచి మరో చోటకు మార్చాలన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కసరత్తు ప్రారంభించాయి. త్వరలోనే సిబ్బందిని గుర్తించి వారిని అవసరమైనచోటకు పంపిస్తారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా పలు జిల్లా కేంద్రాల్లోనే ఏళ్లుగా పాతుకుపోయిన వారికి స్థానచలనం తప్పకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
వెరైటీ వెడ్డింగ్ కార్డు! హర్ష గోయెంకా మనసును దోచింది!
ఇటీవలకాలంలో యువత తమ సృజనాత్మకతను జోడించి చాలా వినూతనంగా వివాహాలు చేసుకుంటున్నారు. అందర్నీ ఆకట్టుకునేలా ఔరా! అనిపించేలా వివాహాలు జరుపుకుంటున్నారు. కొంతమంది హంగు ఆర్భాటాలతో పెళ్లిళ్లు చేసుకుంటే మరికొంతమంది చాలా సింపుల్‌గా వివాహాలు చేసుకుని అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడోక జంట భావించింది కాబోలు. ఆ నవ దంపతుల వివాహా ఆహ్వాన పత్రికను చూసే ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు విషయమేమిటంటే...ఆ దంపతులు తమ వెడ్డింగ్ కార్డు వెరైటీగా ఉండాలనుకున్నారు కాబోలు. అందుకోసం వారి వివాహా ఆహ్వాన పత్రికనే ఒక ట్యాబ్లెట్ స్టిప్స్ ఆకారంలో రూపొందించారు. ట్యాబ్లెట్ వెనుకవైపు ఉండే విభాగంలో ఆయా ట్యాబ్లెట్‌కి సంబంధించిన వివరాలు మాదిరిగా.. హెచ్చరిక, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి తదితర అంశాలో వారి సమాచారం ఉంది. నిశితంగా చూస్తేనే అది ఆహ్వాన పత్రిక అని తెలుస్తుంది. పైగా చాలా ఫన్నీగా అనిపిస్తోంది కూడా. పెళ్లి పత్రికలో ఎలా అయితే వధువు, వరుడు వివరాలు ఉంటాయో అలానే అన్ని వివరాలు పొందుపరిచి ఉన్నాయి. ఇలాంటి ఆలోచన రావడం కూడా గ్రేట్. అంతేకాదండోయ్ వరుడు పేరు ఎళిలరసన్ ఫార్మసీ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాగా, వధువు వసంతకుమారి నర్సింగ్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రోఫెసర్. తరుచు సోష్ల్ మీడియాలో యాక్టివిగ్ ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆర్పీజీ చైర్మన్ హర్ష గోయెంకాను ఎంతగానో ఇంప్రెస్ చేసింది ఈ వివాహ పత్రిక. ప్రజలు చాలా కొత్తదనం కోరుకోవడమే కాదు వినూత్నంగా ఆలోచిస్తున్నారు అని కొనియాడారు. ఇది ఫార్మసిస్ట్ వివాహా ఆహ్వాన పత్రిక అంటూ...ఆ జంట ఆలోచనని ప్రశంసించారు. A pharmacist’s wedding invitation! People have become so innovative these days…. pic.twitter.com/VrrlMCZut9 — Harsh Goenka (@hvgoenka) August 20, 2022 (చదవండి: మెట్రో స్టేషన్‌పై వ్యక్తి హల్చల్.. పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా!) -
ఫార్మాసిస్ట్ వచ్చీరాని వైద్యం.. బాలిక మృతి
మల్కన్‌గిరి (ఒడిశా): ఓ ఫార్మాసిస్ట్ వచ్చీరాని వైద్యం.. ఓ బాలిక మృతికి దారితీసింది. బాధిత కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. వివరాలిలా ఉన్నాయి.. జిల్లా కేంద్రంలోని జగన్నాథ్ మందిరం సమీపంలో నివాసముంటున్న సందీప్ బెహరా అనే ఫార్మాసిస్ట్ తన ఇంటి వద్దనే క్లినిక్ నిర్వహిస్తూ తన వద్దకు వచ్చిన రోగులకు వైద్యం చేస్తుంటాడు. బుధవారం ఉదయం 4 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఎంవీ–44 గ్రామానికి చెందిన వాసుదేవ్ బాలా కూతురు వందన బాలా(14)ని చికిత్స కోసం ఇతడి వద్దకు తీసుకువచ్చారు. చదవండి: (తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు రోజులుగా భర్త మృతదేహంతోనే..) పరీక్షించిన సందీప్ బాలికకు బ్లడ్ టెస్ట్(రక్త పరీక్ష) చేయించాలని సూచించారు. ఈ పరీక్ష అనంతరం వచ్చిన రిపోర్టులో సదరు బాలికకు ప్లేట్లెట్స్ తగ్గినట్లు తేలింది. దీంతో మెరుగైన వైద్యం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి బాలికను తరలించేందుకు బాధిత కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఆస్పత్రిలో అయితే సకాలంలో వైద్యం అందించరని, ఇక్కడ తానే వైద్యం చేసి, బాగు చేస్తానని సందీప్ వారికి నచ్చజెప్పాడు. ఆయన మాటలు నమ్మి, బాలికను అక్కడే ఉంచారు. ఈ క్రమంలో సందీప్ వైద్యం అందించినప్పటికీ తీవ్ర అస్వస్థతతో గురువారం ఉదయం బాలిక కన్నుమూసింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు సదురు ఫార్మాసిస్ట్ నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. అనంతరం సందీప్‌పై ఈడ్చుకుని వెళ్లిమరీ పోలీసులకు అప్పగించి, అతడిపై కేసు నమోదు చేయించారు. -
జీజీహెచ్, గుంటూరులో 129 పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ).. గుంటూరు జిల్లా ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో(జీజీహెచ్) ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 129 ► పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఫిజిసిస్ట్, డేటాఎంట్రీ ఆపరేటర్, బయో–మెడికల్ ఇంజనీర్, ఆప్టోమెట్రిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, ల్యాబ్ అటెండెంట్స్ తదితరాలు. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, జీఎన్ఎం, డిప్లొమా/బీఎస్సీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నాలజీలో సర్టిఫికేట్ కోర్సులతోపాటు ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్, జీజీహెచ్, గుంటూరు, ఏపీ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021 ► వెబ్సైట్: guntur.ap.gov.in -
నేను చచ్చే దాకా ఆమె నన్ను వదలదు..
సాక్షి, పెదగొట్టిపాడు (ప్రత్తిపాడు): ‘నేను చచ్చే దాకా ఆమె నన్ను వదలదు.. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు’.. అంటూ వైద్యాధికారినుద్దేశించి వాట్సాప్ స్టేటస్ పెట్టిమరీ పీహెచ్సీ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని పీహెచ్సీలో ఫార్మాసిస్ట్‌గా సంధ్య కొంత కాలంగా పనిచేస్తూ అదే గ్రామంలోని అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. అయితే పీహెచ్సీ సిబ్బంది తీరుతో ఆమె ఇబ్బందిపడుతున్నారు. ఓపీ స్లిప్పులు రాయాల్సిందిగా ఫార్మాసిస్టును శుక్రవారం స్టాఫ్ నర్సులు కోరారు. అందుకు సంధ్య నిరాకరిస్తూ అది తన డ్యూటీ కాదని చెప్పారు. దీంతో వైద్యాధికారి డాక్టర్ రత్నశ్రీ ఫార్మాసిస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా శనివారం తెల్లవారుజామున 2.40 గంటల సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుంటున్నట్టుగా కనిపిస్తున్న చిత్రాన్ని సెల్ఫీ తీసుకుని.. ‘డాక్టర్ రత్నశ్రీ నన్ను అవమానించింది.. అవమానిస్తూనే ఉంటుంది. నేను చచ్చే దాకా వదలదు. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఏమీ చేయలేని దానిగా బతకటం కంటే.. చస్తే ఈ బాధలేవీ నాకుండవ్.. సో ఐయామ్ గెట్టింగ్ సూసైడ్’ అంటూ స్టేటస్ అప్డేట్ చేసింది. ఉదయాన్నే స్టేటస్‌ను గమనించిన సిబ్బంది, సహచరులు గ్రామ వలంటీర్లకు సమాచారం ఇచ్చారు. వారు సంధ్య ఇంటికి వెళ్లి చూడగా ఆమె అపస్మారక స్థితిలో ఉండి.. తనకు నీరసంగా ఉందని చెప్పి వారిని వెనక్కి పంపినట్టు సమాచారం. ఈ విషయం డీఎంహెచ్‌వో యాస్మిన్ దృష్టికి వెళ్లడంతో ఆమె ప్రాథమిక విచారణకు ఆదేశించారు. డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్ రమేష్ ఆస్పత్రిలో ప్రాథమిక విచారణ చేపట్టారు. వైద్యాధికారి రత్నశ్రీతో పాటు స్టాఫ్ నర్సులను విచారించారు. విచారణ నివేదికను డీఎంహెచ్‌వోకు అందజేస్తానని రమేష్ వివరించారు. కాగా, తాను ఎవ్వరినీ వేధించలేదని డాక్టర్ రత్నశ్రీ చెప్పారు. -
ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. సింహాద్రి బాలుపై ఆరోపణ
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని ఏలూరులో వెదురుపర్తి సౌజన్య (24) అనే ఫార్మసిస్ట్ ఆత్మహత్యకు పాల్పడింది. తన నివాసంలోనే ఉరివేసుకోగా ఆసుపత్రికి తరలించేలోపే సౌజన్య మృతి చెందింది. సౌజన్య హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీలో పనిచేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఏలూరుకు చెందిన సింహాద్రి బాలు అనే వ్యక్తి మోసం చేయడం వలనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని సౌజన్య తండ్రి ఆరోపిస్తున్నారు. బాలు గతంలోనూ ఓ యువతిని మోసగించిన కేసులో ఏలూరు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సౌజన్య తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సెల్ఫీ వీడియో తీసుకొని అనంతరం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం: నాగేంద్ర) -
వికటించిన మందులు
విశాఖపట్నం , అగనంపూడి (గాజువాక): ఒక సిరప్ బదులు మరో సిరప్ ఫార్మాసిస్ట్ ఇవ్వడంతో ఆ మందు వికటించి చిన్నారిని ప్రాణాపాయ స్థితికి తీసుకువెళ్లింది. ఈ సంఘటన అగనంపూడిలో చోటు చేసుకుంది. అగనంపూడి నిర్వాసితకాలనీ కొత్తూరుకు చెందిన సీతిన గణేష్, రూపల మూడేళ్ల పాప హేమచంద్రికకు జ్వరం, జలుబు చేయడంతో అగనంపూడి ఆస్పత్రికి బుధవారం మధ్యాహ్నం తీసుకువెళ్లారు. ఆస్పత్రిలోని పిల్లల వైద్యనిపుణుడు జ్వరానికి, జలుబుకు సిరప్లు మందుల చీటిపై రాశాడు. అయితే పొరపాటున ఫార్మాసిస్ట్ వేరే సిరప్లు ఇవ్వడం, వాటిని పాపకు పట్టడంతో ఒళ్లంతా రంగుమారిపోయి, దద్దుర్లు వచ్చాయి. అంతలోనే స్పృహ తప్పిపోవడంతో వెంటనే అగనంపూడి ఆస్పత్రికి తీసుకు వెళ్లగా మందులు మారిపోయినట్టు గుర్తించిన సిబ్బంది కేజీహెచ్‌కు పంపించారు. పాప పరిస్థితి విషమంగా మారుతుండడంతో పాప తల్లిదండ్రులు గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఇదే విషయంపై బాధితులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయగా, పోలీస్ ఫిర్యాదు చేసుకోవాలని సమాధానం చెప్పడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రియుడి కోసమే భార్యను చంపేశాడు
లండన్ : ఈ ఏడాది మే నెలలో లండన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన భారత సంతతి మహిళ జెస్సికా పటేల్(34) మరణ మిస్టరీ వీడింది. భర్త మితేష్ పటేల్ చేతిలోనే ఆమె దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో గురువారం తుది తీర్పు వెలువడనుందని పేర్కొన్నారు. వివరాలు... భారత సంతతికి చెందిన జెస్సికా, మితేష్‌లకు మాంచెస్టర్ యూనివర్సిటీలో చదివే సమయంలో స్నేహం ఏర్పడింది. తర్వాత కొన్నాళ్లకు ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కలిసి మిడిల్స్‌బోరోలో గత మూడేళ్లుగా తమ ఇంటికి సమీపంలోనే మందుల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది మే నెలలో జెస్సికా అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో మితేష్‌పై అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు పలు షాకింగ్ నిజాలు వెల్లడించాడు. ప్రియుడి కోసమే భార్యను చంపేశాడు.. మితేష్‌కు గే(స్వలింగ సంప్కరుల) డేటింగ్ యాప్ ద్వారా 2015లో సిడ్నీకి చెందిన డాక్టర్ అమిత్ పటేల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అతడిని పెళ్లాడాలని భావించిన మితేష్ భార్య అడ్డు తొలగించుకునేందుకు పథకం రచించాడు. భార్యతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూనే ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా అమిత్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లి, అక్కడే సెటిల్ అవ్వాలని భావించిన మితేష్... అందుకు కావాల్సిన డబ్బు కోసం జెస్సికా పేరిట రెండు మిలియన్ పౌండ్ల జీవిత బీమా కూడా చేయించాడు. ఇందులో భాగంగానే ఓ రోజు (మే 20న) జెస్సికా ఫార్మసీ నుంచి ఇంటికి రాగానే ఆమెతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఆమె చేతులు కట్టేసి, ప్లాస్టిక్ కవర్‌ను ముఖం చుట్టూ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అయితే భార్యను ఎంతగానో ప్రేమించే మితేష్ ఆమెను హత్య చేశాడంటే మొదట కుటుంబ సభ్యులు కూడా నమ్మలేకపోయారు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు నిజం బయటపడింది. ‘నా భార్యను చంపేయాలి.. ఆమె హత్యకు కుట్రపన్నుతున్నా... ఇందుకోసం ఇతరుల సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఇన్సులిన్ ఓవర్‌డోస్.. ఒక మనిషిని చంపడానికి ఎంత మెథడాన్ అవసరం పడుతుంది అని జెస్సికా హత్యకు ముందు మితేష్ గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు. ఫార్మసీలో అందరికీ తెలుసు.. కాగా 2011 నుంచే గే డేటింగ్ యాప్‌లో ప్రిన్స్ అనే మారుపేరుతో మితేష్ చాటింగ్ చేసేవాడని, ఈ విషయం ఫార్మసీలో అందరికీ తెలిసనప్పటికీ వారు రహస్యంగా ఉంచడంతోనే ఈ విషయం జెస్సికా దృష్టికి వచ్చి ఉండదని ఆమె తరపు లాయర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భార్యను హత్య చేయడంతో పాటు, చేసిన నేరం పట్ల కాస్త కూడా పశ్చాత్తాపం లేని మితేష్‌కు ఉరి శిక్షే సరైందని టెసీడ్ మెజిస్ట్రేట్ జస్టిస్ జేమ్స్ గాస్ అభిప్రాయపడ్డారు. -
ఔషధ దుకాణాల్లో అర్హులేరి?
కర్నూలు(హాస్పిటల్): రోగమేదైనా కరెక్టు మెడిసిన్ పడితే నివారణ అవుతుంది.. అదే రాంగ్ మెడిసిన్ ఇస్తే రోగ నివారణ దేవుడెరుగు ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి. అయితే ఇందుకు సంబంధించి అవగాహన ఉన్న వారైతే వైద్యులు ఇచ్చిన ప్రిస్కిప్షన్ ఆధారంగా రోగులకు సరైన మెడిసిన్ ఇచ్చే అవకాశం ఉంది. అవగాహన లేని వ్యక్తి వైద్యం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో... అర్హతలేని వ్యక్తి ఇచ్చే మెడిసిన్ కూడా అలాంటి ఫలితాన్నే ఇస్తుంది. ఈ విషయం తెలిసినా ఔషధ దుకాణదారులు ఫార్మాసిస్టులు లేకుండానే మం దులు విక్రయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. అధికారులు సైతం నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతుండడంతో పరిస్థితి మరింత తీవ్రతరమవుతోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాకు సంబంధించి కర్నూలుతోపాటు ప్రధాన పట్టణాల్లో 3వేలకుపైగా రిటైల్ మెడికల్‌షాపులు, 200కు పైగా హోల్‌సేల్ మెడికల్ ఏజెన్సీలున్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా రూ.13కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోందని అంచనా. నిబంధనల ప్రకారం ప్రతి దుకాణంలో తప్పనిసరిగా ఫార్మాసిస్టు పర్యవేక్షణలోనే మందులు విక్రయించాలి. కానీ 70 శాతానికి పైగా షాపుల్లో ఫార్మాసిస్టులు లేకుండానే మందుల విక్రయాలు సాగుతున్నాయి. కొందరు దుకాణదారులు ఫార్మసి సర్టిఫికెట్లు మా త్రం ఉంచుకుని, వారే ఫార్మాసిస్టుల అవతారం ఎత్తుతున్నారు. సర్టిఫికెట్లు ఇచ్చినందుకు డిప్లమా ఫార్మాసిస్టులకైతే నెలకు రూ.2,500 నుంచి రూ.3వే లు, బి.ఫార్మసీ వారికైతే రూ.4వేల నుంచి రూ.6వేల వరకు ప్రతిఫలంగా అందిస్తున్నారు. స్థానిక దుకాణాలతో పాటు కార్పొరేట్ మెడికల్‌షాపుల్లోనూ అధి క శాతం ఇదే వ్యవహారం నడుస్తోంది. ఔషధ నియంత్రణశాఖలో సిబ్బందికొరత పేరుతో తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఫిర్యాదులంది తే తప్ప దాడులకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఫార్మాసిస్టు పర్యవేక్షణ లేకుం డా మందులు విక్ర యాలు సాగిస్తే రోగుల ప్రాణాలతో ఆడుకున్నట్లేనని అధికారులు చెబుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. మందులపై అవగాహన లేని వారు ఒక మందు బదులు మరో మందు ఇస్తే అది రోగుల ప్రాణానికి సంకటంగా మారుతుంది. కొన్నిసార్లు మందులు వికటిం చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదమూ ఉంది. అయి నా అధిక శాతం దుకాణదారులు ఫార్మాసిస్టులు లేకుండానే మందులు విక్రయిస్తుండడం గమనార్హం. అభయం ఇస్తున్న ఓ సంఘం నాయకుడు.. మెడికల్‌షాపు ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా ఔషధ నియంత్రణశాఖలో రిజిస్టర్ చేసుకోవాలి. నిబంధనల మేరకు సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అందజేయాలి. ఇంతకు ముందుగా ఓ సంఘం నా యకుని వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఆయన సంఘం పేరు చెప్పి రూ.10వేలు, అధికారులకంటూ మరో రూ.10వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా చెల్లిస్తే అధికారులు దుకాణం వద్దకు రాకుండా చూసుకుంటామని భరోసా ఇస్తున్నట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా అధికారుల దాడులు రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రిటైల్ మెడికల్ షాపులపై ఆ శాఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు డి. హరిహర తేజ, కేఎస్ దాదా కళంధర్, అబిద్ అలీషేక్ నంద్యాల, ఆదోని, కర్నూలు అర్బన్, రూరల్ ప్రాంతాల్లో 20 దుకాణాలు తనిఖీ చేశారు. ఇందులో 15 దుకాణాల్లో ఫార్మాసిస్టులు లేకుండా మందుల అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళా ఫార్మసిస్టు మృతి
ఒడిశా ,భువనేశ్వర్ : నగరానికి చెందిన ఓ మహిళా ఫార్మసిస్టు అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతిచెందింది. ఆమె హత్యకు గురైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక చంద్రశేఖర్‌పూర్ కానన్ విహార్ ప్రాంతంలో ఆమె ఉంటున్న ఇంట్లో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించిన మేరకు ఆమె మెడపై కత్తి గాట్లను గుర్తించారు. ఈ పరిస్థితుల్లో ఆమె హత్యకు గురైనట్లు ప్రాథమికంగా ధ్రువీకరించారు. ఫోరెన్సిక్ విభాగం రంగంలోకి దిగి ఈ మృతిపై దర్యాప్తు చేపట్టింది. నగర కమిషనరేట్ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. జగత్సింగ్పూర్ జిల్లా ఎరసమాకు చెందిన హసీనా దాస్ స్థానిక అపోలో ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పని చేస్తోంది. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని స్థానిక క్యాపిటల్ ఆస్పత్రికి తరలించినట్లు జంట నగరాల పోలీసు కమిషనర్ వై బి ఖురానియా తెలిపారు. -
కాంపౌండర్ ఇక ఫార్మసిస్ట్
సాక్షి, హైదరాబాద్ : వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆయుర్వేద, యునానీ, హోమి యోపతి విభాగాల్లోని కాంపౌండర్ పోస్టును ఫార్మసిస్టుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టు మార్పుతో వేతన పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. కొత్తగా ఫార్మసిస్టుగా నియమితులయ్యే వారు ఈ విభాగాల్లో రెండేళ్ల ఫార్మసీ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. దేశంలోని ఎక్కువ రాష్ట్రాల్లో ఇదే విధానం ఉందని, భారత కేంద్ర ఔషధ మండలి నియమాలకు అనుగుణంగా ఈ మార్పులు చేశామని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
సౌదీలో నంద్యాల వాసి దుర్మరణం
నంద్యాల: సౌదీ అరేబియాలోని ఒమన్ ప్రాంతంలో ఉద్యోగం కోసం వెళ్లిన నంద్యాలకు చెందిన ఓ ఫార్మాసిస్ట్ శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విజయ మిల్క్‌డెయిరీలోని ఎలక్ట్రిసిటీ విభాగంలో పని చేస్తున్న అబ్దుల్‌రహీంకు సయ్యద్ హుసేన్, రఫీ కుమారులు. ఆయన నూనెపల్లెలోని విజయభాను కాటన్ మిల్ ప్రాంతంలో నివాసం ఉన్నారు. పెద్ద కుమారుడు సయ్యద్ హుసేన్ కర్నూలులోని సఫా కాలేజీలో ఫార్మసీ కోర్సును పూర్తి చేశాడు. రఫీ ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. సయ్యద్ హుసేన్ గత ఏడాది నవంబర్‌లో సౌదీలోని ఓమన్కు వెళ్లి ఒక కంపెనీలో ఫార్మాసిస్ట్‌గా చేరాడు. ఆయన స్నేహితుడితో కలిసి మస్కట్‌కు కారులో వెళ్లి తిరిగి ఒమన్‌కు వెళ్తుండగా కారు బోల్తా పడింది. దీంతో ఆయన మృతి చెందాడు. ఈ సమాచారం అందడంతో అబ్దుల్‌రహీం కుటుంబం విషాదంలో మునిగింది. ఆయన మృతదేహం నంద్యాలకు రావడానికి రెండు మూడు రోజులు అవుతుందని సోదరుడు రఫీ చెప్పారు. -
నాసిరకం మందులపై సీరియస్
* విచారణకు ఆదేశించిన సీఎస్ రాజీవ్ శర్మ * త్వరలో టీఎస్ ఎంఎస్ఐడీసీ ఎండీనియామకం! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నాసిరకం మందులతో భారీగా అక్రమాలకు పాల్పడుతున్న తెలంగాణ మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ ఎంఎస్ఐడీసీ) అధికారులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్‌శర్మ విచారణకు ఆదేశించారు. ఈ నెల 15న ‘నాసిరకం మందులకు రాజముద్ర’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎస్.. తక్షణమే మందుల కొనుగోలుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకూ కొనుగోలు చేసిన మందులపై పరీక్షలు నిర్వహించారా..? లేదా..? నిర్వహిస్తే వాటి నివేదికలు కూడా సమర్పించాలని సూచించారు. కాగా, తమ బండారం బయటపడకుండా నివేదికలు తారుమారు చేసేందుకు టీఎస్ ఎంఎస్ఐడీసీ అనాలసిస్ విభాగంలోని కొందరు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనిపై పలు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఇదిలావుంటే ప్రస్తుతం టీఎస్ ఎంఎస్‌ఐడీసీకి ఎండీగా.. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఈ బాధ్యతలు అదనంగా ఉండటంతో రోజువారీ పర్యవేక్షణ కొరవడుతోంది. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. ఈ నేపథ్యంలో తక్షణమే పూర్తిస్థాయి ఎండీని నియమించాలని సర్కారు యోచిస్తోంది. యాంటీబయాటిక్స్‌లో వసూళ్ల పర్వం.. తెలంగాణలో యాంటీబయాటిక్స్ మందులు సరఫరా చేసే వారి నుంచి సంబంధిత విభాగాల అధికారులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. యాంటీబయాటిక్స్ సేకరణ (ప్రొక్యూర్మెంట్) చూసే ఓ ఫార్మసిస్ట్ 2 శాతం కమీషన్ ఇస్తేనే ఆర్డరు ఇస్తామని నిక్కచ్చిగా చెబుతున్నారు. అలాగే, కింగ్ కోఠి ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌లుగా విధులు నిర్వహించాల్సిన కొందరు టీఎస్ ఎంఎస్‌ఐడీసీలో పనిచేస్తున్నారు. వాస్తవానికి ఈ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... ఉన్నతాధికారుల అండతో సదరు ఫార్మసిస్టులు లాభసాటిగా ఉంటోందని టీఎస్ ఎంఎస్‌ఐడీసీలో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. వీళ్లపై వైద్యవిధానపరిషత్ కమిషనర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తినా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. దీనిపైనా ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. -
నాసిరకం మందులకు రాజముద్ర!
టీఎస్ఎంఎస్ఐడీసీలో అవినీతి తాండవం కమీషన్లు ఇస్తే నాణ్యతా ప్రమాణాలు లేకున్నా ఆమోదం ముడుపులివ్వకుంటే మంచి మందులైనా కొర్రీలు అనాలసిస్ విభాగంలో కొందరు ఫార్మసిస్ట్‌ల ఇష్టారాజ్యం పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ)లో అవినీతి తాండవిస్తోంది! అక్రమార్కుల ధన దాహానికి మందుల నాణ్యత గాలికి కొట్టుకుపోతోంది!! సంస్థలోని అనాలసిస్ వింగ్ (నాణ్యతా ప్రమాణాలు పరీక్షించే విభాగం)లో కొందరు ఫార్మసిస్ట్‌లు ముడుపులిస్తే నాసిరకం మందులకు రాజముద్ర వేస్తూ ముడుపులివ్వకుంటే మంచి మందులైనా అంగీకరించడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కుల అండ చూసుకొని టీఎస్ఎంఎస్ఐడీసీకి మందులు, సర్జికల్స్ తదితరాలు సరఫరా చేసే సప్లయర్లు నాసిరకం మందులు సరఫరా చేస్తున్నారు. నిబంధనల ప్రకారమైతే 220 రకాల మందులతోపాటు కొన్ని సర్జికల్ వస్తువులకు అనాలసిస్ వింగ్‌లో నాణ్యతా ప్రమాణాలను పరీక్షించి ఆమోదం తెలపాల్సి ఉంది. వీటికి సంబంధించిన నమూనాలను ఔషధ నియంత్రణ మండలి ల్యాబొరేటరీతోపాటు, హైదరాబాద్‌లోని మరో రెండు ప్రైవేటు ల్యాబొరేటరీల్లో పరీక్షలు నిర్వహించాలి. అయితే ఈ ల్యాబొరేటరీలు ఇచ్చే నివేదికలపై అనాలసిస్ వింగ్‌లోని వారికే మొదట సమాచారం అందుతోంది. దీంతో వారు ఈ నివేదిక ఆధారంగా సప్లయర్లకు సమాచారమిస్తున్నారు. ఒకవేళ మందులు నాసిరకం అని తేలితే.. వెంటనే ల్యాబొరేటరీలు ఇచ్చిన నివేదికలను పక్కన పెట్టి, మరో కొత్త బ్యాచ్ మందులను ల్యాబొరేటరీలకు పంపి సరిచేస్తున్నారు. ముడుపులు ఇవ్వకుంటే నాసిరకం అని తేలకపోయినా సరిగా లేవని ఫిర్యాదులు పంపి వాటిని పక్కన పెడుతున్నారు. తాజాగా తెలంగాణలో 15 రకాల మందులు నాసిరకం అని ఔషధ నియంత్రణశాఖ తేల్చింది. అయితే నాసిరకం అని తేలాక కూడా వాటిని వెనక్కు తీసుకురాకుండా రోగులకు ఇస్తున్నారు. ఈ తతంగం వెనక టీఎస్ఎంఎస్ఐడీసీ అనాలసిస్ వింగ్‌లో పనిచేస్తున్న ఒక ఫార్మసిస్ట్ చక్రం తిప్పుతున్నట్టు తెలిసింది. ఇటీవలే ఇన్చార్జి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా నియమితులైన అధికారి కూడా వీటిని అరికట్టలేని పరిస్థితి నెలకొంది. టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీగా ప్రస్తుతానికి సురేశ్ చందానే కొనసాగుతుండగా ఆయన సమయం కేటాయించకపోవడంతో అక్రమాల బాగోతం నియంత్రణలోకి రావట్లేదు. బ్లాక్‌లిస్టులో ఉన్నవి కొన్నే! రాష్ట్రంలో బ్లాక్‌లిస్టులో ఉన్న నాసిరకం మందులు మచ్చుకు కొన్ని మాత్రమేనని తెలుస్తోంది. అనాలసిస్ విభాగంలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్‌ల సాయంతో మందుల బ్యాచ్‌లు మార్చి తిరిగి ల్యాబొరేటరీలకు పంపించడం, మంచివని తేల్చి మళ్లీ మార్కెట్లోకి పంపించడం రివాజుగా మారింది. ఈ సంస్థ ఉమ్మడిగా ఉన్నప్పుడు సైతం పలుసార్లు ఇలాంటి కమీషన్ల బాగోతం బయటపడినా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు తెలంగాణ మౌలిక వైద్య సదుపాయాల సంస్థలో ఇలాంటి ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. -
కమీషన్ల కొనుగోళ్లు!
టీఎస్ఎంఎస్ఐడీసీలో కమీషన్ల కొద్దీ మందుల కొనుగోలు ఫార్మసిస్ట్‌లు, సరఫరాదారుల కుమ్మక్కు.. లాభం ఎక్కువ ఉన్న మందులు కుప్పలు తెప్పలుగా కొంటున్న వైనం కమీషన్లకు కక్కుర్తిపడి ఆ మందులకే ఆర్డర్ పెడుతున్న ఫార్మసిస్ట్‌లు హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు అవసరమైన మందులను డాక్టర్లే ఇవ్వాలి. కానీ మన రాష్ట్రంలో ఆ పనిని మందుల సరఫరాదారులే చేసేస్తున్నారు. అత్యవసర మందులులేక రోగులు ఇక్కట్లు పడుతుంటే.. ఫార్మసిస్ట్‌ల అండతో మందుల కాంట్రాక్టర్లు మాత్రం కోట్లు గడిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మౌలిక వైద్య సేవలు, సదుపాయాల సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ)లో అవసరం కొద్దీ మందుల కొనుగోళ్లు కాకుండా.. ‘కమీషన్ల కొద్దీ మందుల సరఫరా’ అనే పద్ధతిలో కొనుగోళ్లు సాగుతున్నాయి. దీంతో ఏ ప్రభుత్వాసుపత్రిలో చూసినా అవసరం లేని మందులు కుప్పలు తెప్పలుగా కొంటున్నారు. ఇవి ఎక్స్‌పెయిరీకి వచ్చినా పట్టించుకోరు. అత్యవసర మందులు మాత్రం ఎక్కడా కనిపించవు. మందుల కాంట్రాక్టర్లు, ఫార్మసిస్ట్‌లు కుమ్మక్కవ్వడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. టీఎస్ఎంఎస్ఐడీసీకి ప్రస్తుతం ఎండీ లేరు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్చందాకే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన దీనిపై దృష్టి సారించేంత సమయం చిక్కడం లేదు. దీంతో ఇక్కడ ఫార్మసిస్టులే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇవీ లుకలుకలు.. ► దగ్గు, జలుబుకు వాడే అమాక్సిక్ క్లావ్‌లిక్ యాసిడ్ మందును ఒకే ఏడాది రూ.7 కోట్లకు కొన్నారు. అవసరం లేకున్నా ఎక్కువగా కొన్నట్టు తేలింది. ► సరోజినీదేవి ఆస్పత్రిలో ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి మల్కాజిగిరి పీహెచ్‌సీకి 5 వేల ఇన్సులిన్ వయెల్స్ ఇచ్చారు. జిల్లాకు సరిపడా మందుల మోతాదు ఇది. కానీ ఒక్క పీహెచ్‌సీకే ఇచ్చారు. అయినా ఫార్మసిస్ట్లపై చర్యలు లేవు. ► ఏ మందులైనా నాసిరకమని తేలినా కాంట్రాక్టరు నుంచి కమిషన్లు తీసుకుని ఆయా మందులను అనాలసిస్ విభాగంలో పనిచేసే ఫార్మసిస్ట్ కొనసాగిస్తూన్నారు. ► సరోజిని ఆస్పత్రిలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో భారీగా కమీషన్ పద్ధతిలో మందులు సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోలేదు. జిల్లాకొక సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఉంది. ఈ స్టోర్లలో పనిచేసే ఫార్మసిస్ట్‌లందరికీ కలిపి మందుల సరఫరాదారులు ఒక్కో త్రైమాసికానికి రూ.5 లక్షలు ఇస్తున్నట్టు సమాచారం. ► మహబూబ్‌నగర్ జిల్లా పీహెచ్‌సీల్లో ఫార్మసిస్ట్‌లే లేరు. అదేజిల్లా ఫార్మసిస్టులు నలుగురు హైదరాబాద్ మందుల కొనుగోళ్ల విభాగం లో ఐదేళ్లుగా డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. ► యాంటీబయోటిక్స్ కొనుగోలు ఆర్డర్లు ఇస్తే సదరు కాంట్రాక్టర్లు ఒక శాతం కమిషన్ ఇస్తేనే ఆర్డర్లు ఇస్తానని ఫార్మసిస్ట్ రేటు నిర్ణయించినా చర్యలు లేవు. ఇవి మాత్రం కుప్పలు తెప్పలు.. కొన్ని మందులతో అవసరం లేకపోయినా క మీషన్ల కోసం కొన్నారు. జెంటామైసిన్, హాలోథిన్ ఐపీ, శాలిక్లిక్ యాసిడ్ క్రీం, ఆంపొటెరిసిన్, సిఫ్రాక్సిమ్ ఇంజక్షన్, ఆక్సిక్లోవర్ 10 జీఎం, ఆల్బెండజోల్, సినారిజైన్ టాబ్లెట్స్, హెపరిన్ సోడియం, పిరాక్టిమ్ ఇంజక్షన్లలో చాలా ఎక్స్‌పెయిరీకి దగ్గరలో ఉన్నాయి. అయినా వీటిని కొన్నారు. ఈ అత్యవసర మందులు లేనే లేవు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వినియోగించే కొన్ని అత్యవసర మందులకు జిల్లాల్లో తీవ్ర కొరత ఉంది. ఎడ్రెనలైన్ టెర్ట్రేట్ ఇంజెక్షన్, అలూమియం హైడ్రాక్సైడ్, క్లోట్రిమొజోల్, డోగోక్సిన్ ట్యాబ్లెట్స్, డెరిపైలిన్ ట్యాబ్లెట్స్, ఫ్యూరోక్సిన్ సిరప్, ఇబ్రూఫిన్ ట్యాబ్లెట్స్, మిథేల్ ఎర్గొమెట్రిన్ ఇంజక్షన్, నియోమైసిన్ క్రీం, పారాసిట్మాల్ మొదలైన మందులు అసలు లేనే లేవు. దీంతో జిల్లాల్లోరోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బడ్జెట్లో కేటాయించిన విధంగా అవసరమైన మేరకు మందులు కొనాలని నిర్ణయించాం. ఆ ప్రకారమే జరుగుతోంది. ఫార్మసిస్టులు, కాంట్రాక్టర్లు, సరఫరాదారుల కుమ్మక్కుపై ఫిర్యాదులు అందలేదు. దీనిపై పరిశీలించి తగు చర్యలు చేపడతాం. - సురేష్‌చందా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి -
104 వైద్య సిబ్బందికి వేతనాలేవీ..?
ఘట్కేసర్ టౌన్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించడానికి ప్రవేశపెట్టిన ‘104’ పథకం నీరుగారుతోంది. ఈ పథకానికి నిధుల సమస్య ఎదురవడంతో గ్రామీణులకు తగిన వైద్య సేవ లు అందడం లేదు. కనీసం ‘104’ వాహనాల్లో పనిచేసే సిబ్బం దికి వేతనాలు కూడా రావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించే ‘104’ వాహనంలో ఓ డ్రైవర్, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నిషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిన నియమించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాలకు వెళ్లి నిర్ణీత సమయంలో పేదలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేయడం వీరి విధి. జిల్లాలో 17 క్లస్టర్లు ద్వారా గ్రామీణా ప్రజలకు ‘104’ వాహనాలు నిత్యం సేవలందిస్తున్నాయి. నిలిచిన వేతనాలు... వైఎస్ఆర్ మరణాంతరం ఈ పథకం నిర్లక్ష్యానికి గురైంది.ప్రభుత్వం ఈ పథకానికి తగిన నిధులు సమకూర్చకపోవడంతో గ్రామీణులకు వైద్య సేవలు అందడం లేదు. అంతేకాకుండా ఈ పథకంలో పనిచేసే సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు కూడా అందడం లేదు. మే, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల వేతనాలు ఇప్పటికీ అందకపోవడంతో ‘104’ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని సిబ్బంది పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. వేతనాలకు తోడు రోజు వారీగా చెల్లించే అలవెన్సులు కూడా నిలిచిపోయాయి. వేతనం చెల్లించే సమయంలోనే ప్రతి నెలా డీఏను కూడ చెల్లించేవారు. అయితే డీఏ చెల్లింపులకూ ప్రభుత్వం మొండిచేయి చూపడంతో ఆరు నెలలుగా అవి వారికి అంద డం లేదు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి వేతనాలను అందజేయాలని కోరుతున్నారు. ఈ విషయమై సీనియర్ ప్రజా ఆరోగ్య అధికారి నారాయాణరావ్ మాట్లాడుతూ.. ‘104’ సిబ్బంది వేతనాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదని చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలకాగానే సిబ్బందికి వేతనాలు అందిస్తామని తెలిపారు. -
పడకేసిన పల్లెవైద్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని ఆరు మండలాలలో వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా కన్పించింది. లింగంపేట, ఎర్రపహాడ్ (తాడ్వాయిమండలం) సదాశివనగర్, మత్మల్(ఎల్లారెడ్డి మండలం) నాగిరెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో ఫార్మాసిస్టులు,స్టాఫ్ నర్సులే రోగులకు వైద్య చికిత్సలు అందించారు. ఒక్క గాంధారి పీహెచ్సీలో వైద్యుడు రాజహౌళి మాత్రమే విదులకు హాజరై రోగులకు వైద్య సేవలు అందించారు. గాంధారి ఆసుపత్రిలో పనిచేసే మిగతా నలుగురు వైద్యులు, మిగతా మండలాలలో పని చేసే వైద్యులు కూడా స్థానికంగా నివాసం ఉండడంలేదు. లింగంపేటలో స్టాఫ్ నర్సే రోగులకు, గర్భవతులకు వైద్య పరీక్షలు చేసారు. తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ ఆరోగ్య కేంద్రంలో వైద్యుడు సెలవుపై వెళ్లగా ఫార్మాసిస్టు రోగులకు వైద్యం చేసా డు. ఎల్లారెడ్డి మండలం మత్మల్ ఆరోగ్య కేంద్రం లో డాక్టర్ విజయ సమయానికి ఆస్పత్రికి వచ్చి వెం టనే క్లస్టర్ మీటింగ్ పేర ఎల్లారెడ్డికి వెళ్లి పోయారు. చాలాచోట్ల ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే వైద్యులు కానీ, సిబ్బంది సమయపాలనను పాటించడంలేదు. జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉదయం 9.30 నిమిషాలకు వెళ్లగా ఆటెండర్ ఉన్నా రు. అప్పటికే ఐదుగురు రోగులు వైద్యం కోసం ఆరోగ్యకేంద్రానికి వచ్చారు. ఇక్కడ స్టాఫ్ నర్సు కార్తిక మెటర్నటి సెలవులో ఉండగా మల్లూర్ గ్రామ ఆరోగ్యకార్యకర్త 10 గంటలకు వచ్చారు. ఆరోగ్య కేంద్రం లో ప్రసూతి సౌకర్యం, కుటుంబనియంత్రణ ఆపరేషన్ థియేటర్ ఉన్నా సేవలు మాత్రం శూన్యంగా ఉన్నాయి. పిట్లం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించగా అక్కడ ఐదుగురు వైద్యు లు, ఎఎన్మ్లు, సిబ్బంది పూర్తిగా విధుల్లో ఉన్నారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల నుంచి వైద్యులు వస్తుండటంతో రోగులకు సేవలు సకాలంలో అందడం లేదు. ఆస్పత్రిభవనం శిథిలావస్థకు చేరుకోవడంతో రోగులు, వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు విధుల్లో ఉన్నారన్నా రు. వారాంతపు సంతకావడంతో రోగులు వస్తారని వైద్యులు విధులకు వచ్చారన్నారు. బిచ్కుంద మం డల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని 10.30 సందర్శించగా వైద్యుడు వచ్చారు. బోధన్ నియోజకవర్గం బోధన్ నియోజకవర్గంలోని సాలూర, ఎడపల్లి, రెం జల్ పీహెచ్‌సీల వైద్యులు స్థానికంగా నివాసం ఉం డడం లేదు. బోధన్, నిజామాబాద్ పట్టణ కేంద్రాల్లో ఉంటున్నారు. సబ్ సెంటర్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పీహెచ్‌సీలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ చూస్తున్నారు. నవీపేట, రెంజల్, సాలూర పీహెచ్‌సీలు 24 గంటలు సేవలందించాలి. కాని రెగ్యులర్ వైద్యులు లేక రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదు. కుటుంబ ని యంత్రణ ఆపరేషన్లకు మంగళం పాడారు. సాలూ ర పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ స్వప్న ఇన్చార్జిగా ఉన్నారు. రెగ్యులర్ పోస్టు వర్ని పీహెచ్సీ. అందువల్ల సోమవారం విధులకు రాలేదు. ఉదయం 9 నుంచి రోగులు డాక్టర్ కోసం నిరీక్షించారు. సాలూర పరిసర గ్రామాలైన తగ్గెలి, ఖాజాపూర్ మందర్న గ్రామాల నుంచి రోగులు వచ్చారు. డాక్టర్ బోధన్ పట్టణ కేంద్రంలో ఉంటారు. కాన్పుల సంఖ్య చాల తక్కువ, ఈ నెలలో మూడు కాన్పులు మాత్రమే జరి గాయి. మందులపై పూర్తి అవగాహన లేని ఏఎన్ఎం లు మందులను పంపిణీ చేస్తున్నారు. రెగ్యులర్ వైద్యులు లేక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ థియేటర్ మూడేళ్లుగా వృథాగా ఉంది. జనరేటర్ మూలపడేశారు. ఆపరేటర్లేక కంప్యూటర్లు వృథాగా ఉన్నా యి. ఫార్మాసిస్ట్ కూడా ఇన్‌చార్జియే ఉన్నారు. నవీపే ట పీహెచ్సీలో ముగ్గురు వైద్యులుండగా ఒక్కరే విధులకు వచ్చారు. బాల్కొండ నియోజకవర్గం బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేం ద్రంలోని 30 పడకల ఆస్పత్రిలో ఐదుగురు వైద్యుల కు గాను దంత వైద్యురాలు లక్ష్మి ఒక్కరే విధులు నిర్వహించారు. రోగుల తాకిడి ఉన్నా వైద్యులు లే రు. కిసాన్‌నగర్ ఆస్పత్రిలో వైద్యులు సమయంలో అందుబాటులో ఉన్నారు. రోగుల తాకిడి బాగానే ఉంది. వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో అందుబాటులో వైద్యులు ఉన్నారు. మందులు బాగానే ఉన్నా యి. కమ్మర్పల్లి మండలంలోని, చౌట్పల్లిలో పీహెచ్సీలో వైద్యురాలు సౌజన్న హాజరు కాక పోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది సమయ పాలన పాటించక పోవడంతో వైద్యం అం దడం లేదు. భీమ్‌గల్ ఆస్పత్రికి కొత్త భవనం నిర్మించినా ఆపరేషన్ థియేటర్ చిన్నగా ఉంది. వసతులు లేవు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్‌పల్లిలో వైద్యులు స్థానికంగా ఉండటం లేదు. 24 గంటల ఆస్పత్రి పేరుకే ఉంది. రాత్రి పూట వైద్యులు అందుబాటులో లేక ఇన్‌పేషంట్లు రావడం లేదు. మందులు అందుబాటులో ఉన్నాయి. రెండున్నర సంవత్సరాలుగా ఫార్మాసిస్టు లేడు. ఒక గర్భిణీ ఆస్పత్రికి రాగా, వైద్యులు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి సిపార్సు చేశారు. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా డీజిల్ లేదని సమాధానం వచ్చింది. ధర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉండగా.. ఉన్న సిబ్బంది సైతం పలువురు స్థానికంగా ఉండటం లేదు. జక్రాన్‌పల్లి మండలంలోను వైద్యులు స్థాని కంగా ఉండటం లేదు. సిబ్బంది కొరత ఉంది. మందులు అందుబాటులో ఉన్నాయి. సరికొండ ప్రభుత్వ ఆస్పత్రికి మెడికల్ ఆఫీసర్ ఆలస్యంగా వచ్చారు. సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో... జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 375 ఉప కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 120 మంది వైద్యుల కుగాను 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టాఫ్‌నర్సులు-94 పోస్టులు, ఎఎన్ఎంలు-86 పోస్టులు, ల్యాబ్‌టెక్నిషన్‌లు -73 పోస్టులు , ఫార్మాసిస్టులు -46 పోస్టులు, నాల్గవ తరగతి ఉద్యోగులు-115 పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. 14 క్లస్టర్ ఆసుపత్రులు ఉన్నా యి. వీటి పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ కొనసాగుతోంది. అలాగే వైద్య విధాన పరిషత్‌కు సంబంధించి జిల్లా ఆస్పత్రితో పాటు , కామారెడ్డి, బోధన్, బాన్సువాడ ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఎల్లారెడ్డి, దోమకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. జిల్లా ఆస్పత్రి ప్రస్తుతం మెడికల్ కళాశాలకు అనుబంధం ఉండడంతో జిల్లా ఆస్పత్రి ని ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. డీసీహెచ్ఎస్ కార్యాలయానికి సొంత భవనం లేదు. నాలుగు సంవత్సరాలుగా ఇన్చార్జి డీసీహెచ్ఎస్ కొనసాగుతున్నారు. -
మందుల ‘చీటింగ్
ప్రిస్కిప్షన్ లేకుండానే మందుల విక్రయాలు వైద్యులుగా చలామణి అవుతున్న ఫార్మసిస్ట్‌లు విచ్చలవిడిగా గర్భ నిరోధక మాత్రల అమ్మకాలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న బాధితులు సాక్షి,సిటీబ్యూరో: సికింద్రాబాద్‌కు చెందిన మహిళ ఇటీవల గర్భస్రావం కోసం దగ్గర్లోని మెడికల్ షాపునకు వెళ్లింది. వైద్యుడి ప్రిస్కిప్షన్ లేకుండానే సదరు దుకాణదారుడు కొన్ని టాబ్లెట్లు ఇచ్చాడు. వాటిని తీసుకున్న రెండోరోజే మహిళకు గర్భస్రావం కావడంతోపాటు ప్రాణాలను కోల్పోయింది. కడుపులోని పిండం మెరుగుదల కోసం విద్యానగర్‌లోని ఓ ఆస్పత్రి వైద్యురాలు మందు పేరును అర్థం కాకుండా కలిపి రాయడం వల్ల సదరు ఆస్పత్రిలోని ఫార్మసిస్ట్ ‘మైప్రోజిస్ట్’కు బదులు‘మిసోప్రెస్ట్’ఇవ్వడంతో బాధిత మహిళ గర్భాన్ని కోల్పోయింది. దీనిపై సుప్రీకోర్టులో కేసు నడుస్తోంది. ఇవి ఉదాహరణలు మాత్రమే. అనేక హానికారక మందులను మెడికల్ షాపుల్లో ప్రిస్కిప్షన్లు లేకుండానే ఇచ్చేస్తున్నారు. ఇవి నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. రోగుల అవగాహన రాహిత్యం మెడికల్ షాపుల గిరాకీని పెంచుతోంది. వైద్యుల సలహా లేకుండా ఇష్టానుసారం రోగులు యాంటీబయోటిక్స్ వాడటం వల్ల రోగ నిరోధకశక్తి తగ్గి అకాల మృత్యువాత పడుతున్నారు. 1940 డ్రగ్స్ యాక్ట్ ప్రకారం ప్రిస్కిప్షన్ లేకుండా మందులు అమ్మడం నేరం. జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి తదితర 25 రకాల నాన్‌షెడ్యూల్ మందులనే ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించాలి. మరో వెయ్యి రకాల మందులను ఎట్టి పరిస్థితుల్లో ప్రిస్కిప్షిన్ లేకుండా విక్రయించరాదు. అధికారుల ఉదాసీనత, చట్టాల్లోని లొసుగులతో కొందరు ఫార్మసిస్ట్‌లు వైద్యులు రాసిన మందుల చీటీతో సంబంధం లేకుండానే రోగులకు మందులు ఇచ్చేస్తున్నారు. నగరంలో 30 శాతం అమ్మకాలు ప్రిస్కిప్షిన్ లేకుండానే జరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు రెండో రకం నాణ్యత కలవే కావడం గమనార్హం. జలుబు, జ్వరం, తలనొప్పి మాత్రలే కాదు, గర్భస్రావానికి ఉపయోగించే ప్రమాదకరమైన మెఫఫిన్, జొటాటెక్, ఐపిల్స్తో పాటు పలు రకాల స్లీపింగ్ మాత్రలను సైతం యథేచ్ఛగా అమ్ముతుండటం విశేషం. మెడికల్ షాపుల్లో తనిఖీలేవీ? గ్రేటర్లో పదివేలకుపైగా మందుల దుకాణాలున్నాయి. ఇవి రోజూ రూ.పది కోట్ల వ్యాపారం చేస్తున్నట్లు అంచనా. అయితే 50 శాతం దుకాణాల్లో క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్‌లు లేరు. చాలామంది సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని షాపులు నడుపుతున్నారు. ఫార్మారంగంపై కనీస అవగాహన లేని వారు మందులు విక్రయిస్తుండటంతో పరిస్థితి వికటిస్తోంది. నిషేధిత మందులపై సరైన ప్రచారం లేకపోవడంతో వాటినీ యథేచ్ఛగా విక్రయించేస్తున్నారు. అనివార్యమైతే తప్ప పసిపిల్లలకు డబ్బాపాలను సూచించడం, అమ్మడం చేయరాదు. కానీ అన్ని మెడికల్‌షాపుల్లోనూ ఈ ఉత్పత్తులు కొల్లలుగా కనిపిస్తున్నాయి. ఔషధ దుకాణాల్లో కనీసం ఆరు నెలలకోసారి తనిఖీలు చేయాల్సి ఉండగా, డ్రగ్ఇన్స్పెక్టర్లు అటువైపు చూడట్లేదు. హయత్‌నగర్, ఖైరతాబాద్, పంజగుట్ట, దిల్సుఖ్నగర్, అఫ్జల్‌గంజ్, కోఠి, ఎల్బీనగర్, ఉప్పల్, రామంతాపూర్, సికింద్రాబాద్, తిరుమలగిరి, చాంద్రాయణగుట్ట, పాతబస్తీల్లోని మందుల దుకాణాల్లో నాణ్యతలేని, అనుమతిలేని, గడువు ముగిసిన మందులను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.. నేరుగా మెడికల్ షాపు యజమానులు ఇచ్చే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఒక్కోసారి ప్రాణాలకూ ముప్పే. వైద్యంపై కనీస అవగాహన లేని వారిచ్చే మందులు వాడటం శ్రేయస్కరం కాదు. డాక్టర్ సిఫార్సు చేసినవే వాడాలి - ప్రొ.నాగేందర్, ఉస్మానియా మెడికల్‌కాలేజీ వైద్యుల రాతలపై ‘సుప్రీం’లో కేసు పలువురు వైద్యులు అర్థం కాని విధంగా మందుల పేర్లు రాస్తున్నారు. తొలి, చివరి అక్షరం తప్ప మరేమి రాయట్లేదు. దీంతో అనుభవం లేని ఫార్మసిస్టులు ఒకటి బదులు మరొకటి ఇస్తున్నారు. మందుల పేర్లు సామాన్యులకూ అర్థమయ్యేలా ఉండాలి. దీనిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. - సీహెచ్.పరమాత్మ, తెలంగాణ ఫార్మసిస్టుల సంఘం కార్యదర్శి -
వేతనాలివ్వండి మహాప్రభో!
కూచిపూడి, న్యూస్‌లైన్ : దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి గ్రామీణప్రాంత ప్రజల ఆరోగ్యరీత్యా ప్రవేశపెట్టిన 104 పథకంలో అతితక్కువ వేతనానికే సేవలందిస్తున్న సిబ్బంది జీతాలు లేక అలమటిస్తున్నారు. మూడు నెలలుగా వేతనాలు లే(రా)క పస్తులుంటున్నామని వాపోతున్నారు. జిలాల్లోని 14క్లస్టర్లలో 19 వరకు 104 సంచార వైద్యశాలలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క క్లస్టర్లో డీఈవో (డేటా ఎంట్రీ ఆపరేటర్), ల్యాబ్‌టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, వ్యాన్ డ్రైవర్ విధులు నిర్వర్తిస్తుంటారు. వీరికి గతేడాది అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల వేతనాలు రాక అప్పులు చేసుకుంటూ దుర్భర జీవితం గడుపుతున్నారు. ఇదిలా ఉండగా మిగిలిన జిల్లాలో రెండో శనివారం సెలవులిస్తుండగా ఈ జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ నుంచి సెలవు రద్దు చేసినట్లు సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. సెలవును పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. 104 వాహనానికి డీజిల్, మందులకు మాత్రం నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం సిబ్బందికి మాత్రం జీతాలివ్వకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
16 నుంచి మెడికల్ షాప్‌ల బంద్
సాక్షి, ముంబై: ఫార్మాసిస్టులు లేని మెడికల్ షాపుల లెసైన్స్ రద్దు చేసే పనిలో ఫుడ్, డ్రగ్స్ (ఎఫ్డీ) పరిపాలన విభాగం నిమగ్నమైంది. దీన్ని నిరసిస్తూ మెడికల్ షాపు యజమానులు ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా షాపులన్నీ మూసి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర స్టేట్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్నాథ్ షిండే నేతృత్వంలో కార్యవర్గ సభ్యులతో మంగళవారం సమావేశం జరిగింది. ఎఫ్డీ అధికారుల చర్యలను ఉపేక్షించరాదని, వారి దూకుడుకు నిరసనగా బంద్ పాటించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మెడికల్ దుకాణాలున్నాయి. నియమాల ప్రకారం అందులో ఒక ఫార్మాసిస్టు పనిచేయాలి. కానీ 80 శాతం మెడికల్ షాపు యజమానులు తక్కువ వేతనానికి లభించే యువకులను పనిలో పెట్టుకుంటున్నారు. కొంత ఆంగ్ల భాష జ్ఞానం ఉంటే చాలు డాక్టర్ రాసిచ్చిన ప్రిస్కిప్షన్ చూసి మందులిచ్చే బాధ్యతలు వారికి అప్పగిస్తున్నారు. ఒకవేళ తప్పుడు మందులు, ఇంజెక్షన్లు, మాత్రల వల్ల రోగి చనిపోతే అందుకు బాధ్యులెవరు...? అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. దీంతో ఎఫ్డీ అధికారులు దాడులు చేస్తున్నారు. కానీ ఫార్మాసిస్టును నియమించుకోవడం తమకు గిట్టుబాటు కాదని మందుల షాపు యజమానులు వాదిస్తున్నారు. మరోవైపు ఫార్మాసిస్టులు లేని మెడికల్ షాపుల లెసైన్స్‌లు ఎఫ్డీ అధికారులు రద్దు చేస్తున్నారు. దీంతో తమ వ్యాపారం దెబ్బతింటోందని మందులు విక్రయించే వ్యాపారులు ఆందోళనలో పడిపోయారు. ఎఫ్డీ వైఖరిని వ్యతిరేకిస్తూ మూడు రోజులపాటు బంద్ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. -
ఫార్మాసిస్టునంటూ హాస్యమాడిన పోప్
వాటికన్ సిటీ: తానో ఫార్మాసిస్టునంటూ పోప్ ఫ్రాన్సిస్ హాస్యమాడారు. ప్రార్థనను గుండెకు మంచి మందుగా పేర్కొన్నారు. ఆదివారం సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద గుమిగూడిన విశ్వాసులనుద్దేశించి ఆయన మాట్లాడారు. మందు గుళికల ప్యాకెట్‌ను తలపించేలా రూపొందించిన ఓ బాక్సులోని రోజరీ (రోమన్ కేథలిక్కులు తమ ప్రార్థనలను లెక్కించేందుకు ఉపయోగించే హారం)ని పట్టుకుని తన భవనం కిటికీలో ఆయన దర్శనమిచ్చారు. మానవ హృదయాకారంలో దానిని తయారు చేశారు. రోజరీ ప్రార్థనను ఆధ్యాత్మిక ఔషధంగా పేర్కొంటూ అది గుండెకు మంచిదని సిఫారసు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వేలాదిమంది విశ్వాసులకు వాలంటీర్లు ఈ బాక్సులు పంపిణీ చేశారు.