కూచిపూడి, న్యూస్‌లైన్ : దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి గ్రామీణప్రాంత ప్రజల ఆరోగ్యరీత్యా ప్రవేశపెట్టిన 104 పథకంలో అతితక్కువ వేతనానికే సేవలందిస్తున్న సిబ్బంది జీతాలు లేక అలమటిస్తున్నారు.
మూడు నెలలుగా వేతనాలు లే(రా)క పస్తులుంటున్నామని వాపోతున్నారు. జిలాల్లోని 14క్లస్టర్లలో 19 వరకు 104 సంచార వైద్యశాలలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క క్లస్టర్‌లో డీఈవో (డేటా ఎంట్రీ ఆపరేటర్), ల్యాబ్‌టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, వ్యాన్ డ్రైవర్ విధులు నిర్వర్తిస్తుంటారు. వీరికి గతేడాది అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల వేతనాలు రాక అప్పులు చేసుకుంటూ దుర్భర జీవితం గడుపుతున్నారు.
ఇదిలా ఉండగా మిగిలిన జిల్లాలో రెండో శనివారం సెలవులిస్తుండగా ఈ జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ నుంచి సెలవు రద్దు చేసినట్లు సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. సెలవును పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. 104 వాహనానికి డీజిల్, మందులకు మాత్రం నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం సిబ్బందికి మాత్రం జీతాలివ్వకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేతనాలివ్వండి మహాప్రభో!
Published Sat, Jan 11 2014 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement
Advertisement