Lab Technician
-
633 ఫార్మసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖలో 633 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టుల భర్తీ కోసం ‘మెడికల్ హెల్త్ సర్విసెస్ రిక్రూట్మెంట్ బోర్డు’మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. అభ్యర్థులు అక్టోబర్ ఐదో తేదీ నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే మార్చుకునేందుకు 23, 24వ తేదీల్లో అవకాశం ఉంటుందని వివరించారు. నవంబర్ 30న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. నోటిఫికేషన్‌లోని కీలక అంశాలు,వివరాలివీ.. » మొత్తం 633 పోస్టులు ఉండగా.. అందులో 446 ప్రజారోగ్య సంచాలకులు, వైద్యవిద్యా సంచాలకుల (డీఎంఈ) విభాగంలో ఉన్నాయి. మరో 185 తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో, ఇంకో 2 హైదరాబాద్ ఎంఎన్‌జే ఆస్పత్రిలో ఉన్నాయి. ళీ జోన్ల వారీగా చూస్తే.. జోన్–1లో 79, జోన్–2లో 53, జోన్–3లో 86, జోన్–4లో 98, జోన్–5లో 73, జోన్–6లో 154, జోన్–7లో 88 పోస్టులు ఉన్నాయి. » ఈ పోస్టులకు పేస్కేల్ రూ.31,040 నుంచి రూ.92,050 మధ్య ఉంటుంది. » రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాలు.. హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. » ఫలితాల అనంతరం మెరిట్ జాబితాను బోర్డు వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. » అభ్యర్థులు డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఫార్మా డీ పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో తప్పక రిజి్రస్టేషన్ చేసి ఉండాలి. » ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిజేసే వారికి వెయిటేజీ ఉంటుంది. వారు అనుభవ పూర్వక ధ్రువీకరణపత్రం సమర్పించాలి. » అభ్యర్థుల వయసు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు.. దివ్యాంగులకు పదేళ్లు సడలింపు,ఎన్సీసీ, ఎక్స్ సర్విస్‌మన్లకు మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (ఆర్టీసీ, మున్సిపల్ ఉద్యోగులు అనర్హులు) ఐదేళ్ల సడలింపునిచ్చారు. » రాత పరీక్షకు 80 మార్కులు ఉంటాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసినవారికి వెయిటేజీ కింద 20 పాయింట్స్ కేటాయిస్తారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన ప్రతి ఆరు మాసాలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే ప్రతీ ఆరు నెలలకు 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. » పూర్తి వివరాలను అభ్యర్థులు ఠీఠీఠీ.ఝజిటటb.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్సైట్లో పొందవచ్చు. -
కరోనా టెస్ట్ పేరిట నీచం.. ల్యాబ్‌టెక్నీషియన్‌కు పదేళ్ల శిక్ష
కరోనా టెస్టుల పేరిట నీచంగా వ్యవహరించిన ఒక ల్యాబ్‌టెక్నీషియన్‌కు ఎట్టకేలకు కఠిన కారాగార శిక్ష పడింది. శాంపిల్ కలెక్షన్ పేరుతో అసభ్యకర రీతిలో వ్యవహరించిన కేసులో.. పదిహేడు నెలల తర్వాత ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అమరావతి (మహారాష్ట్ర)కి చెందిన యువతి.. స్థానికంగా ఓ మాల్లో పని చేస్తోంది. కరోనా మొదటి వేవ్ సమయంలో ఆమె పనిచేసే మాల్లో పాతిక మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో మిగతా ఎంప్లాయిస్‌తో కలిసి ఆమె సైతం పరీక్షలకు వెళ్లింది. అయితే ఆమెకు పాజిటివ్ వచ్చిందని.. మరిన్ని టెస్టుల కోసం బద్నేరాలోని ల్యాబ్‌కు రావాలంటూ సదరు ల్యాబ్‌టెక్నీషియన్(నిందితుడు) ఆ యువతి రప్పించుకున్నాడు. స్వాబ్ సేకరణలో భాగంగా ఈసారి శాంపిల్ సేకరణ ప్రైవేట్ పార్ట్ నుంచి చేయాలని చెప్పి.. నీచంగా ప్రవర్తించాడు. అయితే ఈ విషయంలో అనుమానం వచ్చిన యువతి.. తన సోదరుడికి చెప్పింది. వాళ్లు ఓ డాక్టర్‌ను సంప్రదించగా.. కొవిడ్-19 స్వాబ్ టెస్ట్ ముక్కు, నోటి నుంచి మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో బాధితురాలు బద్నేరా పోలీసులను ఆశ్రయించింది. అయినా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో పెద్ద ఎత్తున్న నిరసనలు చెలరేగాయి. దీంతో జులై 30, 2020న నిందితుడిని బద్నేరా పోలీసులు అత్యాచార ఆరోపణలపై అరెస్ట్ చేశారు. సుమారు పదిహేడు నెలల విచారణ తర్వాత.. అమరావతి జిల్లా కోర్టు 12 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించి.. ఐపీసీ సెక్షన్ల 354, 376 ప్రకారం.. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. -
జీజీహెచ్, గుంటూరులో 129 పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ).. గుంటూరు జిల్లా ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో(జీజీహెచ్) ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 129 ► పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఫిజిసిస్ట్, డేటాఎంట్రీ ఆపరేటర్, బయో–మెడికల్ ఇంజనీర్, ఆప్టోమెట్రిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, ల్యాబ్ అటెండెంట్స్ తదితరాలు. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, జీఎన్ఎం, డిప్లొమా/బీఎస్సీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నాలజీలో సర్టిఫికేట్ కోర్సులతోపాటు ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్, జీజీహెచ్, గుంటూరు, ఏపీ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021 ► వెబ్సైట్: guntur.ap.gov.in -
Karimnagar: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు రూ.2 లక్షలు..?
సాక్షి, కరీంనగర్: ఉన్నవి రెండే పోస్టులు.. వచ్చినవి 87 దరఖాస్తులు.. ఇంకేముంది చేతివాటానికి దారి దొరికింది. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు బేరసారాలు నడుస్తున్నట్లు తెలిసింది. రూ.2 లక్షలిస్తే చాలు అర్హతలున్నా.. లేకున్నా.. ఉద్యోగ నియామకపత్రం ఇంటికి వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో జరిగిన కాంట్రాక్టు పోస్టుల భర్తీ ప్రక్రియలో ఆసుపత్రిలో పనిచేసే ఓ కీలక అధికారి చక్రం తిప్పి చేతివాటం ప్రదర్శించారు. అదే అధికారి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియలోనూ తన చతురతను ప్రదర్శిస్తుండడంతో దరఖాస్తుదారులు ఆ అధికారి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికే రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అమ్మకం జరిగాయని పలువురు చర్చించుకుంటున్న నేపథ్యంలో... ఒక పోస్టును ఆసుపత్రిలోనే ఔట్‌సోర్సింగ్‌లో పనిచేసే వ్యక్తికి కట్టబెట్టేందుకు అధికారులు ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ముట్టజెప్పిన సదరు వ్యక్తి కూడా తనకు పోస్టు దక్కుతుందనే భరోసాతో ఉన్నట్లు తోటి దరఖాస్తుదారులు చెబుతున్నారు. ఖరారైన పోస్టు రూ.2 లక్షలు పలుకగా, మరో పోస్టుకు మాత్రం లాభసాటిగా బేరం కుదుర్చేందుకు డబ్బులు పెట్టే సత్తా ఉన్న అభ్యర్థిని వెతుకుతున్నట్లు తెలిసింది. 2 పోస్టులు.. 87 దరఖాస్తులు.. జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది మార్చి నెలలో నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు పోస్టులకు 87 మంది అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇదే అదనుగా కీలక అధికారి బేరసారాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. గతంలో జరిగిన కాంట్రాక్టు పోస్టులన్నీ సదరు అధికారి కనుసన్నల్లలోనే భర్తీ కావడంతో అతన్ని ప్రసన్నం చేసుకుంటే చాలు పోస్టు వచ్చినట్లేనని ప్రచారం బహిరంగంగా జరుగుతోంది. అర్హుల ఎంపికతో నోటీసు... దరఖాస్తుదారుల లిస్టు ప్రకారం అర్హులు, అనర్హుల లిస్టు తయారు చేసి ఈ నెల 14న అధికారులు ఆసుపత్రిలో నోటీసు బోర్డుపై అంటించారు. ఈనెల 17న సాయంత్రం 5 గంటల లోపు అభ్యంతరాలుంటే తెలపాలని, లేని పక్షంలో రెండు పోస్టులకు తుది నిర్ణయం తీసుకుంటామని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎంఎల్టీ చేసిన వారు అనర్హులట.. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్టీ) పూర్తి చేసి పారా మెడికల్ బోర్డునుంచి సర్టిఫైడ్ అయిన వాళ్లని సైతం అనర్హులుగా ప్రకటించారు. పారామెడికల్ బోర్డు ఆక్ట్ నెం.38 ఆఫ్ 2006 ప్రకారం ఎంఎల్టీ చదివిన వారు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగాలకు అర్హులు. కానీ ఆసుపత్రిలో మాత్రం కొత్త నిబంధన పెట్టారని పలువురు ఎంఎల్టీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టుల ఎంపికపై అభ్యంతరం... ఎంఎల్టీ చదివిన వారిని అనర్హులుగా ప్రకటిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై శ్రీనాథ్ అనే దరఖాస్తుదారుడు అభ్యంతరం తెలుపుతూ లిఖిత పూర్వకంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు గురువారం లేఖను అందించారు. ఈ లేఖలో మరో వివాదాన్ని సైతం లేవనెత్తారు. నోటిఫికేషన్లో కరీంనగర్ జిల్లాకు చెందిన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఉన్నప్పటికీ, ఎంపిక నోటీసు వచ్చే సరికి జోనల్ స్థాయి నియామకం అని ఉండడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఎల్టీ చదివిన వారికి న్యాయం చేయాలని కోరారు. నిబంధనల ప్రకారమే రిక్రూట్మెంట్.. ల్యాబ్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ నిబంధనల ప్ర కారమే చేపట్టాం. డీఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ అర్హత ఉన్నవారిని మాత్రమే తీసుకుంటామని నోటిఫికేష న్లో స్పష్టం చేశాం. అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నాం. – డాక్టర్ రత్నమాల, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
ఎస్వీవీయూ, తిరుపతిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (ఎస్వీవీయూ).. రాష్ట్రవ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్ (బ్యాక్లాగ్ పోస్టులు) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (సైనిక్ స్కూల్, కలికిరిలో 18 ఖాళీలు) ► పోస్టులు: ల్యాబ్ టెక్నీషియన్(బ్యాక్లాగ్) ► మొత్తం పోస్టుల సంఖ్య: 13 ► అర్హత: మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారా మెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: నెలకు రూ.17,500 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: డీఎంఎల్టీలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.08.2021 ► వెబ్సైట్: https://svvu.edu.in -
తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రిలో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో ఉన్న ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ►మొత్తం పోస్టుల సంఖ్య: 34 ► పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్లు–03, థియేటర్ అసిస్టెంట్–04, ఏఎన్ఎంలు –09, ల్యాబ్ అటెండెంట్లు–04, అటెండీస్–05, వార్డ్ బాయ్స్–04, స్ట్రెచర్ బేరర్స్–05. ► అర్హత: పోస్టును అనుసరించి ఐదు, ఏడు, పదోతరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత కోర్సుల్లో డిప్లొమా, బీఎస్సీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 31.12.2020 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, వయసు ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా/నేరుగాగాని ఆఫీస్ ఆఫ్ ద సూపరింటెండ్, ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి, తిరుపతి చిరునామాకు పంపించాలి. ►దరఖాస్తులకు చివరి తేది: 26.03.2021 ►వెబ్సైట్: https://chittoor.ap.gov.in/notice_category/recruitment/ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్‌లో 12 ఖాళీలు -
ఏపీ, విశాఖపట్నంలో 21 దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం విభిన్న ప్రతిభావంతుల(దివ్యాంగులకు)కు కేటాయించిన బ్యాక్లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 21 » పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్–03, ల్యాబ్ టెక్నీషియన్–01, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఫిమేల్)–03, వర్క్ ఇన్స్పెక్టర్–03, షరాఫ్–01, స్వీపర్–01, ఫిట్టర్ హెల్పర్–02, ఆఫీస్ సబార్డినేట్–06, కుక్–01. » అర్హత: పోస్టును అనుసరించి చదవడం, రాయడం, ఏడు, పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సర్టిఫికేట్లు ఉండాలి. » దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సహాయ సంచాలకులు, దివ్యాంగులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ,రాణి చంద్రమణిదేవి ఆసుపత్రి ప్రాంగణం, పెద్ద వాల్తేర్ జంక్షన్, విశాఖపట్నం–530017 చిరునామాకు పంపించాలి. » దరఖాస్తులకు చివరి తేది: 18.03.2021 » వెబ్సైట్: visakhapatnam.ap.gov.in ఏపీ–కడప పశుసంవర్ధక శాఖలో ల్యాబ్ అటెండెంట్లు -
హత్య కేసులో ఐపీఎస్ అధికారిపై వేటు
లక్నో: ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో కలకలం సృష్టించిన ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ సంజీత్ యాదవ్ కిడ్నాప్, హత్య కేసులో పోలీసు డిపార్ట్మెంట్ నలుగురిని సస్పెండ్ చేసింది. వీరిలో ఐపీఎస్ అధికారి అపర్ణ గుప్తా కూడా ఉన్నారు. సంజీత్ యాదవ్‌ను గత నెల 22న కిడ్నాప్ చేసి రూ. 30లక్షలు ఇవ్వాల్సిందిగా నిందుతులు అతడి కుటుంబాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జూలై 13న పోలీసుల సమక్షంలో కిడ్నాపర్లు అడిగిన మొత్తం చెల్లించామని.. అయినా సంజీత్‌ను వదిలివేయలేదని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు గురువారం ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో సంజీత్ యాదవ్‌ను గత నెల 26న చంపి, నదిలో పడేసినట్లు వెల్లడించారు. అయితే సంజీత్ కుటుంబ సభ్యులు మాత్రం ఓ నెల రోజుల నుంచి కిడ్నాపర్లు తమకు ఫోన్ చేస్తున్నారని.. రూ. 30లక్షలు ఇస్తే సంజీత్‌ని వదిలేస్తామని చెప్పినట్లు తెలిపారు. (‘హత్య చేసి నదిలో పడేశారు’) ఈ క్రమంలో ఏరియా ఇన్చార్జ్ అపర్ణ గుప్తాను కలిసి కిడ్నాపర్లు డిమాండ్ చేసిన డబ్బును అందించామన్నారు. అంతేకాక డబ్బు సంచిన ఓ రైల్వేట్రాక్‌పై పడేశామని చెప్పారు. కానీ పోలీసులు కిడ్నాపర్లకు డబ్బు ముట్ట చెప్పి.. వారికి పారిపోయే అవకాశం ఇచ్చారని సంజీత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాక ఇంతవరకు సంజీత్ మృతదేహాన్ని కూడా కనుక్కోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి వాదన ఇలా ఉండగా పోలీసులు మాత్రం ఆ సంచిలో డబ్బు లేదని వెల్లడించారు. అంతేకాక సంజీత్ కుటుంబ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు అపర్ణ గుప్తాతో పాటు మరో ముగ్గురిని సస్పెండ్ చేశారు. అంతేకాక ‘సంజీత్ కుటుంబ సభ్యులు కిడ్నాపర్లకు డబ్బు చెల్లించామని చెబుతున్నారు. కానీ ఇంతవరకు జరిగిన దర్యాప్తులో డబ్బు చెల్లించినట్లు తెలియలేదు. ఏది ఏమైనా కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. డబ్బు చెల్లించినట్లు తెలిస్తే.. వారికి అందజేస్తాం. ఈ కేసుతో మా డిపార్ట్మెంట్ అధికారులకు సంబంధం ఉన్నట్లు తెలిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అన్నారు. (నటి కిడ్నాప్ ప్లాన్: ముఠా అరెస్టు) -
బ్లడ్ శాంపిళ్లను ఎత్తుకెళ్లిన కోతులు
మీరట్: ఒక ల్యాబ్ టెక్నీషియన్ నుంచి రక్తపు నమూనా కిట్స్‌ను కోతులు ఎత్తుకెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ బ్లడ్ శ్యాంపిల్ కిట్స్‌ను చెట్టుపై కూర్చుని ఆ కోతులు కొరికి చప్పరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ శ్యాంపిల్స్ కరోనా అనుమానితులవని, ఇక ఆ కోతుల ద్వారా కరోనా మరింత వ్యాప్తి చెందుతుందని వచ్చిన వార్తలు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. అయితే, అవి కరోనా అనుమానితుల రక్త నమూనాలు కావని, మధుమేహం ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారివని మీరట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గార్గ్ చెప్పారు. -
కాబోయే భర్తకు ఫోన్ చేశాడని ప్రియుడినే..!
సాక్షి, కడప: తాను పెళ్లి చోసుకోబోయే యువకుడికి ఫోన్ చేసి తన గురించి చెడ్డగా చెప్పి తన పెళ్లి చెడగొడుతున్నాడనే కారణంగా సాలా శ్రీనివాసులు అనే వ్యక్తిని ఓ నర్సు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కడప నగరం చిన్నచౌకు పోలీసుస్టేషన్ పరిధిలో అప్సర సర్కిల్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్లో ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్న సాలా శ్రీనివాసులు అనే వ్యక్తి గత నెల 25న హత్యకు గురైన విషయం విదితమే. మృతుని భార్య సుమతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. ఈ సంఘటనలో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం చిన్నచౌకు పోలీసుస్టేషన్ ఆవరణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిన్నచౌకు సీఐ కె.అశోక్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. చదవండి: 'నేను ఏ తప్పు చేయలేదు' 2014లో నారిపోగు సృజన అలియాస్ సృజన వాహని, హతుడు శ్రీనివాసులు కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసేవారు. ఆ సమయంలో పరస్పరం ప్రేమించుకున్నారు. ఈ సమయంలో వారిమధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత శ్రీనివాసులు సృజనను అనుమానంతో వేధిస్తుండడంతో ఆమె అక్కడ ఉద్యోగం మానేసి హైదరాబాదుకు వెళ్లి అక్కడి ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో నర్సుగా పనిచేస్తూ ఉండింది. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబరు 27న తిరిగి కడపలోని అదే ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా చేరింది. అక్కడ ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులుతో తిరిగి వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే శ్రీనివాసులు అప్పటికే సుమతి అనే మహిళను వివాహం చేసుకుని సంతానం కలిగి ఉన్నాడని తెలుసుకున్న సృజన అతనికి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ పరిస్థితిలో సృజనకు రాజేష్ అనే యువకుడితో పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ విషయమై సృజన, శ్రీనివాసులు మధ్య గొడవ జరిగింది. చదవండి: నటి 'శ్రుతి' లీలలు మామూలుగా లేవుగా..! రాజేష్‌ను పెళ్లి చేసుకోవద్దని ఆమెపై ఒత్తిడి తీసుకురాగా, అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో సృజన దగ్గరి నుంచి రాజేష్‌కు సంబంధించిన ఫోన్ నంబరును హతుడు తీసుకుని అతనికి ఫోన్ చేసి బెదిరించినట్లు విచారణలో తెలిసింది. శ్రీనివాసులు తనకు ఎప్పటికైనా అడ్డుగా ఉంటాడని భావించి అతన్ని అంతమొందించాలని భావించింది. అదను కోసం వేచి ఉండగా గత నెల 24వ తేదీ రాత్రి శ్రీనివాసులు డ్యూటీకి వచ్చి సృజనతోపాటు విధులు నిర్వర్తించాడు. 25వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో నర్సులు విశ్రాంతి తీసుకునే గదిలో వీరిద్దరూ గొడవ పడ్డారు. శ్రీనివాసులు కోపంగా గదిలో ఉన్న చీరతో ఉరి వేసుకుని చనిపోతానని బెదిరించాడు. అప్పటికే శ్రీనివాసులును చంపాలనే ఉద్దేశంతో ఉన్న సృజన ఆలస్యం చేయకుండా అతని మెడకు చీరను బిగించి చంపేసింది. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితురాలిని గుర్తించి అరెస్టు చేశారు. అయితే ఈ సంఘటన జరిగే సమయంలో ఆసుపత్రిలోని సీసీ కెమెరాలను ఆఫ్ చేసి ఉండటంతో ఈ హత్య చేసేందుకు నిందితురాలికి ఇంకా ఎవరైనా సహకరించారా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నామని సీఐ వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన ఎస్ఐలు ఎస్కే రోషన్, ఎం.సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ జె.రామసుబ్బారెడ్డి, కానిస్టేబుళ్లు సి.సుధాకర్ యాదవ్, ఎ.శివప్రసాద్, వి.చెండ్రాయులను సీఐ అశోక్‌రెడ్డి, డీఎస్పీ సూర్యనారాయణ అభినందించారు. -
గురుకులాల్లో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు
సాక్షి, అచ్చంపేట: రాష్ట్రంలోని 34 గురుకుల పాఠశాలల్లో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులను ప్రారంభించినట్లు గురుకులాల రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో రూ.1.50 కోట్లతో నిర్మించిన అదనపు గదులు, కస్తూర్భా బాలికల విద్యాలయంలో నూతనంగా నిర్మిం చిన జూనియర్ కళాశాల భవనాన్ని మంగళవారం గురుకులాల కార్యదర్శి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం గురుకులాల పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియో గం చేసుకొని విద్యార్థులు చదువుల్లో రాణించాలని కోరారు. రాష్ట్రంలో ల్యాబ్ టెక్నిషియన్ కోర్సులతో పాటు 53 మహిళా డిగ్రీ కళాశాలలను ప్రారంభించినట్లు తెలిపారు. కస్తూర్భా విద్యాలయాల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులను మహిళా డిగ్రీ కళాశాలలకు పంపాలని ఆయన సంబంధిత విద్యాలయాల ప్రిన్స్‌పాల్స్‌ను కోరారు. రాబోయే కాలంలో గురుకులాలను సమర్థవంతంగా నిర్వహించుటకు తగు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు ఆడ పిల్లల చదువుల విషయంలో సమస్యగా మారకుండా స్వేచ్ఛగా చదువుకునేలా వాతావరణం కల్పించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకులాల రూపు రేఖలే మారాయన్నారు. ప్రభుత్వం బడుగు, బలహీన విద్యార్థుల సంక్షేమం కోరుతూ అనేక అన్ని వర్గాల వారికి గురుకుల విద్యను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. సమస్యలను అధిగమించి ఆత్మగౌరవంతో చదువు కోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను హక్కుగా భావించి సద్వినియోగం చేసుకోవా లని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, ప్రిన్స్‌పాల్స్ నాగభూషణం, శారద, ఎంఈఓ చంద్రుడు, జెడ్పీటీసీ సభ్యు రాలు నేజమ్మ, ఎంపీపీ లింగమ్మ, స ర్పంచ్ కోనేటి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
వైద్య ఉద్యోగి కిడ్నాప్ కలకలం
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గుత్తుల వెంకట సుబ్బారావు (సుభాష్) కిడ్నాప్ సంఘటన కలకలం రేపింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగి(ల్యాబ్‌లో టెక్నీషియన్)గా పనిచేస్తున్న గుత్తుల వెంకట సుబ్బారావు మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. తన కోసం నలుగురు వ్యక్తులు కారులో రావడంతో ఆసుపత్రి ఆవరణలో వారితో మాట్లాడి, అనంతరం 2.45 సమయంలో అదే కారులో వెళ్లారు. ఆసుపత్రి గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు కారు నంబర్ టీసీ 12 ఈజీ 6730 గా రికార్డులో నమోదు చేశాడు. అప్పటి నుంచి సుబ్బారావు సెల్‌ఫోన్ పని చేయకపోవడంతో భార్య శ్రీదేవి మంగళవారం రాత్రి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుభాష్‌ను కారులో తీసుకు వెళ్లడం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజీలో నమోదైంది. సెక్యూరిటీ గార్డు నమోదు చేసి కారు నెంబర్ ట్రేస్ అవుట్ కాకపోవడం, సెల్‌ఫోన్ పని చేయకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కారణమేంటో.. సుభాష్ కిడ్నాప్ వ్యవహారంపై ఆసుపత్రి వర్గాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. సుభాష్‌కు అప్పులు ఎక్కువగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో అప్పులు తీర్చలేనందుకు, అప్పులు ఇచ్చిన వారు ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక ప్రస్తుతం క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతున్న దృష్ట్యా బెట్టింగ్ ముఠాలు వారు ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుభాష్‌ను కారులో తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరా పుటేజీలో రికార్డు అయినా కారు నంబర్ గానీ, తీసుకువెళ్లిన వ్యక్తులు గానీ స్పష్టంగా కనిపించకపోవడం పోలీసులకు సవాల్ గా మారింది. సుభాష్‌కు ఎవరితోనూ గోడవలు లేవని సహ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఆచూకీ తెలపాలంటూ ఆందోళన ల్యాబ్ టెక్నీషియన్ సుభాష్ ఆచూకీ తెలపాలంటూ భార్య శ్రీదేవి, తన ఇద్దరు పిల్లలతో బుధవారం సాయంత్రం ఆసుపత్రి ముందు ఆందోళన చేసింది. ఈ ధర్నాకు ఆసుపత్రి వైద్య సంఘాల నాయకులు మద్దతు పలికారు. వెంటనే సుభాష్ ఆచూకీ తెలియజేయాలని, కిడ్నాప్ చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ వైద్యుడి అరెస్ట్
తొర్రూరు: ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఆస్పత్రి ఎండీగా అవతారమెత్తాడు. ఈ నకిలీ వైద్యుడు చివరకు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలను డీఎస్పీ రాజారత్నం వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన సరికొండ వెంకట కృష్ణంరాజు అలియాస్ రాంబాబు తండ్రి భూపతిరాజు ఆర్ఎంపీగా పనిచేసేవాడు. వెంకట కృష్ణంరాజు తండ్రి వద్ద ఆర్ఎంపీగా శిక్షణ పొందాడు. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసి గుంటూరు జిల్లా ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేశాడు. రాంబాబు దొర అనే వైద్యుడి సర్టిఫికెట్ల కలర్ జిరాక్స్‌లపై ఫొటో మార్ఫింగ్ చేసి తొర్రూరు చింతలపల్లి రోడ్డులో అమృత ఆస్పత్రి నెలకొల్పాడు. నాలుగేళ్లుగా ఎండీ గోల్డ్ మెడలిస్ట్ బోర్డు పెట్టుకుని అర్హత లేకు న్నా అన్ని రకాల వైద్యసేవలు కొనసాగిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వైద్యుల నియామక కౌన్సెలింగ్‌కు అసలైన అర్హతలు గల డాక్టర్ రాంబాబుదొర, తొర్రూరుకు చెందిన ఓ వైద్యుడు హాజరు కాగా నకిలీ వైద్యుడి బాగోతం బయటపడింది. మీడియాలో కథనాలు రావడంతో నకిలీ వైద్యుడు పరారయ్యాడు. డిప్యూటీ డీఎంహెచ్‌వో కోటాచలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, పోలీసులకు లొంగిపోయాడు. -
ఇంజక్షన్ వికటించి మహిళ మృతి
నక్కపల్లి(పాయకరావుపేట) : గొడిచర్ల పీహెచ్సీలో ఇంజక్షన్ వికటించి ఓ మహిళ మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలుఇలా ఉన్నాయి. ఎస్.రాయవరం మండలం గోకుల పాడుకు చెందిన కొఠారు నాగమణి(24) తన స్నేహితురాలు నానేపల్లి విజయతో కలసి సోమవారం ఉదయం గొడిచర్ల పీహెచ్‌సీకి వచ్చింది. తనతో తెచ్చుకున్న ఇంజక్షన్‌ను చేయాలని అక్కడ ఉన్న ల్యాబ్‌టెక్నీషియన్ రూపను కోరింది. అయితే ఇంజక్షన్ చేసేందుకు రూప నిరాకరించింది. బతిమాలడంతో ఆమె నాగమణికి ఇంజక్షన్ చేసింది. కొద్దిసేపటికి నాగమణి సృహతప్పిపడిపోయింది. వెంటనే రూప, నాగమణి స్నేహితురాలు విజయ ఆమెకు మంచినీరు పట్టి, సపర్యలు చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆమె మరణించిందని తనకు విజయ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిందని మృతురాలికి వరుసకు సోదరుడైన లంక రామచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి ఒత్తిడి మేరకు తాను ఇంజక్షన్ చేసినట్టు రూప చెబుతోంది.అయితే ఇంజక్షన్‌ను మక్కకు చేయాల్సి ఉండగా చేతికి చేయడం వల్లే వికటించి మరణించినట్టు పీహెచ్సీ వైద్యాధికారి నాగనరేంద్ర తెలిపారు.కాగా మృతురాలు కొద్ది రోజులుగా హృద్రోగంతో బాధపడుతోంది. తరచూ ఇంజక్షన్లు చేయించుకుంటోంది.దీనిలో భాగంగానే స్నేహితురాలితోకలసి గొడిచర్ల వచ్చి అక్కడ ఇంజక్షన్ చేయమని కోరిందని, ముందు నిరాకరించిన ట్యాబ్‌టెక్నీషియన్ రూప తర్వాత చేసిందని అక్కడ ఉన్న సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆస్పత్రిలో డాక్టర్ అందుబాటులో ఉన్న సమయంలో హృద్రోగంతో బాధపడుతున్న రోగికి ఆయన అనుమతి తీసుకోకుండా ఇంజక్షన్ చేయడం నేరమని తెలుస్తోంది. నక్కపల్లి సీఐ సీహెచ్ రుద్రశేఖర్ పీహెచ్‌సీకి వెళ్లి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సింహాచలం తెలిపారు. -
లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య
ఒంగోలు క్రైం:లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం సాయంత్రం ఒంగోలు నగరంలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న కంభంకు చెందిన వి.విజయభాస్కరరావు (50) సోమవారం అర్ధరాత్రి ఒంగోలు వచ్చాడు. స్థానిక బస్టాండ్ సమీపంలోని సాగర్ సెంటర్లో గల ఓ ప్రైవేట్ లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం వరకు లాడ్జి నిర్వాహకులకు కూడా కనిపించాడు. సాయంత్రం తలుపు వేసి ఉండటాన్ని గమనించిన లాడ్జి నిర్వాహకులు.. కాలింగ్ బెల్ కొట్టి చూశారు. ఎంతకీ బయటకు రాకపోవడంతో రాత్రి 9.30 గంటల సమయంలో ఒంగోలు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా ఎస్సై దాసరి రాజారావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గదిలోపల గడియలు తొలగించి లోనికి ప్రవేశించిన పోలీసులు.. విజయభాస్కరరావు విగతజీవిగా మారి ఉండటాన్ని గమనించారు. రూమ్‌లోని బెడ్ మీద పురుగులమందు డబ్బా ఉంది. ఆ పక్కనే అతను స్వహస్తాలతో రాసిన సూసైడ్ నోట్ ఉంది. అక్కడే ఉన్న సెల్‌ఫోన్‌తో విజయభాస్కరరావు కుటుంబ సభ్యులకు ఎస్సై రాజారావు సమాచారం అందించారు. ‘నా స్థలాన్ని అమ్మి అప్పులు తీర్చండి, కాలేజీలో ఉన్న నా సహచరులకు నేను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని చెప్పండి, పరిమళను మంచిగా చూడమని చెప్పండి, బన్ని.. మమ్మీని, చెల్లిని జాగ్రత్తగా చూసుకో, ముఖ్యంగా ఎవరినీ ద్వేషించవద్దు, అందరినీ ప్రేమించు. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. లైఫ్‌లో నేను అన్ని విధాలుగా ఫెయిలయ్యాను. అందుకే జీవితం మీద విరక్తితో తనువు చాలిస్తున్నా. పోలీసులకు నా విన్నపం. నా బాడీని కంభం చేర్చగలరు’ అని సూసైడ్ నోట్లో రాసి ఉంది. ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్సై దాసరి రాజారావు తెలిపారు. -
చెప్పిన చోటుకి రావాలి..!
సాక్షి, అమరావతి: ‘చంద్రన్న సంచార చికిత్స’ పథకంలో(104) పనిచేస్తున్న మహిళలపై వేధింపులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పలువురు మహిళలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో బాధను దిగమింగి ఉద్యోగం చెయ్యడమా, లేదంటే మానేయడమో చేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పిరమిల్ స్వాస్థ్య యాజమాన్య సిబ్బంది తీవ్ర వేధింపులకు గురిచేసినట్టు ఓ మహిళా ల్యాబ్ టెక్నీషియన్ ఆరోపించింది. పిరమిల్ స్వాస్థ్య జిల్లా మేనేజర్ శంకరనారాయణ, ఆపరేషనల్ ఎగ్జిక్యూటివ్ లక్షణరావులపై జిల్లా కలెక్టర్‌కూ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్యకూ ఫిర్యాదు చేశారు. మేము ఎక్కడ వాడుకుంటే అక్కడకు రావాలి అంటూ వ్యంగ్యంగా, కించపరిచే మాటలు మాట్లాడారని, మాట వినకపోతే రోజుకో ఊరికి వెళ్లాలని చెప్పి వేధించేవారని వాపోయింది. దీనిపై యూనియన్ కూడా స్పందించి ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదు. అలాగే పాడేరు డివిజన్లో పనిచేస్తున్న ఒక ఏఎన్ఎంను కూడా ఇలాగే వేధించడంతో ఆమె కూడా యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీనిపై ఎవరూ చర్యలు తీసుకోలేదు. విజయవాడలో ఒక మహిళకు ఏఎన్ఎం ఉద్యోగం ఇప్పిస్తామని కార్యాలయానికి పిలిపించి ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఆ మహిళ తీవ్ర మనోవేదనకు గురైంది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని, తనపేరు అందరికీ తెలిసిపోతుందనే ఉద్దేశంతో అదే సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగితో చెప్పుకుని వాపోయింది. ఇలా ‘చంద్రన్న సంచార చికిత్స’లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులపై ఆగడాలు మితిమీరిపోయాయి. ప్రత్యేకంగా మహిళా ఫిర్యాదులపై ఓ మహిళా అధికారిని ఏర్పాటు చేశామని చెబుతున్నా అది తూతూమంత్రంగా ఉంది. మీడియాకు చెబితే ఉద్యోగం నుంచి తొలగిస్తాం.. సంస్థలో వేధింపులపై మీడియాకు సమాచారమిస్తే ఎలాంటి ఉత్తర్వులు లేకుండా తొలగించే హక్కు ఉందని యాజమాన్యం హెచ్చరిస్తోంది. ఇప్పటికే పలువురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి మిగతా ఉద్యోగుల్లో భయభ్రాంతులు సృష్టించారు. మీడియాలో వచ్చిందంటే మీరే కారణం, మీరు కారణం కాదనుకుంటే వార్తలు రాసిన రిపోర్టరుపై సదరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి అంటూ ఉద్యోగులకు చెప్పారంటే యాజమాన్యం ఏ స్థాయిలో వ్యవహరిస్తోందో అర్థమవుతుంది. గత 11 సంవత్సరాలుగా ఈ పథకం కింద పనిచేస్తున్నాం, గతంలో ఎప్పుడూ ఇలాంటి వేధింపుల ధోరణి లేదని, ప్రస్తుతం ఈ సంస్థ వేధింపులు భరించలేకున్నామని మహిళలు వాపోతున్నారు. చివరకు అధికారులకు ఫిర్యాదు చేసినా తమను బదిలీ చేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నాన్నా ప్రకాష్.. అమ్మనొచ్చాను లేయ్ రా..
సాక్షి, అనంతపురం : ‘నాన్నా బంగారు లేయ్ నాన్న. ఓరేయ్ ప్రకాషూ అమ్మను వచ్చానురా... లేయ్‌రా.. నాయనా’ అంటూ ఆతల్లి పెట్టిన కన్నీరు అందరినీ కలచివేసింది. నిండా పాతికేళ్లుకూడా లేని కొడుకు కానరానిలోకాలకు పోయాడని తెలిసిన ఆకన్నపేగు పెట్టిన ఆర్తనాదం అంతా ఇంతాకాదు.. నిండా పాతికేళ్లు లేవు... పైగా డిప్లొమో ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (డీఎంఎల్టీ) కోర్సు చదువుతున్నాడు. ఆరోగ్య విషయంలో ప్రాథమికంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అనుభవమూ ఉంది. కానీ విధి చిన్నచూపు చూసింది. ఆస్పత్రి గేటువద్దే ఉన్న ఆ యువకుడికి ఛాతిలో నొప్పిరావడంతో నడుచుకుంటూ వెళ్లి ఎమర్జెన్సీ వార్డులోని బెడ్‌పై పడుకున్న అతను కొద్ది క్షణాల్లోనే కన్నుమూశాడు. కొడుకు మరణ వార్త విని ఆతల్లి తల్లడిల్లింది. ‘నాన్నా బంగారు లేయ్ నాన్న. ఓరేయ్ ప్రకాషూ అమ్మను వచ్చానురా...లేయ్‌రా..నాయనా’ అంటూ ఆతల్లి పెట్టిన కన్నీరు అందరినీ కలచివేసింది. ఈ సంఘటన సోమవారం సర్వజనాస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... విడపనకటళ్ మండలం గడేహొత్తూరుకు చెందిన రామలింగప్ప, శివలింగమ్మల కుమారుడు ప్యాపిలి సూర్యప్రకాష్(23) నగరంలోని సీట్స్ ఇన్స్టిట్యూట్లో డీఎంఎల్టీ (డిప్లొమో ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) రెండో సంవత్సరం చదువుతున్నాడు. క్లినికల్స్‌లో భాగంగా సోమవారం సర్వజనాస్పత్రిలోని ఓపీ విభాగం బ్లడ్ కలెక్షన్ పాయింట్లో విధులు నిర్వర్తించాడు. మధ్యాహ్నం 1 గంట సమయంలో రూంకు వెళ్లేందుకు ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఛాతినొప్పి రావడంతో వెంటనే నడుచుకుంటూ ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి పడుకున్నాడు. అయితే బెడ్‌పై పడుకున్న సూర్యప్రకాష్ ఉలుకూ పలుకూ లేకపోవడంతో వెంటనే అక్కడి చేరుకున్న డ్యూటీ డాక్టర్ శివకుమార్... అతన్ని పరీక్షించి, హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా మృతి చెందినట్లు నిర్ధారించారు. పది నిమిషాల ముందు తమతో మాట్లాడిన సూర్యప్రకాష్ నిర్జీవంగా పడి ఉండడం చూసిన సీనియర్ టెక్నీషియన్లు కన్నీరుమున్నీరయ్యారు. నాన్నా ప్రకాష్ అమ్మనొచ్చాను లేయ్ రా.. ‘నాన్నా బంగారు లేయ్ నాన్న. ఓరేయ్ ప్రకాషూ అమ్మను వచ్చానురా...లేయ్‌రా..నాయనా’ అంటూ సూర్యప్రకాష్ తల్లి శివలింగమ్మ కుమారుడి మృతదేహంపై పడి గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలివచ్చి తమ మిత్రుడుని తలుచుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. -
గుట్టుగా లింగ నిర్ధారణలు
వేలూరు: తిరువణ్ణామలైలో పది సంవత్సరాలుగా గుట్టుగా మహిళలకు అబార్షన్ చేస్తున్న ఓ ల్యాబ్ టెక్నీషియన్ బండారం బైటపడింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. తిరువణ్ణామలై అవుల్పురం వీధిలోని ఓ ఇంట్లో మహిళలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నట్లు ఆరోగ్యశాఖా అధికారులకు సమాచారం అందింది. దీంతో వైద్య సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ గురునాథన్, అసిస్టెంట్ కమిషనర్ నరసింహన్, సూపరింటెండెంట్ కమలకన్నన్‌తో కూడిన పది మంది బృందం తిరువణ్ణామలైకి వచ్చారు. వీరు తిరువణ్ణామలైలోని ఆరోగ్య జిల్లా జాయింట్ డెరైక్టర్, పోలీసులతో సమీక్షించి అవుల్పురంలోని ఇంట్లో అకస్మిక తనిఖీ చేపట్టారు. అధికారుల తనిఖీ సమయంలో అక్కడున్న కొంతమంది మహిళలను విచారించగా అబార్షన్ కోసం వచ్చినట్లు తెలిసింది. వీరిలో కొంతమంది పరీక్షలు వికటించి బాధపడుతుండడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఇంటిలో పరిశీలించగా అబార్షన్ చేసేందుకు అవసరమైన మాత్రలు, స్కానింగ్ మిషన్లు, ఇంజెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. మరోగదిలో లింగనిర్ధారణ చేయడానికి అవసరమైన మిషన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిపై తిలగవతి వద్ద విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కాగా అధికారుల విచారణలో తిలగవతి పదేళ్ల క్రితం ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసినట్లు తెలిసింది. లింగ నిర్ధారణతో పాటు అబార్షన్ చేయడానికి ఒక్కొక్కరి నుంచి రూ. 5 వేలు తీసుకుంటున్నట్లు తేలింది. ఈ విధంగా ఇప్పటివరకూ వేలల్లో అబార్షన్లు చేసి, పలు లక్షలు వసూలు చేసినట్లు వెల్లడైంది. ఆమెను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. -
అనుమానస్పద స్థితిలో యువతి మృతి
హైదరాబాద్: ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న యువతి అనుమానస్పద స్థితిలో ల్యాబ్‌లోనే మృతి చెందింది. ఈ ఘటన బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. వరంగల్ జిల్లా మరిపెడ ఉగ్గంపల్లికి చెందిన ముత్యం సత్యనారాయణ కుమార్తె సమత(24) కూకట్పల్లి వివేక్‌నగర్‌లోని శ్రీసాయిరాం లేడీస్ హాస్టల్లో ఉంటూ బోయిన్పల్లి చిన్నతోకట్ట గోల్ఫి ల్యాబోరేటరీలో ఏడాదిగా పనిచేస్తోంది. కాగా, ల్యాబ్ నిర్వాహకుడు శ్రీనివాస్...సమతను పెళ్లి చేసుకుంటానంటూ వేధిస్తున్నట్లు సమాచారం. వివాహితుడైన శ్రీనివాస్ ప్రతిపాదనను ఆమె వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె గురువారం రాత్రి ల్యాబ్‌లోనే ఫ్యాన్‌ను ఉరేసుకుని మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. కాగా, పోలీసులు ఈ ఘటన జరిగిన సమయంలో ల్యాబ్‌లోనే ఉన్న శ్రీనివాస్‌తో పాటు ఇతరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
డాక్టర్ మోసం.. ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య
హైదరాబాద్: ఎక్కడైనా ఉద్యోగం ఇచ్చిన యజమానులు.. తమ దగ్గర పనిచేసే ఉద్యోగులను పోషించాలనుకుంటారు. కానీ, హైదరాబాద్ మీర్‌పేటలో మాత్రం ఓ డాక్టర్ చేసిన మోసం కారణంగా ల్యాబ్ టెక్నీషియన్ తన ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దీంతో డాక్టర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. మీర్‌పేటలోని సాయి శ్రీనివాస ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా మల్లేష్ కొంతకాలంగా పని చేస్తున్నాడు. డాక్టర్ అశోక్ కుమార్ దగ్గర మల్లేష్ తన భూమి పత్రాలతో 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. అశోక్ కుమార్ రూ.2 లక్షల అప్పును 20 లక్షలుగా చిత్రీకరించి అతనిని వేధిస్తున్నాడు. దీంతో డాక్టర్ అశోక్ కుమార్ తనను మోసం చేశాడంటూ సూసైడ్ నోట్ రాసిన మల్లేష్.. గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారంపై పోలీసులకు గతంలోనే ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోలేదని మల్లేష్ బంధువులు ఆరోపిస్తున్నారు. -
104 వైద్య సిబ్బందికి వేతనాలేవీ..?
ఘట్కేసర్ టౌన్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించడానికి ప్రవేశపెట్టిన ‘104’ పథకం నీరుగారుతోంది. ఈ పథకానికి నిధుల సమస్య ఎదురవడంతో గ్రామీణులకు తగిన వైద్య సేవ లు అందడం లేదు. కనీసం ‘104’ వాహనాల్లో పనిచేసే సిబ్బం దికి వేతనాలు కూడా రావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించే ‘104’ వాహనంలో ఓ డ్రైవర్, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నిషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిన నియమించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాలకు వెళ్లి నిర్ణీత సమయంలో పేదలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేయడం వీరి విధి. జిల్లాలో 17 క్లస్టర్లు ద్వారా గ్రామీణా ప్రజలకు ‘104’ వాహనాలు నిత్యం సేవలందిస్తున్నాయి. నిలిచిన వేతనాలు... వైఎస్ఆర్ మరణాంతరం ఈ పథకం నిర్లక్ష్యానికి గురైంది.ప్రభుత్వం ఈ పథకానికి తగిన నిధులు సమకూర్చకపోవడంతో గ్రామీణులకు వైద్య సేవలు అందడం లేదు. అంతేకాకుండా ఈ పథకంలో పనిచేసే సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు కూడా అందడం లేదు. మే, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల వేతనాలు ఇప్పటికీ అందకపోవడంతో ‘104’ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని సిబ్బంది పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. వేతనాలకు తోడు రోజు వారీగా చెల్లించే అలవెన్సులు కూడా నిలిచిపోయాయి. వేతనం చెల్లించే సమయంలోనే ప్రతి నెలా డీఏను కూడ చెల్లించేవారు. అయితే డీఏ చెల్లింపులకూ ప్రభుత్వం మొండిచేయి చూపడంతో ఆరు నెలలుగా అవి వారికి అంద డం లేదు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి వేతనాలను అందజేయాలని కోరుతున్నారు. ఈ విషయమై సీనియర్ ప్రజా ఆరోగ్య అధికారి నారాయాణరావ్ మాట్లాడుతూ.. ‘104’ సిబ్బంది వేతనాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదని చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలకాగానే సిబ్బందికి వేతనాలు అందిస్తామని తెలిపారు. -
స్టాఫ్‌నర్సు ఆత్మహత్య
ప్రేమ వ్యవహారం కారణం పాడేరురూరల్: ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురైన స్టాఫ్‌నర్సు సోమవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. ముంచంగిపుట్టుకు చెందిన గంపరాయి రుక్మిణి (25) హుకుంపేట మండలం ఉప్ప పీహెచ్సీలో పని చేస్తున్నది. ఈమె పాడేరులోని లోచెలిపుట్టు ప్రాంతంలో నివాసం ఉంటోంది. పక్క ఇంటిలో ఉంటున్న సెగ్గె శ్రీను సోదరుడు అదే పీహెచ్సీలో ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. దీంతో తరచూ ఉప్పపీహెచ్‌సీకి శ్రీను వెళ్లేవాడు. అక్కడ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారింది. శ్రీనుది కొయ్యూరు మండలం వైఎన్‌పాకలు. డిగ్రీవరకు చదువుకున్న ఇతడు పాడేరులోని సోదరుని ఇంటిలోనే ఉంటున్నాడు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన ఇరు కుటుంబాల వారు ఈ నెల 11న పెళ్లి నిశ్చయానికి మాట్లాడుకోవాలనుకున్నారు. కాగా సోమవారం ఉదయాన్నే తాను స్వగ్రామానికి వెళుతున్నట్టు రుక్మిణి శ్రీనుకు ఎస్ఎంఎస్ పెట్టింది. ప్రియుడి నుంచి సమాధానం రాలేదు. తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడేమోనని ఆమె మనస్తాపానికి గురైంది. సాయంత్రం క్లోరోక్విన్ మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకొంది. శ్రీను ఆమెను ఆటోలో స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. కొద్ది సేపటికే ఆమె మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు శెట్టి నాగరాజు, పీహెచ్ భాగ్యవతి, వైఎస్సార్సీపీ నాయకులు పాంగి పాండురంగస్వామి ఆస్పత్రికి చేరుకొని మృతురాలి బంధువులను ఓదార్చారు. స్టాఫ్ నర్సు మృతికి కారణమైన సెగ్గె శ్రీనును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు మృతురాలి బంధువులు తెలిపారు. -
వారానికో పీహెచ్సీ సందర్శన
జిల్లా కలెక్టర్ యువరాజ్ ఆకస్మిక తనిఖీలు సబ్బవరం తహసీల్దార్‌పై ఆగ్రహం సబ్బవరం: జిల్లాలోని పీహెచ్‌సీలను ఒక గాడిన పెట్టేందుకు జిల్లా కలెక్టర్ ఎన్. యువరాజ్ నడుం బిగించారు. ప్రతి వారం ఒక పీహెచ్‌సీని సందర్శించేందుకు నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. మండలంలోని గుళ్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా ఆయన సందర్శించారు. పీహెచ్‌సీని తనిఖీ చేసిన ఆయన ఆస్పత్రిలో సమస్యలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్, స్వీపర్లు, అటెండర్లు అవసరమని పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ సుజాత కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ రికార్డులను పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేసి తహసీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధార్ కార్డులతో రేషన్ కార్డులు అనుసంధానం, పట్టాదారు పాస్‌పుస్తకాలు ఆన్లైన్ ఎలా జరుగుతోందని ఆర్ఐని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ యువరాజ్ విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో వైద్య నిపుణులు కొరత ఉందని ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 2866 మంది బడికి రాని బడిఈడు పిల్లలను గుర్తించామన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం సర్వే నెంబరు 255లో ఆక్రమణకు గురయిన ప్రభుత్వ భూమిని పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ఎమ్. నాగభూషణరావు, ఎంపీడీఓ ఎస్. త్రినాథరావు, ఆర్ఐలు అరుణ్‌కుమార్, రమేష్ ఉన్నారు. -
ఆయనపై ఎందుకంత ప్రేమ?
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ : ఒకరు కాదు... ఇద్దరు కాదు ఏకంగా బ్లడ్‌బ్యాంక్‌లో పని చేస్తున్న సిబ్బందితో పాటు బ్లడ్ బ్యాంక్ లో సభ్యు లుగా ఉన్న వారంతా ఓ ఉద్యోగిపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఆయనపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ని విధులు నుంచి తప్పించకపోతే తాము వైదొలుగుతామని సభ్యులు హెచ్చరించినప్పటికీ అధికారుల్లో చలనం లేదు. పట్టణం లోని రెడ్‌క్రాస్ సొసైటీలో ల్యాబ్ టెక్నిషియన్‌గా పని చేస్తున్న నూకరాజు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని అందులో పని చేస్తున్న మహిళా సిబ్బంది రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్, కలెక్టర్ కాంతిలాల్ దండేకు ఫిర్యాదు చేశారు. అలాగే రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని లంచం అడిగారని కొంతమంది తెలిపారు. బ్లడ్ బ్యాంక్ సభ్యులమైన తమపై దురుసుగా, కులదూషణతో మాట్లాడుతున్నారని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధు లు రవూఫ్, రామకృష్ణారావు కూడా అధికారులకు ఫిర్యా దు చేశారు. వీటిపై స్పందించి కలెక్టర్ విజయనగరం తహశీల్దార్ వెంకటశివతో నెల రోజుల క్రితం విచారణ జరిపించారు. ఫిర్యాదుదారులు విచారణకు హాజరై ఫిర్యాదులో పేర్కొ న్న అంశాలు వాస్తవమేనని చెప్పారు. పది రోజులు క్రితం జిల్లా కు వచ్చిన రాష్ట్ర రెడ్‌క్రాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం దృష్టికి కూడా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ విషయూన్ని తీసుకువెళ్లారు. అయి నప్పటికీ అధికారులు ఇప్పటివరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నూకరాజు బ్లడ్ బ్యాంక్‌లో ఔట్ సోర్సింగ్ విధానంలో ల్యాబ్ టెక్నిషి యన్‌గా పని చేస్తున్నారు. ఆరోపణలు నిజమని తేలినప్పటికీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనుకంజవేస్తున్నారో తెలియడం లేదు. దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయమై రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ కార్యదర్శి అట్టాడ హేమసుందర్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా నూకరాజుపై విచారణ పూర్తయిందన్నారు. ఫైల్ కలెక్టర్ వద్ద ఉందని, ఒకటి, రెండు రోజుల్లో ఆదేశాలు జారీ చేయనున్నారని చెప్పారు. -
వేతనాలివ్వండి మహాప్రభో!
కూచిపూడి, న్యూస్‌లైన్ : దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి గ్రామీణప్రాంత ప్రజల ఆరోగ్యరీత్యా ప్రవేశపెట్టిన 104 పథకంలో అతితక్కువ వేతనానికే సేవలందిస్తున్న సిబ్బంది జీతాలు లేక అలమటిస్తున్నారు. మూడు నెలలుగా వేతనాలు లే(రా)క పస్తులుంటున్నామని వాపోతున్నారు. జిలాల్లోని 14క్లస్టర్లలో 19 వరకు 104 సంచార వైద్యశాలలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క క్లస్టర్లో డీఈవో (డేటా ఎంట్రీ ఆపరేటర్), ల్యాబ్‌టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, వ్యాన్ డ్రైవర్ విధులు నిర్వర్తిస్తుంటారు. వీరికి గతేడాది అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల వేతనాలు రాక అప్పులు చేసుకుంటూ దుర్భర జీవితం గడుపుతున్నారు. ఇదిలా ఉండగా మిగిలిన జిల్లాలో రెండో శనివారం సెలవులిస్తుండగా ఈ జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ నుంచి సెలవు రద్దు చేసినట్లు సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. సెలవును పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. 104 వాహనానికి డీజిల్, మందులకు మాత్రం నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం సిబ్బందికి మాత్రం జీతాలివ్వకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.