విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ : ఒకరు కాదు... ఇద్దరు కాదు ఏకంగా బ్లడ్‌బ్యాంక్‌లో పని చేస్తున్న సిబ్బందితో పాటు బ్లడ్ బ్యాంక్ లో సభ్యు లుగా ఉన్న వారంతా ఓ ఉద్యోగిపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఆయనపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ని విధులు నుంచి తప్పించకపోతే తాము వైదొలుగుతామని సభ్యులు హెచ్చరించినప్పటికీ అధికారుల్లో చలనం లేదు. పట్టణం లోని రెడ్‌క్రాస్ సొసైటీలో ల్యాబ్ టెక్నిషియన్‌గా పని చేస్తున్న నూకరాజు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని అందులో పని చేస్తున్న మహిళా సిబ్బంది రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్, కలెక్టర్ కాంతిలాల్ దండేకు ఫిర్యాదు చేశారు.
అలాగే రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని లంచం అడిగారని కొంతమంది తెలిపారు. బ్లడ్ బ్యాంక్ సభ్యులమైన తమపై దురుసుగా, కులదూషణతో మాట్లాడుతున్నారని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధు లు రవూఫ్, రామకృష్ణారావు కూడా అధికారులకు ఫిర్యా దు చేశారు. వీటిపై స్పందించి కలెక్టర్ విజయనగరం తహశీల్దార్ వెంకటశివతో నెల రోజుల క్రితం విచారణ జరిపించారు. ఫిర్యాదుదారులు విచారణకు హాజరై ఫిర్యాదులో పేర్కొ న్న అంశాలు వాస్తవమేనని చెప్పారు. పది రోజులు క్రితం జిల్లా కు వచ్చిన రాష్ట్ర రెడ్‌క్రాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం దృష్టికి కూడా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ విషయూన్ని తీసుకువెళ్లారు. అయి నప్పటికీ అధికారులు ఇప్పటివరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
నూకరాజు బ్లడ్ బ్యాంక్‌లో ఔట్ సోర్సింగ్ విధానంలో ల్యాబ్ టెక్నిషి యన్‌గా పని చేస్తున్నారు. ఆరోపణలు నిజమని తేలినప్పటికీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనుకంజవేస్తున్నారో తెలియడం లేదు. దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయమై రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ కార్యదర్శి అట్టాడ హేమసుందర్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా నూకరాజుపై విచారణ పూర్తయిందన్నారు. ఫైల్ కలెక్టర్ వద్ద ఉందని, ఒకటి, రెండు రోజుల్లో ఆదేశాలు జారీ చేయనున్నారని చెప్పారు.
ఆయనపై ఎందుకంత ప్రేమ?
Published Thu, Jun 5 2014 2:10 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement