డాక్టర్ మోసం.. ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య | lab technician suicide attempts in hyderabad | Sakshi
Sakshi News home page

డాక్టర్ మోసం.. ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య

Published Thu, Oct 29 2015 1:35 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

డాక్టర్ మోసం.. ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య - Sakshi

డాక్టర్ మోసం.. ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య

హైదరాబాద్: ఎక్కడైనా ఉద్యోగం ఇచ్చిన యజమానులు.. తమ దగ్గర పనిచేసే ఉద్యోగులను పోషించాలనుకుంటారు. కానీ, హైదరాబాద్ మీర్‌పేటలో మాత్రం ఓ డాక్టర్ చేసిన మోసం కారణంగా ల్యాబ్ టెక్నీషియన్ తన ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దీంతో డాక్టర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.
 
మీర్పేటలోని సాయి శ్రీనివాస ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా మల్లేష్ కొంతకాలంగా పని చేస్తున్నాడు. డాక్టర్ అశోక్ కుమార్ దగ్గర మల్లేష్ తన భూమి పత్రాలతో 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. అశోక్ కుమార్ రూ.2 లక్షల అప్పును 20 లక్షలుగా చిత్రీకరించి అతనిని వేధిస్తున్నాడు. దీంతో డాక్టర్ అశోక్ కుమార్ తనను మోసం చేశాడంటూ సూసైడ్ నోట్ రాసిన మల్లేష్.. గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారంపై పోలీసులకు గతంలోనే ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోలేదని మల్లేష్ బంధువులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement