
మీరట్: ఒక ల్యాబ్ టెక్నీషియన్ నుంచి రక్తపు నమూనా కిట్స్‌ను కోతులు ఎత్తుకెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ బ్లడ్ శ్యాంపిల్ కిట్స్‌ను చెట్టుపై కూర్చుని ఆ కోతులు కొరికి చప్పరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ శ్యాంపిల్స్ కరోనా అనుమానితులవని, ఇక ఆ కోతుల ద్వారా కరోనా మరింత వ్యాప్తి చెందుతుందని వచ్చిన వార్తలు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. అయితే, అవి కరోనా అనుమానితుల రక్త నమూనాలు కావని, మధుమేహం ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారివని మీరట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గార్గ్ చెప్పారు.