sample
-
పుణే పోర్షే కేసు: మకందర్‌కు ఫోన్ చేసిందెవరు?
ముంబై: పుణేలో సంచలనం రేపిన పోర్షే కారు ప్రమాదం దర్యాప్తులో పోలీసులు మరో కీలక విషయం బయటపెట్టారు. బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయాలని నిందితుడు (మైనర్ బాలుడు) తండ్రి డాక్టర్లకు రూ. 3 లక్షల లంచం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ లంచం జువైనల్ జస్టిస్ బోర్డు ఆవరణంలో డాక్టర్ల సూచనతో హాస్పిటల్ వార్డు బాయ్‌కి అందజేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి తండ్రి విశాల్ అగర్వాల్.. బ్లడ్ శాంపిళ్లను తన భార్య బ్లడ్ శాంపిళ్లతో తారుమారు చేయాలని సూసాన్ ఆస్పత్రి వార్డు బాయ్ అతుల్ ఘట్కాంబ్లేకు లంచం ఇచ్చినట్లు తెలిపారు. ఆ లంచాన్ని విశాల్ అగర్వాల్ ఏకంగా జువైనల్ జస్టిస్ బోర్టు ఆవరణంలో ఇచ్చారని దర్యాప్తులో వెల్లడైంది. పుణే క్రైం బ్రాంచ్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్టు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. సూసాన్ ఆస్పత్రి ఫొరెన్సిక్ విభాగం హెడ్ డా.అజయ్ తవారే, డా.శ్రీహరి హాల్కర్ (చీఫ్ మెడికల్ ఆఫీసర్) సూచన మేరకు వార్డుబాయ్ అతుల్ ఘట్కాంబ్లే లంచం తీసుకోవడానికి అంగీకరించాడని పోలీసులు తెలిపారు.చదవండి: పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ప్రయోగంమొదట బాలుడి బ్లడ్ శాంపిల్ నెగటివ్ వచ్చింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు మరోసారి పరీక్ష నిర్వహించగా రెండు వేర్వేరు వ్యక్తుల రిపోర్టులు వచ్చినట్లు తేలింది. బాలుడి బ్లడ్ శాంపిల్‌ను అతని తల్లి శాంపిల్‌తో డాక్టర్లు తారుమారు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. ఈ కేసుతో సంబంధం ఉన్న అష్ఫాక్ మకందర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మకందర్.. డాక్టర్లకు, బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్‌కు మధ్యవర్తిగా పనిచేశాడని క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.చదవండి: పూణే ప్రమాదంలో కీలక పరిణామం!.. తెరపైకి ఎమ్మెల్యే కుమారుడుమే 20న మకందర్ సాసూన్ ఆస్పత్రికి చేరుకునే ముందు ‘విశాల్ అగర్వాల్‌కు సాయం చేయండి’ అని అతనికి ఒకఫోన్ కాల్ వచ్చింది. తర్వాత మకందర్, డాక్టర్ తవారే మధ్య సంభాషణ జరిగింది. అయితే మకందర్ కాల్ చేసి.. విశాల్‌కు సాయం చేయాలన్నది ఎవరూ? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మకందర్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. మే 19 ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే సునీల్ టింగ్రేతో పాటు ఎరవాడ పోలీసు స్టేషన్ వద్ద మకందర్ ఉండటం గమనార్హం. మే19న మైనర్ బాలుడు చేసిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ పుణేలో సంచలనం రేపుతోంది. -
అంతరిక్షం టూ భూలోకం.. ఏం గుట్టు విప్పుతుందో?
వాషింగ్టన్: అల్లంత దూరాన అంతరిక్షంలో సేకరించిన ఆస్టరాయిడ్ తాలూకు తొలి శాంపిల్‌ను అమెరికా భూమి మీదికి తీసుకొచ్చింది. ఓసిరిస్ ఎక్స్ అంతరిక్ష నౌక భూమికి దాదాపు లక్ష కిలోమీటర్ల దూరం నుంచి విసిరేసిన శాంపిల్ క్యాప్సూల్ 4 గంటల ప్రయాణం తర్వాత ఆదివారం అమెరికాలోని ఉటా ఎడారిలో సైనిక భూభాగంలో దిగింది. నమూనాను సోమవారం హ్యూస్టన్ లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలిస్తారు. అనంతరం వాటిమీద పరీక్షలు, పరిశోధనలు చేస్తారు. అక్కడ గతంలో తెచ్చిన చంద్ర శిలలున్నాయి. వాటిని 50 ఏళ్ల క్రితం అపోలో మిషన్‌లో భాగంగా చంద్రుని మీదికి వెళ్ళిన అంతరిక్ష యాత్రికులు తీసుకొచ్చారు. తాజా క్యాప్సూల్ లో కనీసం పావు కేజీ పరిమాణంలో ఆస్టరాయిడ్ తాలూకు శకలాలు ఉండి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి ఎలా రూపొందిందో, దానిపై జీవం ఎలా వికసించిందో అర్థం చేసుకోవటానికి అవి మరింతగా ఉపకరిస్తాయని భావిస్తున్నారు. ఇప్పటిదాకా జపాన్ ఒక్కటే ఆస్టరాయిడ్ శకలాలను భూమికి తెచ్చింది. Today's #OSIRISREx asteroid sample landing isn't just the end of a 7-year, 3.9-billion-mile journey through space. It takes us 4.5 billion years back in time. These rocks will help us understand the origin of organics and water that may have seeded life on Earth.… pic.twitter.com/sHLRrnWqAg — NASA (@NASA) September 24, 2023 ఏడేళ్ల ప్రయత్నం... ఆస్టరాయిడ్లపై పరిశోధన నిమిత్తం నాసా 2016లో 100 కోట్ల డాలర్ల ఖర్చుతో ఓసిరిస్ ఎక్స్ అంతరిక్ష నౌకను ప్రయోగించింది. రెండేళ్ల అనంతరం అది బెన్నూగా పిలిచే ఆస్టరాయిడ్ ఉపరితలంపై దిగింది. 2020లో దాని మీదినుంచి స్వల్ప పరిమాణంలో శకలాలను ఒక క్యాప్సూల్ లోకి సేకరించి వెనుదిరిగింది. అప్పటికే అది కోట్లాది కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున్న బెన్నూ ఆస్టరాయిడ్ ప్రస్తుతం భూమికి 8.1 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అది 2182 సంవత్సరంలో భూమికి అతి సమీపంగా వస్తుందని, అప్పుడది బహుశా మనను ఢీకొనే ప్రమాదమూ లేకపోలేదని అంచనా. ఓసిరిస్ ఎక్స్ ప్రస్తుతం అపోఫిస్‌గా పిలిచే మరో ఆస్టరాయిడ్ వైపు పయనిస్తోంది. బెన్నూ రైట్ ఛాయిస్ సౌర కుటుంబం పుట్టినప్పుడు ఏర్పడ్డ పదార్థంతో బెన్ను రూపొంది ఉంటుందని భావిస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం శాస్త్రవేత్తల వద్ద ఉన్న ఉల్క పదార్థాల నమూనాలతో పోలిస్తే ఇది భిన్నమైంది. దీన్ని శోధించడం ద్వారా 450 కోట్ల ఏళ్ల కిందట సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకురావొచ్చు. బెన్నూ.. కర్బన పదార్థాలు పుష్కలంగా ఉండే కార్బనేషియస్ తరగతి గ్రహశకలం. ఇలాంటి ఖగోళ వస్తువులు గ్రహాల నిర్మాణంలో ‘ఇటుకల్లా’ పనిచేసి ఉంటాయని విశ్లేషిస్తున్నారు. దీనిపై సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఖగోళశాస్త్రంలో నేడున్న అతిపెద్ద ప్రశ్న.. జీవానికి ప్రధాన కారణమైన నీరు, సేంద్రియ పదార్థాలు భూమి మీద పుష్కలంగా ఉండటానికి కారణమేంటి? వందల కోట్ల ఏళ్ల కిందట బెన్ను వంటి గ్రహశకలాలు వీటిని భూమికి చేరవేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ గుట్టును ఒసైరిస్-రెక్స్ నమూనాలు విప్పే అవకాశం ఉంది. చాలా గ్రహశకలాలు.. అంగారకుడు, గురుడు మధ్య ఉన్న గ్రహశకల వలయంలో ఉన్నాయి. అక్కడికి చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. బెన్నూ మాత్రం ఆరేళ్లకోసారి భూమికి చేరువగా వచ్చి వెళుతుంటుంది. అందువల్ల ఆ గ్రహశకలం వద్దకు వ్యోమనౌకను పంపి, భూమికి తిరిగి రప్పించడం చాలా సులువు. ఉత్కంఠ ప్రయాణంలో.. రోదసిలో దాదాపు మూడేళ్ల ప్రయాణం తర్వాత ఒసైరిస్-రెక్స్.. భూమికి చేరువైంది. భూ ఉపరితలానికి లక్ష కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆదివారం సాయంత్రం ఈ వ్యోమనౌక నుంచి శాంపిల్ క్యాప్సూల్ విడిపోయింది. ఆ తర్వాత నాలుగు గంటలు ప్రయాణించాక క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అనంతరం 13 నిమిషాల పాటు దట్టమైన వాతావరణాన్ని చీల్చుకుంటూ గంటకు 44,500 కిలోమీటర్ల వేగంతో నేల దిశగా దూసుకొచ్చింది. గాలి రాపిడి వల్ల చెలరేగిన 3వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను ఉష్ణ రక్షణ కవచం సాయంతో తట్టుకోగలిగింది. పారాచూట్లు దశలవారీగా విచ్చుకొని క్యాప్సూల్ వేగాన్ని తగ్గించాయి. అమెరికాలోని యూతా ఎడారిలో అది సురక్షితంగా దిగింది. హెలికాప్టర్లో వచ్చిన బృందాలు దీన్ని సేకరించి, సమీపంలోని తాత్కాలిక క్లీన్ రూమ్‌లోకి తరలించాయి. ఆ తర్వాత హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు పంపుతారు. 50 ఏళ్ల కిందట చందమామ నుంచి తీసుకొచ్చిన నమూనాలు కూడా అక్కడే ఉన్నాయి. ఒసైరిస్-రెక్స్.. తన ఏడేళ్ల ప్రస్థానంలో.. సుమారు 620 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. -
బ్లడ్ శాంపిళ్లను ఎత్తుకెళ్లిన కోతులు
మీరట్: ఒక ల్యాబ్ టెక్నీషియన్ నుంచి రక్తపు నమూనా కిట్స్‌ను కోతులు ఎత్తుకెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ బ్లడ్ శ్యాంపిల్ కిట్స్‌ను చెట్టుపై కూర్చుని ఆ కోతులు కొరికి చప్పరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ శ్యాంపిల్స్ కరోనా అనుమానితులవని, ఇక ఆ కోతుల ద్వారా కరోనా మరింత వ్యాప్తి చెందుతుందని వచ్చిన వార్తలు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. అయితే, అవి కరోనా అనుమానితుల రక్త నమూనాలు కావని, మధుమేహం ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారివని మీరట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గార్గ్ చెప్పారు. -
సత్యదేవా .. గోడు కనవా!
ఆదాయం ఘనం... సౌకర్యాలు శూన్యం సత్యదేవుని నమూనా ఆలయం వద్ద వసతుల లేమి ఏటా రూ.ఐదు కోట్ల ఆదాయం భక్తులకు తాగేందుకు నీరు కరువు అన్నవరం : స్థానిక జాతీయ రహదారిపై (బైపాస్ రోడ్) గల సత్యదేవుని నమూనా ఆలయం ద్వారా ఏటా దేవస్థానానికి రూ.ఐదు కోట్లు పైబడి ఆదాయం వస్తోంది. అయినా అక్కడ సరైన సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం తాగడానికి మంచినీరు కూడా లేని పరిస్థితి నెలకొని ఉంది. దాహం వేసిన భక్తులు పక్కనే పాన్‌షాపుల్లో వాటర్ బాటిళ్లు కొనుక్కుని తాగుతున్నారు. ఎండలు ముదురుతున్నా భక్తులకు సరైన షెల్టర్ లేదు. అన్నింటికీ మించి అక్కడ విక్రయించే సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లను నిల్వ ఉంచేందుకు గదిలేకపోవడంతో ప్రసాదాలను కౌంటర్లో నిల్వ ఉంచుతున్నారు. గతంలో అన్నవరం గ్రామం నుంచి వాహనాల రాకపోకలు కొనసాగేవి. వాటిలో ప్రయాణించే భక్తుల కోసం సత్యదేవుని మెట్లదారి ప్రారంభంలో తొలిపాంచా నిర్మించి అక్కడ సత్యదేవుని చిత్రపటం ఉంచి, కొబ్బరికాయలు కొట్టే ఏర్పాటు చేశారు. అక్కడే స్వామివారి ప్రసాదాలు విక్రయించే స్టాల్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయితే 1998–2000 సంవత్సరాల మధ్య చెన్నై–హౌరా జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16) విస్తరణ సమయంలో అన్నవరం శివార్లలో నుంచి బైపాస్ రోడ్ నిర్మించారు. దీంతో దేవస్థానానికి వచ్చే వాహనాలు, ఆర్టీసీ బస్‌లు తప్ప మిగిలిన వాహనాలు గ్రామంలోకి రాకుండా వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది. బైపాస్ రోడ్ మీదుగా ప్రయాణించే వాహనాల్లోని భక్తుల కోసం అక్కడ కూడా స్వామివారి నమూనా ఆలయం నిర్మించారు. అక్కడ కూడా స్వామివారి హుండీ పెట్టి, ప్రసాదాల విక్రయాలు ప్రారంభించారు. గత 17 ఏళ్లుగా ఆ నమూనా ఆలయం వద్ద ప్రసాదాల విక్రయాలు, స్వామివారి హుండీ ద్వారా దేవస్థానానికి ఏటా రూ.ఐదు కోట్ల వరకూ ఆదాయం వస్తోంది. అయినా భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం అధికారులు శ్రద్ధ చూపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. తాగేందుకు చుక్కనీరు లేదు అధికారుల అశ్రద్ధ కారణంగా ఇక్కడ భక్తులకు తాగడానికి మంచినీరు కూడా లభ్యం కావడం లేదు. ఇక్కడ బోర్ వెల్ తవ్వితే ఉప్పునీరు పడింది. చేతులు కడుక్కోవడానికి తప్ప తాగడానికి ఆ నీరు పనిచేయడం లేదు. గతంలో మినరల్ వాటర్ టిన్లు దేవస్థానం అధికారులు పంపించేవారు. గత నాలుగు నెలలుగా పంపించడం లేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. ప్రసాదాలు నిల్వచేసేందుకు చోటేది? స్వామివారి ప్రసాదాలు విక్రయించేందుకు రెండు కౌంటర్లు పెట్టారు. ఒక కౌంటర్లో ప్రసాదం టిక్కెట్లు ఇవ్వడానికి, పక్క కౌంటర్లో ప్రసాదాలు ఇవ్వడానికి వీటిని పెట్టారు. రోజూ వేలసంఖ్యలో వచ్చే ప్రసాదం ప్యాకెట్లను నిల్వ ఉంచే గది లేకపోవడంతో ఓ కౌంటర్లో వాటిని పేర్చుతున్నారు. రద్దీ రోజుల్లో ఎక్కువ ప్రసాదం ప్యాకెట్లు వస్తుండడంతో వాటిని పేర్చేందుకు చోటు లేక నమూనా ఆలయం ముందు పేర్చుతున్నారు. సిబ్బంది కూడా అక్కడే ఉండి ప్రసాదాలు విక్రయిస్తున్నారు. చిన్న షెల్టర్‌తో ఎన్నో సమస్యలు ప్రస్తుతం నమూనా ఆలయం ముందు ఉన్న షెల్టర్ చాలా చిన్నది. భక్తులకు ఇది సరిపోవడం లేదు. ఉదయం పది గంటల వరకూ ఎండ ఆలయంలోనే ఉంటోంది. వర్షాకాలం ఎక్కువ మందికి నీడనిచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ శాశ్వతంగా పెద్ద షెల్టర్ నిర్మించాలని, లేదా పందిరి అయినా వేయించాలని భక్తులు కోరుతున్నారు. -
డాండ్ రఫ్పాడించండి
గట్టిగా కొట్టకూడదు. ఊహూ... తిట్టకూడదు. ప్రేమగా హ్యాండిల్ చేయాలి. రక్కినా, గీకినా రివర్స్ కొడుతుంది. కామ్‌గా డీల్ చేయాలి. ఎక్కువ హాట్ వద్దు... ఎక్కువ కూల్ వద్దు. వెచ్చగా బుజ్జగించాలి. భుజాలు దులుపుకోవడం ఆపి... లౌలీగా డాండ్ఫ్ఫ్రాడించండి. గమనిక: చుండ్రు ఒకసారి వచ్చిందంటే దానిని రకరకాల పద్ధతుల ద్వారా తగ్గించవచ్చు. కాని పూర్తిగా నివారించలేం అన్నది గుర్తుంచుకోవాలి. జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే చుండ్రు మళ్లీ మళ్లీ బాధించే అవకాశమూ ఉంది. నలుగురిలో ఉన్నప్పుడు మన ప్రమేయం లేకుండానే మన వేళ్లు మన జుట్టులోకి దూరిపోతాయి. అదంత డీసెంట్ కాదని కాసేపు ఆగాక తెలుస్తుంది. అదీ కాకపోతే జుట్టులోంచి పొడి రాలుతుంది. ఒక్కోసారి కొందరిలో గోళ్లలోకి జిడ్డు చేరుతుంది. ఏదైనా... పదిమందిలో మనకు ఇబ్బంది కలిగించే వ్యవహారమే జరుగుతుంది. కారణం... చుండ్రు. చుండ్రు కారణంగా మన దేశంలో చాలా మంది బాధపడుతుంటారు. ప్రధానంగా 20 - 40 ఏళ్ల మధ్య వయసువారిలో ఈ సమస్య ఎక్కువ. అదీ స్త్రీలలోకన్న పురుషులలో ఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. పుట్టుకొచ్చే విధం ఇదీ... చర్మంలో ఎపిడెర్మిస్, డెర్మిస్ అనే రెండు పొరలు ఉంటాయి. పై పొరను ఎపిడెర్మిస్ అని, కింది పొరను డెర్మిస్ అని అంటారు. మాడుపైన ఉండే డెర్మిస్ పొరలో నుంచే వెంట్రుకలు పుట్టుకువస్తాయి. ఈ హెయిర్ ఫాలికల్స్(వెంట్రుకల కుదుళ్లు) పక్కనే సెబేసియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఈ గ్రంథులు సీబమ్ అనే ఆయిల్‌ని ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ ఆయిల్ వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచటానికి దోహదం చేస్తుంది. దీని ఉత్పత్తి కొంతమందిలో సాధారణంగా ఉంటే, మరికొందరిలో అసాధారణంగా అంటే.. ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ఎపిడెర్మిస్ పొర త్వరగా జిడ్డుగా మారుతుంది. ఈ జిడ్డుపై ఫంగస్ (మెలస్సీజియా) చేరుతుంది. సహజంగానే ఈ ఫంగస్ కూడా అందరి తలలోనూ ఉంటుంది. కాకపోతే జిడ్డు చర్మం ఉన్నవారిలో ఈ ఫంగస్ అధికంగా చేరి స్కిన్సెల్స్ (చర్మకణాల), సీబమ్పై దాడి చేసి, కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ రసాయనాలు మృతకణాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి దోహదం చేస్తాయి. ఫలితంగా తలలో దురద, చికాకు కలుగుతుంది. దురద అనిపించగానే గోళ్లతో తలను గీకుతుంటారు. దీంతో మృతకణాలు పైకిలేస్తాయి. పొడిగా మారిన మృతకణాలు జుట్టు నుంచి రాలి పడతాయి. దానిపేరే ‘చుండ్రు.’ ఎక్కడెక్కడ? మాడుపైనే కాదు కనుబొమలు, కనురెప్పలు, ముక్కుకు ఇరువైపులా, బాహుమూలాల్లోనూ (చంకల్లోనూ) చుండ్రు కనిపించవచ్చు. లక్షణాలు చుండ్రును గుర్తించడం చాలా సులువు. మాడు విపరీతమైన దురదగా ఉంటుంది. తెల్లటి పొట్టులాంటి పదార్థం మాడుపైన, భుజాలమీద, దుస్తుల మీద కనిపిస్తూ ఉంటుంది. ఈ కండిషన్ మరీ తీవ్రమైతే ఆ పరిస్థితిని ‘సెబోరిక్ డర్మటైటిస్’ అంటారు. కొన్నిసార్లు హెచ్ఐవీ, విటమిన్లలో లోపాలు, పార్కిన్సన్ వంటి నరాలకు సంబంధించిన వ్యాధులు (న్యూరలాజికల్ డిజార్డర్స్) ఉన్నవారిలో ఈ సీబమ్ అనే నూనెలాంటి స్రావాలు ఎక్కువవుతాయి. దీన్ని సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. పిల్లల్లో దీన్ని పొరబడటం తగదు ఇక చుండ్రు సమస్యను పసిగట్టి, అది సోరియాసిస్ కాదని గుర్తించడం కూడా ప్రధానమే. చాలా సందర్భాల్లో పిల్లల తలల్లో పొలుసులు రాలే ఫంగల్ ఇన్ఫెక్షన్ను (టీనియా కాపిటిస్)ను చుండ్రుగా పొరబడి తల్లిదండ్రులు చికిత్సకు తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం వహించే అవకాశం ఉంది. దాని వల్ల పిల్లల్లో శాశ్వతంగా జుట్టు రాలిపోయి... తలలో ప్యాచెస్ వచ్చే అవకాశం కూడా ఉంది. వింటర్లో కీలకం చలికాలం వాతావరణంలో తేమ తక్కువగా ఉంటుంది. దీని వల్ల చర్మం పొడిబారుతుంది. మృతకణాలు పెరగడంతో పాటు, పొడి పొడిగా మారి పైకి లేస్తుంటాయి. చుండ్రు - ఆహారం పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. వీటిలోని పోషకాలు చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ని నివారించడానికి సహకరిస్తాయి. రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోయి, ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు సమస్య ఉన్నవారు మాంసం, పంచదార, మైదా, స్ట్రాంగ్ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. జుట్టు - దువ్వెన రక్తప్రసరణ కుదుళ్లకు సరిగ్గా అందాలంటే దువ్వెన మంచి మార్గం. వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో జుట్టును పాయలుగా విడదీస్తూ, ముందుకు వేసుకుని కుదుళ్ల దగ్గర నుంచి చివర్ల వరకు దువ్వాలి. ఇలా చేయడం వల్ల తలలో దుమ్ము, చుండ్రు ఉంటే రాలిపోతుంది. చుండ్రు వేధించకూడదంటే పొగ, దుమ్ము, వేడి మాడుకు తగలకుండా, తడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ని ఎప్పుడు కలవాలి? హెయిర్ ఫాల్ వేరు, చుండ్రు వేరు. చుండ్రు ఉందని ఆందోళన చెందితే సమస్య మరింతగా పెరగవచ్చు. కొన్ని వారాల పాటు వ్యక్తిగతంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇంకా చుండ్రు తగ్గకపోయినా, దీనితో పాటు మాడుపై చర్మం ఎర్రగా మారినా, పెచ్చులు పెచ్చులుగా ఊడుతున్నా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. షాంపూలు మార్కెట్లో రకరకాల యాంటీ డాండ్రఫ్ షాంపూ ఉత్పత్తులు లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి... జింక్ పైరిథ్రోన్, సెలీనియమ్ సల్ఫేడ్, కోల్తార్, కెటోకొనజోల్, శాల్సిలిక్ యాసిడ్... లాంటి యాంటీడాండ్రఫ్ షాంపూల్లో ఏదైనా వాడుకోవచ్చు. నాలుగు వారాల పాటు ఒక షాంపును వాడినప్పటికీ తగ్గకపోతే మరో షాంపూని మార్చి చూడాలి. వీటి వల్లా తగ్గకపోతే మైల్డ్ కార్గికో స్టిరాయిడ్స్ లోషన్స్‌ని మాడుకు రాసుకుని, కడిగేయాలి. షాంపూ లేబుల్స్‌పై ఉన్న నిబంధనలను పాటించడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఏ షాంపూ అయినా తగినంతగా తీసుకుని నీటిలో కలిపి జుట్టు తడపాలి. ఆ తర్వాత తలంతా రుద్దుతూ శుభ్రపరుచుకోవాలి. చుండ్రు ఉన్నవారు తప్పనిసరిగా రోజూ యాంటీ డాంఢ్రఫ్ షాంపూతో తలస్నానం చేయాలి. కేశాలు పొడిబారుతున్నాయి అనుకునేవారు స్నానం చేయడానికి అరగంట ముందు గోరువెచ్చని నూనెతో మర్ధనా చేసుకోవాలి. అయితే నూనెలు (హెయిర్ ఆయిల్ రాసుకోవడం వల్ల తల మరింత జిడ్డుగా మారి చుండ్రు సమస్య ఎక్కువ కావచ్చు. అందువల్ల చుండ్రు సమస్య ఉన్నవారు జుట్టుకు నూనె రాసుకోకపోవడమే మంచిది). చుండ్రు సమస్య మరీ తీవ్రంగా ఉన్న సమయంలో నోటి ద్వారా తీసుకోవాల్సిన ఫ్లుకోనజోల్ వంటి ఓరల్ యాంటీఫంగల్ మందులు తీసుకోవాల్సి ఉంటుంది. కండిషనర్ను రూట్లెవల్ నుంచి పెట్టుకోకూడదు. కేవలం కాస్త పై నుంచి జుట్టు పొడవునా (హెయిర్ లెంత్ పొడవునా) పెట్టుకోవాలి. ఒకవేళ ఎవరిలోనైనా తల నుంచి చుండ్రు పొలుసులుగా రాలుతుంటే వెంటనే డాక్టర్‌ను కలిసి చిన్నపిల్లలైతే టీనియా కాపిటిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్యగానీ పెద్దవాళ్లైతే సోరియాసిస్ ఏదైనా ఉన్నాయేమోనని నిర్ధారణ చేసుకోవాలి. దీని కోసం డర్మటాలజిస్ట్‌ను కలవాలి. చుండ్రు... మరికొన్ని ఇతరత్ర అంశాలు... చలి అని తలస్నానానికి బాగా వేడినీళ్లు వాడుతుంటారు. దీంతో మాడుపై చర్మం పొడిబారి చుండ్రు ఎక్కువయ్యే అవకాశం ఉంది. తలస్నానానికి గోరువెచ్చని నీళ్లే వాడాలి. మెంతులతో... చుండ్రు నివారణకు మెంతులు మంచి ఔషధం. మెంతులను రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని తలంతా పట్టించి అరగంట అలాగే ఉంచి, కడిగేయాలి. పదిహేను రోజులకు ఒసారి ఇలా చేస్తే చుండ్రు తగ్గుతుంది. కేశాలు పొడిబారకుండా ఉంటాయి. నిమ్మకాయతో... చుండ్రు అనగానే నిమ్మచెక్కతో బరాబరా జుట్టును రుద్దేస్తుంటారు. అలా కాకుండా తలంటుకున్న తర్వాత టీ స్పూన్ తాజా నిమ్మరసాన్ని మగ్గునీళ్లలో కలిపి ఆ నీటితో జుట్టు తడిసేలా కడగాలి. ఈ విధంగా నెలకు ఒకసారి చేయాలి. పెసర పిండితో... చుండ్రును తగ్గించడానికి పెసరపిండి కూడా ఉపయోగపడుతుంది. రెండు టేబుల్స్పూన్ల పెసరపిండిని అరకప్పు పెరుగులో కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు తగ్గిపోతుంది. చుండ్రు - చిట్కాలు మూడు వంతుల గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో ఒక వంతు ఆపిల్ సిడార్ వెనిగార్‌ను కలిపి, ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఆ మిశ్రమం తలకు పూర్తిగా పట్టాక డాక్టర్ సలహా మేరకు సరైన పీహెచ్ ఉన్న షాంపూతో తల స్నానం చేయాలి. మార్చి మార్చి వేణ్నీళ్లు, చన్నీళ్ల స్నానం వల్ల మాడుకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో చుండ్రు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి వల్ల చుండ్రు పెరిగే అవకాశం ఉంది. ఊపిరితిత్తుల నిండుగా బాగా గాలి పీల్చే వ్యాయామాల వల్ల ఒత్తిడి తగ్గి... తద్వారా చుండ్రు కూడా తగ్గే అవకాశం ఉంది. తలస్నానానికి ముందే ఒకసారి జుట్టును బాగా దువ్వుకోవడం వల్ల అప్పటికే తలలో ఏర్పడి ఉన్న పొట్టు వదులైపోయి మాడు మరింత శుభ్రంగా అయ్యే అవకాశం ఉంది. షాంపూలు, మంచి పోషకాహారం, కొన్ని రసాయన ఆధారిత యాంటీ-డాండ్రఫ్ షాంపూలు చుండ్రును ఎదుర్కోవడంలో బాగా సహాయపడతాయి. వైద్య నిపుణుల సహాయంతో ఈ సమస్యను సమర్థంగానే ఎదుర్కోవచ్చు. అపోహలు - వాస్తవాలు అపోహ: చుండ్రు వల్ల జుట్టు రాలుతుంది. వాస్తవం: సాధారణ చుండ్రు వల్ల జుట్టు రాలదు. ఫంగస్ వల్ల చుండ్రు ఎక్కువయితే కొద్దిగా జుట్టు రాలవచ్చు. అపోహ: చుండ్రు ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ఉదా: దువ్వెనలు, దుస్తులు ఒకరివి ఒకరు వాడుకోవడం మూలంగా. వాస్తవం: అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశాలు తక్కువ. అపోహ: అన్ని కాలాల్లోనూ విసిగిస్తుంది. వాస్తవం: చలికాలంలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అపోహ: పిల్లల్లోనూ చుండ్రు ఉంటుంది. వాస్తవం: చాలా వరకు పిల్లల్లో చుండ్రు సమస్య ఉండదు. (ఏడాది లోపు పిల్లల్లో ఉండే చుండ్రును క్రెడిల్ క్రాప్ అంటారు. ఆ తర్వాత తగ్గిపోతుంది). అపోహ: మాటిమాటికీ గుండు చేయించుకోవడం వల్ల చుండ్రు తగ్గుందనేది ఒక అపోహ. వాస్తవం : ఒకసారి గుండుతో సమస్య తగ్గుతుంది. మాటిమాటికీ చేయించాల్సిన అవసరం లేదు. -
కోటి రతనాలంటి రుచులు...
కోటి రతనాల రాగాలు పలికించే వీణ పట్టే చేతులు... కోటి రుచులను వండలేవా? వడ్డించలేవా? ఉద్యమాల గడ్డ మీద... వండే వంటల్లోనూ పవరుంటుంది... పౌరుషముంటుంది... నాలుకనంటగానే రుచిస్తుంటుంది. అసలు సిసలు తెలంగాణాంగణ ప్రాంగణపు వంటలైన శేవల పాయసం కేవలం రుచి చూస్తే సరిపోదు... మసాలా పూరీ తింటే మనసు నిండదు... మరి కాస్త తప్పక కావాలనిపిస్తుంది... నడుములెత్తకుండా కూర్చుని తినాలనిపించే ఆనపగింజ కుడుములు వారేవా అనిపించే వాక్కాయ ఆవకాయ వడివడిగా తినిపించే చేమకూర బడీలు పూర్ణం కట్టు చారుతోనే సంపూర్ణమయ్యే భోజనాలు... కోటి రుచుల్లో కొన్ని శాంపిల్ రుచులివి... రాష్ట్రాలుగా వేరైనంత మాత్రాన రుచులు వేరవుతాయా? స్టేటులుగా విడిపోయినంతనే టేస్టులు విడివడతాయా? ఒకటీ రెండు తింటేనే కోటి రుచుల పెట్టు ఈ తెలగాణ్యపు వంటలు ముద్ద నోట పెట్టగానే... నాలుక మాగాణ్యంపై రుచుల సిరుల పంటలు. మసాలా పూరీ కావలసినవి: గోధుమపిండి - 3 కప్పులు; సెనగపిండి - కప్పు; కరివేపాకు - 3 రెమ్మలు; పచ్చి మిర్చి - 3; పసుపు - కొద్దిగా; మిరప్పొడి - టీ స్పూను; ధనియాల పొడి - టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత తయారీ: గోధుమపిండి, సెనగపిండి కలిపి జల్లించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్దలో కొన్ని నీళ్లు పోసి పలుచగా చేసుకోవాలి కరివేపాకు, పచ్చి మిర్చి సన్నగా తరిగి పిండిలో వేయాలి పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి నీళ్లు, తగినంత ఉప్పు వేసి కలపాలి తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీపిండిలా కలుపుకోవాలి పది నిమిషాల తర్వాత కొద్దిగా నూనె వేసి మృదువుగా అయ్యేలా కలిపి చిన్న ఉండలు చేసుకోవాలి ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ పల్చగా ఒత్తుకోవాలి అన్నీ చేసుకుని, వేడి నూనెలో నిదానంగా రెండు వైపులా కరకరలాడేలా వేయించి తీసుకోవాలి. (పూరీలు మందంగా ఉంటే మెత్తబడిపోతాయి. నిల్వ ఉండవు) శేవల పాయసం కావలసినవి: గోధుమపిండితో చేసిన శేవలు - 200 గ్రా.; బెల్లం తురుము - 250 గ్రా.; నెయ్యి - 4 టీ స్పూన్లు; గసగసాలు - టీ స్పూను; ఏలకుల పొడి - టీ స్పూను; పాలు - కప్పు; కొబ్బరి తురుము - కొద్దిగా తయారీ: ఒక గిన్నెలో బాగా ఎండిన శేవలు, తగినన్ని నీళ్లు పోసి శేవలను ఉడికించాలి బెల్లం తురుము, పాలు, నెయ్యి వేసి నెమ్మదిగా కలపాలి బాగా ఉడికిన తర్వాత ఏలకుల పొడి, గసగసాలు వేయాలి కొబ్బరితురుముతో గార్నిష్ చేసి దింపేయాలి వేడివేడిగా అందించాలి ఇష్టమైన వారు మరి కాస్త నెయ్యి వేసుకోవచ్చు శేవల తయారీ... గోధుమపిండికి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి చిన్నచిన్న ఉండలుగా చేసుకుని, చేతితో ఒత్తుతూ సన్నగా పొడవుగా సేమ్యా మాదిరిగా చేయాలి రెండు మూడు రోజులు ఎండబెట్టాలి డబ్బాలో నిల్వ చేసుకుని, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. వీటిని తయారు చేసే మిషన్లు మార్కెట్లో దొరుకుతాయి. ఇవి సేమ్యా లాంటివి. చేమకూర బడీలు కావలసినవి: చేమకూర ఆకులు - 10 (వెడల్పుగా ఉండే ఆకులు); సెనగపిండి - కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; మిరప్పొడి - టీ స్పూను; పసుపు - చిటికెడు; గరం మసాలా - చిటికెడు; సన్నగా తరిగిన కొత్తిమీర - టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత. తయారీ: చేమకూర ఆకులను కడిగి, తుడిచి పెట్టుకోవాలి సెనగపిండిలో మిగతా వస్తువులు, కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి ముద్దలా చేసుకోవాలి చేమకూర ఆకుపై ఈ ముద్దను పలుచగా రాసి చాప చుట్టలా మడిచి ఉంచాలి అదే విధంగా అన్ని ఆకులతో చేసుకోవాలి ఈ మడతలను ఆవిరి మీద పదిహేను నిమిషాలు ఉడికించాలి చల్లారిన తర్వాత అంగుళం వెడల్పులో ముక్కలుగా కట్ చేయాలి నూనెలో వేసి ఎర్రగా కరకరలాడేలా వేయించాలి వీటిని ఉల్లి చక్రాలతో నంచుకు తింటే రుచిగా ఉంటాయి. పూర్ణం కట్టు చారు కావలసినవి: సెనగపప్పు ఉడకబెట్టిన నీళ్లు - 2 కప్పులు; చింతపండు - నిమ్మకాయంత; ఉల్లిపాయ - 1; పచ్చి మిర్చి - 2; ఎండు మిర్చి - 3; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; టొమాటో - 1; పసుపు - పావు టీ స్పూను; ఆవాలు + జీలకర్ర - పావు టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - 3 టీ స్పూన్లు; ఉడికించిన సెనగపప్పు ముద్ద (పూర్ణం) - పావు కప్పు తయారీ: చింతపండులో నీళ్లు పోసి, నానబెట్టి, పులుసు తీసుకుని పప్పు నీళ్లలో కలపాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ, టొమాటో, నిలువుగా చీల్చిన పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, తగినంత ఉప్పు వేసి కలపాలి గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేగాక కలిపి పెట్టుకున్న కట్టు చారు వేయాలి కొద్దిసేపు మరిగిన తర్వాత పూర్ణం వేసి కలపాలి మరో రెండు నిమిషాలు మరిగించి దించేయాలి చారు తియ్యతియ్యగా పుల్లపుల్లగా ఉంటుంది. ఆనప గింజల కుడుములు కావలసినవి: బియ్యప్పిండి - కప్పు; ఆనప గింజలు - ఒకటిన్నర కప్పులు; ఉల్లికాడల తరుగు - కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; పచ్చి మిర్చి ముద్ద - టీ స్పూను; ఉప్పు - తగినంత తయారీ: ఆనప గింజలు మరీ లేతగా కాకుండా కొద్దిగా ముదురుగా ఉండేలా చూసుకోవాలి. (చిక్కుడు గింజలతో కూడా చేయవచ్చు) బియ్యప్పిండిలో ఆనప గింజలు, పచ్చి మిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన ఉల్లికాడలు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి గోరువెచ్చని నీళ్లతో తడిపి మూత పెట్టి గంటసేపు ఉంచాలి నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసుకోవాలి ఇడ్లీ రేకులలో ఒక్కో ఉండను ఉంచి ఆవిరి మీద ఉడికించాలి ఆవకాయతో కాని, ఉల్లిపాయ పచ్చడితో కాని తింటే రుచిగా ఉంటాయి. వాక్కాయఆవకాయ కావలసినవి: వాక్కాయలు - కేజీ; ఉప్పు - 250 గ్రా.; నువ్వుల నూనె - 250 గ్రా.; మిరప్పొడి - 125 గ్రా.; అల్లం ముద్ద - 125 గ్రా.; వెల్లుల్లి ముద్ద - 125 గ్రా.; జీలకర్ర పొడి - 25 గ్రా.; మెంతి పొడి - టీ స్పూను; పసుపు - టీ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; జీలకర్ర + మెంతులు - టీ స్పూను తయారీ: వాక్కాయలను రెండు లేదా నాలుగు ముక్కలుగా తరిగి లోపలి జీడి వేరు చేయాలి ఒక గిన్నెలో పసుపు, కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి మరో గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేసి కరిగిన తర్వాత జీలకర్ర, మెంతులు వేసి కాస్త ఎర్రబడ్డాక దింపేయాలి నూనె కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం ముద్ద, వెల్లుల్లి ముద్ద వేసి కలిపి పూర్తిగా చల్లారాక కలిపి పెట్టుకున్న పొడులు, వాక్కాయ ముక్కలు వేసి బాగా కలపాలి జాడీలోకి తీసుకుని మూడు రోజుల తర్వాత ఆవకాయ మొత్తం ఇంకోసారి కలిపి వాడుకోవాలి. చేమగడ్డ పప్పు కావలసినవి: కందిపప్పు - 200 గ్రా.; చేమగడ్డలు - 200 గ్రా.; ఉల్లిపాయ - 1; పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; గరంమసాలా పొడి - పావు టీ స్పూను; పసుపు - అర టీ స్పూను; మిరప్పొడి - టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; ఆవాలు + జీలకర్ర - అర టీ స్పూను; టొమాటో - 1 (ముక్కలుగా తరగాలి); చింతపండు పులుసు - పావు కప్పు; ఉప్పు - తగినంత; నూనె - 3 టీ స్పూన్లు తయారీ: కందిపప్పు కడిగి నీళ్లు పోసి సగం పసుపు, కొంచెం నూనె వేసి ఉడికించాలి చేమగడ్డలు పొట్టు తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి మెత్తబడేవరకు ఉంచాలి పసుపు, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి నిమిషం సేపు వేయించి చేమగడ్డలు, వాటికి తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి చేమగడ్డలు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, పచ్చి మిర్చి తరుగు వేసి అందులో చింతపండు పులుసు, అర కప్పు నీళ్లు పోసి, బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి చేమగడ్డలు మెత్తబడ్డ తర్వాత ఉడికించిన కందిపప్పు, తగినంత ఉప్పు వేసి కలిపి మరి కొద్దిసేపు ఉడికించాలి గరంమసాలా పొడి, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. సేకరణ డా. వైజయంతి కర్టెసీ: జ్యోతి వలబోజు