Monkey Attacks
-
భార్య బాసన్లు కడుగుతుండగా.. భర్త కర్ర పట్టుకుని..
ఇంటావిడ బాసన్లు కడుగుతుంటే ఇంటాయన చేతిలో కర్ర పట్టుకుని నిల్చున్నాడేంటని అనుకుంటున్నారా? ఆలిపై అనుమానంతో కాదు.. ఆవిడను రక్షించడానికే ఆయనీలా పహరా కాస్తున్నారు. ఆ ఊర్లో అందరి ఇళ్లలోనూ ఇంచుమించు అందరూ ఇలాగే చేస్తుంటారు. ఇదేదో ఆచారం అనుకునేరు! మహిళలు ఆరు బయట పనులు చేయడం పూర్తయ్యే వరకు పురుషులు సెక్యురిటీ డ్యూటీ చేయాల్సిందే. ఎందుకంటే వానరాల బారి నుంచి కాపాడుకోవడానికి అని చెబుతున్నారు ఆ ఊరి ప్రజలు.మంచిర్యాల జిల్లాలో కోతులు బెంబేలెత్తిస్తున్నాయి. భీమారం మండల కేంద్రంలో ఆరుబయట ఇంటి పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక మహిళ శనివారం తన ఇంటి ఆవరణలో వంటపాత్రలు శుభ్రం చేస్తుండగా.. ఆమె భర్త కర్ర పట్టుకుని కోతుల నుంచి రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఇప్పటికే గ్రామంలో అనేక మంది కోతుల దాడిలో గాయపడ్డారు. దీంతో గ్రామంలో కోతుల బాధితుల సంఘమే ఏర్పాటైంది. కోతులను తరలించాలని అటవీ అధికారులు, పంచాయతీ అధికారులకు వినతిపత్రం అందజేసింది. – సాక్షి ప్రతినిధి, మంచిర్యాల ‘సౌర’భాలుఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వరకు ఇటీవల నిర్మించిన 363వ జాతీయ రహదారిపై.. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పై వంతెన వద్ద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో రాత్రి వేళ జిగేల్మంటున్న సౌర విద్యుద్దీపాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ట్రిపుల్ ఐటీలో వాకథాన్ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో శనివారం ఉదయం వాకథాన్ నిర్వహించారు. ఇన్చార్జ్ వీసీ గోవర్దన్, ఎస్పీ జానకీషర్మిల విద్యార్థులతో కలిసి క్యాంపస్ ఆవరణలోని ఎకో పార్క్‌లో వాకింగ్ చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి గోవర్దన్ మాట్లాడారు. విద్యార్థుల రక్షణ, సహకారం కోసం ఎస్పీ వర్సిటీని దత్తత తీసుకున్నట్టు వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పాఠ్యేతర కార్యకలాపాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జానకీషర్మిల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్‌కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణదీర్ సాగి, అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
వారెవ్వా..నిఖిత : కోతులకు చుక్కలు చూపించింది.. దెబ్బకు!
పిల్లలు గాడ్జెట్స్ వాడకంలో భలే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మనం వాళ్లకి సరైన పద్ధతిలో నేర్పించా లేగానీ, టెక్నాలజీని చాలా తొందరగా నేర్చుకుంటారు. సమయానికి వాడుతారు కూడా. యూపీలో జరిగిన ఒక సంఘటన చూస్తే మీరూ నిజం అంటారు. ప్రమాదకర పరిస్థితిలో ఏమాత్రం భయపడకుండా ఓ అమ్మాయి స్మార్ట్‌గా వ్యవహరించింది. తనను తాను కాపాడుకోవడమే కాదు , నెలల వయస్సున్న చెల్లెల్ని కూడా రక్షించు కుంది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో నివసించే 13 ఏళ్ల నిఖిత కోతుల దాడినుంచి తన చెల్లాయిని కాపాడుకున్న తీరు విశేషంగా నిలిచింది. అసలు ఏం జరిగిందంటే... కుటుంబ సభ్యులు అంతా ఎవరి పనుల్లో వారు సందడిగా ఉన్నారు. ఇంతలో నిఖిత తన చెల్లిలితో ఆడుకుంటున్న సమయంలో ఇంట్లోకి కోతులు చొరబడ్డాయి. వంటగదిలోకి వెళ్లి, వంట సామాన్లు చిందరవందర చేసాయి. కొన్నింటిని విసిరి పారేసాయి. ఇది చాలదన్నట్టు చిన్నారిపై దాడికి ప్రయత్నించాయి. కుటుంబ సభ్యులంతా పై అంతస్థులో వేరే గదిలో ఉన్నారు. అయినా నిఖిత తల్లిని పిలవడానికి ప్రయత్నించింది. కానీ అవి మరింత రెచ్చిపోయాయి. ఇక్కడే నిఖిత తెలివిగా ఆలోచించింది. కోతిని భయపెట్టేలా కుక్కలా గట్టిగా మొరగాలని అలెక్సాను ఆదేశించింది. అంతే అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా పెద్దగా మొరిగే శబ్దాలు చేసింది. దీంతో కోతిని భయపడి పారిపోయింది. #WATCH | Uttar Pradesh: A girl named Nikita in Basti district saved her younger sister and herself by using the voice of the Alexa device when monkeys entered their home. Nikita says, "A few guests visited our home and they left the gate open. Monkeys entered the kitchen and… pic.twitter.com/hldLA0wvZS — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 6, 2024 #WATCH | Nikita's mother says, "We were sitting in the room, the gate was open when the girl called me. When I came and saw that monkeys were in the kitchen and scaring her I called Nikita, and she used her mind and asked Alexa to play the sound of a dog. Because of that barking… pic.twitter.com/gzBGr3P004 — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 6, 2024 “కొంతమంది అతిథులు మా ఇంటికి వచ్చారు, వారు గేటు తెరిచారు. దీంతో కోతులు వంటగదిలోకి ప్రవేశించి వస్తువులను విసిరి పారేశాయి. ఇద్దరమూ భయపడ్డాం. అప్పుడు కుక్క మొరిగే శబ్దాలను ప్లే చేయమని అలెక్సాను అడిగాను. అలెక్సా చేసిన శబ్దాలకు కోతులు భయపడి పారిపోయాయి” అని నిఖితా జరిగిన సంఘటనను ఏఎన్ఐతో వివరించింది. ఈ గలాటా అంతా వినబడి తానూ వచ్చాననీ, అలెక్సా చేసిన శబ్దాలకు కోతులు భయపడి పారిపోయాని నిఖిత తల్లి చెప్పింది. -
కోతుల వీరంగం.. బావిలోపడ్డ వృద్ధురాలు
సాక్షి, సిరిసిల్ల: ఇటీవల కాలంలో కోతుల దాడులు పెరిగిపోయాయి. జనావాసాల్లోకి చొరబడి గుంపులు, గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కోతులు మూకుమ్మడిగా దాడి చేయడంతో ఓ వృద్ధురాలు బావిలో పడింది. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. రాచర్లబొప్పాపూర్‌కు చెందిన గంభీర్పూర్ రాజవ్వ (68) ఇంటి బయట కూర్చుని ఉండగా.. హఠాత్తుగా కోతుల గుంపు దాడి చేశాయి. కోతుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న బావిలో పడి మధ్యలో ఇరుక్కుపోయింది. కేకలు వేయడంతో సమీప ఇళ్లలోని యువకులు వచ్చి బావిలో వేలాడుతున్న రాజవ్వను తాళ్ల సహాయంతో బయటకు లాగారు. అపస్మారకస్థితిలో ఉన్న రాజవ్వను ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. చదవండి: ప్రగతి కాదు.. సర్పంచ్‌లకు దుర్గతి.. ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి ధ్వజం -
Viral Video: యువకుడ్ని సావకోట్టిన కోతి
-
కోతులతో కష్టాలు కనుమా.. కొండెంగలను తెచ్చినా..
సాక్షి, హైదరాబాద్: ఇంతకు ముందు పంట పొలాలకు రక్షణ కోసం కంచెలు వేయడం చూశాం. వివిధ రకాల పశువులు, పక్షులు, అడవి జాతి జంతువులతో పంట నష్టపోకుండా పొలం చుట్టూ రకరకాల బొమ్మలు, వైర్లు, టపాకాయలు, దిష్టి బొమ్మలు, సౌండ్స్ సిస్టం ఏర్పాటు చేయడం చూశాం. కానీ ఇంటిపై కప్పులపై బొమ్మలు, కరెంట్ తీగలు, కంచె వేయడం ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడు అనేక గ్రామాల్లో ఇంటి పైకప్పులపై కంచెలు కనిపిస్తున్నాయి. కేవలం కోతుల కోసమే ఇలాంటి జాగత్త్రలు, రక్షణ చర్యలు తీసుకుంటున్నారంటే ఒకింత ఆశ్చర్యం అనిపించినా.. అక్షరాలా నిజమే. ఒకప్పుడు కేవలం అటవీ పరిసర ప్రాంతాలు, పల్లెల్లో కోతుల బెడద ఎక్కువగా ఉండేది. కానీ ఇటీవలి కాలంలో ఊళ్ళల్లోనే కాదు పట్టణాల్లోనూ వానరాల సంచారం తీవ్రమైంది. కొండెంగలను తెచ్చినా.. కోతుల కట్టడి కోసం చాలా ఊళ్ళల్లో, కాలనీల్లో స్థానికులు తలాకొంత వేసుకుని వాటి రక్షణకు కొండెంగలను తెచ్చి పెట్టుకున్నారు. కానీ ఒక దిక్కున కొండెంగలను ఏర్పాటు చేస్తే మరో దిక్కున కోతులు చొరబడుతున్నాయి.. అన్ని చోట్లా పెట్టేందుకు ఎక్కువగా కొండెంగలు కావాల్సి ఉన్నా వాటి కొరత నేపథ్యంలో గ్రామస్తులకు విసుగొచ్చి చివరికి తీసుకువచ్చిన కొండెంగలను కూడా అడవిలో వదిలేశారంటే వానర సైన్యం సంఖ్య ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు సౌండ్స్ సిస్టం ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండటం లేదు, కోతులు పట్టితెచ్చిన వారికి 2 రూ.వేల నుంచి పదివేలు ముట్టజెప్పినా... ఒకటి రెండు రోజుల తర్వాత మళ్లీ కోతుల బెడద తప్పడంలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి కోతులు రాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం కానరావడం లేదు. ఈ మధ్య మా ఊళ్లో ఓ ఇంట్లోకి కోతి వెళ్లింది. పొరపాటున ఇంటి డోర్‌లాక్ పడటంతో వందలాది కోతులు ఇంటిని చుట్టుముట్టి నానారభస చేసి. పైకప్పును పూర్తిగా పాడు చేశాయి. ఆ సమయంలో ఇంట్లో మనుషులు లేరు కాబట్టి సరిపోయింది. లేదంటే పరిస్థితి ఏమిటి? – గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ–2, ముస్తాబాద్ -
రెచ్చగొడితే ఇలాగే ఉంటంది.. పట్టపగలే చుక్కలు చూపించింది
కొన్నిసార్లు మనుషులు చేసే చిన్న తప్పులకు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో జంతువులను కవ్విస్తే అవి దాడి చేసిన వీడియోలు చూసే ఉంటాము. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా జూకు వెళ్తే.. కొన్ని జంతువులను దూరం నుంచి చూడాలని హెచ్చరిస్తుంటారు. అయినా కొంత మంది వినిపించుకోకుండా అతి చేస్తారు. దీంతో జంతువులు తిరగబడి గాయపరుస్తాయి. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడటం లేదా ప్రాణాలు సైతం పోయే పరిస్థితి రావచ్చు. తాజాగా ఓ యువతి.. బోనులో ఉన్న కోతిని రెచ్చిగొట్టింది. దీంతో తగిన మూల్యం చెల్లించుకుంది. వీడియోలో.. యువతి బోనులో ఉన్న కోతిని ఓ యువతి డిస్టర్బ్ చేస్తుంది. దీంతో, కోతి తీవ్ర ఆగ్రహంతో వెంటనే బోనులో జాలీ నుంచి తన చేతితో అమ్మాయి జుట్టును పట్టుకుంది. యువతి మోత్తుకున్న జుట్టుని మాత్రం వదల్లేదు. కోతి చేతిలో నుంచి తన జుట్టును విడిపించుకోవడానికి అమ్మాయి ఎంతో శ్రమించింది. చివరకు పక్కనే ఉన్న కొంతమంది వచ్చి కోతిని భయపెట్టడంతో జట్టుని వదిలేసింది. దీంతో, ఆమె అక్కడి నుంచి జారుకుంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
కోతి పగ పట్టిందా.. రక్తం వచ్చేలా తల్లి, చిన్నారిపై దాడి
Monkey Attacked On Girl.. కొన్ని సందర్భాల్లో జంతువులు పగబడితే ఎలా ప్రవర్తిస్తాయో చూసే ఉంటాము. ఏనుగులు, ఎద్దులు కోపంతో ఉన్నప్పుడు దాడులు చేసిన వీడియోలు చూశారు కాదా.. తాజాగా ఓ కోతి కూడా అలాగే.. మందేసిన కోతిలాగా రెచ్చిపోయింది. ఓ చిన్నారిపై దాడి చేసింది. చిన్నారి పేరెంట్స్ ఎంత ప్రతిఘటిస్తున్నా కోతి మాత్రం తగ్గేదేలే అన్నట్టు వ్యవహరించింది. వారి వెంటపడి మరీ చిన్నారిని లాగేసుకునే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. అయితే, యూకేకు చెందిన మెట్రో వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రష్యాలోని టెర్పిగోరివో ప్రాంతంలో ఓ ఫ్యామిలీ.. తన స్నేహితుడి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో గార్డెన్లో పిల్లలు ఆడుకుంటుండగా ఓ కోతి అక్కడికి వచ్చి పిల్లలపై దాడికి దిగింది. దీంతో అక్కడున్న వారంతా పరుగులు తీశారు. రెండేళ్ల పౌలీనాను కోతి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఆ చిన్నారి మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ కేకలు వేసింది. పౌలీనా అరుపులు విన్న ఆమె తల్లి అక్కడికి పరిగెత్తుకు వచ్చి చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించింది. కానీ, కోతి మాత్రం ఇద్దరిపై దాడి చేసింది. ఇంతలో అక్కడికి వచ్చిన చిన్నారి తండ్రి.. కోతిని తన్నుతూ వారిద్దరిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, కోతి మాత్రం చిన్నారిపై దాడి కొనసాగిస్తూనే ఉంటుంది. ఎంత ప్రతిఘటించినా కోతి మాత్రం చిన్నారిని లాగేసుకుంటూనే ఉంది. చివరకు కోతి నుంచి ఆమెను పేరెంట్స్ రక్షించారు. కానీ, పౌలీనాకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె ఆసుపత్రికి తరలించారు. పౌలీనా చేతులు, కాళ్లపై గాయాల కారణంగా చాలా రక్తం పోయినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంలకడగానే ఉందని.. న్యూస్ వీక్ ఓ కథనంలో పేర్కొంది. అయితే, చిన్నారి ఉంటున్న ఇంటి పక్కనే ఓ మిలియనీర్ ప్రైవేట్ జూ ఒకటి ఉన్నట్టు సమాచారం. అందులో తేడేళ్లు, ఏనుగులు, ఇతర అడవి జంతువులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కోతి వారిపై దాడి చేసిందని పలు వార్తా సంస్థలు కథనాల్లో తెలిపాయి. قرد يهاجم فتاة صغيرة ويحاول اختطافها من والدتها.. 🛑 ملاحظة : غريبة التغيير في فطرة الحيوانات .. pic.twitter.com/2UafWTdM1j— #كابتن_غازي_عبداللطيف (@CaptainGhazi) July 22, 2022 ఇది కూడా చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. బైక్ నడిపే వాళ్లు తప్పక చూడాల్సిందే! -
ఇల్లు పీకి పందిరేసి! హైదరాబాద్‌లో బెంబేలెత్తిస్తున్న కోతులు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో వివిధ ప్రాంతాల్లో కోతుల బెడదతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈస్ట్ మారేడ్‌పల్లి, వెస్ట్‌మారేడ్‌పల్లి, పద్మారావునగర్, సికింద్రాబాద్, అల్వాల్, ఉప్పల్, తార్నాక, అమీర్‌పేట, కాప్రా తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి వస్తున్న కోతులతో ప్రజలు.. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు భయంతో వణికిపోతున్నారు. జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగంలో కుక్కలను పట్టుకునేందుకు తగిన నైపుణ్యం ఉన్న కారి్మకులున్నప్పటికీ, కోతులను పట్టుకునేందుకు నైపుణ్యం ఉన్న సిబ్బంది లేదు. దీంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల నుంచి ఫిర్యాదుల ధాటికి తట్టుకోలేక సంప్రదాయ విధానాలతోనే, తమకు తెలిసిన పద్ధతిలోనే ఏటా అయిదారు కోతులకు మించి పట్టుకోవడం లేదు. చాలా ప్రాంతాల్లో ప్రజలే తమ పాట్లేవో తాము పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోతులను పట్టుకునేందుకు తగిన నైపుణ్యం, సామగ్రి కలిగిన ఏజెన్సీలను ఆహా్వనిస్తూ టెండర్లు పిలిచారు. ► గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లకుగాను కూకట్పల్లి, సికింద్రాబాద్ జోన్లకు మాత్రం ఒక్కో టెండరు దాఖలైనట్లు వెటర్నరీ అధికారులు తెలిపారు. శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, కూకట్పల్లి, చారి్మనార్ జోన్లకు ఒక్క టెండరు కూడా దాఖలు కాలేదు. దీంతో ఏం చేయాలో తెలియక రీటెండర్లకు సిద్ధమయ్యారు. అయినా కాంట్రాక్టు ఏజెన్సీలు వస్తాయో, లేదో తెలియని పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీలో పనులు చేసేందుకు ఇటీవలి కాలంలో కాంట్రాక్టర్ల నుంచి తగిన స్పందన కనిపించడం లేదు. ఓవైపు పెరుగుతున్న ఎండలతోపాటు మరోవైపు అడవుల్లోనూ ఆహారం దొరక్క, నగరానికి చేరుతున్న కోతులు ఇళ్లలో చొరబడుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలు కోతుల ఆవాసాలుగా ఉన్నాయి. నగరంలో వేల సంఖ్యలో ఉన్న కోతులు బహిరంగ ప్రదేశాల్లోనూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ► ఢిల్లీ తదితర మెట్రో నగరాల్లో కోతులను పట్టుకునే నైపుణ్యమున్న ఏజెన్సీలకు ఒక్కో కోతికి రూ.5వేల నుంచి రూ.6 వేల వరకు చెల్లిస్తున్నారు. జీహెచ్ఎంసీ గరిష్టంగా రూ.1800 చెల్లించేందుకు మాత్రమే టెండర్లు ఆహ్వానించింది. ఈ ధర కోతులను పట్టుకోవడం వరకే కాదు.. వాటిని తిరిగి ఆదిలాబాద్ తదితర జిల్లాల్లోని అటవీప్రాంతంలో విడిచి పెట్టి రావాలి. ఆమేరకు, సంబంధిత అటవీశాఖ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి. ► ఈ పనులతోపాటు కోతులను తరలించేందుకయ్యే రవాణా ఖర్చులు కూడా కాంట్రాక్టు ఏజెన్సీవే. దీంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు పొందిన ఏజెన్సీ ప్రజల నుంచి ఫిర్యాదులకనుగుణంగా జీహెచ్ఎంసీ అధికారులు చెప్పిన ప్రాంతాలకు వెళ్లి కోతుల్ని పట్టుకోవాలి. ► కోతుల్ని పట్టుకున్నాక, వాటిని సంబంధిత అటవీ ప్రాంతంలో వదిలేంతవరకు వాటికి ఎలాంటి గాయాలు కాకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ని అవస్థలున్నందున కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకు రావడంలేదు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కోతి చేష్టలు ఇలా.. ► తలుపులు తెరిచినప్పుడు, కిటికీల ద్వారా ఇళ్లలోకి చేరుతున్నాయి. గదుల్లోని సామగ్రిని చిందరవందర చేస్తున్నాయి. ► కోతులు వంట గదుల్లోని పప్పులు, చక్కెర తదితర డబ్బాలను పడవేస్తున్నాయి. దేవాలయాల వద్ద కొబ్బరిచిప్పలు, అరటిపండ్ల వంటి వాటికోసం పైకి ఎగబడుతున్నాయి. వీటిని చూసి భయంతో కిందపడి గాయాలపాలైన ఘటనలున్నాయి. ► ఇళ్లలోకి ప్రవేశించిన కోతులతో జడుసుకొని పరుగుపెట్టి పడిపోయి దెబ్బలు తగిలిన వారున్నారు. పార్కుల్లో, రోడ్ల పక్కన పాదచారులపైకి లంఘిస్తూ, రక్కిన ఘటనలు కూడా ఉన్నాయి. ► కోతులు వాటికి నచి్చన వాటిని నోట పట్టుకెళ్తూ, మిగతా వాటిని ఇల్లంతా వెదజల్లుతున్నాయని పద్మారావునగర్‌కు చెందిన శ్రీవల్లి చెప్పారు. అవి బయటకు వెళ్లేవరకూ బిక్కు బిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. కోతుల బారినుంచి కాపాడాలి అమీర్‌పేట డివిజన్ శివ్‌బాగ్‌లో కోతులు బెడద ఎక్కువగా ఉంది. పగటి పూట ఎక్కడి నుంచో గుంపులు గుంపులుగా వచ్చి హాస్టళ్ల ముందు సంచరిస్తున్నాయి. ఒంటరిగా వచ్చే వారి వెంటపడుతున్నాయి. చేతిలో ఏది ఉంటే అది ఎత్తుకుపోతున్నాయి. – గౌతమ్, అమీర్‌పేట మీదపడి కరుస్తున్నాయి.. కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడు ఎక్కడ ఏమి చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా ఇళ్లపై దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు భయంతో వణికిపొతున్నారు. రోడ్లపై వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా మీదపడి దాడి చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మీద పడి కరుస్తున్నాయి. – కె. అనిత, పద్మారావునగర్ ఆహార పదార్థాలను చిందరవందర చేస్తున్నాయి.. చిలకలగూడ, సీతాఫల్మండి, నామాలగుండు, శ్రీనివాసనగర్ తదితర ప్రాంతాల్లో గుంపులుగా సంచరిస్తున్న వానరాలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నాం. ఇళ్లలోకి చొరబడి నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలను చెల్లాచెదురు చేసి, దొరికిన వస్తువులను విసిరి కొట్టి, పూలమొక్కలు, కుండీలు ధ్వంసం చేస్తున్నాయి. గట్టిగా అదిలిస్తే మీదపడి గోళ్లతో గీరుతున్నాయి. పళ్లతో కొరికి గాయాలు చేస్తున్నాయి. సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన స్పందించలేదు. – మార్పెల్లి రవి, చిలకలగూడ -
సారూ.. కోతుల సంచారాన్ని నియంత్రించండి!
భట్టిప్రోలు: భట్టిప్రోలులో వానరాల సంచారం అధికమైంది. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. చేతులలో చిన్న పొట్లాలతో చిన్నారులు, మహిళలు కనిపించినా వెంటపడి మరీ దాడి చేసి గాయపరుస్తున్నాయి. ముఖ్యంగా భట్టిప్రోలు విఠలేశ్వరనగర్లో కోతులు అధిక సంఖ్యలో ఉన్నాయి. వీటిన బారిన పడి గాయపడి ఆసుపత్రి పాలైన వారు ఎంతోమంది. లంక గ్రామాల్లో ఉండే ఈ కోతులు ఇక్కడకు వలస వచ్చాయి. కోతుల బెడదతో స్థానికులు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. డాబాల పైకి ఎక్కితే ఎక్కడ దాడి చేస్తాయోనని భీతిల్లుతున్నారు. తలుపులు తెరిస్తే ఇళ్లల్లోకి ప్రవేశించి నానా భీభత్సం చేస్తున్నాయి. సెంటర్లో చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహించే షాపులపై ఎగబడి మరీ తినుబండారాలు తీసుకొని మరీ పరిగెడుతున్నాయి. దీంతో వారు నష్ట పోతున్నారు. స్థానికులు పంచాయతీ అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా కానీ తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా కోతుల సంచారాన్ని నియంత్రించాలని, లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వాపోతున్నారు. చదవండి: ‘ఇప్పటికే ఇద్దరాడపిల్లల్ని కన్నాను’..! రోజుల పసికందును చంపిన తల్లి.. -
విషాదం: కోతుల భయంతో గుండె ఆగింది
సాక్షి, ధర్మపురి: కోతులు దాడి చేస్తాయేమోనన్న భయంతో ఓ మహిళ గుండె ఆగి మరణించింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బట్టపల్లి మోహన్ ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం కుటుంబంతో ధర్మారానికి వచ్చాడు. ఇక్కడే ఉంటూ వడ్రంగి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మోహన్ కూతురు రేవతి (34)కి వివాహం అయినప్పటికీ ధర్మారంలో తండ్రి వద్దనే ఉంటోంది. ఉదయం ఇంటి నుంచి రేవతి బయటకు వస్తున్న సమయంలో గుంపుగా వచి్చన కోతులు పెద్దగా అరుస్తూ ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించాయి. వాటిని చూసిన రేవతి భయంతో అక్కడే కుప్పకూలింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. గుండెపోటుతోనే మరణించిందని వైద్యులు తెలిపారు. కాగా, రేవతికి ముగ్గురు పిల్లలున్నారు. చదవండి: కొత్త ట్విస్ట్: యువతికి షాకిచ్చిన జొమాటో డెలివరీ బాయ్ -
కోతుల భయం.. తీసింది ప్రాణం
మద్దిరాల: కోతుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడి బాలింత దుర్మరణం పాలైంది. ఈ హృదయ విదారక ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కడం గ్రామానికి చెందిన శ్రీలతకు అర్వపల్లి మండలం అడివెంలకు చెందిన జేసీబీ డ్రైవర్ దోమల సైదులుతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇప్పటికే నాలుగేళ్ల కొడుకు బిట్టు, రెండున్నరేళ్ల కుమార్తె మాన్యశ్రీ ఉన్నారు. మూడో కాన్పు కోసం శ్రీలత (24) మూడు నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. నెల క్రితం సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం తల్లిగారింటి ముందు రేకుల షెడ్ కింద ఊయలలో చిన్నారి పడుకొని ఉన్నాడు. ఆ సమయంలో శ్రీలత బట్టలు ఉతికి ఆరేస్తుండగా ఒక్కసారిగా కోతుల గుంపు దాడిచేసింది. కోతుల బారి నుంచి తప్పించుకుని బాబును తీసుకుని ఇంట్లోకి వెళ్లాలనుకున్న శ్రీలత.. కోతుల గుంపు మరింత ముందుకు ఉరకడంతో భయంతో బాబును అక్కడే ఉంచి ఇంట్లోకి పరుగుతీసింది. ఈ క్రమంలో గడప తగిలి కిందపడగా, అటుపక్కనే ఉన్న మంచంకోడు తలకు బలంగా తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతురాలి భర్త సైదులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపారు. ప్రభుత్వం స్పందించి కోతుల బారి నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
బ్లడ్ శాంపిళ్లను ఎత్తుకెళ్లిన కోతులు
మీరట్: ఒక ల్యాబ్ టెక్నీషియన్ నుంచి రక్తపు నమూనా కిట్స్‌ను కోతులు ఎత్తుకెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ బ్లడ్ శ్యాంపిల్ కిట్స్‌ను చెట్టుపై కూర్చుని ఆ కోతులు కొరికి చప్పరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ శ్యాంపిల్స్ కరోనా అనుమానితులవని, ఇక ఆ కోతుల ద్వారా కరోనా మరింత వ్యాప్తి చెందుతుందని వచ్చిన వార్తలు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. అయితే, అవి కరోనా అనుమానితుల రక్త నమూనాలు కావని, మధుమేహం ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారివని మీరట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గార్గ్ చెప్పారు. -
సెట్లో యాంకర్‌పై కోతి దాడి.. పరుగో పరుగు
-
సెట్లో యాంకర్‌పై కోతి దాడి.. పరుగో పరుగు
అప్పటి వరకు కోతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని సరదాగా ముద్దు చేసిన యాంకర్ ఒక్కసారిగా కోతిని నెట్టేసి సెట్లో నుంచి బయటకు పరుగులు తీసింది. ఈ సరదా ఘటన ఈజిప్టులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లోబ్నా అసల్ అనే మహిళ జర్నలిస్ట్ తన సహ జర్నలిస్ట్‌లతో కలిసి టెలివిజన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. వీరు ఇంటర్యూ చేస్తున్న ఈజిప్టు నటుడు తనతో ఓ కోతిని వెంట తీసుకొచ్చాడు. కోతిపై ముచ్చటపడ్డ యాంకర్ దానిని తన పక్కన కూర్చోబెట్టుకుని ఆడించింది. (ఫోన్లో గేమ్ ఆడిన కప్ప; చివర్లో మాత్రం) యాంకర్‌తో కోతి కాసేపు బాగానే ఉంది. అయితే ఇంటర్వ్యూ మధ్యలో అనూహ్యంగా కోతి యాంకర్‌పై తిరగబడింది. ఆమెపై దూకి కాళ్లు గోకడం ప్రారంభించింది. కోతి దాడి చేయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన యాంకర్ దాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకపోవడంతో కోతి నుంచి రక్షించుకోడానికి దాన్ని నెట్టేసి సెట్ నుంచి పరుగులు తీసింది. చివరికి ఓ వ్యక్తి వచ్చి కోతిని తీసుకున్నాడు. మూడు రోజుల క్రితం యూట్యూబ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు దీనిని 50 వేల మంది వరకు వీక్షించారు. (వైరల్: జలకాలాటల్లో ఏమీ హాయిలే..) -
‘మంకీ గన్’తో కోతులు పరార్
సాక్షి, తొర్రూరు: పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టించి రూ.లక్షల పెట్టుబడితో సాగు చేసిన పంటలను కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు రైతులు అనేక కష్టాలు పడుతుంటారు. కొంత మంది రైతులు పంటలను కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు కొండెంగలను సైతం కొనుగోలు చేశారు. ప్రతి రోజు కొండెంగను తమ పంట పొలాల వద్దకు తీసుకెళ్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ కొండెంగలను సైతం ఎదిరించి పంటలను సర్వ నాశనం చేస్తున్నాయి. ఈ క్రమంలో తొర్రూరులోని లిటిల్ ప్లవర్ స్కూల్‌కు చెందిన కొంత మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులు పంట పొలాలను కోతుల బెడత నుంచి కాపాడుకునేందుకు పడుతున్న కష్టాన్ని చూసి తుపాకీ తరహాలో పెద్ద శబ్ధం వచ్చేలా మంకీ గన్( మంకీ స్కారర్)ను తయారు చేశారు. దాని నుంచి వచ్చే శబ్ధంతో పంట పొలాల నుంచి కోతులు పరారవుతున్నాయి. దీంతో విద్యార్థులను పాఠశాల యజమాన్యం, ఉపాధ్యాయులతో పాటు రైతులు అభినందిస్తున్నారు. రూ.200 ఖర్చుతోనే.. ఐదు ఫీట్లు ఉండే రెండు రకాల ప్లాస్టిక్ పైపులతో ఈ తుపాకీ(మంకీ స్కారర్)ని లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు తయారు చేశారు. ప్లాస్టిక్ పైపులు, ఒక లైటర్‌తో కేవలం రూ.200 ఖర్చుతో సుమారు 50 తుపాకులను తయారు చేశారు. కార్బైడ్ అనే 10 గ్రాముల కెమికల్, 10 మిల్లీలీటర్ల వాటర్‌ను కలిపి లైటర్‌తో నెట్టడంతో ఈ మంకీ గన్ పేలి పెద్ద శబ్ధం వస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న కోతులు వెళ్లిపోయే అవకాశం ఏర్పడుతుంది. రైతులకు ఉచితంగా అందిస్తాం పంటలను కోతుల బెడద నుంచి కాపాడేందుకు విద్యార్థులు తయారు చేస్తున్న మంకీ స్కారర్లను ఈ ప్రాంత రైతులకు ఉచితంగా అందిస్తాం. విద్యార్థులు ఇలాంటి ప్రయోగాలు చేసి విజయవంతం అవడం అభినందనీయం. మండలంలోని ఏ గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందో గుర్తించి రైతులకు మంకీ స్యారర్లను అందిస్తాం. – అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, స్కూల్ కరస్పాండెంట్ -
కోతులు తాకని పంజరపు తోట!
ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకునే వారికి తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు, పట్టణాలన్న తేడా లేకుండా చాలా ప్రాంతాల్లో కోతుల బెడద పెద్ద సమస్యగా మారింది. కోతుల తాకిడికి తట్టుకోలేక పెరటి తోటలు/ మేడలపై ఇంటిపంటల సాగుకు స్వస్తి పలుకుతున్న వారు లేకపోలేదు. అయితే, పెరట్లో పాతికేళ్లుగా ఇంటిపంటలు సాగు చేసుకునే అలవాటు ఉన్న ముళ్లపూడి సుబ్బారావు కోతుల సమస్యను ఎలాగైనా అధిగమించాలన్న పట్టుదలతో పంజరపు తోట(కేజ్ గార్డెన్)ను ఏర్పాటు చేసుకున్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుబ్బారావు ప్రకృతికి దగ్గరగా జీవించాలన్న తపన కలిగిన వ్యక్తి. సామాజిక చైతన్యం కలిగిన కథా రచయిత కూడా. సింగరేణి కాలరీస్‌లో అదనపు జనరల్ మేనేజర్‌గా కొత్తగూడెంలో పనిచేస్తున్న ఆయన తన క్వార్టర్ పక్కనే గచ్చు నేలపై ఇనుప మెష్‌తో పంజరం నిర్మించుకొని.. అందులో మడులు, పాత టబ్‌లు, బక్కెట్లలో సేంద్రియ ఇంటిపంటలు పండించుకుంటున్నారు. 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవున 9 అడుగుల ఎత్తున తన కిచెన్ గార్డెన్‌కు రూ. 40 వేల ఖర్చుతో ఇనుప పంజరాన్ని నిర్మించుకున్నారు. కుమారుడు విదేశాల్లో స్థిరపడటంతో దంపతులు ఇద్దరే నివాసం ఉంటున్నారు. సుబ్బారావు తన అభిమాన మినీ పొలమైన ఇనుప పంజరంలో.. బెండ, వంగ, టమాటా, అలసంద, పొట్ల, ఆనప(సొర) వంటి కూరగాయలతోపాటు 6 రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు. ఏడాదిలో 6 నెలలు కూరగాయలు, ఆకుకూరలు నూటికి నూరు శాతం, మిగతా 6 నెలలు 50% మేరకు తమ పంజరపు తోటలో కూరగాయలు, ఆకుకూరలనే తింటున్నామని ఆయన సంతృప్తిగా చెప్పారు. ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలను పొందడంతోపాటు.. కంటి నిండా పచ్చదనం పంజరపు తోట రూపంలో అందుబాటులో ఉండటంతో దైనందిన జీవితంలో ఒత్తిడిని మర్చిపోయి సాంత్వన పొందుతున్నానని ఆయన తెలిపారు. ఇప్పుడు ఫైబర్ టబ్‌లు అందుబాటులోకి రావడంతో ఇంటిపంటల సాగు కొంత సులభమైందన్నారు. తక్కువ స్థలంలో, మనకు నచ్చిన కూరగాయలు, ఆకుకూరలను అధిక దిగుబడి పొందడానికి పంజరపు తోట ఉపకరిస్తోందన్నారు. క్వార్టర్లలో, అద్దె ఇళ్లలో నివసించే ఉద్యోగులు అవకాశం ఉన్న వారు పంజరపు తోటను ఏర్పాటు చేసుకుంటే.. ఇల్లు మారినా, ఊరు మారినా.. దీన్ని కూడా పెద్దగా కష్టపడకుండానే తరలించుకెళ్లవచ్చని ఆయన అనుభవపూర్వకంగా చెబుతున్నారు. సొంత ఇల్లున్న వారికి పంజరపు తోట ఖర్చు భరించలేనిదేమీ కాదని, ఒక సోఫాపై పెట్టే ఖర్చుతోనే దీన్ని సమకూర్చుకోవచ్చన్నారు. క్యాంపులకు వెళ్లినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి టైమర్‌తో కూడిన డ్రిప్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నట్లు సుబ్బారావు తెలిపారు. కోతుల బెడదకు విరుగుడుగా పంజరపు తోటను నిర్మించుకున్న సుబ్బారావు (94911 44769) దంపతులకు ‘సాక్షి’ జేజేలు పలుకుతోంది. ముళ్లపూడి సుబ్బారావు -
కోతుల వీర విహారం
అచ్చంపేట రూరల్ : అచ్చంపేటలోని వివిధ కాలనీల్లో కోతుల బెడద తీవ్రమైంది. ఒంటరిగా ఉన్న మనుషులపై ప్రత్యక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. వా రంలో 10మందికి పైగా కోతులు దాడి చేసి గాయపర్చాయి. ఆదర్శనగర్ కాలనీ లో చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నాయి. మధ్యాహ్నపాఠశాల నుం చి ఇంటికి తినడానికి వచ్చిన విద్యార్థులపై కోతులు దాడి చేసి గాయపర్చుతున్నాయి. ఆదర్శనగర్ కాలనీలో.. ఈనెల 29న ఆదర్శనగర్ కాలనీలో ఓ విద్యార్థి వెంట పడి కోతులు దాడి చేశాయి. పరుగెత్తుకుంటూ ఓ ఇంట్లోకి వెళ్లినా కోతులు వదల్లేదు. కాళ్లు, చేతులపై దాడి చేశాయి. ఇది చూసిన కాలనీవాసులు భయాందోళనకు గురై ఇంటి నుంచి బయటకు వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లినా కర్రలు చేతిలో పట్టుకుని వస్తున్నారు. ఒకప్పుడు ఇళ్లలోకి వచ్చి ఆహార పదార్థాలు ఎత్తుకెళ్లే కోతులు ప్రస్తుతం దాడులు చేయడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఇంటిలో ఉన్న మహిళలు తలుపులు మూసుకుని ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ సిబ్బందిపై.. అలాగే బుధవారం ఉదయం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న సిబ్బందిపై కోతులు దాడి చేశాయి. సెక్యూరిటీ గార్డు, ఉద్యోగి సుఖ్జీవన్రెడ్డిపై దాడి చేసి గాయపర్చాయి. సుఖ్‌జీవన్‌రెడ్డి చేతులు, చెవులను కొరికివేశాయి. ఎడమ చెవిని కోతి కొరకడంతో చెవి భాగం కింద పడింది. ఆర్టీసీ కార్మికులు కర్రలు చేతిలో పట్టుకుని పనులు చేస్తున్నారు. అందరూ ఒకే దగ్గర కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడు కోతులు దాడులు చేస్తాయో అని భయాందోళనలో కార్మికులు ఉన్నారు. కోతులను పట్టుకునేవాళ్లను పిలిపించాం కాలనీలో కోతులు దాడులు చేస్తున్నాయని ఫిర్యాదులు చాలా వచ్చాయి. కోతులను పట్టుకునే వాళ్లను పిలిపించాం. గురువారం నుంచి కోతులను పట్టుకునే పనిలో వారుంటారు. కాలనీవాసులు భయాందోళనకు గురి కాకుండా కోతులను పట్టుకుని పట్టణానికి దూరంగా వదిలేస్తాం. – నాయిని వెంకటస్వామి, నగరపంచాయతీ కమిషనర్, అచ్చంపేట పట్టించుకోని అధికారులు... కోతుల బెడద నుంచి తప్పించాలని పలుమార్లు నగరపంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. గతంలో ఓసారి కోతులను పట్టుకునే వారిని పిలిపించి పట్టుకుని పట్టణానికి దూరంగా పంపించారని, ప్రస్తుతం అలాంటి చర్యలు నగరపంచాయతీ అధికారులు చేపట్టడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. -
వానరకం
దమ్మపేట : మండల కేంద్రమైన దమ్మపేటలో ప్రజలు కోతులతో వేగలేకపోతున్నారు. అవి ఎప్పడు ఎవరి మీద దాడి చేస్తాయో..ఏ ఇంట్లో దూరి సామగ్రి ఎత్తుకుపోతాయో తెలియక జనం భయపడుతున్నారు. దమ్మపేటలో కొంత కాలంగా కోతులు విచ్చిల విడిగా తిరుగుతున్నాయి. ఇళ్ల తలుపులు తెరచి ఉంటే చాలు ఇంట్లోకి జొరబడి సామగ్రిని చిందరవందర చేయడమే కాకుండా ఎత్తుకుపోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. రోడ్ల పక్కన కిరణా షాపులు, పండ్ల దుకాణాల్లో అయితే యజమానులున్నా లోనికి దూరిపోయి చేతికందిన వాటిని తీసుకుపోతున్నాయి. రోడ్లపై నడిచే వ్యక్తుల చేతుల్లో కవర్లు కనిపిస్తే వారి నుంచి కవర్లును లాక్కెళ్తున్నాయి. దీంతో కూరగాయలు, ఇతర సామగ్రిని చేతపట్టుకోవాలంటే జనం జంకిపోతున్నారు. ఉదయం, సాయంత్రం అని సమయం లేకుండా ఇళ్ల పైకప్పులపై చేరి పెంకులను తొలగిస్తూ నానా భీవత్సం సృష్టిస్తున్నాయి. వాటి బెడద నుంచి తట్టుకోలేక ప్రజలు ఇళ్ల వద్ద కర్రలతో కాపలా కాస్తున్నారు. ఇటీవల మల్కారం రోడ్డులో నివాసముంటున్న ఒక వ్యక్తిపై కోతులు పడి విపరీతంగా కరిశాయి. దమ్మపేటలో కోతుల సమస్య పరిష్కరించాలని పట్టణ ప్రజలు పంచాయతీ అధికారులను, పాలకవర్గాన్ని కోరుతున్నారు. దమ్మపేటలో కోతులతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇంటి ఆవరణలో కూరలు తయారు చేయడానికి సిద్ధం చేసిన కూరగాయలను ఎత్తుకెళ్తున్నాయని అంటున్నారు. వాటితో పాటు బయట ఆరవేసిన దుస్తులను ఎత్తుకెళుతు జనాలను భయబ్రాంతులను చేస్తున్నాయి. దమ్మపేటలో కోతుల సమస్యకు పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వాటి వల్ల ప్రజలు, చిన్న పిల్లలు చాలా ఇబ్బందులకు గురువుతున్నారు. గతంలో ఒకసారి దమ్మపేటలో కోతులను పట్టి దూరంగా వదిలారు. కొంతకాలం కోతుల సమస్యలేదు. కొద్దికాలంగా సమస్యల మళ్లీ పునరావృతం అయిందని, కోతుల సమస్యకు పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
కోతి కోసం భారీ వేట..
హైదరాబాద్: కొద్ది రోజులుగా నగరంలోని సైదాబాద్ వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న వానరాన్ని బంధించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) రంగంలోకి దిగింది. కమిషనర్ జనార్థన్ రెడ్డి ఆదేశాల మేరకు వెటర్నరీ, మున్సిపల్, జూపార్క్ సిబ్బంది.. భారీ సంరంజామాతో బుధవారం నుంచి కోతి ఆపరేషన్‌ను ప్రారంభించారు.. మతిస్థిమితం కోల్పోయిన ఓ కోతి.. సైదాబాద్ ప్రాంతంలోని ప్రజలపై తరచూ దాడులకు తెగబడుతోంది. ఇప్పటివరకు కనీసం 90 మందిని కరిచింది. దీంతో కొందరు కోతికి భయపడి ఇళ్లు వదిలి వెళ్ళిపోయారు. ఈ వ్యవహారంపై స్పందించాల్సిందిగా సైదాబాద్ కార్పొరేటర్ స్వర్ణలత జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన కమిషనర్.. వెటర్నరి, జూ, మున్సిపల్ సిబ్బందిని తక్షణమే అక్కడికి పంపించి, కోతిని బంధించే ఏర్పాట్లు చేస్తామని హమీ ఇచ్చారు. (చదవండి.. కోతి భయంతో హైదరాబాద్ నుంచి చెన్నైకి..) -
కోతే కదా అని....!
-
పగతో రగిలిపోతున్న వానరం..
పాట్నా : మనుషులే కాదు జంతువులు కూడా పగ, ప్రతీకారాలు తీర్చుకుంటాయని ఓ వానరం రుజువు చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు..ముగ్గురు రైల్వే డ్రైవర్లపై ఆ కోతి దాడికి పాల్పడింది.ఈ సంఘటన బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో చోటుచేసుకుంది. చంపారన్ జిల్లా వాల్మికీ రైల్వే స్టేషన్ వద్ద ఓ కోతి గత వారం గూడ్స్ రైలు కింద పడి మృతి చెందింది. దాంతో తోబుట్టువు అయిన మరో కోతి... రైలు డ్రైవర్‌పై ప్రతీకారం పెంచుకుంది. వరుసగా దాడులు చేయటం మొదలు పెట్టింది. ఈ సంఘటనలపై రైల్వే అధికారి ఏకె ఝా మాట్లాడుతూ ఆ కోతి అనుకోకుండా రైల్వే డ్రైవర్లపై దాడి చేసినట్లు లేదని, దాని తోబుట్టువులు లేదా బంధువుల మృతికి పగ తీర్చుకోవడానికే ఈ దాడులకు పాల్పడి ఉండవచ్చన్నారు. గత వారం వాల్మీకి నగర్ రైల్వే స్టేషన్లో ఓ వానరం గూడ్స్ రైలు వెనక పరుగులు పెట్టిందని ఆయన చెప్పారు. శనివారం గూడ్స్ రైలు డ్రైవర్ పై వానరం దాడి చేయగా రైల్వే అధికారులు అతడిని కాపాడారని పేర్కొన్నారు. మరో గూడ్స్ రైలు డ్రైవర్‌పై దాడి చేయగా, ఇంజిన్ క్యాబిన్లో లాక్ చేసుకుని డ్రైవరే స్వయంగా తనను తాను కాపాడుకోవాల్సి వచ్చిందన్నారు. ఇంకో గూడ్స్ డ్రైవర్‌పై దాడికి యత్నించగా అతడు పంపిన మెసెజ్‌కు స్పందించిన రైల్వే అధికారులు అతికష్టం మీద డ్రైవర్‌ను రక్షించారని ఝా వివరించారు. ఈ సంఘటనలతో రైల్వే డ్రైవర్లు ఆందోళనకు గురవుతున్నారు. దాంతో వాల్మికీ రైల్వే స్టేషన్లో రైలు ఆపాలంటేనే భయపడుతున్నారు.