భట్టిప్రోలు: భట్టిప్రోలులో వానరాల సంచారం అధికమైంది. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. చేతులలో చిన్న పొట్లాలతో చిన్నారులు, మహిళలు కనిపించినా వెంటపడి మరీ దాడి చేసి గాయపరుస్తున్నాయి. ముఖ్యంగా భట్టిప్రోలు విఠలేశ్వరనగర్‌లో కోతులు అధిక సంఖ్యలో ఉన్నాయి. వీటిన బారిన పడి గాయపడి ఆసుపత్రి పాలైన వారు ఎంతోమంది. లంక గ్రామాల్లో ఉండే ఈ కోతులు ఇక్కడకు వలస వచ్చాయి. కోతుల బెడదతో స్థానికులు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. డాబాల పైకి ఎక్కితే ఎక్కడ దాడి చేస్తాయోనని భీతిల్లుతున్నారు. తలుపులు తెరిస్తే ఇళ్లల్లోకి ప్రవేశించి నానా భీభత్సం చేస్తున్నాయి. సెంటర్‌లో చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహించే షాపులపై ఎగబడి మరీ తినుబండారాలు తీసుకొని మరీ పరిగెడుతున్నాయి. దీంతో వారు నష్ట పోతున్నారు. స్థానికులు పంచాయతీ అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా కానీ తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా కోతుల సంచారాన్ని నియంత్రించాలని, లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వాపోతున్నారు.
చదవండి: ‘ఇప్పటికే ఇద్దరాడపిల్లల్ని కన్నాను’..! రోజుల పసికందును చంపిన తల్లి..
Comments
Please login to add a commentAdd a comment