Troubled Areas
-
Manipur: శిబిరాల నుంచే ఓటు
ఇంఫాల్: గత ఏడాదంతా జాతుల వైరంతో అట్టుడికిపోయిన మణిపూర్ ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారంతో మోతెక్కిపోయే రాష్ట్రాలకు భిన్న వాతావరణం మణిపూర్‌లో నెలకొంది. మెయితీ, కుకీ తెగల గొడవలతో 50,000 మందికిపైగా స్థానికులు సహాయక, పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. తమ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న భావన వారిలో గూడుకట్టుకుంది. లోక్‌సభ ఎన్నికలపైనా వ్యతిరేక భావన నెలకొంది. దాంతో మరో రెండు వారాల్లో పోలింగ్ ఉన్నా ఎన్నికల హడావుడే కనిపించలేదు. ‘‘మణిపూర్‌లో 2,955 పోలింగ్ స్టేషన్లలో సగం సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో వేరే ప్రాంతాలకు వలసపోయిన వారి కోసం 94 స్టేషన్లు ఏర్పాటుచేస్తున్నాం. 24,000 మంది శిబిరాల నుంచే ఓటేయనున్నారు’’ అని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసీర్ ప్రదీప్ కుమార్ ఝా అన్నారు. ఓటర్లతో మాట్లాడి ఎన్నికలపై సదాభిప్రాయం పెంచి పోలింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్టు చెప్పారు. గత ఏడాది మే మూడో తేదీన లోయ ప్రాంతాల్లో ఉండే మెజారిటీ జనాభా మైతేయ్‌లకు రాష్ట్రంలో ఎస్టీ హోదా డిమాండ్‌కు వ్యతిరేకంగా కుకీలు చేపట్టిన గిరిజనుల సంఘీభావ ర్యాలీ తర్వాత హింస ప్రజ్వరిల్లింది. మైతేయ్, కుకీల విద్వేషకాండలో 219 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది ప్రాణభయంతో సొంతూరిని వదిలి పారిపోయి ఐదు లోయ జిల్లాలు, మూడు కొండ జిల్లాల్లోని శిబిరాల్లో దాక్కున్నారు. ఘర్షణలు పూర్తిగా సద్దుమణకముందే రాష్ట్రంలో ఎన్నికలు అవసరమా? అంటూ వేలాది మంది బాధితులు, కొన్ని పౌర సంఘాలు ప్రశి్నస్తూ ఎన్నికల బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చాయి. ‘‘గత లోక్‌సభ ఎన్నికల్లో మణిపూర్‌లో చక్కటి పోలింగ్ శాతం నమోదైంది. ఇది ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర ఓటర్ల నమ్మకానికి అద్దంపడుతోంది. ఈసారి గణనీయమైన పోలింగ్‌కు కృషిచేస్తాం’’ అని ప్రదీప్ ఝా అన్నారు. -
సారూ.. కోతుల సంచారాన్ని నియంత్రించండి!
భట్టిప్రోలు: భట్టిప్రోలులో వానరాల సంచారం అధికమైంది. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. చేతులలో చిన్న పొట్లాలతో చిన్నారులు, మహిళలు కనిపించినా వెంటపడి మరీ దాడి చేసి గాయపరుస్తున్నాయి. ముఖ్యంగా భట్టిప్రోలు విఠలేశ్వరనగర్లో కోతులు అధిక సంఖ్యలో ఉన్నాయి. వీటిన బారిన పడి గాయపడి ఆసుపత్రి పాలైన వారు ఎంతోమంది. లంక గ్రామాల్లో ఉండే ఈ కోతులు ఇక్కడకు వలస వచ్చాయి. కోతుల బెడదతో స్థానికులు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. డాబాల పైకి ఎక్కితే ఎక్కడ దాడి చేస్తాయోనని భీతిల్లుతున్నారు. తలుపులు తెరిస్తే ఇళ్లల్లోకి ప్రవేశించి నానా భీభత్సం చేస్తున్నాయి. సెంటర్లో చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహించే షాపులపై ఎగబడి మరీ తినుబండారాలు తీసుకొని మరీ పరిగెడుతున్నాయి. దీంతో వారు నష్ట పోతున్నారు. స్థానికులు పంచాయతీ అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా కానీ తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా కోతుల సంచారాన్ని నియంత్రించాలని, లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వాపోతున్నారు. చదవండి: ‘ఇప్పటికే ఇద్దరాడపిల్లల్ని కన్నాను’..! రోజుల పసికందును చంపిన తల్లి.. -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు భారీ బందోబస్తు
ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు ఓఎస్డీ (పరిపాలన) వైవి.రమణకుమార్ చెప్పారు. ఎన్నికల నిర్వహణపై ఆయన గురువారం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇల్లందు, ఖమ్మం, సత్తుపల్లి సబ్ డివిజన్ పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రెండు విడతలుగా జరిగే ఈ ఎన్నికలకు బందోబస్తు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, ఖమ్మం రెవెన్యూ డివిజన్ల పరిధిలో 573 అతి సమస్యాత్మక, 600 సమస్యాత్మక, 225 తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలను గుర్తించినట్టు చెప్పారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని ఆదేశించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ తొలి విడత ఎన్నికలకు ఐదుగురు డీఎస్పీలు, 21మంది సీఐలు, 89మంది ఎస్సైలు, 660మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 1639మంది కానిస్టేబుళ్లు, 390మంది హోంగార్డులు, 106మంది మహిళా కానిస్టేబుళ్లు, 177మంది మహిళా హోంగార్డులు, 230మంది ఇతర శాఖల సిబ్బంది (ఫోర్స్), 72 సెక్షన్ల సీఎపీఎఫ్, 43 సెక్షన్ల ఏపీఎస్పీ, 14 స్పెషల్ పార్టీ, 15 యూనిట్ల గ్రేహౌండ్స్ ఫోర్స్‌తో బందోబస్తు నిర్వహించనున్నట్టు వివరించారు. రెండో విడత ఎన్నికలకు ఎనిమిదిమంది డీఎస్పీలు, 37మంది సీఐలు, 81మంది ఎస్సైలు, 621మంది ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, 1374మంది కానిస్టేబుళ్లు, 453మంది హోంగార్డులు, 154 మంది మహిళా కానిస్టేబుళ్లు, 113మంది మహిళా హోంగార్డులు, 63 సెక్షన్ల సీఏపీఎఫ్, 23 సెక్షన్ల ఏపీఎస్పీ, 10 స్పెషల్ పార్టీలు, 15 యూనిట్ల గ్రేహౌండ్ ఫోర్స్‌తో బందోబస్తు నిర్వహించనున్నట్టు వివరించారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందుస్తు చర్యల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా సెక్షన్ 107, 108, 109, 110 సీఆర్పీసీ కింద 1266 కేసుల్లో 10,576 మందిని బైండోవర్ చేసినట్టు తెలిపారు. ఈ సమావేశం లో ఇల్లందు డీఎస్పీ మనోహర్రాావు, ఖమ్మం డీఎస్పీ బాలకిషన్‌రావు, సత్తుపల్లి డీఎస్పీ అశోక్‌కుమార్, ఎస్బీ సీఐ వెంకట్రావు, ఎస్బీ ఎస్సై పూర్ణచందర్రావు తదితరులు పాల్గొన్నారు.