ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు ఓఎస్‌డీ (పరిపాలన) వైవి.రమణకుమార్ చెప్పారు. ఎన్నికల నిర్వహణపై ఆయన గురువారం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇల్లందు, ఖమ్మం, సత్తుపల్లి సబ్ డివిజన్ పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రెండు విడతలుగా జరిగే ఈ ఎన్నికలకు బందోబస్తు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, ఖమ్మం రెవెన్యూ డివిజన్ల పరిధిలో 573 అతి సమస్యాత్మక, 600 సమస్యాత్మక, 225 తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలను గుర్తించినట్టు చెప్పారు.
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని ఆదేశించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ తొలి విడత ఎన్నికలకు ఐదుగురు డీఎస్పీలు, 21మంది సీఐలు, 89మంది ఎస్సైలు, 660మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 1639మంది కానిస్టేబుళ్లు, 390మంది హోంగార్డులు, 106మంది మహిళా కానిస్టేబుళ్లు, 177మంది మహిళా హోంగార్డులు, 230మంది ఇతర శాఖల సిబ్బంది (ఫోర్స్), 72 సెక్షన్ల సీఎపీఎఫ్, 43 సెక్షన్ల ఏపీఎస్‌పీ, 14 స్పెషల్ పార్టీ, 15 యూనిట్ల గ్రేహౌండ్స్ ఫోర్స్‌తో బందోబస్తు నిర్వహించనున్నట్టు వివరించారు. రెండో విడత ఎన్నికలకు ఎనిమిదిమంది డీఎస్పీలు, 37మంది సీఐలు, 81మంది ఎస్సైలు, 621మంది ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, 1374మంది కానిస్టేబుళ్లు, 453మంది హోంగార్డులు, 154 మంది మహిళా కానిస్టేబుళ్లు, 113మంది మహిళా హోంగార్డులు, 63 సెక్షన్ల సీఏపీఎఫ్, 23 సెక్షన్ల ఏపీఎస్‌పీ, 10 స్పెషల్ పార్టీలు, 15 యూనిట్ల గ్రేహౌండ్ ఫోర్స్‌తో బందోబస్తు నిర్వహించనున్నట్టు వివరించారు.
శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందుస్తు చర్యల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా సెక్షన్ 107, 108, 109, 110 సీఆర్‌పీసీ కింద 1266 కేసుల్లో 10,576 మందిని బైండోవర్ చేసినట్టు తెలిపారు. ఈ సమావేశం లో ఇల్లందు డీఎస్పీ మనోహర్‌రాావు, ఖమ్మం డీఎస్పీ బాలకిషన్‌రావు, సత్తుపల్లి డీఎస్పీ అశోక్‌కుమార్, ఎస్‌బీ సీఐ వెంకట్రావు, ఎస్‌బీ ఎస్సై పూర్ణచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు భారీ బందోబస్తు
Published Fri, Apr 4 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM
Advertisement
Advertisement