ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారులను ఆదేశించా రు. ఆదివారం ఖమ్మం నగరంలో పలు ప్రాంతాల్లో ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం అసెంబ్లీ పరిధిలోఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో, షాదీఖానాలో, టీఎన్‌జీవో ఫంక్షన్ హాలులో, పాలేరు నియోజకవర్గ పరిధిలో టీటీడీసీ, అంబేద్కర్ భవన్‌లలో నిర్వహిం చిన శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి రావడంతోపాటు మరోవైపు పదోతరగతి పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా కొంత ఇబ్బంది, ఒత్తిడి ఉన్నా ఎన్నికలు సజావుగా నిర్వహించడం మన విధి అన్నా రు. ఎన్నికల నిర్వహణకు 16వేల మంది సిబ్బంది అవసరం కాగా, ఇప్పటి వరకు 15వేల మంది సిబ్బంది సిద్ధం గా ఉన్నారన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 81.60 శాతం ఓట్లు పోలయ్యాయని, రాష్ట్రం లో అత్యధిక శాతం పోలయిన ఐదు జిల్లాల్లో ఖమ్మం ఒకటిగా నిలి చిందని గుర్తుచేశారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా 90శాతం ఓట్లు పోలయ్యాయని, జిల్లాలో ఓటర్లు చైతన్యవంతులని చెప్పారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయ, సిబ్బంది చాలా సానుకూల దృక్పథంతో పనిచేస్తున్నారని, ఇదే విధానాన్ని కొనసాగించాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. బీఎల్‌వో లు ఇంటింటికి తిరిగి స్లిప్‌లు పంపిణీ చేస్తారని, పోలింగ్ రోజున హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటుచేసి ఓటర్లకు సలహాలు, సూచనలు చేస్తారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్‌లపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించిందని, రానున్న ఎన్నికల్లో ఆ ఓట్లే కీలకం కానున్నాయని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ సి బ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాల వద్ద పోలింగ్ సిబ్బం దికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నా రు. ఈ సందర్భంగా ఆయా శిక్షణ కేంద్రాల్లో మాస్టర్ ప్లానర్లు ఈవీ ఎంల పనితీరు, పోలింగ్ ప్రక్రియలను వివరించారు. కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు శ్రీనివాస్, అరుణకుమా రి, రాజమహేందర్‌రెడ్డి, శివదాసు, పీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.
ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వర్తించాలి
Published Mon, Mar 31 2014 1:48 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement