సాక్షి, హైదరాబాద్: ఇంతకు ముందు పంట పొలాలకు రక్షణ కోసం కంచెలు వేయడం చూశాం. వివిధ రకాల పశువులు, పక్షులు, అడవి జాతి జంతువులతో పంట నష్టపోకుండా పొలం చుట్టూ రకరకాల బొమ్మలు, వైర్లు, టపాకాయలు, దిష్టి బొమ్మలు, సౌండ్స్ సిస్టం ఏర్పాటు చేయడం చూశాం. కానీ ఇంటిపై కప్పులపై బొమ్మలు, కరెంట్ తీగలు, కంచె వేయడం ఎప్పుడైనా చూశారా..
ఇప్పుడు అనేక గ్రామాల్లో ఇంటి పైకప్పులపై కంచెలు కనిపిస్తున్నాయి. కేవలం కోతుల కోసమే ఇలాంటి జాగత్త్రలు, రక్షణ చర్యలు తీసుకుంటున్నారంటే ఒకింత ఆశ్చర్యం అనిపించినా.. అక్షరాలా నిజమే. ఒకప్పుడు కేవలం అటవీ పరిసర ప్రాంతాలు, పల్లెల్లో కోతుల బెడద ఎక్కువగా ఉండేది. కానీ ఇటీవలి కాలంలో ఊళ్ళల్లోనే కాదు పట్టణాల్లోనూ వానరాల సంచారం తీవ్రమైంది.
కొండెంగలను తెచ్చినా..
కోతుల కట్టడి కోసం చాలా ఊళ్ళల్లో, కాలనీల్లో స్థానికులు తలాకొంత వేసుకుని వాటి రక్షణకు కొండెంగలను తెచ్చి పెట్టుకున్నారు. కానీ ఒక దిక్కున కొండెంగలను ఏర్పాటు చేస్తే మరో దిక్కున కోతులు చొరబడుతున్నాయి.. అన్ని చోట్లా పెట్టేందుకు ఎక్కువగా కొండెంగలు కావాల్సి ఉన్నా వాటి కొరత నేపథ్యంలో గ్రామస్తులకు విసుగొచ్చి చివరికి తీసుకువచ్చిన కొండెంగలను కూడా అడవిలో వదిలేశారంటే వానర సైన్యం సంఖ్య ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు సౌండ్స్ సిస్టం ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండటం లేదు, కోతులు పట్టితెచ్చిన వారికి 2 రూ.వేల నుంచి పదివేలు ముట్టజెప్పినా... ఒకటి రెండు రోజుల తర్వాత మళ్లీ కోతుల బెడద తప్పడంలేదు.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి
కోతులు రాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం కానరావడం లేదు. ఈ మధ్య మా ఊళ్లో ఓ ఇంట్లోకి కోతి వెళ్లింది. పొరపాటున ఇంటి డోర్‌లాక్ పడటంతో వందలాది కోతులు ఇంటిని చుట్టుముట్టి నానారభస చేసి. పైకప్పును పూర్తిగా పాడు చేశాయి. ఆ సమయంలో ఇంట్లో మనుషులు లేరు కాబట్టి సరిపోయింది. లేదంటే పరిస్థితి ఏమిటి?
– గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ–2, ముస్తాబాద్
Comments
Please login to add a commentAdd a comment