
సాక్షి, ధర్మపురి: కోతులు దాడి చేస్తాయేమోనన్న భయంతో ఓ మహిళ గుండె ఆగి మరణించింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బట్టపల్లి మోహన్ ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం కుటుంబంతో ధర్మారానికి వచ్చాడు. ఇక్కడే ఉంటూ వడ్రంగి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
మోహన్ కూతురు రేవతి (34)కి వివాహం అయినప్పటికీ ధర్మారంలో తండ్రి వద్దనే ఉంటోంది. ఉదయం ఇంటి నుంచి రేవతి బయటకు వస్తున్న సమయంలో గుంపుగా వచి్చన కోతులు పెద్దగా అరుస్తూ ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించాయి. వాటిని చూసిన రేవతి భయంతో అక్కడే కుప్పకూలింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. గుండెపోటుతోనే మరణించిందని వైద్యులు తెలిపారు. కాగా, రేవతికి ముగ్గురు పిల్లలున్నారు.
చదవండి:
కొత్త ట్విస్ట్: యువతికి షాకిచ్చిన జొమాటో డెలివరీ బాయ్
Comments
Please login to add a commentAdd a comment