కోతి పగ పట్టిందా.. రక్తం వచ్చేలా తల్లి, చిన్నారిపై దాడి | Monkey Attacked On Girl Near Private Zoo In Russia | Sakshi
Sakshi News home page

Monkey Attack: కోతి పగ పట్టిందా.. రక్తం వచ్చేలా తల్లి, చిన్నారిపై దాడి

Published Sat, Jul 23 2022 2:59 PM | Last Updated on Sat, Jul 23 2022 3:00 PM

Monkey Attacked On Girl Near Private Zoo In Russia - Sakshi

Monkey Attacked On Girl.. కొన్ని సందర్భాల్లో జంతువులు పగబడితే ఎలా ప్రవర్తిస్తాయో చూసే ఉంటాము. ఏనుగులు, ఎద్దులు కోపంతో ఉన్నప్పుడు దాడులు చేసిన వీడియోలు చూశారు కాదా.. తాజాగా ఓ కోతి కూడా అలాగే.. మందేసిన కోతిలాగా రెచ్చిపోయింది. ఓ చిన్నారిపై దాడి చేసింది. చిన్నారి పేరెంట్స్‌ ఎంత ప్రతిఘటిస్తున్నా కోతి మాత్రం తగ్గేదేలే అన్నట్టు వ్యవహరించింది. వారి వెంటపడి మరీ చిన్నారిని లాగేసుకునే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. 

అయితే, యూకేకు చెందిన మెట్రో వార్తా స​ంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రష్యాలోని టెర్పిగోరివో ప్రాంతంలో ఓ ఫ్యామిలీ.. తన స్నేహితుడి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో గార్డెన్‌లో పిల్లలు ఆడుకుంటుండగా ఓ కోతి అక్కడికి వచ్చి పిల్లలపై దాడికి దిగింది. దీంతో అక్కడున్న వారంతా పరుగులు తీశారు. రెండేళ్ల పౌలీనాను కోతి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఆ చిన్నారి మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ కేకలు వేసింది. 

పౌలీనా అరుపులు విన్న ఆమె తల్లి అక్కడికి పరిగెత్తుకు వచ్చి చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించింది. కానీ, కోతి మాత్రం ఇద్దరిపై దాడి చేసింది. ఇంతలో అక్కడికి వచ్చిన చిన్నారి తండ్రి.. కోతిని తన్నుతూ వారిద్దరిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, కోతి మాత్రం చిన్నారిపై దాడి కొనసాగిస్తూనే ఉంటుంది. ఎంత ప్రతిఘటించినా కోతి మాత్రం చిన్నారిని లాగేసుకుంటూనే ఉంది. 

చివరకు కోతి నుంచి ఆమెను పేరెంట్స్‌ రక్షించారు. కానీ, పౌలీనాకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె ఆసుపత్రికి తరలించారు. పౌలీనా చేతులు, కాళ్లపై గాయాల కారణంగా చాలా రక్తం పోయినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంలకడగానే ఉందని.. న్యూస్‌ వీక్‌ ఓ కథనంలో పేర్కొంది. అయితే, చిన్నారి ఉంటున్న ఇంటి పక్కనే ఓ మిలియనీర్‌ ప్రైవేట్‌ జూ ఒకటి ఉన్నట్టు సమాచారం. అందులో తేడేళ్లు, ఏనుగులు, ఇతర అడవి జంతువులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కోతి వారిపై దాడి చేసిందని పలు వార్తా సంస్థలు కథనాల్లో తెలిపాయి. 

ఇది కూడా చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. బైక్‌ నడిపే వాళ్లు తప్పక చూడాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement