Private Zoo
-
పెట్స్.. అదో స్టేటస్!
సాక్షి, హైదరాబాద్: నగరవాసుల స్టేటస్ సింబల్ మారింది. లగ్జరీ వాహనాలు, హై ఎండ్ గృహాలు, విదేశీ ఫర్నీచర్, లైఫ్ స్టయిల్ జాబితాలో విదేశీ పెంపుడు జంతువులు కూడా చేరిపోయాయి. సినీ ప్రముఖులు, బడా వ్యాపారులు తమ వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్ హౌస్‌లు, లగ్జరీ విల్లాలలో విదేశీ పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. తాజాగా క్యాసినోవాలా చికోటి ప్రవీణ్ వ్యవసాయ క్షేత్రంలో ఎగ్జోటిక్ పెట్స్‌ను అటవీ శాఖ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. విదేశాల్లోని అడవి జాతి పెంపుడు జంతువులను ఎగ్జోటిక్ పెట్స్ అంటారు. మన దేశంలో వీటి రవాణా వైల్డ్‌లైఫ్ యాక్ట్–1972 ప్రకారం చట్ట వ్యతిరేకం. అమెరికా, ఆ్రస్టేలియా, మెక్సికో వంటి విదేశాల నుంచి అక్రమ మార్గంలో దిగుమతి చేసుకొని, విక్రయిస్తుంటారు. ఇటీవల కోల్కత్తా నుంచి హైదరాబాద్‌కు కంగారులను అక్రమ రవాణా చేస్తున్న ఓ ముఠాను వెస్ట్ బెంగాల్‌లోని కుమార్గ్రామ్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లో అధిక డిమాండే అక్రమ రవాణాకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఇండియన్ బ్రీడ్ ఎగ్జోటిక్ పెట్స్ పెంపకానికి మన దేశంలో అనుమతి ఉంది. కానీ, ఆయా జంతువులను అటవీ శాఖ వద్ద నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరంలో ఈ తరహా వన్యప్రాణులు 150–200 రకాలుంటాయని అంచనా. నగరంలో 50కి పైగా ప్రైవేట్ జూలు.. ప్రస్తుతం నగరంలో 50కి పైగా ప్రైవేట్ జూలు ఉంటాయని బహుదూర్‌పల్లిలోని జూ అధికారి ఒకరు తెలిపారు. చేవెళ్ల, శంకర్పల్లి, కందుకూరు, శామీర్‌పేట, భువనగిరి వంటి పలు ప్రాంతాలలోని విశాలమైన ఫామ్ హౌస్‌లు, వ్యవసాయ క్షేత్రాలలో చిన్న పాటి జూలను ఏర్పాటు చేసి, వీటిని పెంచుతున్నారు. అలాగే పలువురు బడా డెవలపర్లు లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలలో పెట్ పార్క్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. క్యాసినో వాలాగా పేరొందిన చికోటి ప్రవీణ్‌కు కందుకూరు మండలం సాయిరెడ్డిగూడలో 12 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇందులో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొండచిలువలు, ఊసరవెల్లి, మకావ్ చిలుకల వంటి వన్యప్రాణులున్నట్లు అధికారులు గుర్తించారు. అధ్యయనం చేశాకే పెంపకం.. ఎగ్జోటిక్ పెట్స్ జీవన విధానంపై అవగాహన ఉంటేనే పెంచుకోవాలి. లేకపోతే స్వల్పకాలంలోనే అనారోగ్యం పాలై చనిపోతాయని కూకట్‌పల్లిలోని ఎగ్జోటిక్ పెట్ విక్రయదారుడు, వెటర్నరీ స్టూడెంట్ యుగేష్ తెలిపారు. అవి ఏ జాతికి చెందినవి, ఎలాంటి వాతావరణంలో పెరుగుతాయి, వాటి ఆహారం, వాటికి వచ్చే రోగాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. సల్కాటా, ఆల్డాబ్రా టార్టాయిస్: ప్రారంభ ధర రూ.2.5 లక్షలు. ఇగ్వానా: ఆకుపచ్చ, నీలం, పసుపు రంగుల ఇగ్వానాల ప్రారంభ ధర రూ.15 వేలు. స్నో, థానోస్ రంగులవైతే రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య ఉంటాయి. బాల్ పైథాన్: వీటిని రాయల్ పైథాన్స్ అని కూడా పిలుస్తారు. ధర రూ.35–40 వేలు. డెడ్ బియర్డ్ డ్రాగన్: తెల్ల గడ్డంలాగా ఉంటాయి. వీటిని వెనక్కి తిప్పినా ఎలాంటి చలనం ఉండదు. వీటి స్పర్శ చల్లగా, గట్టిగా ఉంటుంది. తెలుపు, గోధుమ, ఎరుపు రంగుల్లోని డ్రాగన్స్ ప్రారంభ ధర రూ.80 వేలు. కార్న్ స్నేక్: నార్త్ అమెరికాకు చెందిన ఈ కార్న్ స్నేక్స్ విషపూరితం కావు. జన్యురకం, రంగులను బట్టి వీటి ధరలు రూ.25–35 వేల మధ్య ఉంటాయి. మార్మోసెట్ కోతులు: సౌత్ అమెరికా, బ్రెజిల్, కొలంబియా దేశాలకు చెందిన ఈ కోతులు ఆలివ్ గ్రీన్, గోధుమ రంగుల్లో ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.5 లక్షలు.. మీర్కట్: దక్షిణాఫ్రికాకు చెందిన మీర్కట్స్ గోధుమ, తెలుపు రంగులో ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.1.5 లక్షలు. రామచిలుకలు: బ్లాక్పామ్ కాకాటూ, విక్టోరియా క్రౌన్, గోల్డెన్ కోనూర్, అమెరికన్ క్రౌ వంటి రంగురంగుల రామచిలుకలు ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ. 30 వేలు. యార్కి టెర్రియర్ డాగ్: అచ్చం బొమ్మలాగా నలుపు, గోధుమ రంగులలో ఈ కుక్క వీటి ప్రారంభ ధర రూ.85 వేలు. జోలో అనే రకం కుక్కలకు శరీరంపై వెంట్రుకలు ఉండకపోవటం వీటి స్పెషాలిటీ. గ్రే కలర్లో వీటి ధర రూ.లక్ష. (చదవండి: ‘ఫీజు’ లేట్.. మారని ఫేట్!) -
కోతి పగ పట్టిందా.. రక్తం వచ్చేలా తల్లి, చిన్నారిపై దాడి
Monkey Attacked On Girl.. కొన్ని సందర్భాల్లో జంతువులు పగబడితే ఎలా ప్రవర్తిస్తాయో చూసే ఉంటాము. ఏనుగులు, ఎద్దులు కోపంతో ఉన్నప్పుడు దాడులు చేసిన వీడియోలు చూశారు కాదా.. తాజాగా ఓ కోతి కూడా అలాగే.. మందేసిన కోతిలాగా రెచ్చిపోయింది. ఓ చిన్నారిపై దాడి చేసింది. చిన్నారి పేరెంట్స్ ఎంత ప్రతిఘటిస్తున్నా కోతి మాత్రం తగ్గేదేలే అన్నట్టు వ్యవహరించింది. వారి వెంటపడి మరీ చిన్నారిని లాగేసుకునే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. అయితే, యూకేకు చెందిన మెట్రో వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రష్యాలోని టెర్పిగోరివో ప్రాంతంలో ఓ ఫ్యామిలీ.. తన స్నేహితుడి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో గార్డెన్లో పిల్లలు ఆడుకుంటుండగా ఓ కోతి అక్కడికి వచ్చి పిల్లలపై దాడికి దిగింది. దీంతో అక్కడున్న వారంతా పరుగులు తీశారు. రెండేళ్ల పౌలీనాను కోతి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఆ చిన్నారి మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ కేకలు వేసింది. పౌలీనా అరుపులు విన్న ఆమె తల్లి అక్కడికి పరిగెత్తుకు వచ్చి చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించింది. కానీ, కోతి మాత్రం ఇద్దరిపై దాడి చేసింది. ఇంతలో అక్కడికి వచ్చిన చిన్నారి తండ్రి.. కోతిని తన్నుతూ వారిద్దరిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, కోతి మాత్రం చిన్నారిపై దాడి కొనసాగిస్తూనే ఉంటుంది. ఎంత ప్రతిఘటించినా కోతి మాత్రం చిన్నారిని లాగేసుకుంటూనే ఉంది. చివరకు కోతి నుంచి ఆమెను పేరెంట్స్ రక్షించారు. కానీ, పౌలీనాకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె ఆసుపత్రికి తరలించారు. పౌలీనా చేతులు, కాళ్లపై గాయాల కారణంగా చాలా రక్తం పోయినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంలకడగానే ఉందని.. న్యూస్ వీక్ ఓ కథనంలో పేర్కొంది. అయితే, చిన్నారి ఉంటున్న ఇంటి పక్కనే ఓ మిలియనీర్ ప్రైవేట్ జూ ఒకటి ఉన్నట్టు సమాచారం. అందులో తేడేళ్లు, ఏనుగులు, ఇతర అడవి జంతువులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కోతి వారిపై దాడి చేసిందని పలు వార్తా సంస్థలు కథనాల్లో తెలిపాయి. قرد يهاجم فتاة صغيرة ويحاول اختطافها من والدتها.. 🛑 ملاحظة : غريبة التغيير في فطرة الحيوانات .. pic.twitter.com/2UafWTdM1j— #كابتن_غازي_عبداللطيف (@CaptainGhazi) July 22, 2022 ఇది కూడా చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. బైక్ నడిపే వాళ్లు తప్పక చూడాల్సిందే! -
ఆ భయం పోయింది
దుబాయ్‌లో మస్త్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు కాజల్ అగర్వాల్. ఈ సందర్భంగా ఆమె అక్కడ ఉన్న ఓ ప్రైవేట్ జూలోకి వెళ్లారట. అక్కడి జంతువులతో సరదాగా టైమ్ స్పెండ్ చేశారు. ఈ విషయాన్నే కాజల్ చాలా ఎగై్జటింగ్‌గా చెబుతున్నారు. ‘‘కొన్ని జంతువులంటే నాకు చాలా భయం ఉండేది. వాటిని ఇంత క్లోజ్‌గా చూస్తానని అనుకోలేదు. ఇప్పుడు ఆ భయం పోయింది. ఇలా నా భయం దూరం కావడానికి సహకరించిన వారికి ధన్యవాదాలు. నా బర్త్‌డే సెలబ్రేషన్ విభిన్నంగా, మంచి అనుభూతితో జరిగినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు కాజల్. ఇక కాజల్ సినిమాల ప్రస్తావనకు వస్తే.. ఆమె తెలుగులో ఒక కథానాయికగా నటించిన ‘రణరంగం’ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. శర్వానంద్ హీరో. అలాగే తమిళంలో కాజల్ నటించిన ‘కోమలి, ప్యారిస్ ప్యారిస్’ విడుదలకు సిద్ధమయ్యాయి. కమలహాసన్ ‘ఇండియన్ 2’లో కథా నాయికగా నటించనున్నారు. మరోవైపు ‘మను చరిత్ర’ అనే సినిమాను సమర్పిస్తున్నారు. -
పాతబస్తీలో ప్రైవేట్ జూ?
► గుట్టుచప్పుడు కాకుండా నిర్వహణ! ► బిహార్ నుంచి వన్యప్రాణుల స్మగ్లింగ్ ► ఉత్తరప్రదేశ్‌లో పట్టుబడిన నగరవాసులు ► అంతర్జాతీయ మాఫియాగా అనుమానాలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో జూ ఎక్కడ ఉంది? అంటే.. బహదూర్‌పురలో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ అని ఠక్కున చెప్పేస్తాం. అయితే ఇప్పటి వరకు రికార్డుల్లోకి ఎక్కకుండా, గుట్టుచప్పుడు కాకుండా పాతబస్తీలో ‘ప్రైవేట్ జూ’లు నడుస్తున్నాయంటే నమ్మగలమా..? ఉత్తరప్రదేశ్‌లో పట్టుబడిన నగరవాసులు ఇదే విషయాన్ని బయటపెట్టారు. వన్యప్రాణులైన కరకల్ క్యాట్, లెపార్డ్ క్యాట్లను అక్రమ రవాణా చేస్తూ వీరు చిక్కారు. దీనిపై సమాచారం అందుకున్న అటవీ–పోలీసు విభాగాలు పాతబస్తీలో ఉన్న ప్రైవేట్ జూ ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. బిహార్ నుంచి తీసుకొస్తూ.. పాతబస్తీలోని కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మహ్మ ద్ ఆరిఫ్ సహా ఐదుగురు నగరవాసులు అరుదైన కరకల్, లెపార్డ్ జాతులకు చెందిన పిల్లుల కోసం కొన్ని రోజుల క్రితం బిహార్ వెళ్లారు. అక్కడి అటవీ ప్రాంతంలో ఈ జాతులకు చెందిన ఐదింటిని పట్టు కున్న వీరు.. తమ ఇన్నోవా వాహనంలో ఇనుప కంచె తో ప్రత్యేకంగా చేసిన పెట్టెల్లో భద్రపరిచారు. సోమ వారం వాహనంలో ఉత్తర్‌ప్రదేశ్ మీదుగా వస్తుం డగా.. ఆ రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో మీర్జాపూర్ ప్రాంతంలో తనిఖీ చేయగా.. వీరి వాహనంలో కరకల్, లెపార్డ్ జాతులకు చెందిన ఐదు పిల్లులు బయటపడ్డాయి. ఆరిఫ్‌తో పాటు మరో ఇద్దరు అధికారులకు చిక్కగా.. మిగిలిన ఇరువురు పరారయ్యారు. జూ పేరుతో తప్పించుకోజూశారు.. ఆరిఫ్ సహా మిగిలిన ఇద్దరూ తమను అదుపులోకి తీసుకున్న అధికారులతో తాము హైదరాబాద్ జూకు చెందిన సిబ్బంది అని, జంతు ప్రదర్శనశాలలో ఉంచడానికి అధికారికంగానే వీటిని తరలిస్తున్నామని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడి అటవీ శాఖ అధికారులు అందుకు సంబంధించిన పత్రాలు చూపమని చెప్పడంతో దొరికేశారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో పాతబస్తీలో అనధికారికంగా కొనసాగుతున్న జూలో పెంచుకోవడానికే వీటిని తరలిస్తున్నట్లు అంగీకరించారు. ఈ తరహా పిల్లుల్ని సజీవంగా స్మగ్లింగ్ చేస్తూ చిక్కడం అత్యంత అరుదని ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఉమేందర్ శర్మ మీడియాకు వెల్లడించారు. కెమెరా ట్రాప్ కళ్లల్లోనూ పడవు.. అడవుల్లో వన్యప్రాణుల్ని లెక్కించడానికి, వాటి ఆచూకీ తెలుసుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేక ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తుంది. మూవ్మెంట్ క్యాప్చర్ పద్ధతిలో పని చేసే వీటి ముందుకు ఏ జంతువు వచ్చినా.. కెమెరా ఫొటో తీస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ అడవుల్లో అరుదైన జాతికి చెందిన కరకల్, లెపార్డ్ క్యాట్స్ కొన్నేళ్లుగా కెమెరాలకూ చిక్కలేదని చెప్తున్నారు. అంతరించి పోయాయని భావిస్తున్న తరుణంలో.. ఆ పిల్లుల్ని హైదరాబాదీలు ఎలా పట్టుకున్నారనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ‘అంతర్జాతీయ’కోణంలోనూ ఆరా స్మగ్లర్లు తమ ఉనికి బయటపడకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇన్నోవాకు బూడిద రంగు వేయించడంతో పాటు నంబర్ ప్లేట్ కనిపించకుండా కప్పేశారు. పిల్లుల్ని పకడ్బందీగా ఇనుప బోన్లలో గన్నీ బ్యాగ్స్‌తో పార్శిల్ చేశారు. వీటిని పరిశీలించిన యూపీ అధికారులు తమకు చిక్కిన హైదరాబాదీల వెనుక అంతర్జాతీయ ముఠా ఉందని అనుమానిస్తున్నారు. ఇలా అక్రమంగా తీసుకువెళ్లిన వన్యప్రాణుల్ని హైదరాబాద్, బెంగళూరుల్లోని ఫామ్‌హౌస్‌ల్లో కొంతకాలం ఉంచుతున్నారని, ఆపై బయటి దేశాలకు తరలిస్తున్నారని అనుమానిస్తున్నారు. అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్న కరకల్ క్యాట్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని అడవుల్లోనూ కలిపి 200లోపే ఉన్నట్లు అంచనా. దీంతో ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయడానికి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో(డబ్ల్యూసీసీబీ) రంగంలోకి దిగనుంది.