రెచ్చగొడితే ఇలాగే ఉంటంది.. పట్టపగలే చుక్కలు చూపించింది | Monkey Pulls Girl Hair Video Trending In Social Media | Sakshi
Sakshi News home page

కోతిని రెచ్చగొడితే ఇలాగే ఉంటంది.. పట్టపగలే చుక్కలు చూపించింది

Published Mon, Jul 25 2022 9:38 AM | Last Updated on Mon, Jul 25 2022 9:39 AM

Monkey Pulls Girl Hair Video Trending In Social Media - Sakshi

కొన్నిసార్లు మనుషులు చేసే చిన్న తప్పులకు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో సోషల్‌ మీడియాలో జంతువులను కవ్విస్తే అవి దాడి చేసిన వీడియోలు చూసే ఉంటాము. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

సాధారణంగా జూకు వెళ్తే.. కొన్ని జంతువులను దూరం నుంచి చూడాలని హెచ్చరిస్తుంటారు. అయినా కొంత మంది వినిపించుకోకుండా అతి చేస్తారు. దీంతో జంతువులు తిరగబడి గాయపరుస్తాయి. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడటం లేదా ప్రాణాలు సైతం పోయే పరిస్థితి రావచ్చు. తాజాగా ఓ యువతి.. బోనులో ఉన్న కోతిని రెచ్చిగొట్టింది. దీంతో తగిన మూల్యం చెల్లించుకుంది. 

వీడియోలో.. యువతి బోనులో ఉన్న కోతిని ఓ యువతి డిస్టర్బ్‌ చేస్తుంది. దీంతో, కోతి తీవ్ర ఆగ్రహంతో వెంటనే బోనులో జాలీ నుంచి తన చేతితో అమ్మాయి జుట్టును పట్టుకుంది. యువతి మోత్తుకున్న జుట్టుని మాత్రం వదల్లేదు. కోతి చేతిలో నుంచి తన జుట్టును విడిపించుకోవడానికి అమ్మాయి ఎంతో శ్రమించింది. చివరకు పక్కనే ఉన్న కొంతమంది వచ్చి కోతిని భయపెట్టడంతో జట్టుని వదిలేసింది. దీంతో, ఆమె అక్కడి నుంచి జారుకుంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. 


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement