ఉక్రెయిన్‌లో రష్యా దాడుల కారణంగా వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. అప్పటికే పుతిన్.. ప్రపంచ శక్తివంతమైన నేతల్లో ఒకరుగా ఉన్నారు. కాగా, పుతిన్ కుటుంబం గురించి మాత్రం ఎప్పుడూ బయటకు రాలేదు. ఇక, ఉక్రెయిన్‌లో యుద్దం అనంతరం.. పుతిన్ వ్యక్తిగత విషయాలపై వరల్డ్‌వైడ్ చర్చ నడిచింది. ఇందులో భాగంగా ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
తాజాగా పుతిన్ మరోసారి వార్తల్లో నిలిచారు. 69 ఏళ్ల పుతిన్ మరోసారి తండ్రి కాబోతున్నారు.. ఆయనకు కుమార్తె పుట్టబోతోంది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రేయసి, మాజీ జిమ్నాస్ట్ అలీనా కబయెవా ప్రెగ్నెంట్ అని వార్తలు బయటకు వచ్చాయి. ఆమె గర్భం దాల్చిందని.. త్వరలో ఆమె.. మరోబిడ్డకు జన్మనివ్వబోతోందని జనరల్ ఎస్వీఆర్ టెలిగ్రాం ఛానెల్ పేర్కొంది. తాజాగా జరిపిన లింగ నిర్దారణ పరీక్షల్లో.. ఆమెకు ఆడపిల్లగా తేలినట్లు వెల్లడించింది.
అయితే, దీనిపై పుతిన్ మాత్రం.. సంతోషంగా లేరని టెలిగ్రాం ఛానెల్ చేసిన పోస్టుపై పుతిన్ అసహనం వ్యక్తం చేసినట్లు ది సన్ ఓ కథనంలో పేర్కొంది. ఇక, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన రిథమిక్ జిమ్నాస్ట్ అలీనాకు పుతిన్ వల్ల ఇప్పటికే ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం. 2015లో కబయెవాకు కుమారుడు జన్మించగా.. 2019లో మాస్కోలో రెండో కుమారుడు జన్మించాడని స్విస్ బ్రాడ్ షీట్ వార్తా సంస్థ ఓ కథనంలో రాసుకొచ్చింది. కాగా, వారి సంబంధం గురించి పుతిన్ బాహ్య ప్రపంచానికి తెలియకుండా జాగ్రతపడ్డారని పలు వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. ఆమెను రహస్యంగా స్విట్జర్లాండ్ కొద్ది సంవత్సరాలు దాచిపెట్టినట్టు తెలుస్తోంది.
మరోవైపు.. ఉక్రెయిన్‌లో రష్యా దాడుల నేపథ్యంలో కబయెవాను సైబీరియన్ అండర్ గ్రౌండ్ సిటీ బంకర్లో రహస్యంగా ఉంచినట్లు రష్యా మీడియా పలు కథనాల్లో పేర్కొంది. చివరిసారిగా కబయెవా.. గత నెలలో బ్లాక్ సీ రిసార్ట్ వద్ద రిథమిక్ జిమ్నాస్టిక్స్ శిక్షణా శిబిరంలో కనిపించడంతో వార్తల్లో నిలిచారు. ఇక, తాజాగా ఆమె మరో బిడ్డకు జన్మనివ్వనుండటం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
Vladimir Putin is 'expecting a daughter' with ex-gymnast 'lover' Alina Kabaeva despite the Russian President claiming he 'has enough children as it is', new report claims
— Merissa Hansen 🇺🇸 (@MerissaHansen17) July 10, 2022
https://t.co/ntzOIcxJ63
ఇది కూడా చదవండి: రెస్టారెంట్‌పై దాడులకు తెగబడ్డ మహిళలు...వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment