pregent
-
మెటర్నిటీ ఫోటో షూట్ : అందమైన అనుభవం
-
ప్రెగ్నెన్సీ సమయంలో యాంటీ అలర్జీ మెడిసిన్ వాడితే ప్రమాదమా..?
-
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి.. సంతోషం ఆవిరి!
మాలూరు: ఎన్నో ఆశలతో ఆస్పత్రికి వెళ్లినవారికి విషాదమే మిగిలింది. ప్రసూతి కోసం వచ్చిన మహిళకు సాధారణ ప్రసవం చేస్తామని చెప్పి, చివరకు మా చేత కాదని జిల్లాస్పత్రికి పంపించగా అక్కడ తల్లీ శిశువు కన్నుమూశారు. ఈ విషాద సంఘటన కర్నాటకలోని కోలారు జిల్లా మాలూరు తాలూకాలోని దొడ్డశివార గ్రామంలో జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. సహజ ప్రసవం చేస్తామని జాప్యం వివరాలు... దొడ్డశివార ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రసవం కోసం గర్భిణి సుధ (34) శుక్రవారం చేరింది. నొప్పులు ప్రారంభం కాగా వైద్యులు సాధారణ ప్రసవం చేయిస్తామని చెప్పి వేచి చూశారు. సాయంత్రం చివరికి ఫిట్స్ వచ్చాయని చెప్పారు. కాన్పు చేయకపోగా పరిస్థితి బాగాలేదని జిల్లాస్పత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడకు వెళ్లగా ఆడశిశువుకు జన్మనిచ్చి సుధ ప్రాణాలు వదిలింది. కొంతసేపటికి బిడ్డ కూడా చనిపోయింది. సుధకు భర్త రవి, ఆరేళ్ల పాప ఉన్నారు. సోమవారం కుటుంబీలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆందోళన చేయడంతో విషయం వెలుగుచూసింది. సరైన వైద్యం చేయని వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తాలూకా వైద్యాధికారి డాక్టర్ ప్రసన్న, ఎస్ఐ అనిల్‌కుమార్‌లు చేరుకుని విచారణ చేశారు. తప్పు చేశారని తేలితే చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. -
భద్రాద్రిలో దారుణం: ప్రేమ పేరుతో ట్రాప్ చేసి.. గర్భవతి అయ్యాక..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు.. యువతిని ట్రాప్ చేశాడు. అతడి మాటలు నమ్మిన సదరు యువతి.. శారీరకంగా దగ్గర కావడంతో గర్భం దాల్చింది. అతడి వల్ల చివరకు ప్రాణాలు విడిచింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారం.. ములకలపల్లి మండలం వీకే రామవరం గ్రామానికి చెందిన యువతితో పుసుగుడెంకు చెందిన భూక్యా నందుకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో, ఆమెను పెళ్లి చేసుకుంటానని నందు ట్రాప్ చేశాడు. ప్రేమ పేరిట ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు గర్భం దాల్చింది. 5 నెలల గర్భవతి కావడంతో అబార్షన్ కావడానికి మాత్రలు ఇచ్చాడు. కానీ, ఆమెకు అబార్షన్ కాకపోవడంతో ఆసుపత్రికి వెళ్లాడు. ఈ క్రమంలో బాధితురాలు, నందు, మరో మహిళ కలిసి.. భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చి తన భార్యకు తీవ్ర రక్తస్రావం అవుతుందని చెప్పి అడ్మిట్ చేశాడు. కాగా, వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో ఆమెకు ఫిట్స్ రావడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో, నందుతోపాటు ఆసుపత్రికి వచ్చిన అమ్మాయి అక్కడి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో బాధితురాలు మృతిచెందింది. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. దీంతో వారు కన్నీటిపర్యంతమయ్యారు. తన బిడ్డను నందు బలితీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ఫేస్బుక్లో పరిచయం.. ఆ తర్వాత పెళ్లి.. ఇంతలోనే.. -
తండ్రి కాబోతున్న పుతిన్.. సీక్రెట్ లవర్ ఎవరంటే..?
ఉక్రెయిన్‌లో రష్యా దాడుల కారణంగా వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. అప్పటికే పుతిన్.. ప్రపంచ శక్తివంతమైన నేతల్లో ఒకరుగా ఉన్నారు. కాగా, పుతిన్ కుటుంబం గురించి మాత్రం ఎప్పుడూ బయటకు రాలేదు. ఇక, ఉక్రెయిన్‌లో యుద్దం అనంతరం.. పుతిన్ వ్యక్తిగత విషయాలపై వరల్డ్‌వైడ్ చర్చ నడిచింది. ఇందులో భాగంగా ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా పుతిన్ మరోసారి వార్తల్లో నిలిచారు. 69 ఏళ్ల పుతిన్ మరోసారి తండ్రి కాబోతున్నారు.. ఆయనకు కుమార్తె పుట్టబోతోంది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రేయసి, మాజీ జిమ్నాస్ట్ అలీనా కబయెవా ప్రెగ్నెంట్ అని వార్తలు బయటకు వచ్చాయి. ఆమె గర్భం దాల్చిందని.. త్వరలో ఆమె.. మరోబిడ్డకు జన్మనివ్వబోతోందని జనరల్ ఎస్వీఆర్ టెలిగ్రాం ఛానెల్ పేర్కొంది. తాజాగా జరిపిన లింగ నిర్దారణ పరీక్షల్లో.. ఆమెకు ఆడపిల్లగా తేలినట్లు వెల్లడించింది. అయితే, దీనిపై పుతిన్ మాత్రం.. సంతోషంగా లేరని టెలిగ్రాం ఛానెల్ చేసిన పోస్టుపై పుతిన్ అసహనం వ్యక్తం చేసినట్లు ది సన్ ఓ కథనంలో పేర్కొంది. ఇక, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన రిథమిక్ జిమ్నాస్ట్ అలీనాకు పుతిన్ వల్ల ఇప్పటికే ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం. 2015లో కబయెవాకు కుమారుడు జన్మించగా.. 2019లో మాస్కోలో రెండో కుమారుడు జన్మించాడని స్విస్ బ్రాడ్ షీట్ వార్తా సంస్థ ఓ కథనంలో రాసుకొచ్చింది. కాగా, వారి సంబంధం గురించి పుతిన్ బాహ్య ప్రపంచానికి తెలియకుండా జాగ్రతపడ్డారని పలు వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. ఆమెను రహస్యంగా స్విట్జర్లాండ్ కొద్ది సంవత్సరాలు దాచిపెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఉక్రెయిన్‌లో రష్యా దాడుల నేపథ్యంలో కబయెవాను సైబీరియన్ అండర్ గ్రౌండ్ సిటీ బంకర్లో రహస్యంగా ఉంచినట్లు రష్యా మీడియా పలు కథనాల్లో పేర్కొంది. చివరిసారిగా కబయెవా.. గత నెలలో బ్లాక్ సీ రిసార్ట్ వద్ద రిథమిక్ జిమ్నాస్టిక్స్ శిక్షణా శిబిరంలో కనిపించడంతో వార్తల్లో నిలిచారు. ఇక, తాజాగా ఆమె మరో బిడ్డకు జన్మనివ్వనుండటం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. Vladimir Putin is 'expecting a daughter' with ex-gymnast 'lover' Alina Kabaeva despite the Russian President claiming he 'has enough children as it is', new report claims https://t.co/ntzOIcxJ63 — Merissa Hansen 🇺🇸 (@MerissaHansen17) July 10, 2022 ఇది కూడా చదవండి: రెస్టారెంట్‌పై దాడులకు తెగబడ్డ మహిళలు...వీడియో వైరల్ -
నెల క్రితమే వివాహం.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య
వివాహామైన నెల రోజులకే నవ వధువు.. భర్తకు ఊహించని షాకిచ్చింది. ఆమె చేసిన పనికి వరుడి కుటుంబ సభ్యులు అందరి ముందు తలెత్తుకోలేకపోయారు. చేసేదేమీ లేక చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మహారాజ్గంజ్కుచెందిన ఓ వ్యక్తి.. నెల రోజుల క్రితం వివాహం జరిగింది. ఇంతలో నవ వధువుకు కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమెను పరిశీలించిన వైద్యులు.. నవ వధువు నాలుగు నెలల గర్బవతి అని చెప్పారు. ఈ క్రమంలో వరుడితో సహా కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం.. తనకు నెల రోజుల క్రితమే వివాహం జరిగిందని.. మరి నాలుగు నెలల గర్భవతి ఎలా అయిందని భర్త.. ఆమెను నిలదీశాడు. ఇక చేసేదేమీ లేక.. పోలీసులకు ఆశ్రయించాడు. వధువు కుటుంబం తనను మోసం చేశారని భార్య, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ప్రవీణ్‌తో ప్రేమ వివాహం.. ఇడ్లీ భాషాతో సహజీవనం.. చివరకు దారుణంగా. -
ప్రియుడితో షికార్లు.. గర్భం దాల్చడంతో యూట్యూబ్ చూసి.. ఆ తర్వాత
సాక్షి, ముంబై: వారిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమ మైకంలో వారిద్దరూ ఒకరోజు శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. టెన్షన్‌కు గురైన ఆమె ప్రియుడి సలహాతో గర్భాన్ని తొలగించుకునేందుకు యూట్యాబ్ చూసి తనకు తానే వైద్యం చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నాగ్‌పుర్‌లోని నార్ఖేడ్కు చెందిన యువతి.. ఆరు నెలల క్రితం తన బాయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా కలవడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పగా అతడు ఏవో మందు వేసుకుంటే అబార్షన్ అవుతుందని సూచించాడు. దీంతీ ఆమె ఆ మందులు వేసుకుంది. అయినప్పటికీ అబార్షన్ కాకపోవడంతో ఈ విషయం తన కుటుంబ సభ్యులకు తెలుస్తుందని టెన్షన్ పడింది. అబార్షన్ మందుల కోసం యూ ట్యూబ్‌లో సెర్చ్ చేసింది. ఓ మందును కొనుగోలు చేసి వాటిని వేసుకుంది. దీంతో అనారోగ్యానికి గురైంది. అనుమానం వచ్చి తల్లి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. అనంతరం వెంటనే ఆమెను వైద్యం కోసం నాగపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేసిన తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగైందని వైద్యులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి బాయ్‌ఫ్రెండ్ వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
గర్భిణీ మహిళను డోలీలో మోసుకెళ్లిన వాలంటీర్లు : విజయనగరం
-
రక్తహీనతపై ఐరన్ అస్త్రం..
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): ప్రపంచానికి అమ్మతనపు కమ్మదనాన్ని పరిచయం చేసే మహిళలు గర్భం దాల్చిన తర్వాత అనారోగ్యం బారిన పడుతున్నారు. రక్తహీనతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గర్భిణులందరికీ ఐరన్ మాత్రల పంపిణీ చేయాలని ఆదేశించింది. దీంతో ఈ కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరం చేశారు. జిల్లాలో 2019–20లో 95.67శాతం, 2020–21లో 104.01శాతం మందికి ఐరన్‌ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేశారు. అంతేకాకుండా 2020–21లో 98.03శాతం మంది గర్భిణులకు ధనుర్వాతం రాకుండా ముందుగానే టెటనస్ టాక్సిడ్ ఇంజెక్షన్లు కూడా ఇచ్చారు. సమస్య ఎందుకు వస్తుందంటే.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కుటుంబ సభ్యులందరూ భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో తినకపోయినా తిన్నామని చెబుతూ మంచినీళ్లు తాగి కాలం వెళ్లదీస్తుంటారు. ఫలితంగా వారిలో రక్తహీనత పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. కొందరు అవగాహన లేక పోషకాహారానికి దూరంగా ఉంటున్నారు. వీరు గర్భం దాల్చిన సందర్భంలో రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటోంది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే.. జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3,486 అంగన్వాడీ కేంద్రాలు, 63 మినీ అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు పోషకాహారం పంపిణీతో పాటు ఐరన్‌మాత్రలు ఇస్తున్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో వైద్యపరీక్షలు చేసి అవసరమైన మందులు ఇస్తున్నారు. హైరిస్క్ గర్భిణులతో పాటు మొదటిసారి గర్భం దాల్చిన వారిపై ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రసవం అయ్యేలోపు నాలుగుసార్లు వైద్యుల వద్ద పరీక్షలు చేయిస్తున్నారు. గర్భిణులకు వైద్యసేవలు అందించేందుకు జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 26 అర్బన్‌హెల్త్ సెంటర్లు, నంద్యాలలో జిల్లా ఆసుపత్రి, ఆదోనిలో మాతాశిశు ఆసుపత్రి, కర్నూలులో ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఉన్నాయి. రక్తహీనతతో ఇబ్బందులు ఇవీ.. రక్తహీనతతో గర్భంలో శిశువు ఎదుగుదల సరిగ్గా ఉండదు. అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ. నెలలు నిండకుండానే బిడ్డ జన్మించి చనిపోవచ్చు. తల్లికీ టీబీ వచ్చే అవకాశం ఉంది. తల్లికి మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినే అవకాశం ఎక్కువ. బీపీ ఎక్కువైతే మెదడులో నరాలు చిట్లవచ్చు. కొన్నిసార్లు తల్లి, బిడ్డ మానసిక స్థితి సరిగ్గా ఉండకపోవచ్చు. సాధారణ మహిళతో పాటు గర్భిణులకు హిమోగ్లోబిన్ ఎప్పుడూ 10 శాతం పైగానే ఉండేటట్లు చూసుకోవాలి. ఐరన్ ఫోలిక్ మాత్రల ప్రయోజనం ఇదీ.. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం 8 నుంచి 10 గ్రాములు ఉంటే కొంచెంగా, 6 నుంచి 8 గ్రాములుంటే మధ్యస్తంగా, 6 కంటే తక్కువగా ఉంటే తీవ్రమైన రక్తహీనతగా వైద్యులు చెబుతారు. 8 నుంచి 10 శాతం ఉన్న వారికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు, 6 నుంచి 8 గ్రాములు ఉన్న వారికి ఐరన్ సుక్రోజ్ ఇన్ఫ్యూజన్ ఇంజెక్షన్లు ఇస్తారు. 6 కంటే తక్కువ ఉన్న వారికి మాత్రం రక్తం ఎక్కిస్తారు. గర్భిణులు మూడో నెల నుంచే ఐరన్‌ఫోలిక్ యాసిడ్ మాత్రలు క్రమం తప్పకుండా వాడాలి. లేకపోతే వారు తీవ్ర రక్తహీనతకు చేరి తల్లీబిడ్డలిద్దరికీ ప్రాణాపాయం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
దారుణం: తల్లీబిడ్డలను వేరుచేసి అంత్యక్రియలు..గర్భిణి మృతిపై విచారణ..
కాప్రా: కరోనా ఉందనే అనుమానంతో ఆస్పత్రులు చేర్చుకోకపోవడంతో.. ఓ నిండు గర్భిణి అంబులెన్సులోనే మృతి చెందిన ఘటనపై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి విచారణకు ఆదేశించారు. విచారణ బాధ్యతను జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) మల్లికార్జునరావుకు అప్పగించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మల్లికార్జునరావు శనివారం వైద్య సిబ్బందితో కలిసి పావని ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆమెను ఏయే ఆస్పత్రులకు తీసుకెళ్లిందీ, ఏం జరిగిందన్న వివరాలను సేకరించారు. ఐదు ప్రైవేటు ఆస్పత్రులను గుర్తించి విచారణ చేపట్టారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నారు. కనికరం లేని ఆస్పత్రులు.. హైదరాబాద్ శివార్లలోని మల్లాపూర్ నాగలక్ష్మినగర్‌కు చెందిన నిండు గర్భిణి పావని.. శుక్రవారం వైద్యం కోసం ఆస్పత్రులు తిరుగుతూ అంబులెన్సులోనే ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని వరుసగా ఐదు ఆస్పత్రులకు వెళ్లామని, కరోనా అనుమానంతో ఎవరూ చేర్చుకోకుండా ఆమె మరణానికి కారణమయ్యారని పావని తల్లిదండ్రులు జోగారావు, నీలవేణి రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. ఘటనతో ప్రైవేటు ఆస్పత్రుల నిర్లక్ష్యంపై అంతటా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ విచారణకు ఆదేశించారు. తల్లీబిడ్డలను వేరుచేసి అంత్యక్రియలు పావని మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు శనివారం మల్లాపూర్ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ వారికి ఊహించని ఘటన ఎదురైంది. ఆచారం ప్రకారం తల్లీబిడ్డలను వేర్వేరుగా తీసుకొస్తేనే దహన సంస్కారాలు నిర్వహిస్తామని శ్మశానవాటిక నిర్వాహకులు తేల్చి చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు పావని మృతదేహాన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. తల్లితోపాటు కడుపులోనే చనిపోయిన బిడ్డను వేరు చేయాలంటూ.. మళ్లీ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఇందుకు ఏ ఆస్పత్రిలోనూ వైద్యులు ముందుకు రాలేదు. అప్పటికే పుట్టెడు దుఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఇది మరింత వేదనకు గురి చేసింది. చివరికి ప్రభుత్వ అధికారుల జోక్యంతో ఓ ఆస్పత్రిలో తల్లి, బిడ్డల మృతదేహాలను వేరు చేశారు. తర్వాత మల్లాపూర్ శ్మశానవాటికలో తల్లి, బిడ్డలకు వేర్వేరుగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పావని కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. కాగా ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు డబ్బుల యావే తప్ప.. సరైన వైద్యం అందించాలన్న ధ్యాసే లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి ఘటన మరే ఆడబిడ్డకు జరగకూడదని, సదరు ఆస్పత్రులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
గర్భిణికి పురుడు పోసిన ఎమ్మెల్యే
ఐజ్వాల్: ప్రసవ వేదనతో బాధపడుతున ఓ మహిళకు మిజోరాంకు చెందిన శాసనసభ్యుడు పురుడుపోశారు. సమయానికి ఎమ్మెల్యే స్పందించడంతో బాధిత మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎమ్మెల్యే చొరవతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. సోమవారం తన సొంత నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో శాసనసభ్యుడు, డాక్టర్ జెడ్ఆర్ థియామ్సంగ పర్యటించారు. ఈ సమయంలోనే నాగూర్ గ్రామంలో నెలలు నిండిన ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లు ఎమ్మెల్యేకు సమాచారం అందింది. వృత్తిరీత్యా గైనకాలజీ డాక్టర్ అయిన థియామ్సంగ చాంఫై ఆస్పత్రికి వెళ్లి ఆమెకు పురుడు పోశారు. చాంఫై ఆస్పత్రి డాక్టర్ అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉండటంతో గర్భిణికి ఎమ్మెల్యే సీజేరియన్ చేశారు. (మెసేజ్ చూశారని అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య!) అయితే గతంలో కూడా థియామ్సంగ మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న సిబ్బందికి వైద్యం సాయం అందించేందుకు 7 కిలోమీటర్లు నడిచి వార్తలో నిలిచారు. కాగా.. 2018 ఎన్నికలలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) టికెట్‌పై పోటీ చేసి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టిటి జోతన్‌సంగను ఓడించారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ బోర్డు వైస్ చైర్మన్‌గా ఉన్నారు. -
ప్రభుత్వాస్పతిలో గర్భిణీ మృతి
-
మైనర్‌ను గర్భవతిని చేసిన వ్యక్తిపై కేసు
పోడూరు : బాలికను గర్భవతిని చేసిన ఒక వివాహితుడిపై బుధవారం పోడూరులో కేసు నమోదు చేసినట్టు ఎస్సై కొప్పిశెట్టి రామకృష్ణ తెలిపారు. ఆయన సమాచారం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా తూర్పుపాలెం శివారు ఆనందరావుపేటకు చెందిన వివాహితుడు మూడే గోపాలం. అతడి భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరి ఇంటి సమీపంలో గోపాలానికి చెల్లెలు వరుసైన ఒక బాలిక (17) తరచూ పిల్లవాడిని ఆడించేందుకు అతడి ఇంటికి వస్తుండేది. గోపాలం భార్య ఉపాధ్యాయురాలు కావడంతో పగటి సమయంలో స్కూల్‌కు వెళ్లిపోయేది. ఈ నేపథ్యంలో ఆ బాలికను గోపాలం మాయమాటలుతో శారీరకంగా లొంగదీసుకున్నాడు. ప్రస్తుతం బాలిక తొమ్మిదో నెల గర్భిణి. ఈ విషయం గోపాలం భార్యకు తెలియడంతో ఆ బాలికకు అబార్షన్ చేయించేందుకు వారు ప్రయత్నించారు. చివరకు ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై రామకృష్ణ నిందితుడైన గోపాలంపై అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గర్భిణులకు మరో వరం
జగిత్యాల: గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు ప్రసవాలకు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణ ప్రాంతాలకు రావాలంటే ఖర్చుతో కూ డుకున్న పని. దీంతో ప్రభుత్వం గర్భిణుల కోసం 108, 104 మాదిరిగా.. 102 వాహనాలను ఏర్పాటుచేసింది. అమ్మ ఒడి పథకంలో భాగం గా వీటిని ప్రారంభిస్తున్నారు. దీంతో జిల్లాలోని గర్భిణులు, బాలింతలకు ఊరట కలగనుంది. గర్భిణులకు బాసటగా నిలవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేసీఆర్ కిట్‌తోపాటు అమ్మ ఒడి పథకం కింద నగదు ప్రోత్సాహకాలు అందజేస్తోంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధిక శాతం ప్రసవాలు జరుగుతున్నాయి. ఉచితంగానే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అమ్మ ఒడి పథకం కింద గర్భిణుల కోసం సర్కార్ మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. వారి ఇళ్ల నుంచి ఆస్పత్రులకు తీసుకొస్తూ ప్రసవం అనంతరం తిరిగి బాలింతలను ఇళ్లకు చేర్చేందుకు ప్రత్యేకంగా 102 వాహనాలను సమకూర్చనుంది. జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకు సుమారు వెయ్యికి పైగానే నమోదవుతున్నాయి. ఆస్పత్రిలో కాల్‌సెంటర్ ఏర్పాటు.. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో కాల్‌సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో గర్భిణులు ఎంతమంది ఉన్నారో నమోదు చేసుకుని వారి సమయాన్ని బట్టి సిబ్బంది ఫోన్ చేసి వారిని 102 వాహనం ద్వారా తీసుకురానున్నారు. ప్రతి గ్రామానికి వెళ్లి తీసుకొస్తారు. ఆరోగ్య పరిస్థితుల గురించి ఫోన్ చేసి తెలుసుకోనున్నారు. త్వరలో ఆస్పత్రిలో కాల్‌సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. త్వరలో ప్రారంభం.. జిల్లాకు 102 వాహనాలను ఆరు కేటాయించారు. నియోజకవర్గానికి 2 చొప్పున మూడు నియోజకవర్గాలకు కేటాయించనున్నారు. 102 వాహనాలను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతో మేలు.. 102 వాహనాలతో గ్రామీణ ప్రాంతాల నుంచి గర్భిణులను తీసుకువచ్చి ప్రసవం అనంతరం మళ్లీ గ్రామాల్లో దింపివేస్తారు. 108, 104 మాదిరిగానే 102 వాహనాలు పనిచేస్తాయి. ఎలాంటి ఖర్చులు ఉండవు. ఉచితంగానే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువస్తారు. – సుగంధిని, డీఎంహెచ్‌వో -
న్యాయం కోసం యువతి మౌన దీక్ష
అడ్డపనస (సారవకోట): మండలంలోని అంగూరు పంచాయతీ అడ్డపనస గ్రామంలో కొల్లి అనసూయ తనను వివాహం చేసుకోవాలని చీడి సూర్యనారాయణ అలియాస్ సురేష్ ఇంటి దగ్గర గురువారం మౌన దీక్షకు దిగింది. ఆమె చేస్తున్న మౌన దీక్షకు ఆదీవాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు వాబ యోగేశ్వరరావు, ఐకార్డ్ కార్యదర్శి కొల్లి సింహాచలం మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చీడి సూర్యనారాయణతో ఏడాది కిందట నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తుందని తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. దీంతో తాను గర్భం దాల్చానని ప్రస్తుతం ఏడు నెలల గర్భవతినని తెలిపింది. ఈ విషయమై తనను సంప్రదిస్తే ఇప్పుడు తనకేమీ సంబంధం లేదని చెబుతున్నాడని పేర్కొంది. దీనిపై తన తల్లిదండ్రులైన కొల్లి లింగయ్య, ఆదిలక్ష్మిలకు తెలపగా గ్రామంలోని పెద్ద మనుషులతో మాట్లాడారని పేర్కొంది. వారు సైతం తనకు న్యాయం చేయకపోవడంతో న్యాయం కోసం మౌనదీక్ష చేస్తున్నట్లు ఆమె తెలిపింది. అదీకాక పది రోజుల నుంచి సూర్యనారాయణ గ్రామంలో అందుబాటులో సహితం లేడని తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. -
అమ్మను దోషిని చేస్తారా!?
అభిప్రాయం దేశంలోని 50 వేల స్కాన్ సెంటర్ల రికార్డు సక్రమంగా నిర్వహించేలా పర్యవేక్షించటం చేతకావటం లేదు. కానీ ప్రతి ఏటా 2 కోట్ల 90 లక్షల మంది గర్భవతుల గర్భాలలో ఉన్నది ఆడో, మగో స్కాన్ చేసి, నమోదు చేయించి... ట్రాక్ చేసి ఆడ శిశువుల్ని కాపాడతారట. ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతాననడం అంటే ఇదే కదా! ‘‘డాక్టర్లని ఎంత కాలం శిక్షిస్తాం? ఇకనయినా లింగ నిర్ధారణను చట్టబద్ధం చేసి ఆడ శిశువుల్ని కాపాడాలి’’ అంటూ మన కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మనేకాగాంధీ ఇటీవల మేధోమథనం చేశారు. ఈ దేశంలో ఎవరయినా స్కాన్ సెంటర్‌కు వెళ్ళి గర్భంలోని బిడ్డ ఆడో, మగో చెప్పమంటే కాదనే ధైర్యం ఎవరికుంటుంది’’ అని పాపం డాక్టర్ల నిస్సహాయత పట్ల చలించిపోయారు. లింగ నిర్ధారణ చట్ట రీత్యా తీవ్ర నేరం అని ప్రతి ఆసుపత్రిలో పెట్టిన బోర్డు కూడా అడిగిన వారికి చూపించలేనంత భయంతో డాక్టర్లు ఈ దేశంలో బతుకుతున్నారు... గర్భవతుల నుండి డాక్టర్లను కాపాడే చట్టం తెస్తే ఇంకా బాగుంటుం దేమోనని సదరు మంత్రి మలివిడతలో ప్రస్తావించ వచ్చు. పురుష వీర్య కణాలలోని ఎక్స్, వై క్రోమోజో ములను వడపోసి కేవలం మగ పిండాన్ని ఏర్పర్చే వై క్రోమోజోము వీర్య కణాలనే స్త్రీ గర్భంలో ప్రవేశ పెట్టడం అంటే అసలు ఆడపిండం ఏర్పడే అవకాశాన్ని లేకుండా చేసే పద్ధతి... డబ్బు, అవకాశంలేని వారు రూ.10 వేలతో లింగ నిర్ధారణ, గర్భస్రావాలకు వెళితే.. ఉన్నత, నయా మధ్యతరగతి లక్షన్నర ఖర్చుతో క్రోమో జోముల వడపోతలకు పాల్పడుతున్నారు. అంటే లింగాన్ని బట్టి గర్భస్రావాలు చేయటం నేరం అంటే మన వైద్యులు సాంకేతిక పరిజ్ఞానంలోని మరింత ఆధునికతను వాడి ఆడ శిశువులను పుట్ట కుండా చేస్తున్నారన్న మాట... అంటే వైద్యవృత్తిలోని కనీస నైతిక విలువల్ని, చట్టాన్ని రెండింటినీ ఉల్లంఘి స్తున్నారన్న మాట. 2003 చట్ట సవరణ కాలం నుండి 2014 వరకూ దేశంలో కోటి 21 లక్షల మంది ఆడ శిశువులని ముందే తెలియడంతో గర్భస్రావాలు జరిగితే 206 మంది డాక్టర్లకు మాత్రం కనీస శిక్షలు విధించారు. వారి సర్టిఫికెట్లు మాత్రం ఉపసంహరించిన దాఖలాలు లేవు. 15 రాష్ట్రాల్లో అస్సలు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఊపిరి తీయకుండా అమ్మ గర్భంలోనే హతమైనకోటిన్నర మంది పసిపాపల గురించి ఒక కన్నీటి బొట్టు రాలలేదు కాని మనేకాగాంధీ దయార్ద్ర హృదయం నేరస్తులైన ఈ 206 మంది వైద్యుల కోసం మాత్రం ఆక్రోశిస్తోంది. ఇక లింగ నిర్ధారణ చట్టబద్ధం అయితే గర్భాలలో ఉన్నది అంతా మగ శిశువులే అని నమోదు చేస్తారు. ఆడ శిశువుల భ్రూణ హత్య నేరంగాని మగ శిశువుల అబార్షన్ కాదు కదా. రకరకాల వైద్య కారణాలతో మగ శిశువులుగా నమోదైన ఆడ పిండాల్ని యధేచ్ఛగా తొలగిస్తారు. ఆడవాళ్ళకు పిండాలు పెట్టి గర్భస్రావ పరిశ్రమ విరాజిల్లడం ఖాయం. అంతగా వివక్షత అనుకుంటే ఆడ డాక్టర్లు మాత్రమే లింగ నిర్ధారణ చేయాలని నియమం పెడితే సంపూర్ణ సమానత్వం సిద్ధిస్తుంది. ఆడ పిల్లను కనాలా వద్దా? అసలు ఎంత మందిని కనాలి? ఎప్పుడు కనాలి? అసలు కనాలా వద్దా? అనే విషయంలో నోరు మెదిపే అధికారం ఆడవాళ్ళకు ఈ దేశంలో ఉందా? ఎందరికి ఉంది? స్త్రీల శరీరాలపై స్త్రీలకు హక్కు అనడం పాశ్చాత్య సంస్కృతి. అది ఇక్కడ చెల్లదని కుల మతాల గుత్తేదార్లు రంకెలు వేసి కాలు దువ్వుతున్న కాలం ఇది. ప్రతి దేశభక్తి గల స్త్రీ 10 మంది పిల్లల్ని (ఇతర మతాల వారికి మినహారుుంపు) కనాలని, లేదంటే కనీస పక్షం నలుగురు కొడుకుల్ని మాత్రం కనాలని బహి రంగంగా శాసించే పార్లమెంటు బాబాలను ఎన్నుకున్నందుకు స్త్రీలు ఈపాటి మూల్యం చెల్లించాలికదా! త్యాగం చేయటం, అణగి వుండటం ఉగ్గు పాలతో తాగి ఆచరించేవారే మన దేశపు నిజమైన స్త్రీలు కాబట్టి గర్భస్థ శిశువు అడయినా మగయినా నిర్ధారణ జరిగాక దాన్ని కాపాడటం నూటికి రెండొందల పాళ్ళు అమ్మల కర్తవ్యమే... అందుకే కదా మాతృ దేవోభవ అన్నది... ఆ గర్భం చట్టబద్ధంగానో, నాటు పద్ధతితోనో, కొట్టడం, తన్నడం వంటి ఖర్చులేని టెక్నాలజీ వల్లనో లేదా ప్రమాదవశాత్తుగానో లేదా అసలు సహజసిద్ధ కారణాల వల్లనో గర్భస్రావం అయితే ఆమె నేరస్తురాల వుతుందన్న మాట. దీనికి వేరెవరూ బాధ్యులు కాదు. భావజాలం, సమాజం, కుటుంబ, డాక్టర్లు, ప్రభుత్వం ఇవన్నీ కూడా ఆడ శిశువుల మరణాలకు, భ్రూణ హత్యలకు బాధ్యులనడం దేశ ద్రోహం... అసలు స్త్రీల శరీరాలపై స్త్రీలకు హక్కులుండాలనడం మన కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే అంతర్జాతీయ కుట్ర. 10 మందిని కనడం, కుటుంబ పోషణకు మాత్రమే సంపాదించడం (ఆర్థిక స్వావ లంబన వల్ల స్త్రీలు విచ్చలవిడి అవుతారట) వంటి పాతివ్రత్య సూత్రాల పునరుద్ధరణతోనే అభివృద్ధి సాధ్యం. ఇప్పటికే ‘‘ఇండియాస్ డాటర్’’ నిషేధం, బాలనేరస్తుల వయస్సు తగ్గింపులతో స్త్రీలపై అత్యాచా రాలు అరికట్టడం జరిగింది. అద్దె గర్భాలు చట్టబద్ధం అయితే ఇల్లు కదలకుండా స్త్రీలు స్వయం ఉపాధి పొంది లక్షలు ఆర్జించవచ్చు. మానవ సమతుల్యం కంటే జంతు సమతుల్య తను ప్రేమించేవారు మంత్రిగా ఉండి ఇటువంటి ఆలో చనలు చేయటం మన జన్మజన్మల కర్మఫలం. కనుక మనం ఒక అగ్రరాజ్యంగా ఎదగడాన్ని భగ్నం చేయ డానికే స్త్రీల హక్కులు, మానవ హక్కులు, దళిత హక్కులని గగ్గోలు పెడుతూ అభివృద్ధి నుండి మనల్ని ప్రక్కదారి పట్టిస్తున్నారని దేశ భక్తులంతా గమనిం చాలని మనవి. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, దేవి pa_devi@rediffmail.com