ప్రియుడితో షికార్లు.. గర్భం దాల్చడంతో యూట‍్యూబ్‌ చూసి.. ఆ తర్వాత | Pregnant Girl Watched Youtube And Then Did Abortion | Sakshi
Sakshi News home page

ప్రియుడితో షికార్లు.. గర్భం దాల్చడంతో వైద్యం కోసం యూట‍్యూబ్‌ చూసి.. ఆ తర్వాత

Published Mon, Apr 4 2022 12:49 PM | Last Updated on Mon, Apr 4 2022 3:32 PM

Pregnant Girl Watched Youtube And Then Did Abortion - Sakshi

సాక్షి, ముంబై: వారిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమ మైకంలో వారిద్దరూ ఒకరోజు శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. టెన్షన్‌కు గురైన ఆమె ప్రియుడి సలహాతో గర్భాన్ని తొలగించుకునేందుకు యూట్యాబ్‌ చూసి తనకు తానే వైద్యం చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. నాగ్​పుర్​లోని నార్ఖేడ్​కు చెందిన యువతి.. ఆరు నెలల క్రితం తన బాయ్​ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా కలవడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పగా అతడు ఏవో మందు వేసుకుంటే  అబార్షన్ అవుతుందని సూచించాడు. దీంతీ ఆమె ఆ మందులు వేసుకుంది. అయినప్పటికీ అబార్షన్‌ కాకపోవడంతో ఈ విషయం తన కుటుంబ సభ్యులకు తెలుస్తుందని టెన్షన్‌ పడింది. 

అబార్షన్‌ మందుల కోసం యూ ట్యూబ్‌లో సెర్చ్‌ చేసింది.  ఓ మందును కొనుగోలు చేసి వాటిని వేసుకుంది. దీంతో అనారోగ్యానికి గురైంది.  అనుమానం వచ్చి తల్లి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. అనంతరం వెంటనే ఆమెను వైద్యం కోసం నాగపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.  చికిత్స చేసిన తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగైందని వైద్యులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి బాయ్​ఫ్రెండ్​ వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement