మైనర్‌ను గర్భవతిని చేసిన వ్యక్తిపై కేసు | The case against the person who made the minor pregnant | Sakshi
Sakshi News home page

మైనర్‌ను గర్భవతిని చేసిన వ్యక్తిపై కేసు

Published Thu, Apr 12 2018 9:19 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

The case against the person who made the minor pregnant - Sakshi

పోడూరు : బాలికను గర్భవతిని చేసిన ఒక వివాహితుడిపై బుధవారం పోడూరులో కేసు నమోదు చేసినట్టు ఎస్సై కొప్పిశెట్టి రామకృష్ణ తెలిపారు. ఆయన సమాచారం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా తూర్పుపాలెం శివారు ఆనందరావుపేటకు చెందిన వివాహితుడు మూడే గోపాలం. అతడి భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరి ఇంటి సమీపంలో గోపాలానికి చెల్లెలు వరుసైన ఒక బాలిక (17) తరచూ పిల్లవాడిని ఆడించేందుకు అతడి ఇంటికి వస్తుండేది.

గోపాలం భార్య ఉపాధ్యాయురాలు కావడంతో పగటి సమయంలో స్కూల్‌కు వెళ్లిపోయేది. ఈ నేపథ్యంలో ఆ బాలికను గోపాలం మాయమాటలుతో శారీరకంగా లొంగదీసుకున్నాడు. ప్రస్తుతం బాలిక తొమ్మిదో నెల గర్భిణి. ఈ విషయం గోపాలం భార్యకు తెలియడంతో ఆ బాలికకు అబార్షన్‌ చేయించేందుకు వారు ప్రయత్నించారు. చివరకు ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై రామకృష్ణ నిందితుడైన గోపాలంపై అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement