minar girl
-
మీకోసమే వచ్చారు.. కృతజ్ఞతలు తెలపండి!
ఇండోర్: అసలే కుమార్తెపై అఘాయిత్యంతో కుమిలిపోతున్న తల్లిదండ్రులతో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అమానవీయంగా ప్రవర్తించారు. ‘మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చిన ఎంపీకి కృతజ్ఞతలు తెలపండి’ అంటూ తీవ్రమైన బాధలో ఉన్న కుటుంబసభ్యుల్ని ఆదేశించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మంద్‌సౌర్‌లో జూన్ 26న ఓ మైనర్ బాలిక(8)పై ఇద్దరు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ప్రస్తుతం ఇండోర్ ప్రభుత్వాసుపత్రిలో కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే సుదర్శన్ గుప్తా, మంద్సౌర్ ఎంపీ సుధీర్‌తో కలసి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అత్యుత్సాహం చూపిన ఎమ్మెల్యే సుదర్శన్.. ‘ఎంపీ సుధీర్‌కు కృతజ్ఞతలు తెలపండి. ఆయన మిమ్మల్ని కలుసుకునేందుకే ప్రత్యేకంగా ఆస్పత్రికి వచ్చారు’ అని చెప్పారు. దీంతో తెల్లబోయిన బాధితురాలి తల్లిదండ్రులు ఇద్దరికీ చేతులెత్తి దండం పెట్టారు. ఇంతలో మీడియాను గమనించిన సుదర్శన్.. ‘ఇంకేమైనా అవసరముంటే చెప్పండి’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన బాధితురాలి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. మరోవైపు మైనర్ బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోంది. -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ ఆర్మీ ఉద్యోగి గర్భవతిని చేసిన సంఘటన స్ధానికంగా కలకలం రేపింది. ఈ ఘటన విశాఖపట్నంలోని చోడవరం మండలం గౌరవరం గ్రామంలో చోటుచేసుకుంది. జొన్నపల్లి జగన్నాథం అనే ఆర్మీ ఉద్యోగి ఓ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక బంధువులు చోడవరం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆర్మీ ఉద్యోగిపై నిర్భయ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. -
కథువా కన్నా దారుణం.. హింసించి చంపారు!
సూరత్: కథువా, ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ ఘటనలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న తరుణంలో గుజరాత్లో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూరత్‌లో ఓ మైనర్ బాలిక(11)ను వారం రోజులు లైంగిక దాడి చేసి, చిత్రహింసలు పెట్టిన మృగాళ్లు, చివరికి గొంతునులిమి హత్యచేశారు. ఏప్రిల్ 6న సూరత్‌లోని భెస్తన్‌లోని క్రికెట్ మైదానంలో బాలిక మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు పోస్ట్‌మార్టంకు పంపారు. బాలిక మృతదేహంపై 86 గాయాలు ఉన్నాయని పోస్ట్‌మార్టం అనంతరం సూరత్ సివిల్ ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగం చీఫ్ గణేశ్ గొవేకర్ తెలిపారు. చెక్కతో చేసిన ఆయుధంతో ఆమె మర్మాంగాలను కూడా మృగాళ్లు గాయపర్చారని వెల్లడించారు. వారంరోజుల పాటు ఆమెను చిత్రవధకు గురిచేసిన అనంతరం చివరగా గొంతునులిమి హత్యచేశారన్నారు. బాలికపై అత్యాచారం జరిగిందా? లేదా? తెలుసుకునేందుకు ఆమె నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామన్నారు. కఠువా, ఉన్నావ్ ఘటనల్లో దోషులెవరినీ విడిచిపెట్టబోమని ప్రధాని మోదీ హామీఇచ్చిన మరుసటి రోజే ఆయన సొంత రాష్ట్రంలోనే ఈ దారుణం వెలుగులోకిరావడం గమనార్హం. కాగా, మృతురాలి గురించి తమకు ఎలాంటి వివరాలు తెలియరాలేదని, ఆమె వివరాలు చెప్పినవారికి రూ.20 వేలు బహుమతిగా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. -
మైనర్‌ను గర్భవతిని చేసిన వ్యక్తిపై కేసు
పోడూరు : బాలికను గర్భవతిని చేసిన ఒక వివాహితుడిపై బుధవారం పోడూరులో కేసు నమోదు చేసినట్టు ఎస్సై కొప్పిశెట్టి రామకృష్ణ తెలిపారు. ఆయన సమాచారం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా తూర్పుపాలెం శివారు ఆనందరావుపేటకు చెందిన వివాహితుడు మూడే గోపాలం. అతడి భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరి ఇంటి సమీపంలో గోపాలానికి చెల్లెలు వరుసైన ఒక బాలిక (17) తరచూ పిల్లవాడిని ఆడించేందుకు అతడి ఇంటికి వస్తుండేది. గోపాలం భార్య ఉపాధ్యాయురాలు కావడంతో పగటి సమయంలో స్కూల్‌కు వెళ్లిపోయేది. ఈ నేపథ్యంలో ఆ బాలికను గోపాలం మాయమాటలుతో శారీరకంగా లొంగదీసుకున్నాడు. ప్రస్తుతం బాలిక తొమ్మిదో నెల గర్భిణి. ఈ విషయం గోపాలం భార్యకు తెలియడంతో ఆ బాలికకు అబార్షన్ చేయించేందుకు వారు ప్రయత్నించారు. చివరకు ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై రామకృష్ణ నిందితుడైన గోపాలంపై అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై లైంగిక దాడిచేసిన యువకుడి అరెస్ట్
రాజేంద్రనగర్: బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం... బుద్వేల్ రైల్వేస్టేషన్ శ్రీరామ్‌నగర్‌కాలనీకి చెందిన గోవింద్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. గోవింద్ కుమార్తె (16) స్థానికంగా కూలీ పనిచేస్తుంది. అదే ప్రాంతంలో నివసించే షేక్ అబ్దుల్లా(22) ప్రేమిస్తున్నానంటూ బాలిక వెంటపడుతున్నాడు. ఈనెల 1న రాత్రి 7 గంటల ప్రాంతంలో అబ్దుల్లా.. గోవింద్ కూతురుకు మాయమాటలు చెప్పి స్థానికంగా ఉన్న మసీద్ వద్దకు తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. అనంతరం అంబేడ్కర్‌నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కూతురు కనిపించకపోవడంతో గోవింద్ స్థానికుల సహాయంతో వాకబు చేస్తుండగా అంబేడ్కర్‌నగర్‌లో ఉందని తెలియడంతో అక్కడకు వెళ్లాడు. కాగా బాలిక తనపై అబ్దుల్లా లైంగిక దాడికి పాల్పడినట్లు వివరించింది. దీంతో గోవింద్ మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఏడేళ్ల బాలికపై అత్యాచారం
సాక్షి, కర్ణాటక : క్రిష్ణగిరి సమీపంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మహారాజగడ సమీపంలోని కోడినాయకనపల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను అదే ప్రాంతానికి చెందిన చెన్నప్పన్(54) చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో సమీపంలోని పశువుల కాపరులు సంఘటన స్థలానికి చేరుకొని చెన్నప్పన్కు దేహశుద్ధి చేసి క్రిష్ణగిరి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చెన్నప్పన్ను అరెస్టు చేసి బాలికను చికిత్స కోసం ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
వికారాబాద్‌లో గ్యాంగ్‌రేప్
సాక్షి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం ఇబ్రహీంపూర్ తాండాలో దారుణం చోటుచేసుకుంది. గిరిజన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పొలం పనికి వెళ్లి వస్తుండగా యువకులు బాలికను అడ్డగించి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
బాలికపై సామూహిక లైంగికదాడి
గుంటూరు ఈస్ట్: నిరుపేద కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులు 10 రోజుల క్రితం ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి హైదరాబాద్‌లో ఉండటం, నిందితులను కాపాడేందుకు ఓ పెద్ద మనిషి మభ్యపెట్టిన కారణంగా బాలిక తల్లిదండ్రులు ఆలస్యంగా పోలీసులను ఆశ్రయించినట్టు తెలిసింది. గుంటూరు లాలాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కాలనీకి చెందిన 8వ తరగతి చదివే 13 సంవత్సరాల బాలిక జనవరి 28వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి సమీపంలోని చిల్లర కొట్టుకు వెళ్లింది. బాలికకు పరిచయస్తుడైన 23 ఏళ్ల వ్యక్తి ఆటోలో వచ్చి ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళదామంటూ బాలికను ఆటో ఎక్కమన్నాడు. బాలిక నిరాకరించడంతో చేయి పట్టుకుని బలవంతంగా ఆటో ఎక్కించాడు. అతను తెలిసిన వ్యక్తి అవడంతో కొంతసేపు బాలిక ప్రతిఘటించలేదు. అయితే ఆటో కొంత దూరం వెళ్లిన తర్వాత మరో ముగ్గురు ఎక్కారు. ఆటోను బాలికకు తెలియని ప్రాంతాల వైపునకు తీసుకెళ్తుండటంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆటోను నగరంపాలెంలో పాడుబడ్డ స్థితిలో ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లోకి తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి సంపత్‌నగర్ కొబ్బరి తోటల్లోకి తీసుకెళ్లి రెండోసారి లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులు బాలికను తీవ్రంగా కొట్టి ఆమె పట్ల నీచంగా ప్రవర్తించారు. రాత్రి 12 గంటల సమయంలో బాలికను ఆర్టీసీ బస్టాండు సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. నిందితులు బాలిక బంధువులకు ఫోన్ చేసి బస్టాండ్ సమీపంలో ఆమె ఒంటరిగా కనిపించినట్లు చెప్పారు. బాలిక తండ్రి ఊళ్లో లేని కారణంగా బంధువులు ఆమెను ఇంటికి చేర్చారు. 4 రోజుల అనంతరం తండ్రి ఇంటికి చేరుకుని బాలికను విచారించగా నిందితుల దుర్మార్గం బయటపడింది. అయితే స్థానిక పెద్ద ఒకరు బాలిక తల్లిదండ్రులను సంప్రదించి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే పరువు పోతుందని పోలీసులే ఇక్కడకు వచ్చి చర్యలు తీసుకునేలా తాను ప్రయత్నిస్తానని నమ్మించాడు. అయితే ఆ పెద్ద మనిషి నిందితుల తరఫునే వ్యవహరిస్తున్నాడని గుర్తించి బాలిక తండ్రి శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు నిర్భయ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు సమాచారం. నిందితులు గతంలోనూ ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి చేసి పెద్దల పంచాయితీతో బయటపడ్డట్లు స్థానికులు చెబుతున్నారు. -
బాలికపై అత్యాచారం : ఎస్ఐతో సహా నలుగురి అరెస్ట్
సాక్షి, కేరళ: 16 ఏళ్ల బాలికపై ఓ ఎస్సైతో సహా నలుగురు అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఆలప్పుజా జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్ఐతో సహా నలుగురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వివరాలు.. ఆలప్పుజా జిల్లా మారారికులం ప్రాంతానికి చెందిన ఆదీరా(37) అదే ప్రాంతంలోని దళిత కుటుంబానికి చెందిన 16 సంవత్సరాల వయస్సు గల చిన్నారికి పని ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళింది. కానీ ఆమె బాలికకు పని ఇప్పించకుండా ఆ బాలికను వ్యభిచారం గృహంలోకి తోసింది. దీంతో బాలిక అనారోగ్య పాలైంది. అనంతరం ఆదీరా చిన్నారిని ఇంటి దగ్గర వదిలి పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అది గమనించిన స్థానికులు బాలిక ఏడుస్తూ కనిపించడంతో ఆదీరాను పట్టుకుని విచారించారు. ఆ చిన్నారి జరింగిందతా చెప్పడంతో ఆదీరాను మరారికుళమ్ పోలీసులకు అప్పగించారు. బాలికను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. విచారణలో ఆదీరా తెలిపిన వివరాల ప్రకారం బాలికను మారారికులమ్ పోలీసు స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న లైజీ (39), మత్తు పదార్థాల నిషేధ విభాగ అధికారి థామస్ (46), ప్రిన్స్ (32), జీను (33) ఈ నలుగురు అత్యాచారం చేశారని తెలిసింది. అనంతరం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు. ఇంకా ఆదీరాని కూడా పోలీసులు అరెస్టు చేశారు. -
బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం : ఆటో ఎక్కిన బాలికపై కామాంధుడైన డ్రైవర్ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దాంతో బాలిక మౌనం వహించింది. గర్భం దాల్చడంతో గమనించిన తల్లిదండ్రులు నిలదీయడంతో తొమ్మిది నెలల క్రితం జరిగిన లైంగిక దాడి గురించి వివరించింది. అబార్షన్ చేయించేందుకు తల్లిదండ్రులు యత్నించగా అప్పటికే సమయం మించిపోయింది. అబార్షన్ చేసేందుకు వీలుకాదని వైద్యులు తేల్చి చెప్పారు. బాధిత బాలిక శనివారం ఆడపిల్లకు జన్మనివ్వడంతో విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు కట్టుబడిపాళేనికి చెందిన ఓ బాలిక తన తల్లిదండ్రులతో బుచ్చిరెడ్డిపాళెంలో బేల్దారి పనులకు వెళ్లేది. ఈ క్రమంలో తొమ్మిది నెలల క్రితం బుచ్చిరెడ్డిపాళెం నుంచి ఆటో చెన్నూరు కట్టుబడిపాళేనికి బయల్దేరింది. రెడ్డిపాళెం దాటిన తరువాత ఆటో డ్రైవర్ ముళ్లపొదల్లోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక భయపడి మౌనం వహించింది. అయితే కాలక్రమేణా బాలికలో వస్తున్న మార్పులను గమనించిన తల్లిదండ్రులు నిలదీసేసరికి జరిగిన విషయాన్ని చెప్పింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేసేందుకు ప్రయత్నించగా బాలిక ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు సూచించారు. ఈ నేపధ్యంలో బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వైద్యులు, బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుని కోసం గాలిస్తున్నారు. -
పెళ్లి కొచ్చి పెళ్లికూతురైంది!
అన్నానగర్(తమిళనాడు) : తురైయూర్‌లో బుధవారం పెళ్లి చూసేందుకు వచ్చిన ఓ యువతి అనుకోకుండా పెళ్లి కూతురైంది. తిరుచ్చి జిల్లా తురైయూర్‌కు చెందిన వెంకటేషన్‌కు మణ్ణచ్చనల్లూర్ సమీపంలోని ఎదుమలైకి చెందిన కనకతో వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చితార్థం చేశారు. తురైయూర్‌లో ఉన్న కల్యాణ మండపంలో బుధవారం వివాహం చేయడానికి సిద్ధం చేశారు. బంధువులు, స్నేహితులు అందరూ మండపానికి చేరుకున్నారు. వరుడు, వధువు అలంకరించుకుంటున్నారు. అప్పుడు వివాహ మండపానికి సినిమా తరహాలో హఠాత్తుగా పోలీసులు రావడంతో కలకలం రేపింది. పోలీసులు పెళ్లికుమార్తె తండ్రిని పిలిచి విచారణ జేశారు. ఆ బాలిక ఇంకా మైనరేనని ఇంకా 18 సంవత్సరాలు పూర్తికాలేదని పెళ్లి చేస్తే అరెస్టుచేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విచారణ నిమిత్తం పెళ్లికుమార్తెను, ఆమె తండ్రిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు అవమానానికి గురయ్యామని మనస్తాపం చెందారు. ఆ సమయంలో బంధువులంతా కలసి చర్చించి పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. వివాహానికి వచ్చిన వారిలో ఒకరికి పెళ్లి ఈడొచ్చిన కుమార్తె ఉందని, ఆమెకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. అందరూ అంగీకరించడంతో ఆ యువతితో అదే ముహూర్తంలో అతడికిచ్చి వివాహం చేశారు. -
బాలికను గర్భవతిని చేసి.. అబార్షన్!
బెల్లంపల్లి(మంచిర్యాల): బాలికను గర్భవతిని చేసిన యువకుడు పెళ్లి మాటకొచ్చేసరికి ముఖం చాటేశాడు. పెళ్లి చేస్తామని చెప్పి సదరు యువకుడి తల్లిదండ్రులు అబార్షన్ చేయించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడు, అతడి తల్లిదండ్రులపై నిర్భయ, అత్యాచారం కేసు నమోదైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూటౌన్ ఎస్‌హెచ్‌వో జవ్వాజీ సురేష్ కథనం ప్రకారం.. బెల్లంపల్లి పట్టణ పరిధి 65డీప్ బస్తీకి చెందిన బాలిక ఇంటర్మీడియెట్ చదువుతోంది. అదే బస్తీలో ఉన్న ఓ చర్చికి ప్రార్థనల కోసం కొన్నాళ్లుగా వెళ్తోంది. కొద్దిరోజులు అందులో పని చేసింది. చర్చి ఫాదర్ కుమారుడు సాలెం రాజు(18) బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. శారీరక సంబంధాన్ని కొనసాగించడంతో గర్భవతి అయింది. శారీరక మార్పులను పరిశీలించిన బాలిక తల్లిదండ్రులు నిలదీయగా.. జరిగిన విషయం చెప్పింది. రాజు తల్లిదండ్రులను నిలదీయగా.. తమ కుమారుడితో వివాహం జరిపిస్తామని, అబార్షన్ చేయించాలని సూచించారు. అబార్షన్ చేయించిన తర్వాత పెళ్లికి నిరాకరించారు. కులం తక్కువంటూ హేళనగా మాట్లాడారు. దీంతో బాలిక, ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడు సాలెం రాజు, అతడి తల్లిదండ్రులపై నిర్భయ, అత్యాచారం కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌హెచ్‌వో వివరించారు. -
బంధువుల వివాహానికి పంపలేదని ఆత్మహత్య
నార్పల: బంధువుల వివాహానికి పంపలేదని గడ్డంనాగేపల్లికి చెందిన రామాంజనేయులు కూతురు (14) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్ఐ రామచంద్రారెడ్డి తెలిపిన మేరకు.. సునీత ఆత్మకూరులో బంధువుల ఇంట జరుగుతున్న వివాహానికి పంపకపోవడంతో తల్లిదండ్రులను బెదిరించేందుకు సూపర్‌వాస్మోల్ తాగింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతురాలి తండ్రి రామాంజనేయులు ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ రామచంద్రారెడ్డి కేసు నమోదు చేసుకున్నారు.