
నిందితుడు షేక్ అబ్దుల్లా
రాజేంద్రనగర్: బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం... బుద్వేల్ రైల్వేస్టేషన్ శ్రీరామ్‌నగర్‌కాలనీకి చెందిన గోవింద్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. గోవింద్ కుమార్తె (16) స్థానికంగా కూలీ పనిచేస్తుంది. అదే ప్రాంతంలో నివసించే షేక్ అబ్దుల్లా(22) ప్రేమిస్తున్నానంటూ బాలిక వెంటపడుతున్నాడు.
ఈనెల 1న రాత్రి 7 గంటల ప్రాంతంలో అబ్దుల్లా.. గోవింద్ కూతురుకు మాయమాటలు చెప్పి స్థానికంగా ఉన్న మసీద్ వద్దకు తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. అనంతరం అంబేడ్కర్‌నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కూతురు కనిపించకపోవడంతో గోవింద్ స్థానికుల సహాయంతో వాకబు చేస్తుండగా అంబేడ్కర్‌నగర్‌లో ఉందని తెలియడంతో అక్కడకు వెళ్లాడు. కాగా బాలిక తనపై అబ్దుల్లా లైంగిక దాడికి పాల్పడినట్లు వివరించింది. దీంతో గోవింద్ మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment