rajendra nagar police station
-
బాలికపై లైంగిక దాడిచేసిన యువకుడి అరెస్ట్
రాజేంద్రనగర్: బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం... బుద్వేల్ రైల్వేస్టేషన్ శ్రీరామ్‌నగర్‌కాలనీకి చెందిన గోవింద్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. గోవింద్ కుమార్తె (16) స్థానికంగా కూలీ పనిచేస్తుంది. అదే ప్రాంతంలో నివసించే షేక్ అబ్దుల్లా(22) ప్రేమిస్తున్నానంటూ బాలిక వెంటపడుతున్నాడు. ఈనెల 1న రాత్రి 7 గంటల ప్రాంతంలో అబ్దుల్లా.. గోవింద్ కూతురుకు మాయమాటలు చెప్పి స్థానికంగా ఉన్న మసీద్ వద్దకు తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. అనంతరం అంబేడ్కర్‌నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కూతురు కనిపించకపోవడంతో గోవింద్ స్థానికుల సహాయంతో వాకబు చేస్తుండగా అంబేడ్కర్‌నగర్‌లో ఉందని తెలియడంతో అక్కడకు వెళ్లాడు. కాగా బాలిక తనపై అబ్దుల్లా లైంగిక దాడికి పాల్పడినట్లు వివరించింది. దీంతో గోవింద్ మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఎక్స్‌ప్రెస్ వేపై కారు బోల్తా
హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే పై కారు బోల్తా పడింది. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మెహిదీపట్నం నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న కారు ఆరాంఘర్ సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. కారులో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇతర వాహనాలేవీ ఆ సమయంలో సమీపంలో లేకపోవటంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. అయితే, వాహనాల రాకపోకలకు మాత్రం అంతరాయం ఏర్పడింది. ఘటన విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని కారును పక్కకు తొలగించారు. కొద్దిసేపటి తర్వాత వాహనాలను క్రమబద్ధీకరించారు. -
డ్రగ్స్ ముఠాపై ఎస్ఓటీ పోలీసుల దాడులు
హైదరాబాద్: నిషేధిత డ్రగ్స్‌ను విక్రయిస్తున్న ముఠాపై సైబరాబాద్‌లో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. మాదాపూర్‌లోని సన్‌సిటీ లో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ పంపిణీ చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యులో ఇద్దరిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. గత 2013 నుంచి గోవా, బెంగళూరు, హైదరాబాద్ వంటి పలు నగరాల్లో ఈ ముఠా నిషేధిత మాదక పదార్థాలను పంపిణీ చేస్తోంది. ఈ ముఠా సభ్యుల్లో నైజీరియా నివాసి, సిమాన్ సహా పలువురు నిషేధిత మాదక పదార్థాలను పలుమార్లు హైదరాబాద్ నగరంలో విక్రయించినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 44 గ్రాముల మాదక పదార్థాలు 50 చిన్న ప్యాకెట్లతో పాటు నగదు 30 వేల రూపాయలు, రెండు మొబైల్ ఫోన్లు, రెండు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముగ్గురిలో ఒకరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. రాజేంద్ర నగర్ పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు. -
పిల్లలను ఆటో ఎక్కించి మాయమైన తండ్రి
-
పిల్లలను ఆటో ఎక్కించి మాయమైన తండ్రి
హైదరాబాద్ : ముగ్గురు చిన్నారులను ఆటో ఎక్కించి, ఇప్పుడే వస్తానని చెప్పిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. దాంతో చాలాసేపు ఎదురు చూసిన ఆటో డ్రైవర్ చేసేదిలేక హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఆ చిన్నారులను అప్పగించాడు. మంగళవారం రాత్రి వెంకటరమణ అనే వ్యక్తి తన పిల్లలు భానుప్రసాద్, కవలలైన భాగ్యలక్ష్మి, భావనలను లక్డికపూల్ చౌరస్తా వద్ద ఆటో ఎక్కించి, ఉప్పరపల్లి చౌరస్తాలో దింపమని, తాను వెనకే బైక్‌పై వస్తానని ఆటోడ్రైవర్‌కు చెప్పాడు. అయితే ఉప్పరపల్లిలో ఎంతసేపు ఎదురుచూసినా .. వెంకటరమణ రాలేదు. పోలీసులు చిన్నారులను విచారించగా, తండ్రిపేరు తప్ప మరే వివరాలు చెప్పలేకపోతున్నారు. దాంతో పోలీసులు వీరి ఆచూకీ కనుక్కునే పనిలో ఉన్నారు.