రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే పై కారు బోల్తా పడింది.
హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే పై కారు బోల్తా పడింది. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మెహిదీపట్నం నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న కారు ఆరాంఘర్ సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. కారులో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఇతర వాహనాలేవీ ఆ సమయంలో సమీపంలో లేకపోవటంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. అయితే, వాహనాల రాకపోకలకు మాత్రం అంతరాయం ఏర్పడింది. ఘటన విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని కారును పక్కకు తొలగించారు. కొద్దిసేపటి తర్వాత వాహనాలను క్రమబద్ధీకరించారు.