car turn
-
ఎక్స్ప్రెస్ వేపై కారు బోల్తా
హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్ వే పై కారు బోల్తా పడింది. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మెహిదీపట్నం నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న కారు ఆరాంఘర్ సమీపంలో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. కారులో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇతర వాహనాలేవీ ఆ సమయంలో సమీపంలో లేకపోవటంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. అయితే, వాహనాల రాకపోకలకు మాత్రం అంతరాయం ఏర్పడింది. ఘటన విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని కారును పక్కకు తొలగించారు. కొద్దిసేపటి తర్వాత వాహనాలను క్రమబద్ధీకరించారు. -
ఖానాపూర్లో కారు బోల్తా..ఐదుగురికి గాయాలు
ఖానాపూర్(ఆదిలాబాద్ జిల్లా): ఖానాపూర్ మండల కేంద్రంలోని కొమరం భీం చౌరస్తాలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. మండల కేంద్రంలోని అంగడి బజార్ చౌరస్తాలోని బాలాజీ మెడికల్ షాపు నిర్వాహకుడు ముత్యాల వెంకట్రామి రెడ్డి నిర్మల్ నుంచి ఖానాపూర్కు కారులో వస్తుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో రాంరెడ్డితో పాటు యన భార్య పుష్పలత, కూతురు శ్రేయ మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు దగ్గరలో ప్రాథమిక చికిత్స అందించి నిర్మల్ తరలించారు. -
కారు బోల్తా: ఒకరు మృతి
అనంతపురం: అనంతపురం జిల్లా సోమందేపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కారు బోల్తా పడి ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
అనంతపురం(చిలమత్తూరు): కారు అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన ఆదివారం తెల్లవారు జామున చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద ఎన్హెచ్44పై చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కారు నెంబర్(కేఏ 51 ఎంఈ 4235)ను ఆధారంగా క్షతగాత్రులు బెంగుళూరుకు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో బెంగళూరువాసి మృతి
మానోపాడు(మహబూబ్నగర్): రోడ్డుప్రమాదంలో కారు బోల్తాపడి ఒక మహిళ మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదం మహబూబ్నగర్ జిల్లా మనోపాడ్ మండలం ఎన్హెచ్ 44పై సోమవారం రాత్రి 9.45 గంటలకు జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన బెంగళూరు వాసులు హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వచ్చి వెళ్తుండగా కారు బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న లక్షి(55) అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.