ఖానాపూర్(ఆదిలాబాద్ జిల్లా): ఖానాపూర్ మండల కేంద్రంలోని కొమరం భీం చౌరస్తాలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. మండల కేంద్రంలోని అంగడి బజార్ చౌరస్తాలోని బాలాజీ మెడికల్ షాపు నిర్వాహకుడు ముత్యాల వెంకట్రామి రెడ్డి నిర్మల్ నుంచి ఖానాపూర్‌కు కారులో వస్తుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో రాంరెడ్డితో పాటు యన భార్య పుష్పలత, కూతురు శ్రేయ మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు దగ్గరలో ప్రాథమిక చికిత్స అందించి నిర్మల్ తరలించారు.