Komuram Bheem
-
కళ్ల ‘కలక’లం
ఆదిలాబాద్: కెరమెరి మండలంలోని అనార్పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆరురోజుల క్రితం ఇద్దరు విద్యార్థులకు కళ్ల కలక వ్యాధి సోకింది. పరీక్షించిన పీహెచ్సీ వైద్యాధికారి వినోద్‌కుమార్ వైద్యం చేసి తగిన సలహాలు, సూచనలు ఇచ్చి పంపించారు. శనివారం అదే ఆశ్రమ పాఠశాలలో వైద్య పరీక్షలు నిర్వహించగా 11 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్లు గుర్తించారు. దీంతో ఆ పాఠశాలలో కలకలం రేగింది. ఈ ఒక్క పాఠశాలనే కాదు జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో విద్యార్థులు, చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కళ్ల కలక (కంజెక్టివైటీస్) వ్యాధి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వ్యాపించింది. ముఖ్యంగా చిన్నారులకు అధికంగా సోకుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 213 కేసులు నమోదయ్యా యి. దగ్గు జలుబు, మాదిరి సీజనల్లాగా వచ్చే వ్యాధి. వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రభా వం చూపుతుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వ్యాపించింది. ఎక్కువగా చిన్నారులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వ్యాధి సోకిన వారి కళ్లను తదేకంగా చూడడం వల్ల కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయితే రోగిని ప్రత్యేక గదిలో ఉంచాలి. రోగి వాడిన టవల్, ఇతర వస్తువులు ఇతరులు ఉపయోగించకూడదు. పెద్ద ప్రమాదం ఏమీ లేకపోయినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాధి లక్షణాలు వ్యాధి సోకిన వారి కళ్లు మంట అనిపిస్తాయి. కళ్లవెంట నీరుకారడం, దురద, రెప్పలు వాపెక్కడం, ఊసులురావడం, నిద్రపోయిన సమయంలో రెప్పలు అతుక్కోవడం కళ్ల కలక లక్షణాలు. ఒక కన్నుతో మొదలై మరోకంటికి వ్యాపిస్తుంది. ఒకరితో మొదలై ఏకకాలంలో పలువురికి వ్యాప్తి చెందుతుంది. రోగ నిరోధకశక్తి ఆధారంగా మూడు నుంచి వారం రోజుల పాటు వేధిస్తుంది. వాతావరణం ఒక్కసారిగా మారడంతో వ్యాధి ప్రభావం అధికంగా చూపుతోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యాధి సోకిన వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. రోగి టవల్, సబ్బు ఇతరులు వాడవద్దు. బయటికి వెళ్లినప్పుడు నల్ల కళ్లద్దాలు పెట్టుకోవాలి. ఇతరులకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు సోకితే వ్యాధి తగ్గేవరకూ ఇంటివద్దే ఉండాలి. వైద్యుల సూచనలతో యాంటీబయాటిక్స్ డ్రాప్స్ వాడాలి. ఆందోళన చెందవద్దు కళ్ల కలక వ్యాధి సోకినవారు ఆందోళన చెందవద్దు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధికి సంబంధించిన డ్రాప్స్ అందుబాటులో ఉన్నాయి. వ్యాధి సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలి. రోగి కళ్లల్లోకి చూసినా అతను వాడిన టవల్ ఉపయోగించినా ఇతరులకు వ్యాధి సోకే ప్రమాదం ఉంది. – రామకృష్ణ, జిల్లా వైద్యాధికారి -
కొమురంభీం జిల్లాలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు..
కౌటాల/చింతమానెపల్లి: చింతమానెపల్లి: కుమురం భీం జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఉదయం 8.40 గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. కొద్ది సెకన్లపాటు వచ్చిన ప్రకంపనలతో ఆయా మండలాల ప్రజలు భయాందోళనలకు గుర య్యారు. సిర్పూర్(టి) నియోజకవర్గం కేంద్రంగా భూకంపం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కాగా, భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైంది. కౌటాల, సిర్పూర్(టి), చింతల మానెపల్లి, బెజ్జూర్, దహెగాం మండలాల్లోని పలు గ్రామాల్లో ఇళ్లలోని వస్తువులు కింద పడటంతో గమనించిన పలువురు భయాందోళనలతో బయటకు పరుగెత్తారు. భూప్రకంపనల ద్వారా ఎలాంటి నష్టం లేదని, ప్రజలు భయాందోళనలకు గురికా వొద్దని అధికారులు తెలిపారు. చదవండి: ‘సిట్’ అంటే.. సిట్, స్టాండ్ మాత్రమే.. రేవంత్ రెడ్డి సెటైర్లు.. -
‘భవనాలు నిర్మించగానే సరిపోదు.. గిరిజన బిడ్డల సమస్యలు తీరాలి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బంజారా, ఆదివాసీ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రూ. 50 కోట్ల చొప్పున వ్యయంతో ప్రభుత్వం రెండు భవనాలను నిర్మించింది. కాగా, బంజారా భవన్‌కు సంత్ సేవా లాల్ పేరును అలాగే, ఆదివాసీ భవన్‌కు కొమరం భీమ్ పేర్లను పెట్టారు. ఈ రెండు భవనాలను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ గిరిజన బిడ్డలందరికీ అభినందనలు. భవనాలు నిర్మించగానే సరిపోదు.. గిరిజన బిడ్డల సమస్యలు తీరాల్సిన అవసరం ఉంది. గిరిజన బిడ్డల విషయంలో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వారి చదువుల విషయంలో, విదేశాలకు వెళ్లే విషయంలో, గిరిజన పోడు భూముల విషయంలోగానీ, రక్షణ విషయంలో గానీ.. ప్రభుత్వం సహకరిస్తోంది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ పరిష్కారం కావాల్సిన అవసరముంది. ఈ భవనం తెలంగాణ గిరిజన బిడ్డల హక్కుల పరిరక్షణకు వేదిక కావాలి. వారి సమస్యల పరిరక్షణకు మార్గం కావాలి. ఆదివాసీ మేధావి వర్గం ఒక్కటై.. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. -
రెడీమేడ్ గూడు.. భలేగుంది చూడు
సాక్షి, ఆసిఫాబాద్ (కెరమెరి): ఉండేందుకు ఇల్లు లేక.. కట్టుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక తలదాచుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆదిమ గిరిజనుల సొంతింటి కలను ఐటీడీఏ అధికారులు సాకారం చేశారు. రూ.3.4 లక్షలతో రెడీమేడ్ ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కుమురంభీం జిల్లా కెరమెరి మండలం బాబేఝరి గ్రామ పంచాయతీ పరిధి శివగూడలో 13 కుటుంబాలున్నాయి. ఆదిమ గిరిజనులు (పీటీజీ) గూన, పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు. దీంతో వారి కోసం ఒక్కొక్క ఇంటికి రూ.3.4 లక్షలు వెచ్చించి రెడీమేడ్‌గా 13 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఐటీడీఏ అధికారులు నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా మొదటి ఇంటిని టేకం మాణిక్‌రావు అనే లబ్ధిదారుకు నిర్మించారు. హాల్, బెడ్రూం, కిచెన్, మరుగుదొడ్లు, నేలకు రంగురంగుల టైల్స్ తదితర సౌకర్యాలతో ఇంటిని పూర్తి చేశారు. కిటికీలకు చలువ అద్దాలు అమర్చడంతో ఆకర్షణీయంగా ఇల్లు కనిపిస్తోంది. ఇంటి నిర్మాణానికి 30 రోజుల సమయం పట్టిందని, 50 ఏళ్ల వరకు మన్నిక ఉంటుందని ఐటీడీఏ ఏఈ నజీమొద్దీన్ తెలిపారు. మిగతా ఇళ్ల నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అందమైన ఇంట్లో నివసించాలనే కల నెరవేరనుండటంతో ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
వామ్మో.. పులి; ఆ వీడియో పాతది
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/గుండాల: జిల్లాలోని గుండాల, కరకగూడెం, ఆళ్లపల్లి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో రెండు, మూడు రోజులుగా పులి సంచరిస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. శుక్రవారం రాత్రి ఆళ్లపల్లి మండలంలో ఓ పశువుల పాకపై దాడి చేసి దుక్కిటెద్దును చంపేసింది. గురువారం రాత్రి దామరతోడు అటవీ ప్రాంతం నుంచి కరకగూడెం మండలం అనంతారం అటవీ ప్రాంతంలో పులి అడుగులను గుర్తించిన స్థానికులు ఏడూళ్ల బయ్యారం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం ఆళ్లపల్లి మండలం రాయిగూడెం పోడు భూముల సమీపంలో పులి కనిపించిందని అక్కడి గ్రామస్తులు తెలిపారు. (చదవండి: పులి హల్చల్) ఆ పులి వీడియో పాతది: అటవీశాఖ సాక్షి, హైదరాబాద్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోందని, పశువుల కాపరులకు కనిపించిందని శుక్రవారం నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో పాతదని, ఈ ప్రాంతానికి సంబంధించినది కాదని అటవీ శాఖ స్పష్టం చేసింది. ఈ వీడియోపై విచారణ చేపట్టిన అటవీ అధికారులు అది మహారాష్ట్రకు చెందిన పాత వీడియోగా నిర్ధారించారు. యావత్మల్ జిల్లా అంజన్‌వాడి అటవీ ప్రాంతంలో గత నెలలో కనిపించిన పులి వీడియోను కొందరు బెజ్జూరు ప్రాంతంలో పులి అంటూ వాట్సాప్ ద్వారా సర్క్యులేట్ చేశారని ఆదిలాబాద్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) వినోద్ కుమార్ వెల్లడించారు. తప్పుడు సమాచారంతో చేస్తున్న ప్రచారం వల్ల స్థానిక గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. పులుల సంచారంపై శాఖాపరంగా అప్రమత్తంగా ఉన్నామని, ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఒక్క ఆసిఫాబాద్ జిల్లాలోనే 32 ప్రత్యేక బృందాలతో పులుల కదలికలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: అది ఫేక్ వీడియో: కేసులు పెడతాం!) -
రాజమౌళికి ఎంపీ సోయం బాపురావు వార్నింగ్
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). ఇందులో కొమురమ్ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ఇటీవల అన్ని జాగ్రత్తలతో ప్రారంభమైంది. ఇదిలా ఉండగా ఈ నెల 22న కొమురం భీం జయంతి సందర్భంగా రామరాజు వాయిస్‌తో కూడిన ఎన్టీఆర్(కొమురం భీం) టీజర్‌ని చరణ్ విడుదల చేశారు. రామ్ చరణ్ వాయిస్‌తో ప్రారంభమైన వీడియోలో. గోండ్రు బెబ్బులి కొమురం భీంగా ఎన్టీఆర్ పాత్రల తీరుతెన్నులని పరిచయం చేశారు. చదవండి: వివాదంలో ‘ఆర్ఆర్ఆర్’.. ఆ సన్నివేశాలు తొలగించండి అయితే సినిమాలోని కొమురం భీం పాత్ర వివాదంగా మారుతోంది. కొమురం భీంగా నటిస్తున్న తారక్‌కు ఇందులో ముస్లిం టోపీ పెట్టడంపై ఆదీవాసులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు స్పందించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీమ్ చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని దర్శకుడు రాజమౌళిని హెచ్చరించారు. నిజాం వ్యకులతో పోరాటం చేసిన కొమరం భీమ్‌కు ఇతర మతాలతో సంబంధం పెట్టి టోపీలు పెట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. అదే విధంగా టోపీ ఉన్న సన్నివేశాలని తొలగించాలని, లేకపోతే సినిమా థియేటర్లపై దాడి చేసే అవకాశం ఉదని హెచ్చరించారు. కొమరం భీమ్ తమ పాలిట దేవుడని, ఉన్నది ఉన్నట్టు చూపిస్తే తమకు ఏమాత్రం అభ్యంతరం లేదని అన్నారు. అంతేగానీ కలెక్షన్ల కోసం పాత్రను వక్రీకరిస్తే బాగోదని అన్నారు. చదవండి: ఆర్ఆర్ఆర్: రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్ -
వివాదంలో ‘ఆర్ఆర్ఆర్’.. ఆ సన్నివేశాలు తొలగించండి
సాక్షి, హైదరాబాద్: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ వివాదంలో చిక్కుకుంది. గోండుల వీరుడు కొమురం భీంగా జునీయర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు రాజమౌళి దశలుగా సినిమా టీజర్‌ను విడుదల చేస్తూ వారిలో మరింత ఆసక్తిని రేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన ఎన్టీఆర్ టీజర్ వివాదాస్పదంగా మారింది. కొమురం భీం పాత్ర పోషిస్తున్న తారక్‌కు ఇందులో ముస్లిం టోపీ పెట్టడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: వాడి పొగరు ఎగిరే జెండా) ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని కొమురం భీం విగ్రహానికి ఆదివాసీల యువసేన ఇవాళ(శనివారం) క్షీరాభిషేకం చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ టీజర్లో ఎన్టీఆర్‌కు ముస్లిం టోపి పెట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొమురం భీం అని, ఆయన చరిత్రను పూర్తిగా అర్థం చేసుకుని సినిమా తీయాలంటూ రాజమౌళికి సూచించారు. ఇష్టారీతిగా సినిమా తీసి ఆదివాసీల మనోభావాలు దెబ్బతీయోద్దంటూ రాజమౌళిపై మండిపడుతున్నారు. ఈ సినిమాలో ముస్లిం టోపి ఉన్న కొమురం భీం సన్నివేశాలను తొలగించాలని లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆదివాసీలు హెచ్చరించారు. కాగా, బాహుబలి సినిమా అప్పుడు కూడా పలు వివాదాలు చెలరేగాయి. గిరిజనులను అవమానకరంగా చూపారంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. (చదవండి: ఆర్ఆర్ఆర్ టీజర్: ఇవన్నీ ఇప్పటికే చూసేశాం) -
చైనా సరిహద్దులో ఆర్మీ జవాను మృతి
కొమురం భీం, ఆసిఫాబాద్ : చైనా సరిహద్దులో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఆర్మీ జవాను మరణించారు. వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ పట్టణం అహ్మద్ రజా కాలనీకి చెందిన ఆర్మీ జవాన్ మహమ్మద్ షాకీర్ చైనా సరిహద్దులోని లడక్ ప్రాంతంలో చనిపోయాడు.. ఆరుగురు బృందంతో విధులు నిర్వర్తిస్తుండగా కొండ చరియలు విరిగిపడి మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. 17 ఏళ్లుగా షాకీర్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. షాకీర్ మృతితో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి -
మావోయిస్టులను తరిమేస్తాం: ఎస్పీ హెచ్చరిక
సాక్షి, కొమురం భీం, ఆసిఫాబాద్: మావోయిస్టులను జిల్లా అటవీ ప్రాంతం నుంచి తరిమి వేస్తామని, వారి ఆగడాలను తిప్పి కొట్టేందుకు పోలీసు దళాలు విస్తృత చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ విష్ణు వారియర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికైనా మావోయిస్టులు తమ తీరును మార్చుకుని ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. వెంటనే లొంగిపోయిన వారికి అన్ని విధాలా జీవనోపాధికి సహకరిస్తామని, కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించవచ్చని పేర్కొన్నారు. మావోయిస్టులకు ప్రజలు ఎవరు సహకరించవద్దని, వారి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. సమాచారం తెలిపిన వారికి వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు వారికి తగిన బహుమతులు ఇస్తామని పేర్కొన్నారు. ఈనెల 25న తెలంగాణ బంద్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం విజయపురి కాలనీ చర్ల- వెంకటాపురం ప్రధాన రహదారిపై పట్టపగలే వెలిసిన మావోయిస్టులు పోస్టర్లు కలకలం రేపాయి. తెలంగాణ రాష్ట్ర కమిటీ సిపిఐ మావోయిస్టు పేరుతో వెలసిన ఈ పోస్టర్లలో.. విరసం నేత వరవరరావు, వికలాంగుడైన సాయిబాబాలతో పాటు మిగతా 12 మందిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. వారిపై పెట్టిన కేసులని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. అంతేకాకుండా అడవుల నుంచి గ్రేహాండ్స్ బలగాలను ప్రభుత్వం తక్షణమే ఉప సంహరించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. -
కొలువు దీరిన కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పాలకవర్గం
కాగజ్‌నగర్: ‘‘ఎండీ సద్దాం హుస్సేన్ అనే నేను కాగజ్‌నగర్ పురపాలక సంఘం సభ్యుడిగా, శాసనము ద్వారా నిర్మితమైన..’’ ‘‘రాచకొండ గిరీశ్‌కుమార్ అనే నేను కాగజ్‌నగర్ పురపాలక సంఘం సభ్యుడిగా, శాసనము ద్వారా నిర్మితమైన..’’అంటూ సాగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంతో కాగజ్‌నగర్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశాల మేరకు కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీ సీఈవో వేణు నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ముందుగా ఎన్నికల సంఘం నియమనిబంధనలను చదివి వినిపించారు. ఉదయం 11 గంటలకు జెడ్పీ సీఈవో ఒక్కొక్కరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా కౌన్సిలర్ ఎల్లేష్ ప్రమాణ స్వీకారం చేశారు. 10వ వార్డు కౌన్సిలర్ అన్నబోయిన విజయ భగవంతుని ప్రమాణంతో పాటు తన భర్త వనమాల రాముపై ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం కౌన్సిలర్లు ప్రమాణ స్వీకార పత్రంపై సంతకాలు చేశారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఎక్స్ అఫీషియగా హాజరై పర్యవేక్షించారు. ప్రమాణ స్వీకారం అనంతరం కౌన్సిలర్లు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ తిరుపతితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏకగ్రీవంగా చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక.. పట్టణంలోని 30 వార్డుల్లో అధికార టీఆర్ఎస్ 22 స్థానాలు కైవసం చేసుకోగా సోమవారం చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా చేపట్టారు. చైర్మన్, వైస్‌చైర్మన్ పేర్లను జెడ్పీ సీఈవో ప్రకటించారు. వారికి పార్టీ బీ ఫారం అందించినట్లు పేర్కొన్నారు. చైర్మన్ సద్దాం హుస్సేన్‌ను పంబాల సుజాత ప్రతిపాదించగా, బొద్దున విద్యావతి బలపర్చారు. వైస్‌చైర్మన్ రాచకొండ గిరీష్‌కుమార్‌ను స్వామిశెట్టి రాజేందర్ ప్రతిపాదించగా, విజయ్‌యాదవ్ కుమార్ బలపర్చారు. చైర్మన్ పదవిని సద్దాం హుస్సేన్, గిరీష్‌కుమార్ చెరో రెండున్నర సంవత్సరాలు పాలించనున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం వీరు ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ఆలింగనము చేసుకున్నారు. నూతన అధ్యయనం మొదలు.. – ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో నూతన అధ్యయనం మొదలైందని ఎమ్మెల్యే కోనప్ప పేర్కొన్నారు. నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకతీతంగా మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అభివృద్ధిలో, పాలనలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. చైర్మన్ హుస్సేన్, వైస్‌చైర్మన్ గిరీష్‌కుమార్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన పాలకవర్గ సభ్యులకు, ఎమ్మెల్యే కోనప్పకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల, పాలకవర్గం సభ్యుల నమ్మకం వమ్ముకాకుండా మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు. -
కదిలిన ఆదివాసీ దండు
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీ దండు కదిలింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 9న జరిగే ఆదివాసీ అస్తిత్వ పోరాటానికి పయనమైంది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి ఆదివాసీలు శనివారం జిల్లా కేంద్రానికి చేరుకొని ఆదిలాబాద్ నుంచి రైలుమార్గం ద్వారా నాగ్‌పూర్‌కు తరలివెళ్లారు. ఇప్పటికే చాలా మంది ప్రత్యేక వాహనాలు, రైళ్ల ద్వారా వెళ్లగా, మిగతా వారు శనివారం బయల్దేరారు. రెండు జిల్లాల నుంచి 3వేల మంది వరకు వెళ్లినట్లు ఆదివాసీ సంఘాల నాయకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశ నలుమూలల నుంచి ఈ సభలో పాల్గొననున్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఈ సభ జరగనుంది. గత కొన్నిరోజుల నుంచి ఆదివాసీ సంఘాల నాయకులు సభకు భారీ సంఖ్యలో తరలించేందుకు సన్నద్ధం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడం, పోడు భూములకు పట్టాలు, ఏజెన్సీ ప్రాంతంలో నకిలీ ధ్రువపత్రాలను అరికట్టాలనే ప్రధాన డిమాండ్లతో ఈ సభ నిర్వహిస్తున్నారు. గుస్సాడీ వేషధారణలో ఢిల్లీకి పయనమవుతున్న యువకులు ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఆధ్వర్యంలో ఇప్పటికే పలు కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టగా, దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టే సభ ద్వారా ఈ విషయం దేశమంతటా తెలిసేందుకు ఆస్కారం ఉంది. ఆదివాసీ అస్తిత్వ పోరాట సభకు ఆదివాసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రులు హాజరుకానున్నారని ఆదివాసీ నాయకులు చెబుతున్నారు. సభకు ఎంతమంది తరలివెళ్తున్నారనే విషయంపై ఇంటెలిజెన్స్, పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో అక్కడ జరిగే సభ ఏర్పాట్లను, జిల్లా నుంచి వచ్చే ఆదివాసీల ఏర్పాట్లు, తదితరవి పరిశీలిస్తున్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా చొరవ చూపుతున్నారు. రైలు మార్గం ద్వారా వెళ్లేవారికి మధ్యలో భోజనాలు, ఢిల్లీలో ప్రత్యేకంగా ఫంక్షన్హాల్లు ఏర్పాటుచేసినట్లు ఆదివాసీ నాయకులు చెబుతున్నారు. తుడుందెబ్బ జెండాలు తీసుకెళ్తున్న ఆదివాసీలు రైల్వేస్టేషన్లో సందడి.. ఢిల్లీలో జరిగే అస్తిత్వ పోరాట సభకు తరలివెళ్లేందుకు వచ్చిన ఆదివాసీలతో ఆదిలాబాద్ రైల్వేస్టేషన్ సందడిగా మారింది. వేలాది సంఖ్యలో ఆదివాసీలు చేరుకోవడంతో రైల్వేస్టేషన్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసిన జనంతో కిటకిటలాడింది. జై ఆదివాసీ.. జైజై ఆదివాసీ అనే నినాదాలతో రైల్వేస్టేషన్ మార్మోగింది. -
ఆదివాసీలు మరో పోరాటానికి సిద్ధం కావాలి
హన్మకొండ అర్బన్ : జల్‌జంగల్, జమీన్ కోసం కొమురంభీం స్ఫూర్తితో ఆదివాసీలు మరో పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ ప్రజాసామాజిక వేదిక ప్రతినిధి, ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే అన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరంగల్, ఖమ్మం జిల్లాల బస్సుయాత్రను మంగళవారం హన్మకొండలోని నక్కలగుట్ట కాళోజీ జంక్షన్ వద్ద మంగళవారం ఆమె జెండా ఊపి ప్రారంబించా రు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కాత్యాయని విద్మ హే మాట్లాడుతూ ఆదివాసీల జీవితమే ఒక చైతన్యమన్నారు. ఆదివాసీలు చేసే పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రొఫెసర్ ఈసం నారాయణ మాట్లాడుతూ దశాబ్దాలుగా పోడు భూములు సాగు చేసుకుని జీవిస్తున్న ఆదివాసీల భూములు లాక్కునే ప్రయ త్నాలకు వ్యతిరేకంగానే బస్సుయాత్ర చేపట్టినట్లు తెలిపారు. పోడు భూములు లాక్కోవడం ద్వారా ఆదివాసీలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. వాస్తవంగా అడవులను నాశనం చేస్తున్న శక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాని డిమాండ్ చేశా రు. ఈనెల 26వరకు బస్సుయాత్ర ముగుస్తుందని, సెస్టెంబర్ 6న ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. -
ఆదివాసీ జిల్లా కోసం కదిలిన దండు
భారీగా తరలివచ్చిన ఆదివాసీలు జోడేఘాట్‌తో కూడిన కొమరం భీమ్ జిల్లా కోసం డిమాండ్ ఆదివాసీలను విచ్ఛిన్నం చేసే కుట్రేనని ఆరోపణ కెరమెరి : ఆదివాసీ ప్రత్యేక జిల్లా కోసం ఆదివాసీల దండు కదిలింది. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఆదివాసీలు గురువారం భారీగా తరలి రావడంతో జోడేఘాట్ మరో సారి దర్బార్‌ను తలపించింది. హట్టి నుంచి జోడేఘాట్ వరకు వందలాది మందితో మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం కొమరం భీమ్ సమాధికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిరంగ సభలో ఆదివాసీ వక్తలు, వివిధ సంఘాల నాయకులు, ఆఇఫాబాద్ మాజీ ఎమ్మేల్యే ఆత్రం సక్కు, హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం భగవంత్‌రావు, మాజీ జెడ్పీ చైర్మన్ సిడాం గణపతి, ఆదివాసీ రచయితల సంఘం నేత మైపతి అరుణ్‌కుమార్, వరంగల్ అడ్వోకేట్ పాపాలాల్, ప్రోఫెసర్ నాగేశ్వరరావు, జేఏసీ జిల్లా నాయకులు కనక యాదోరావు, వెడ్మ బొజ్జులు మాట్లాడారు. ఆదివాసీలను విడదీసే కుట్రలో భాగమే జిల్లాల పునర్విభజన అని, అందరు ఆదివాసీలు కలిసికట్టుగాఉంటే రాన్ను కాలంలో ఏలుతారని భావించి సీఎం కేసీఆర్ కట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కొమురం భీమ్ మండలాన్ని వేరే జిల్లాలో కలిపి కెరమెరిని మాత్రం ఆదిలాబాద్ లో కలుపుతామని ప్రకటించడం సరికాదన్నారు. మాననాటే.. మావరాజ్ (మా గ్రామంలో మా రాజ్యం ) వస్తే మనం బాగుపడతామన్నారు. ఇందుకు ప్రత్యేక జిల్లా సాధించి తీరుదామన్నారు. ఇంద్రవెల్లి నుంచి కౌటాల వరకు 13 మండలాలల్లో ప్రత్యేక జిల్లాను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని ఎడల ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మంచిర్యాలలో కొమురం భీమ్ విగ్రహం పెట్టనివ్వలేదు – కుంరం సోనేరావు గతంలో మంచిర్యాలలో తాత కొమురం భీమ్ విగ్రహం పెడతామంటే అరెస్ట్ చేశారు. మంచిర్యాలలో తాతకు అవమానం జరిగింది. అలాంటి జిల్లాలో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అంటూ కొమురం భీమ్ మనవడు కొంమురం సోనేరావు అన్నారు. జోడేఘాట్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఐక్యమంత్యంతో ఉంటే ఆదివాసీ జిల్లా ను సాధించుకో గలుగుతామన్నారు. ఆసిపాబాద్ జిల్లా చేస్తే మంచిది – ఏమాజీ 27 సంవత్సారాలు ఆసిపాబాద్ జిల్లా ఉంది. అందుకు ఆసిఫాబాద్ జిల్లా చేస్తే మంచిదని జెడ్పీటీసీ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే ఏమాజీ అన్నారు. జోడేఘాట్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. 5 నుంచి 8 వందల ఎకరాలు వరకు ప్రభుత్వ భూమి ఉందని జిల్లా ఏర్పాటకు ఇది సరిపోతుందని అన్నారు. ప్రభుత్వం కార్యాలయాలు సైతం అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రజల సౌలభ్యం కోసం ఆసిపాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నైతం నారాయణ, జనార్ధన్, ఆత్రం లక్ష్మణ్, కోవ, అనక దేవ్‌రావు, కనక మాదవ్‌రావు, కుసుంబ్ రావు, సుగుణ, శేకర్, విజయ్‌కుమార్, మడావి కన్నిబాయి, వెంకటేశ్, బీజేపీ నాయకులు అంజనేయులు గౌడ్, పౌడల్, నాగేశ్వర్రావు, భీంరావు తదితరులున్నారు. -
కొమురం భీం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
ఆదిలాబాద్: ఆసిఫాబాద్ లోని కొమురం భీం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 25 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండటంతో అధికారులు మూడు గేట్లను ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గుండి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
ఖానాపూర్‌లో కారు బోల్తా..ఐదుగురికి గాయాలు
ఖానాపూర్(ఆదిలాబాద్ జిల్లా): ఖానాపూర్ మండల కేంద్రంలోని కొమరం భీం చౌరస్తాలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. మండల కేంద్రంలోని అంగడి బజార్ చౌరస్తాలోని బాలాజీ మెడికల్ షాపు నిర్వాహకుడు ముత్యాల వెంకట్రామి రెడ్డి నిర్మల్ నుంచి ఖానాపూర్‌కు కారులో వస్తుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో రాంరెడ్డితో పాటు యన భార్య పుష్పలత, కూతురు శ్రేయ మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు దగ్గరలో ప్రాథమిక చికిత్స అందించి నిర్మల్ తరలించారు. -
చారిత్రక నాటక వైభవానికి నాందీవాక్యం
కొమురం భీం ప్రదర్శనపరంగా ప్రేక్షకులను విశేషంగా కదిలించింది. కానీ ఇతివృత్తాన్ని బట్టి మరింత యోగ్యంగా ప్రదర్శించే అవకాశాలు ఈ నాటకానికి ఉన్నాయి. ప్రయోగం కూడా మూస స్థాయికి చేరుకుందని పరిషత్ నాటకాల మీద వచ్చిన విమర్శ. ప్రయోగం కోసం ప్రయోగం అన్న ధోరణితో పరిషత్ నాటకాలు కొద్దికాలంగా ఆకర్షణను కోల్పోయిన మాటను ఎవరూ కాదనలేరు. 80వ దశకంతో చూస్తే ఇవాళ పరిషత్ నాటకం చాలా వెనుకబడిందనే అనాలి. నిజానికి రంగస్థలమే ఆదరణను కోల్పోయింది. కానీ ప్రభుత్వం నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలు మాత్రం ప్రయోగాన్నీ, సంప్రదాయాన్నీ కూడా గౌరవిస్తున్నాయి. మే నెలలో రాజమండ్రిలో జరిగిన నంది నాటకోత్సవాలు దీనినే రుజువు చేశాయి. ఇందులో చారిత్రక ఇతివృత్తాలతో వచ్చిన రెండు నాటకాలకు (డొక్కా సీతమ్మ, కొమురం భీం) ప్రేక్షకులు నీరాజనాలు పట్టడం ఆహ్వానించదగిన పరిణామం. చారిత్రక ఘట్టాలను ప్రతిభావంతుడైన రచయిత నాటకంగా మలిస్తే ఆ రచన కావ్య స్థాయికి చేరి, ప్రేక్షకులకు రసానుభూతిని కలిగిస్తుంది. మంచి దర్శకుడి చేయూత ఉంటే ప్రదర్శన కూడా చరిత్రాత్మకమవుతుంది. ‘డొక్కా సీతమ్మ’ నాటకం అలాంటిదే. ఉత్తమ ప్రదర్శనకు ఇచ్చే బంగారు నంది సహా పలు విభాగాలలో ఈ నాటకానికి పురస్కారాలు లభించాయి. గంగోత్రి, పెదకాకాని బృందం ఈ నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. ‘ఖుర్బానీ’, ‘బొమ్మా-బొరుసా’, ‘ప్రేమకు పద్దెనిమిదేళ్లు’, ‘హంస కదా నా పడవ’ (ఉత్తమ రచన), ‘పేదోడు’ వంటి నాటకాలు కూడా ఈ విభాగంలో పోటీ పడినాయి. రచన పరంగా డొక్కా సీతమ్మ మంచి ప్రమాణాలతో కనిపిస్తుంది. ప్రేక్షకులను వర్తమానం నుంచి గతంలోకి రచయిత ‘పినాకపాణి’ (రామకృష్ణరాజు) తీసుకుపోయే తీరు హృద్యంగా ఉంది. నాయుడు గోపి దర్శకత్వం వహించారు (సీతమ్మ భర్త జోగన్నపంతులు పాత్ర కూడా ఆయనే ధరించారు). ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా అక్కడి పార్లమెంట్లో డొక్కా సీతమ్మ చిత్రపటం చూసి, విస్తుపోయిన జీఎంసీ బాలయోగి (ఒకప్పుడు లోక్‌సభ స్పీకర్, తరువాత దుర్మరణం పాలైనారు) స్వదేశం వచ్చాక ఆమె కుటుంబీకుల ద్వారా ఆమె గాథను తెలుసుకున్నట్టు రచయిత చిత్రించారు. అనన్య సామాన్యమైన సీతమ్మ (1841-1909) దాతృత్వాన్ని విని ఎడ్వర్డ్ ప్రభువు ‘ద మోస్ట్ చారిటబుల్ ఉమెన్ ఆఫ్ సౌత్ ఇండియా’ అని కీర్తించి ఆమె చిత్రపటాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో ఆవిష్కరించడం చారిత్రక వాస్తవం. తూర్పు గోదావరి జిల్లా, లంకల గన్నవరం అనే కుగ్రామంలో ఆమె అన్నదాన కార్యక్రమం నభూతో నభవిష్యతి అన్న రీతిలో సాగింది. ఆమెకు కులమత భేదాలు లేవు. ఎవరి దగ్గరా నయాపైసా తీసుకోలేదు. పైగా గోదావరి జిల్లాలను మలమలలాడించిన కరువు కాలంలో ఆమె నిరంతరాయంగా అన్నదానం చేసి చరిత్రకెక్కారు. అందుకు సంబంధించిన ఉదంతాలను నేటికీ ఆ ప్రాంతంలో కథలు కథలుగా చెప్పుకుంటారు. గోదావరి పొంగింది. అలాంటి సమయంలో అవతలి ఒడ్డు నుంచి ‘సీతమ్మ తల్లీ, ఆకలి’ అన్న ఆర్తనాదం వినిపించింది. అతడొక దళితుడు. సీతమ్మ వెంటనే అన్నం, బట్టలు పట్టుకుని, భర్త జోగన్నపంతులును తీసుకుని ఆవలి తీరానికి వెళ్లి అతడికి అన్నం పెట్టింది. ఇది కల్పనకు సైతం అందని వాస్తవ ఘటన. ఇలాంటి వాటితో నిండిన ఈ నాటకంలో కరుణరసం గోదారి పొంగులాగే కనిపించింది. ‘నువ్వు సముద్రం కన్నా పెద్ద అమ్మవు. మన పిల్ల గోదారి నీ దయను అడ్డుకోగలదా?’ వంటి మాటలు నాటకానికి వన్నె తెచ్చాయి. ‘అంతా దోచుకుపోయినా ఫర్వాలేదు. ఆకలితో మాత్రం వెళ్లకండి!’ అని దొంగలను కూడా ప్రేమతో కట్టడి చేసిన తల్లి సీతమ్మ. దీనితో పాటు, సర్ ఆర్థర్ కాటన్‌ను ఆమె సత్కరించే సన్నివేశం కూడా ప్రేక్షకులను అలరించింది. కొమురం భీం ప్రదర్శన పరంగా ప్రేక్షకులను విశేషంగా కదిలించింది. కానీ ఇతివృత్తాన్ని బట్టి మరింత యోగ్యంగా ప్రదర్శించే అవకాశాలు ఈ నాటకానికి ఉన్నాయి. స్వాతంత్య్రేచ్ఛను వ్యక్తీకరించే ఇలాంటి ఇతివృత్తానికి అవసరమైన లోతు కొద్దిగా లోపించిందని అనిపిస్తుంది. నిజాం ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన గిరిజన నాయకుడు భీం కథకు చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉద్వేగాలను ప్రదర్శించడమే చారిత్రక నాటకానికి కీలకమన్న భావన ఇందులోని చిరు లోపం. దీనితో ఇతివృత్తం ఆత్మ ప్రేక్షకునికి అందకుండా పరారైపోతుంది. ఖుర్బానీ తృతీయ ఉత్తమ ప్రదర్శనకు ఎంపికైంది. మరుగున పడిందని భావిస్తున్న చరిత్రను ఇలా రంగస్థలం అక్కున చేర్చుకోవడం శుభపరిణామం. ఈ పంథా కొనసాగాలి. - కల్హణ ఫొటోలు: గరగ ప్రసాద్ -
కొమురం భీంను నిజాం చంపలేదు: నాయిని
హైదరాబాద్: కొమురం భీంను నిజాం చంపలేదని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. నిజాం పాలనలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండవచ్చని, అయితే 99 శాతం మంచి పాలన అందించారని నాయిని వ్యాఖ్యానించారు. చరిత్ర తెలుసుకోకుండా కొందరు నిజాం పాలనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎంఐఎం తమ పార్టీకి కొన్ని అంశాలపై మాత్రమే సమర్థిస్తుందని పేర్కొన్నారు. ఎంఐఎం కూడా కొన్ని విషయాల్లో తమను విమర్శించిందని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు ఉనికి కాపాడుకోవడానికే తమపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తనకు తెలియదని నాయిని అన్నారు. -
కొమురం భీమ్....ఆ పేరే ఒక పోరాటం
-
ఆదివాసీ అభివృద్ధితో భీంకు నివాళి
నేడు కొమురం భీం 74వ వర్ధంతి కొమురం భీం మరణించి ఏడు దశాబ్దాలు దాటినా ఆదివాసీ జీవితం నేటికీ ఏ కొత్త చిగురులూ వేయలేదు, ఏ కొత్త పూవులూ పూయలేదు. ఈ నేపథ్యంలో నాలుగు తరాలుగా నెరవేరని ఆదిలాబాద్ భూమిపుత్రుల చిరకాల కోర్కెలను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పరిష్కరించాలి. ఆదివాసీ హక్కుల కోసం జరిగిన వీరోచిత పోరా టంలో 1941 అక్టోబర్ 8న కొమురం భీం అసువులు బాశాడు. ఆదిలాబాద్ మారుమూల ప్రాంతం నుం చి హైదరాబాద్‌కు కాలినడకన వెళ్లి నిజాం ప్రభు వుకు గిరిజనుల జీవన్మరణ బాధను భీం వినిపిం చాడు. భూములకు పట్టాలివ్వాలని, కప్పం కట్టాలని అధికార్లు, రజాకార్లు చేస్తున్న వేధింపులను ఆపాలని వేడుకున్నాడు. నిజాం సర్కారు కరుణించకపోగా రజాకార్లను ఉసిగొల్పడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన కొమురం భీం 1941 ఆశ్వయుజ మాసం కార్తీక పౌర్ణమినాడు 12 గ్రామాలకు చెందిన గిరిజన తెగ లను కూడగట్టి సామూహిక తిరుగుబాటుకు సిద్ధమ య్యాడు. రాజీ మార్గం విఫలమై నిజాం రజాకార్లు చేసిన దాడిలో భీం వీర మరణం పొందాడు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం భీం నేల కొరిగిన జోడెన్ ఘాట్‌ను తెలంగాణ సీఎం కె. చంద్రశేఖరరావు సందర్శించనున్నారు. కేసీఆర్ రాకకు రెండు రోజుల ముందు, ఆ పరిసర ప్రాం తాల్లో ఆంత్రం జంగు (18) డిగ్రీ విద్యార్థి, తొడసం రావు పటేల్ (55), జక్కావాడ్ (4), వేముల సోని (20) అనే నలుగురు గిరిజనులు తీవ్ర జ్వరాలతో మరణించారు. 74 ఏళ్ల క్రితం భీం ప్రాణాలొడ్డి చాటి న సమస్యలు నేటికీ అపరిష్కృతంగా ఉండటం నిజంగా సిగ్గుచేటు. గిరిజనుల ప్రాథమిక హక్కు జల్ జంగల్ జమీన్‌పై ఏ ప్రభుత్వాలూ పట్టించుకో లేదు. వారు సాగుచేస్తున్న అటవీ పోడు భూము లకు, బంజర్లకు నేటికీ సంపూర్ణ హక్కుపత్రాలు రాలేదు. భీం ప్రాణత్యాగం తర్వాత హక్కు పత్రాలి చ్చిన భూములకు చట్టబద్ధమైన సౌకర్యాలు, రుణ సదుపాయాలను నేటికీ కొమురం భీం వారసులు పొందకపోవడం ఘోరం. ఆదివాసీలకు నేటికీ రక్షిత నీరు లేదు. ప్రాణా లకు ప్రమాదకరమైన చెలిమల్లో, వాగుల్లో నీళ్లే వాళ్లకు ప్రధాన దిక్కు. ఈ అరక్షితమైన తాగునీళ్లే ప్రతి ఏటా వందలాది మంది గిరిజనుల ప్రాణా లను తీస్తున్నాయి. జిల్లాలోని ఆదివాసీల్లో నూటికి 70 మంది తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నవారే. వీరి అనారోగ్య మరణాలను నివారించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమైంది. కేసీఆర్ పర్యటన సంద ర్భంగానైనా జిల్లాలో అనారోగ్యం బారిన పడి మర ణిస్తున్న ప్రతి ఒక్క చావుకు శాశ్వత ముగింపు పలికేలా గట్టి చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో ఒక ఊరితో మరో ఊరికి రహ దారి సంబంధం లేని వాగులపై వంతెనలు లేని జిల్లాల్లో ఆదిలాబాద్‌దే అగ్రస్థానం. ఇక్కడ నేటికీ ఎడ్లబండ్లే అంబులెన్సులు. వర్షం వస్తే చాలు మంచా లు, కర్రకు కట్టిన జోలెలే రోగులకు ఆంబులెన్సులు అవుతున్నాయి. చస్తే అవే పాడెలవుతున్నాయి. జిల్లా లోని 32 అంబులెన్సులకుగాను 16 పైగా మూత పడ్డాయి. ప్రైవేట్ వాహనాలను అద్దెకు తీసుకునే శక్తి లేక నిస్సహాయ పరిస్థితుల్లో వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. శవాలను ద్విచక్ర వాహ నాలపై తీసుకెళుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాగ్దానం చేసినట్లుగా హెలికాప్టర్ అంబులెన్స్ (రోగులను హెలికాప్టర్ ద్వారా తరలించడం) సౌకర్యం కల్పిస్తే కేసీఆర్ గారికి ఆదివాసులు రుణపడి ఉంటారు. అపారమైన నీరున్న ఆదిలాబాద్ జిల్లా నుంచే ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వాటర్ గ్రిడ్‌ను ప్రారంభించాలి. వ్యవసాయానికి ఒక్క పంటకు కూడా సాగునీరు సౌకర్యం లేకపోవ డమే జిల్లాలో అన్నదాతల ఆత్మహత్యలకు కారణం. 1,050 కిలోమీటర్ల దూరం ప్రవహింపచేసి చేవెళ్లకు తరలించే మా ప్రాణహిత నీళ్లను ముందుగా అతి సమీపంలో ఉన్న మూలవాసుల ప్రాణాలకు, భూములకు కూడా హితం చేకూర్చే ప్రణాళిక కావా లిప్పుడు. ఇక్కడికి సమీపంలోని ఉట్నూరు ఆదివాసీ ప్రాంతంలోని భూములకు రెండు పంటలకు సాగు నీరు అందించాలి. మెరుగైన పారిశుధ్య వసతులను కల్పించాలి. ఆదివాసుల్లో రక్తహీనతను తొలగించి, రోగనిరోధక శక్తిని పెంచే అతి చౌకైన పౌష్టికాహా రాన్ని (జొన్నలు, కొర్రలు, రాగులు, సామలు, పప్పుదినుసులు) చౌకధరలతో ప్రత్యేక నిత్యావసర పథకం కింద అందించాలి. అన్ని రకాల పోషకాహార పంటలకు మద్దతు ధర పెంచి ప్రోత్సహించాలి. జిల్లాలోని ప్రతి ఆదివాసీ ప్రాణాన్నీ కాపాడే ప్రణా ళికలను సీఎం కేసీఆర్ ప్రకటించాలి. అదే కొమురం భీం ప్రాణార్పణకు అచ్చమైన నివాళి. - మర్సుకోల తిరుపతి (ఏజెన్సీ ఆరోగ్య పరిరక్షణ కమిటీ కన్వీనర్) నైనాల గోవర్ధన్ (తెలంగాణ జలసాధన సమితి అధ్యక్షులు) -
కాశ్మీర్ తరహా టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం!
హైదరాబాద్: గిరిజన హక్కుల కోసం పోరాడిన నాయకుడు కొమరం భీమ్ వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 8 తేదిన ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ లో జరిగే కొమరం భీమ్ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని తెలంగాణ రాష్ట్ర ఆటవీశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సహజవనరులు పుష్కలంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రామన్న అన్నారు. జిల్లాను కాశ్మీర్ తరహా టూరిజంగా అభివృద్ధి చేస్తామన్నారు. 200 ఎకరాల్లో కొమరం భీమ్ గౌరవార్థం ఓ పార్క్ ను ఏర్పాటు చేస్తామని జోగు రామన్న తెలిపారు. -
ఆదిలాబాద్ జిల్లా పేరును మార్చండి: సోనేరావు
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా పేరును గిరిజనల కోసం పోరాటం సాగించిన ఉద్యమ నేత కొమరం భీమ్ పేరుగా మార్చాలని ఆయన మనవడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి విజ్క్షప్తి చేశారు. సచివాలయంలోని సీఎం కార్యాలయంలో కేసీఆర్ ను కొమరం భీమ్ మనవడు సోనే రావు కలిసి విజ్క్షాపన పత్రాన్ని సమర్పించారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్దికి, గిరిజనుల అభివృద్ధికి, సంక్షేమానికి మరిన్ని పథకాలను ప్రారంభించాలని కేసీఆర్ కు సోనేరావు సూచించారు.