
కొమురం భీంను నిజాం చంపలేదు: నాయిని
హైదరాబాద్: కొమురం భీంను నిజాం చంపలేదని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. నిజాం పాలనలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండవచ్చని, అయితే 99 శాతం మంచి పాలన అందించారని నాయిని వ్యాఖ్యానించారు. చరిత్ర తెలుసుకోకుండా కొందరు నిజాం పాలనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.
ఎంఐఎం తమ పార్టీకి కొన్ని అంశాలపై మాత్రమే సమర్థిస్తుందని పేర్కొన్నారు. ఎంఐఎం కూడా కొన్ని విషయాల్లో తమను విమర్శించిందని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు ఉనికి కాపాడుకోవడానికే తమపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తనకు తెలియదని నాయిని అన్నారు.