'కల్కి' రేంజ్ ఇది.. నైజాంలో వసూళ్ల రికార్డ్ బ్రేక్ | Kalki 2898 AD Day 1 Collection Crossed RRR In Nizam | Sakshi
Sakshi News home page

Kalki 2898 Collection: ఒక్క ఏరియాలో ఇన్ని కోట్లా? 'కల్కి' రచ్చ రంభోలా!

Published Fri, Jun 28 2024 10:55 AM | Last Updated on Fri, Jun 28 2024 11:53 AM

Kalki 2898 AD Day 1 Collection Crossed RRR In Nizam

ప్రభాస్ 'కల్కి' రిలీజై అప్పుడే ఓ రోజు అయిపోయింది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి అంచనాలతో బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మిగతా చోట్ల ఏమో గానీ నైజాంలో మాత్రం సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సాధించిన ఓ రికార్డుని దాటేయడం విశేషం.

(ఇదీ చదవండి: 'బాహుబలి'కి కట్టప్ప.. 'కల్కి'లో మాత్రం ఏకంగా రెండు)

'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా రచ్చ లేపుతున్నాయి. మరీ ముఖ్యంగా తొలిరోజు వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మిగతా వాటి సంగతి కాస్త పక్కనబెడితే తాజాగా థియేటర్లలోకి వచ్చిన 'కల్కి' కేవలం నైజాం ఏరియాలోనే మొదటి రోజు రూ.24 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ (రూ.23.55 కోట్లు) పేరిట ఉన్న ఘనత వెనక్కి వెళ్లిపోయింది.

కేవలం ఒక్క నైజాం ఏరియాలోనే 'కల్కి' ఈ రేంజు వసూళ్లు సొంతం చేసుకుందంటే ఓవరాల్ Day-1 కలెక్షన్స్‌లో ఇంకెన్ని రికార్డులు బద్ధలు కొట్టేసి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. అయితే నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా తొలిరోజు వసూళ్లు గురించి పోస్టర్ రిలీజ్ చేయాల్సి ఉంది.

(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)

(ఇదీ చదవండి: 'కల్కి' మూవీలో కృష్ణుడిగా చేసిన నటుడెవరో తెలుసా?)

(ఇదీ చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement