కారు బోల్తా పడి ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
అనంతపురం(చిలమత్తూరు): కారు అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన ఆదివారం తెల్లవారు జామున చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద ఎన్‌హెచ్44పై చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
కారు నెంబర్(కేఏ 51 ఎంఈ 4235)ను ఆధారంగా క్షతగాత్రులు బెంగుళూరుకు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.