డ్రగ్స్‌ ముఠాపై ఎస్‌ఓటీ పోలీసుల దాడులు | SOT police attacks on Drugs gang, two held | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ ముఠాపై ఎస్‌ఓటీ పోలీసుల దాడులు

Published Wed, May 4 2016 10:13 PM | Last Updated on Fri, May 25 2018 2:11 PM

డ్రగ్స్‌ ముఠాపై ఎస్‌ఓటీ పోలీసుల దాడులు - Sakshi

డ్రగ్స్‌ ముఠాపై ఎస్‌ఓటీ పోలీసుల దాడులు

హైదరాబాద్‌: నిషేధిత డ్రగ్స్‌ను విక్రయిస్తున్న ముఠాపై సైబరాబాద్‌లో ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేశారు. మాదాపూర్‌లోని సన్‌సిటీ లో రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రగ్స్‌ పంపిణీ చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యులో ఇద్దరిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. గత 2013 నుంచి గోవా, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి పలు నగరాల్లో ఈ ముఠా నిషేధిత మాదక పదార్థాలను పంపిణీ చేస్తోంది. ఈ ముఠా సభ్యుల్లో నైజీరియా నివాసి, సిమాన్‌ సహా పలువురు నిషేధిత మాదక పదార్థాలను పలుమార్లు హైదరాబాద్‌ నగరంలో విక్రయించినట్టు పోలీసులు వెల్లడించారు.

నిందితుల నుంచి 44 గ్రాముల మాదక పదార్థాలు 50 చిన్న ప్యాకెట్లతో పాటు నగదు 30 వేల రూపాయలు, రెండు మొబైల్‌ ఫోన్లు, రెండు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముగ్గురిలో ఒకరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. రాజేంద్ర నగర్‌ పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement