సాక్షి, కేరళ: 16 ఏళ్ల బాలికపై ఓ ఎస్సైతో సహా నలుగురు అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఆలప్పుజా జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్‌ఐతో సహా నలుగురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వివరాలు.. ఆలప్పుజా జిల్లా మారారికులం ప్రాంతానికి చెందిన ఆదీరా(37) అదే ప్రాంతంలోని దళిత కుటుంబానికి చెందిన 16 సంవత్సరాల వయస్సు గల చిన్నారికి పని ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళింది. కానీ ఆమె బాలికకు పని ఇప్పించకుండా ఆ బాలికను వ్యభిచారం గృహంలోకి తోసింది. దీంతో బాలిక అనారోగ్య పాలైంది. అనంతరం ఆదీరా చిన్నారిని ఇంటి దగ్గర వదిలి పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అది గమనించిన స్థానికులు బాలిక ఏడుస్తూ కనిపించడంతో ఆదీరాను పట్టుకుని విచారించారు. ఆ చిన్నారి జరింగిందతా చెప్పడంతో ఆదీరాను మరారికుళమ్ పోలీసులకు అప్పగించారు. బాలికను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.
విచారణలో ఆదీరా తెలిపిన వివరాల ప్రకారం బాలికను మారారికులమ్ పోలీసు స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న లైజీ (39), మత్తు పదార్థాల నిషేధ విభాగ అధికారి థామస్ (46), ప్రిన్స్ (32), జీను (33) ఈ నలుగురు అత్యాచారం చేశారని తెలిసింది. అనంతరం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు. ఇంకా ఆదీరాని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment