చేసినోడు..చూసినోడే కాదు...రాసినోడిదీ తప్పేనట! | SI over action on woman rape case | Sakshi
Sakshi News home page

చేసినోడు..చూసినోడే కాదు...రాసినోడిదీ తప్పేనట!

Published Wed, Oct 25 2017 12:49 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM

SI over action on woman rape case - Sakshi

ఫ్రెండ్లీ పోలీసింగ్‌.. పోలీసులు మీకు, సమాజానికి స్నేహితులే.. శాంతిభద్రతల పరిరక్షణలో వారికి సహకరించండి..మీ చుట్టుపక్కల ఏదైనా అన్యాయమో.. అక్రమమో.. నేరమో జరుగుతుంటే వెంటనే వారికి ఫోన్‌ చేయండి.. వారొచ్చి అడ్డుకుంటారు..మీ వివరాలు గోప్యంగా ఉంచుతారు.. పోలీసు ఉన్నతాధికారులు ఉవాచించే ఈ ప్రకటనలన్నీ ఊకదంపుడు ప్రసంగాలేననిపిస్తోంది.. నిజానికి వారికి అంత పెద్దమనసు లేదనిపిస్తోంది.. ఎక్కడో ఏమో కానీ మన విశాఖ పోలీసులు మాత్రం అలానే ప్రవర్తిస్తున్నారు. నేర సమాచారం ఇచ్చిన వారినే అరెస్టుల పాల్జేస్తున్నారు..   మూడురోజుల క్రితం రైల్వేస్టేషన్‌ సమీపంలో పట్టపగలు, నడిరోడ్డుపై జరిగిన ఓ అత్యాచార ఘటన సమాచారం ఇచ్చిన ఆటోడ్రైవర్‌ను అరెస్టు చేశారు. చివరికి ఆ దుస్సంఘటనను  కవర్‌ చేసినా మీడియా ప్రతినిధులను కూడా పిలిపించి  వేధింపులకు గురిచేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆడ లేక మద్దెల ఓడు... అవడానికి ముతక సామెతే కావొచ్చు గానీ విశాఖ నగర పోలీసుల పని తీరుకు ఇది సరిగ్గా వర్తిస్తుంది. నగరంలో రోజురోజుకీ పేట్రేగిపోతున్న నేరాలు, ఘోరాలు, దారుణాలను ఏమాత్రం కట్టడి చేయలేని పోలీసులు... వృత్తిరీత్యా ఆయా ఘటనలను కవరేజ్‌ చేస్తున్న పాత్రికేయులను మాత్రం వేధింపులకు గురి చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... మూడురోజుల కిందట రైల్వేస్టేషన్‌ సమీపంలో మ తిస్థిమితం లేని యాచకురాలిపై ఓ యువకుడు మిట్టమధ్యాహ్నం అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ సమయంలో అక్కడే ఉ న్న ఓ ఆటో డ్రైవర్‌ సాక్ష్యాధారాల కోసం సెల్‌ఫోన్‌లో చిత్రీ కరించి వెంటనే పోలీసులకు, మీడియా వారికి సమాచా రం అందించాడు. అత్యాచారాన్ని అడ్డుకోకుండా సెల్‌ఫో న్‌లో చిత్రీకరించిన అతని వైనంపై విమర్శలు వెల్లువెత్తినా... తాను ఆ సమయంలో అంతకంటే ఏమీ చేయలేకపోయానని చెప్పుకొచ్చాడు.

మద్యం మ త్తులో తెగబడుతున్న ఆ యువకుడిని అడ్డుకోలేక ఏం చేయాలో తెలియని పరిస్థితిలోనే తాను సెల్‌ఫోన్‌లో వీడియో తీశానని చెబుతున్నాడు. ఇప్పుడు ఇ దంతా ఎందుకంటే... వీడియో తీసిన ఆటోడ్రైవర్‌ను స్టేషన్‌కు ఎత్తుకెళ్లిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చే పట్టారు. అక్కడితో ఆగకుండా ఆ అత్యాచార ఫ ుటనను కవర్‌ చేసిన మీడియా జర్నలిస్టులను సై తం వేధింపులకు గురి చేయడం ఇప్పుడు వివా దాస్పదమవుతోంది. మంగళవారం సాయంత్రం ఆ ఘటన కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ సురేష్‌ మీడియా ప్రతినిధులకు ఫోన్‌ చే శారు. ఆ రోజు ఘటన గురించి తమకు మరిన్ని  వివరాలు కా వాలని, ఓసారి స్టేషన్‌కు వస్తే మాట్లాడుకుందామని అన్నారు. అడపాదడపా మీడియా ప్రతినిధులు, పోలీసులు ఒకరినొకరు స మాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం మామూలే కాబట్టి.. కొంతమం ది ఫొటో జర్నలిస్టులు మంగళవారం రాత్రి ఫోర్త్‌ టౌన్‌కు వెళ్లారు.

ఎస్‌ఐ ఓవర్‌యాక్షన్‌
విలేకరులను పిలిచి ఎస్‌ఐ సురేష్‌ చేసిన ఓవర్‌ యాక్ష న్‌ వివాదాస్పదమవుతోంది. సమాచారం ఇవ్వాల్సిం  దిగా రమ్మని సూచించిన ఎస్‌ఐ తీరా అ క్కడకు వెళ్లిన తర్వాత... విచారణ మా దిరి మాట్లాడటంపై అభ్యంతరాలు వ్య క్తమవుతున్నాయి. ఆ వీడియో మీకు ఎక్కడిది... మీకు ఎవరు పంపించారు.. మీరు ఎవరెవరికి పంపించారు.. అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్‌ చూ సి ఇస్తా అని తీసుకుని.. షేర్‌ ఇట్‌తో డేట్‌ చెక్‌ చేశాడు.. అక్కడితో ఆగకుండా ఫోన్‌ సీజ్‌ చేస్తానంటూ హడావుడి చేశాడు. ఆ ఘటనకు సంబంధించి తెల్లకాగితంపై ఎస్‌ఐ ఏదేదో రాసుకుని.. కింద సంతకం పెట్టాల్సిందిగా ధొటో జర్నలిస్టులపై ఒత్తిడి తీసుకువచ్చాడు.. ఇదేమిటి.. మాకేం సంబంధం అని మొత్తుకున్నా రాసివ్వాల్సిందేనంటూ ఒత్తిడి చేశాడు. ఆఫీసు వేళల్లో మీరు మమ్మల్ని పిలిచి ఇలా అడగడం సరికాదని ఫొటో జర్నలిస్టులు స్పష్టం చేసి స్టేషన్‌ బయటకు వచ్చేశారు. అత్యాచార ఘటన వార్తను కవర్‌ చేసిన ఫొటో జర్నలిస్టులపై ఓ ఎస్‌ఐ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది.

ఆటో డ్రైవర్‌ శ్రీను అరెస్ట్‌
సీతమ్మధార (విశాఖ ఉత్తరం): మానవత్వంతో పోలీసులకు సమాచారం ఇచ్చినందుకు ఆటోడ్రైవర్‌ని పోలీసులు అరెస్ట్‌ చేయడం సంచలనం రేపింది. నగరంలో ఆదివారం నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మతిస్ధిమితం లేని మహిళపై యువకుడు లైంగిక దాడికి దిగిన సంఘటనను వీడియో తీసిన ఆటో డ్రైవరు శ్రీనును నాలుగో పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు... పట్టపగలే నడిరోడ్డుపై శివ అనే యువకుడు లైంగిక దాడికి దిగిన దారుణాన్ని వీడియో తీసి పలువురికి పంపించినందుకు పోలీసులు ఆటోడ్రైవర్‌పై 354 (సి) సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. బుధవారం రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆటోడ్రైవరు శ్రీనును వేరే చోట ఉంచినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement