మెదక్ రూరల్ : తొమ్మిదేళ్ల బాలికపై వరుసకు మేనమామ అయిన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మెదక్ మండలం మంబోజిపల్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. రూరల్ ఎస్‌ఐ వినాయకరెడ్డి కథనం మేరకు.. మండలంలోని మంబోజిపల్లి గ్రామానికి చెందిన బాలిక (9) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. కాగా.. బాలికకు మేనమామ వరుస అయిన నరసింహులు హైదరాబాద్‌లో ఉంటూ సోమవారం మంబోజిపల్లికి వచ్చాడు. ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు.
బాలిక తల్లిదండ్రులు వారింట్లోనే పడుకోగా.. నరసింహులు బాలికను పిలుచుకుని అదే గ్రామంలో ఉంటున్న బాలిక పెద్దనాన్న ఇంటికి వెళ్లాడు. అక్కడ పడకున్నాక అర్ధరాత్రి సమయంలో బాలికను ఇంటి పక్కనే గల వ్యవసాయ పొలాల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో బాలిక కేకలు వేసింది. ఈ శబ్దం విన్న గ్రామస్తులు నిద్రలేచి సంఘటనా స్థలానికి చేరుకునేసరికి నరసింహులు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయాన్ని బాలిక అక్కడి వారికి చెప్పింది. ఈ మేరకు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు వైద్యపరీక్షల నిమిత్తం బాలికను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
బాలికపై అత్యాచారం
Published Wed, Apr 22 2015 2:25 AM | Last Updated on Sun, Sep 2 2018 3:57 PM
Advertisement
Advertisement