narsimhulu
-
మోత్కుపల్లికి పోటీ చేసే అవకాశం కల్పించాలి
యాదగిరిగుట్ట: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మ డి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆయన అనుచరులు సీఎం కేసీఆర్‌ను కోరారు. భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో గురువారం మోత్కుపల్లి నర్సింహులు అభిమానులు, అనుచరులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోత్కుపల్లి నర్సింహులు 5 సార్లు ఆలేరు నుంచి, ఒక సారి తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే గెలిచారన్నారు. రాజకీయాల్లో మంచి అనుభవం ఉన్న మోత్కుపల్లి నర్సింహులును సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభ సమయంలో పిలిచి, బీఆర్ఎస్లోకి ఆహ్వనించారని తెలిపారు. ఆ సమయంలోనే రాష్ట్ర స్థాయిలో మంచి పదవి ఇచ్చి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు మోత్కుపల్లికి ఎలాంటి పదవులు ఇవ్వలేదని ఆవేద అభివాదం చేస్తున్న మోత్కుపల్లి అనుచరులున వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ నాయకుడికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించాలన్నారు. -
సాయుధ పోరాట యోధుడు నర్సింహులు కన్నుమూత
సాక్షి, యాదాద్రి/అంబర్‌పేట: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ (ఎం ఎల్) జనశక్తి నేత, ప్రజా విమోచన సంపాదకుడు బండ్రు నర్సింహులు (104) తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొంది ఈ నెల 21న డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అనంతరం బాగ్ అంబర్‌పేట డీడీ కాలనీ లోని కుమారుడు ప్రభాకర్ నివాసంలో ఉం టున్నారు. శనివారం బండ్రు నర్సింహులు గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ప్రభాకర్, భాస్కర్, కుమార్తెలు విమలక్క (అరుణోదయ, విప్లవ గాయకురాలు), జయమ్మ ఉన్నారు. ఆయన పార్ధివ దేహాన్ని గాంధీ వైద్య కళాశాలకు కుటుంబ సభ్యులు దానం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్య దర్శి చాడ వెంకట్‌రెడ్డి, వామపక్ష నేతలు గోవర్ధన్, ఎన్.శ్రీనివాస్, పరశురామ్, డీడీ కాలనీకి వచ్చి బండ్రు నర్సింహులు మృతదేహానికి నివాళులర్పించారు. ఆలేరులో నక్సల్ ఉద్యమానికి శ్రీకారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెంది న కొమురవ్వ, బుచ్చి రాములు దంపతు లకు జన్మించిన బండ్రు నర్సింహులు ఆలేరు ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమానికి పురుడు పోశాడు. చిన్నతనంలో తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మీద పడి నర్సింహులు ఆలేరులో కొంతకాలం హమాలీగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆంధ్ర మహాసభ ద్వారా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ లో చేరారు. తెలంగాణ సాయుధ పోరాటంలో గెరిల్లా దళ కమాండర్‌గా పోరాటం నడుపుతూ రాయగిరి వద్ద అరెస్టయ్యారు. జనగామ మిలటరీ క్యాంపు, నల్లగొండ జైలులో చిత్రహింసలు అనుభవించారు. 1964లో డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్, మీసా చట్టం కింద అరెస్ట్ అయి పన్నెండేళ్లు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత సీపీఐ (ఎంఎల్) పార్టీలో చేరి తరిమెల నాగిరెడ్డి నాయకత్వంలో పనిచేశారు. అనంతరం చండ్ర పుల్లారెడ్డి గ్రూపులో.. అనంతరం జనశక్తి పార్టీ రాజన్న వర్గంలో పనిచేశారు. సికింద్రాబాద్ కుట్ర కేసులో అరెస్ట్ 1971 నుంచి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్ ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సమావేశాలు, సభలు, ఊరేగింపులు, వాటికి ముందు జరిగిన హింసాత్మక ఘటనల ఆధారంగా సికింద్రాబాద్ కుట్ర కేసు నమోదు చేశారు. ఇందులో బండ్రు నర్సింహులు తదితరులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. సికింద్రాబాద్ కుట్ర కేసులో ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాలు సేకరించలేదని సెషన్స్ కోర్టు అభిప్రాయపడుతూ 1989 ఫిబ్రవరి 27న అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. 2015లో నూరేళ్ల పండుగ బండ్రు నర్సింహులు ‘నూరేళ్ళ సభ–నూటొక్క పాట’కార్యక్రమం 2015 అక్టోబర్ 1న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో జరిగింది. అప్పుడే నర్సింహులు 100వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కాగా, నర్సింహులు మృతికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. -
మెరిసిన ‘పేట’ తేజం
నారాయణపేట రూరల్/జడ్చర్ల టౌన్ : వలసలు.. వెనుకబాటుకు మారుపేరుగా ఉన్న నారాయణపేట జిల్లాకు అరుదైన గుర్తింపు లభించింది. తాజాగా విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో పేటకు చెందిన రాహుల్ ఆలిండియాలో 272వ ర్యాంకు సాధించారు. రిటైర్డ్ పీఈటీ నర్సింహులు, హిందీ టీచర్ శశికళ దంపతుల కుమారుడైన రాహుల్ పదో తరగతి వరకు నారాయణపేటలోనే విద్యాభ్యాసం చేశారు. 2016లో ఏఈగా ఎంపికైనా ఆయన సివిల్స్ సాధించేందుకు రెండేళ్లు లాంగ్‌లీవ్ పెట్టి అనుకున్నది సాధించారు. మరోవైపు జడ్చర్ల మండలం చాకలిగడ్డతండా వాసి శశికాంత్‌కు 764వ ర్యాంక్ వచ్చింది. -
అటెండర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి..
సాక్షి, హైదరాబాద్: ఆయన ఆత్మ విశ్వాసం ముందు అంగవైకల్యం ఓడిపోయింది. పట్టుదలతో సాధించిన విజయం యువతకు స్ఫూర్తిగా నిలిచింది. బతుకుదెరువు కోసం అటెండర్‌గా పని చేసిన ఆయన ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి అర్హత సాధించారు. ఆయనే సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలా నికి చెందిన దళిత యువకుడు పిట్ల నర్సింహులు. మంత్రి కె.తారకరామారావు ఇచ్చిన చేయూతే నర్సింహులు జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడాయనకు మంత్రి మరింత భరోసా కల్పించారు. రూ. 2 లక్షలు నగదు అందించారు. గుడిసెలో నివాసం ఉంటున్న వారి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పేదరికం కారణంగా.. పిట్ల నర్సింహులుకు పుట్టుకతోనే అంగవైకల్యం. అయినా విధిరాతకు ఎదురొడ్డి పీజీ వరకు చదువుకున్నారు. ఆపై చదవాలనుకున్నా పేదరికం అడ్డుపడింది. వయసైపోయిన తల్లిదండ్రులు, పెళ్లీడుకొచ్చిన నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. దాంతో ఏదో ఒక ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎంత ప్రయత్నించినా ఏ ఉద్యోగమూ దొరకలేదు. దాంతో ఒక రోజు గ్రామ సభకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ను కలసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. జీవితంలో ఏదో సాధించాలన్న నర్సింహులు తపనను గుర్తించిన మంత్రి కేటీఆర్.. సిరిసిల్లలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఉద్యోగం ఇప్పించారు. పైచదువులు చదవాలని, సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. దీంతో నర్సింహులు అటు కుటుంబాన్ని పోషిస్తూనే ఇటు చదువుకున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష (జేఆర్ఎఫ్)లో ఉత్తీర్ణత సాధిం చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. శుక్రవారం నర్సింహులును తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఆయ న విజయాన్ని అభినందించి, రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించారు. గుడిసెలో ఉంటున్న నర్సింహులు కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. వచ్చే దసరా నాటికి ఆ కొత్త ఇంట్లో భోజనం చేస్తావని నర్సింహులుకు మాటిచ్చారు. ‘‘అంగవైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో జయించిన నర్సింహులు గెలుపు అందరికీ స్ఫూర్తినిస్తుంది. యువతకు నర్సింహులు రియల్ ఇన్స్పిరేషన్. స్పష్టమైన లక్ష్యంతో ప్రయత్నిస్తే కష్టాలెన్ని ఎదురొచ్చినా కలను నెరవేర్చుకోవచ్చన్న నిజం మరోసారి స్పష్టంగా తెలిసింది..’’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక అటెండర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన నర్సింహులును చూసి తాము గర్వపడుతున్నామని నర్సింహులుకు ఉద్యోగం ఇచ్చిన వెన్నెల జూనియర్ కాలేజీ ప్రిన్సి పాల్ చైతన్యకుమార్ పేర్కొన్నారు. -
ఏడున్నడో.. ఎట్లున్నడో..
కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన శాడ నర్సింహులుకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నా నీటి సౌకర్యం లేక, పంటలు పండక అప్పులు అయ్యాయి. దీంతో గల్ఫ్ పోవాలనుకున్నాడు. సౌదీలోని గిద్ద ప్రాంతం లో కంపెనీ వీసాతో ఉద్యోగం ఉందని తెలుసు కుని వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కామారె డ్డిలోని ఓ ట్రావెల్స్ ఏజన్సీలో రూ.80వేలు చెల్లించి 2016 జూన్ 29న ఇక్కడ నుంచి సౌదీ బయల్దేరాడు. మరుసటి రోజు అతని భార్య కిష్టవ్వకు ఫోన్ చేసి కంపెనీ మనుషులు వచ్చి తనను తీసుకు వెళ్లారని చెప్పాడు. ఆ తర్వాత అతని వద్ద నుంచి ఇక ఎలాంటి ఫోన్ రాలేదు. కుటుంబ సభ్యులు అతనితోపాటు గదిలో ఉండే రామారెడ్డి గ్రామానికి చెందిన వారికి ఫోన్ చేసి వాకబు చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రోజు నుంచి నర్సింహులు కనిపించ డం లేదని వారు చెప్పడంతో ఆందోళనకు గుర య్యారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండాపో యింది. కామారెడ్డిలోని ట్రావెల్ ఏజన్సీ, వీసా పంపిన వ్యక్తి అందరూ చేతులెత్తేశా రు. దీంతో నర్సింహులు కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పట్టించుకుంటలేరు.. సౌదీ వెళ్లగానే ఫోన్ చేసిండు. చేరుకున్న అన్నడు. ఆ తర్వాత ఎక్కడున్నడో, ఎట్లున్నడో ఏం తెల్వదు. వీసా పంపిన వాళ్లను, అందరిని అడిగి జూసినం. మాకేం తెల్వదంటున్నారు. మా ఆర్థిక పరిస్థితి బాగా లేదు. అప్పులు పెరిగినై. పిల్లలు బెంగపెట్టుకున్నరు. ప్రభుత్వం స్పందించి నా భర్త జాడను తెలుసుకుని మాకు న్యాయం చేయాలి. – కిష్టవ్వ కష్టాల్లో నర్సింహులు కుటుంబం గల్ఫ్ వెళ్లిన నర్సింహులు గల్లంతవడంతో అతని కుటుంబం కష్టాల్లో పడింది. అతనిది నిరుపేద కుటుంబం. ఆయన భార్య కిష్టవ్వ బీడీలు చుడుతూ ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. కూతురు శిరీష కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఫైనలి యర్ చదువుతుండగా, స్థోమత లేక కుమారుడు నవీన్ ఇంటర్‌తో ఆపేశాడు. డిగ్రీ చదువుతూనే తల్లికి చేదోడుగా ఉండేందుకు శిరీష కూడా బీడీలు చుడుతోంది. ఓ వైపు నర్సింహులు జాడ లేదనే బాధతోపాటు గల్ఫ్ వెళ్లేందుకు చేసిన అప్పులు తడిసి మోపెడవుతున్నాయని ఆందోళనకు గురవుతున్నారు. బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లిన వ్యక్తి అక్కడి వెళ్లిన మరుసటి రోజే అదృశ్యమయ్యాడు. సౌదీకి వెళ్లిన అతడు.. అక్కడి చేరుకున్నట్టు ఫోన్ చేసి చెప్పాడు. అదే చివరి మాట. అప్పటి నుంచి ఫోన్ లేదు.. అత ని జాడ లేదు. ఎన్నిర కాలుగా ప్రయత్నించినా యేడాదిన్నరగా ఏ సమాచారమూ లేదు. ఇంటికి పెద్ద దిక్కు ఏమయ్యాడో, ఎక్కడున్నడో.. ఎట్లున్నడో తెలియక భార్య, పిల్లలు తల్లడిల్లుతున్నారు. సిరిసిల్ల: గల్ఫ్ వెళ్లే వారిలో పెద్దగా చదువు రానివారు ఎక్కువగా ఉన్నారు. వీరికి నకిలీ ఏజెంట్లు విజిటింగ్ వీసాలు అంటగట్టి వర్క్‌పర్మిట్ లేకుండా పంపిస్తున్నారు. దీంతో అక్కడికి వెళ్లాక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. భారతీయ విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ (పీవోఈ)ని ఏర్పాటు చేసింది. తెలంగాణ జిల్లాల్లో లైసెన్స్ పొందిన ఏజంట్ల వివరాలు హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమ్మిగ్రెంట్స్(పీవోఈ) కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. ఏదైనా ఒక పనిలో వృత్తి నైపుణ్యం కలిగి ఉండాలి. నైపుణ్యం ఉంటే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఏ నైపుణ్యం లేకుండా వెళ్తే.. అన్ స్కిల్ లేబర్‌గా గొడ్డు చాకిరీ చేయాల్సి ఉంటుంది. పాస్‌పోర్టులో ఇంటిపేరు, తండ్రి, తల్లి, భార్య పేర్లు తప్పులు లేకుండా చూసుకోవాలి. ఇంటి అడ్రస్, విద్యార్హతలు, జన్మస్థలం, పుట్టిన తేదీ నమోదు చేసుకోవాలి. ఇండియన్ ఎంబసీచే ధ్రువీకరించబడిన అరబ్బీతో పాటు ఇంగ్లీష్, తెలుగు భాషలలో గల ఉద్యోగ ఒప్పం ద పత్రం కలిగి ఉండాలి. ఉద్యోగ ఒప్పంద పత్రం ఒక శ్రామికునిగా మీ హక్కులను కాపాడుతుంది. కనీసం ఆరు నెలలపాటు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టు ఉండేట్లుగా చూసుకోవాలి. చెల్లుబాటులో ఉన్న వీసా తప్పకుండా పాస్‌పోర్టుపై స్టాంపింగ్ అయి ఉండాలి. లేదా విడిగా వీసాపత్రం ఉండాలి. విదేశాలకు వెళ్లే ముందు వైద్యపరీక్షలు చేయించుకోవాలి. గల్ఫ్‌లో పనిలోకి తీసుకునే ముందు మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఫెయిల్ అయితే ఉద్యోగం నుంచి తొలగించి ఇంటికి పంపిస్తారు. ముందుగా చూసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో జాయింట్ బ్యాంకు అకౌంట్ తీయాలి. గల్ఫ్ వెళ్లేవారు పాస్‌పోర్టు, వీసా, ఆధార్‌కార్డు వంటి ధ్రువీకరణ పత్రాలను జిరాక్స్ తీసి ఒక సెట్ ఇంటి దగ్గర భద్రపరచాలి. విదేశాలకు వెళ్లేవారు ప్రవాసీ భారతీయ బీమా యోజన (పీబీబీవై ఇన్సూరెన్స్) తప్పనిసరిగా చేయించుకోవాలి. -
సిద్ధిపేటలో దొంగల బీభత్సం
సిద్ధిపేట మండలకేంద్రం గణేశ్ నగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా నివాసముంటున్న శ్రీశైలం, పదయ్య, నర్సింహులు అనే ముగ్గురి ళ్లలో చోరీకి పాల్పడ్డారు. మూడిళ్లలో కలిపి 2 తులాల బంగారం, రూ.10 వేల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పొలం పనుల్లో విషాదం.. ట్రాక్టర్ డ్రైవర్ మృతి
నిజామాబాద్జిల్లా మాచారెడ్డి మండలం ఇస్సాయిపేటలో శుక్రవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. ఓ రైతు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతున్న సమయంలో డ్రైవర్ నర్సింహులు (45) పట్టుతప్పి కింద పడిపోయాడు. యంత్రం కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. -
పెళ్లికి వెళ్లి వస్తూ అనంత లోకాలకు...
ఇద్దరు మృతి, మరో ఐదుగురికి గాయాలు యాలల (రంగారెడ్డి జిల్లా) పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఓ డీసీఎం వ్యాన్ రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురురికి తీవ్రగాయాలైన సంఘటన యాలాల మండలం దండమీదపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలంలోని అన్నారం గ్రామాస్తులు కర్ణాటకలో ఓ పెళ్లికి హాజరయై తిరిగి వస్తున్నారు. యాలల మండలం దండమీదపల్లి వద్ద డీసీఎం వ్యాన్ వెనుక డోర్ ఊడిపోయింది. వెనక భాగంలోని వారు రోడ్డుపై పడ్డారు. అందులో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతులు మహబూబ్‌నగర్ అన్నారానికి చెందిన నర్సింహులు(20), పెంటయ్య(14) గా గుర్తించారు. -
ఫుడ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని మోసం - అరెస్ట్
వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని నందిని రెస్టారెంట్ యజమాని నర్సింహులుకు ఎల్ అండ్ టి ఫుడ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తామని మోసగించిన కేసులో కడప చిన్నచౌక్ పోలీసులు మంగళవారం నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 15,50,000 రూపాయల నగదు, నాలుగు సెల్ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన సందీప్‌సింగ్ అనే వ్యక్తి నర్సింహులుకు ఫోన్‌చేసి ఎల్ అండ్‌టీ ఫుడ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మబలికి విడతలవారీగా 23 లక్షల రూపాయలు వసూలు చేసుకున్నాడు. ఎన్నిరోజులైనా ఫుడ్ కాంట్రాక్ట్ రాకపోవడంతో మోసపోయానని భావించిన నర్సింహులు పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు దుండగులు కర్నూలు జిల్లా నందికొట్కూరులో తలదాచుకున్నట్లు గుర్తించి మంగళవారం ఉదయం ఆ ముఠాలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అసలు నిందితుడు సందీప్ సింగ్ పరారయ్యాడు. అతనికోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. -
చింతపండు దొంగలించాడని..
ధరూరు: రంగారెడ్డి జిల్లా ధరూరు మండలం గుడిదొట్ల గ్రామంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. నర్శింహులు(30) అనే వ్యక్తి చింతపండు దొంగతనం చేశాడని కావరి రాము అనే వ్యక్తి గ్రామంలో పంచాయతీ పెట్టాడు. అంతేకాకుండా అతనిని గ్రామస్తులు చితకబాదారు. దాంతో అవమానంగా భావించిన నర్శింహులు ఇంటికెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామస్తులు అవమానించడంతోనే నర్శింహులు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. -
బోయినపల్లిలో వ్యక్తి దారుణహత్య
హైదరాబాద్: నగరంలోని బోయినపల్లిలో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోది చంపారు. మృతుడు బేగంపేటలోని ఇంద్రానగర్‌కు చెందిన నర్సింహులుగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధ తాళలేక...
అప్పుల బాధ తాళలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మంథని మండలం స్వర్ణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింహులు(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో పత్తి దిగుబడి సరిగ్గా రాకపోవడంతో.. ప్టెటిన పెట్టుబడులు కూడా తిరిగి రాలేదు. దీంతో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు తీర్చే దారి కానరాక ఈ రోజు ఉదయం పత్తి చేను వద్దకు వెళ్లి అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన రైతులు అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నిమ్మనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
నిమ్మనపల్లి మండలం కొల్లసానివారిపల్లె వద్ద సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో కొల్లసానివారి పల్లె గ్రామానికి చెందిన నర్సింహులు(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
బాలికపై అత్యాచారం
మెదక్ రూరల్ : తొమ్మిదేళ్ల బాలికపై వరుసకు మేనమామ అయిన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మెదక్ మండలం మంబోజిపల్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ వినాయకరెడ్డి కథనం మేరకు.. మండలంలోని మంబోజిపల్లి గ్రామానికి చెందిన బాలిక (9) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. కాగా.. బాలికకు మేనమామ వరుస అయిన నరసింహులు హైదరాబాద్‌లో ఉంటూ సోమవారం మంబోజిపల్లికి వచ్చాడు. ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. బాలిక తల్లిదండ్రులు వారింట్లోనే పడుకోగా.. నరసింహులు బాలికను పిలుచుకుని అదే గ్రామంలో ఉంటున్న బాలిక పెద్దనాన్న ఇంటికి వెళ్లాడు. అక్కడ పడకున్నాక అర్ధరాత్రి సమయంలో బాలికను ఇంటి పక్కనే గల వ్యవసాయ పొలాల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో బాలిక కేకలు వేసింది. ఈ శబ్దం విన్న గ్రామస్తులు నిద్రలేచి సంఘటనా స్థలానికి చేరుకునేసరికి నరసింహులు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయాన్ని బాలిక అక్కడి వారికి చెప్పింది. ఈ మేరకు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు వైద్యపరీక్షల నిమిత్తం బాలికను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
నెట్వర్క్: అప్పుల బాధలు, రుణమాఫీపై అనుమానాలు.. విద్యుత్ కోతలు వెరసి రుణదాతలు ఉసురు తీసుకుంటున్నారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో సోమవారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచకు చెందిన చాకలి నర్సింహులు(35) తనకున్న రెండెకరాల్లో మూడు బోర్లు తవ్వించాడు. అవి వట్టి పోవడంతో అప్పుల కుప్పగా మారాడు. మరో వైపు మండల కేంద్రంలోని స్టేట్‌బ్యాంక్‌లో తనకున్న రూ. 45 వేల రుణం మాఫీ అవుతుందో లేదోనన్న బెంగపట్టుకుంది. ఈ క్రమంలో తన చెరుకుతోటలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కొమరారం గ్రామానికి చెందిన రైతు గంగావత్ తారు (40) తనకున్న ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితుల్లో పంట ఎండిపోవడంతో మరోసారి రెండున్నర ఎకరాల్లో అదే పంట వేశాడు. విద్యుత్ కోతలతో పంటకు నీరందక ఎండిపోయింది. పంట పెట్టుబడికి తోడు పాత రుణం మొత్తం రు. 4 లక్షల వరకు అప్పు అయింది. సోమవారం చేను వద్దకు వెళ్లిన తారు పంట ఎండిపోవడం చూసి, అప్పు ఎలా తీర్చాలని మనస్తాపానికి గురయ్యాడు. వ్యవసాయ బావి వద్ద ఉరి వేసుకున్నాడు. రాత్రి కరెంట్‌కు రైతు బలి ఆత్మకూరు: రాత్రి కరెంట్‌కు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని చౌళ్లపల్లికి చెందిన రైతు బలయ్యూడు. పోలీసుల కథనం ప్రకారం... రాచర్ల భద్రయ్య (50)తనకున్న ఎకరమున్నర భూమిలో పత్తి సాగుచేశాడు. సోమవారం వేకువజామున 3 గంటలకు చీకట్లో పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. స్టార్టర్ ఆన్ చేసినా... మోటర్ నడవకపోవడంతో సర్వీస్ వైరు చెక్ చేస్తూ వెళుతుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. -
మున్సి‘పోల్స్’కు గట్టి నిఘా
ఆలంపల్లి, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా ప్రత్యేక బృందాలతో గట్టి నిఘా ఏర్పాట్లు చేసినట్లు సబ్ కలెక్టర్ అమ్రపాలి తెలిపారు. గురువారం ఆమె తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందంలో ఫారెస్టు, ఎక్సైజ్, పీఆర్ అధికారులు, ఇతర శాఖల గెజిటెడ్ అధికారులను నియమిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రతి టీంలో పోలీసు, రెవెన్యూ ఎక్సైజ్ అధికారులతో పాటు ఓ వీడియోగ్రాఫర్ ఉంటారని, వారికి ప్రత్యేక వాహనం కేటాయించినట్లు ఆమ్రపాలి తెలిపారు. తాండూరు, వికారాబాద్ అతి దగ్గరలో కర్ణాటక సరిహద్దు ఉంటడం కారణంగా జిల్లాకు మద్యం వచ్చే ప్రమాదం ఉందని, దీనిపై నిఘా వేయాలని అధికారులకు సూచించారు. వికారాబాద్ డీఎస్పీ నర్సింలు మాట్లాడుతూ.. ప్రవేటు వాహనాలే కాకుండా అంబులెన్సులు, పోలీసు వాహనాలను కూడా తనిఖీ చేస్తామన్నారు. రూ.40 వేలకు మించి నగదుకు తగిన వివరాలు లే కుంటే ఐటీకింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ‘మీ కోసం’ అనే సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు.. సమస్యలు ఏమైనా ఉంటే ప్రజలు ఫోన్ ద్వారా సమాచారం అందించవచ్చన్నారు. రాంగ్ కాల్స్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆరు వాహనాలతో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని మర్పల్లి, మోమిన్‌పేట్, ధారూరు, బంట్వారం, వికారాబాద్‌లో ప్రత్యేకంగా నిఘా పెంచుతున్నామన్నారు. అనుమతులు లేకుండా వాహనాలకు బ్యానర్లు, పోస్టర్లు అంటిచరాదని సూచించారు. గ్రామాల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తాండూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరీష్, వికారాబాద్ సీఐ లచ్చిరాంనాయక్, ఎక్సైజ్ సీఐ సుధాకర్, గోపీనాథ్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
రెండో రోజూ ఆందోళన
షాబాద్, న్యూస్‌లైన్: రెండో రోజూ మండల పరిధిలోని సర్దార్‌నగర్‌లో ఉన్న పేపర్ మిల్లు ఎదుట గ్రామస్తులు బైఠాయించారు. కాలుష్యానికి కారణమవుతున్న కంపెనీని బంద్ చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ కాలుష్యం విషయమై చర్చించేందుకు ఆదివారం గ్రామ సర్పంచ్ నర్సింలు, వార్డు సభ్యులతో కలిసి పరిశ్రమ వద్దకు వెళ్లారు. సర్పంచ్‌తో పాటు గ్రామస్తులను కంపెనీ సిబ్బంది నెట్టివేయడంతో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. సోమవారం కూడా సర్పంచ్‌తో పాటు స్థానికులు కంపెనీ ఎదుట బైఠాయించారు. కంపెనీ మేనేజర్ నాగేశ్వర్రావు గ్రామ సర్పంచ్ నర్సింలుతో పాటు స్థానికులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. తమ సెక్యురిటీకి సర్పంచ్ అని తెలియక తెలియక పొరపాటు జరిగిందని చెప్పారు. కంపెనీ నుంచి కాలుష్యం వెలువడకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు సర్పంచ్‌తో పాటు గ్రామస్తులు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పేపర్‌మిల్లు ఎదుట గ్రామస్తుల ఆందోళన
షాబాద్, న్యూస్‌లైన్: మండల పరిధిలోని సర్దార్‌నగర్ గ్రామ సర్పంచ్ నర్సింలుపై స్థానికంగా ఉన్న ఓ పేపర్‌మిల్లు యాజమాన్యం దాడి చేసిందని ఆరోపిస్తూ ఆ గ్రామస్తులు ఆదివారం ధర్నా చేశారు. సర్పంచ్ నర్సింలు, గ్రామస్తులు చెప్పిన కథనం ప్రకారం.. సర్దార్నగర్కి సమీపంలో ఉన్న పేపర్ మిల్లు నుంచి దుమ్ము, దూళి అధికంగా వచ్చి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మిల్లు యజమానితో మాట్లాడేందుకు సర్పంచ్ నర్సింలు, వార్డు సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లాడు. అయితే మిల్లు మేనేజర్ నాగేశ్వర్రావు తన సెక్యూరిటీ గార్డ్స్‌తో సర్పంచ్‌ను బయటకు గెంటివేయించారు. ‘నీవు సర్పంచ్ అయితే మాకేంది..? మా మిల్లు వద్దకు ఎందుకు వచ్చావంటూ’ దుర్భాషలాడటంతో సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు కలిసి కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. మిల్లు నుంచి వచ్చే దుమ్ముతో తాగునీరు కలుషితమవుతోందని, తాము రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లును మూసివేయించాలని గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేదన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మిల్లు మూసివేతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. గ్రామస్తులంతా కలిసి కంపెనీ గేటుకు తాళం వేయడంతో మిల్లులో పనులు నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు అక్కడినుంచి వెనుదిరిగారు. -
మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం
జోగిపేట, న్యూస్‌లైన్: జోగిపేట క్లాక్‌టవర్ సమీపంలోని జాతి పిత మహాత్మాగాంధీ పాలరాతి విగ్రహాన్ని పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు ధ్వంసం చేయడంతో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. బుధవారం రాత్రి పట్టణానికి చెందిన కొందరు యువకులు మద్యం మత్తులో ఘర్షణ పడ్డారు. ఘర్షణలో గాంధీ విగ్రహం కుడి చెయ్యి, కర్ర ధ్వంసమయ్యాయి. విగ్రహం నుదిటిపై రాయితో కొట్టడంతో మరకలు పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి చుట్టు పక్కల వారిని విచారించగా ఈ సంఘటనలో ప్రేమ్‌కుమార్, నర్సింలు అనే యువకుల హస్తం ఉన్నట్లు చెప్పడంతో అదేరోజు రాత్రి వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. గొడవపడిన వారిలో మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులకు తెలిసినా వదిలిపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విగ్రహం ధ్వంసమైన వార్త పట్టణంలో వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు క్లాక్‌టవర్ వద్దకు చేరుకున్నారు. మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రామాగౌడ్, ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు జూకంటి లక్ష్మణ్, పట్టణ ఆర్యవైశ్య సంఘ నేతలు మల్లికార్జున్, పోల రఘునాథ్, పలు పార్టీల నాయకులు విగ్రహాన్ని పరిశీలించారు. నిరసనగా జోగిపేట బంద్, శాంతి ర్యాలీ గాంధీ విగ్రహ ధ్వంసానికి నిరసనగా జోగిపేటలో పార్టీలకు అతీతంగా బంద్‌కు పిలుపునిచ్చి, శాంతిర్యాలీని నిర్వహించారు. అనంతరం డిప్యూ టీ తహశీల్దార్ కిరణ్మయి, ఎస్ఐ ముఖీద్పాషలకు వినతిపత్రాలు సమర్పించారు. ధ్వంసమైన గాంధీ విగ్రహానికి గ్రామ పెద్దలు క్షీరాభిషేకం చేశారు. కేసు నమోదు : సీఐ సైదానాయక్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటనలో నిందితులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సైదానాయక్ తెలిపారు. డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి ఖండన జోగిపేటలో మహత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వం సం చేయడాన్ని డిప్యూటీ సీఎం దామోద రాజ నర్సింహ, మాజీ మంత్రి బాబూమోహన్ ఖం డించారు. ఫోన్ ద్వారా సంఘటన వివరాలు తెలుసుకున్న వారు ఈ చర్యను ఖండించారు. విగ్రహ పునర్నిర్మాణానికి అవసరమైన నిధుల ను సమకూర్చేందుకు డిప్యూటీ సీఎం హామీ ఇ చ్చినట్లు మాజీ మార్కెట్ డెరైక్టర్ రాములు, వెంకటేశం తెలిపారు. మాజీ మంత్రి బాబూమోహన్ ఫోనులో మాట్లాడుతూ విగ్రహం ఏ ర్పాటుకు తన సహకారం ఉంటుందన్నారు. -
సీసీఐ.. కొనుగోళ్లకు సై!
గజ్వేల్, న్యూస్‌లైన్: సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) వైఖరిలో క్రమంగా మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది. గతేడాది కొన్ని రోజులు మాత్రమే కొనుగోళ్లు చేపట్టి చేతులెత్తేసిన ఆ సంస్థ.. ఈసారి సానుకూల దృక్పథంతో ముందుకు సాగడానికి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘మద్దతు ధర’తో ప్రమేయం లేకుండా కమర్షియల్ పర్చేజ్ చేపట్టడానికి నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నిర్ణయం అమలైతే జిల్లా రైతులకు భారీ ప్రయోజనం చేకూరే అవకాశముంది. 2011లో మాదిరిగా మద్దతు ధరతో ప్రమేయం లేకుండా ‘కమర్షియల్ పర్చేజ్’ చేపట్టి రైతులకు అండగా నిలవడానికి ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని జిల్లాకు చెందిన ఓ సీసీఐ అధికారి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. మరో వారం తర్వాత దీనిపై స్పష్టంగా ఆదేశాలు రానున్నాయని, ఆదేశాలు రాగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 2011 నవంబర్ నెలలో పత్తి ధర పైపైకి ఎగబాకింది. పత్తి ధర రూ.4 వేల నుంచి ప్రారంభమై డిసెంబర్, జనవరి నెలలో రూ.7 వేల పైచిలుకు పలికింది. అంతర్జాతీయ పత్తి మార్కెట్లో ఏర్పడిన డిమాండ్ కారణంగా ధర అమాంతం పెరిగింది. నిజానికి ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.3,000 మాత్రమే. సీసీఐ కేంద్రం నిబంధనల ప్రకారం మద్దతు ధరకే పత్తిని కొనుగోలు చేయాలి. కానీ నిబంధనలను సడలించుకొని ‘కమర్షియల్ పర్చేజ్’ పేరిట సీసీఐ కూడా వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం, ఆదిలాబాద్‌తోపాటు గజ్వే ల్ కేంద్రాల్లో ప్రైవేటు వ్యాపారులతో పోటీపడి కొనుగోళ్లు చేపట్టింది. గరిష్టంగా గజ్వేల్‌లో రూ.7 వేల వరకు ధరను చెల్లించింది. ఈ లెక్కన గజ్వేల్ లో ప్రైవేటు వ్యాపారులు, సీసీఐ పోటీలు పడి కొనుగోళ్లు చేపట్టడం వల్ల ఇక్కడ 2.72 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసి రికార్డును సృష్టించారు. పడిపోయిన పత్తి ధర.... జిల్లాలో ఈసారి 1.20 లక్షల హెక్టార్లలో పత్తి సాగైంది. సుమారు 2.8 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడులు వచ్చే అవకాశముంది. పత్తి రైతుల అవసరాల దృష్ట్యా జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, జోగిపేట, జహీరాబాద్‌లలో సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్కెట్లోకి ఉత్పత్తులు రావడం ఊపందుకున్నా ఈ కేంద్రాలను ఇంకా తెరవలేదు. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన రూ.4000మద్దతు ధర కూడా రైతులకు అందడంలేదు. పదిరోజుల క్రితం కురిసిన తుపాన్ కారణంగా పత్తి తడిసిపోయిందనే కారణంతో వ్యాపారులు కేవలం క్వింటాలుకు రూ.3000నుంచి రూ.3500 మాత్రమే ధర చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు ప్రైవేట్ వ్యాపారులు వేలాది క్వింటాళ్లకుపైగా పత్తిని కొనుగోలు చేశారు. ఈ లెక్కన ఒక్క గజ్వేల్ ప్రాంతంలోనే ధర రూపేణా రైతులు ఇప్పటికే లక్షల్లో నష్టపోయారు. విధిలేక పత్తిని అమ్ముకున్నా మంచి ధర వస్తుందనే ఆశతో 18 క్వింటాళ్ల పత్తిని గజ్వేల్ యార్డుకు తెచ్చిన. ఇక్కడికొస్తే ఏం లాభం క్వింటాల్‌కు రూ.3,350 మాత్రమే చెల్లిస్తుండ్రు. వానలకు పత్తి కొద్దిగా తడిసినందుకే ఇంత ధర తక్కువ చేయడం న్యాయం కాదు. డబ్బులు అవసరముండి విధిలేక పత్తిని అమ్ముకున్న. - నర్సింలు, పత్తి రైతు,ఇంద్రానగర్,నల్గొండ