జోగిపేట, న్యూస్‌లైన్: జోగిపేట క్లాక్‌టవర్ సమీపంలోని జాతి పిత మహాత్మాగాంధీ పాలరాతి విగ్రహాన్ని పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు ధ్వంసం చేయడంతో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. బుధవారం రాత్రి పట్టణానికి చెందిన కొందరు యువకులు మద్యం మత్తులో ఘర్షణ పడ్డారు. ఘర్షణలో గాంధీ విగ్రహం కుడి చెయ్యి, కర్ర ధ్వంసమయ్యాయి. విగ్రహం నుదిటిపై రాయితో కొట్టడంతో మరకలు పడ్డాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి చుట్టు పక్కల వారిని విచారించగా ఈ సంఘటనలో ప్రేమ్‌కుమార్, నర్సింలు అనే యువకుల హస్తం ఉన్నట్లు చెప్పడంతో అదేరోజు రాత్రి వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. గొడవపడిన వారిలో మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులకు తెలిసినా వదిలిపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విగ్రహం ధ్వంసమైన వార్త పట్టణంలో వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు క్లాక్‌టవర్ వద్దకు చేరుకున్నారు.
మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రామాగౌడ్, ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు జూకంటి లక్ష్మణ్, పట్టణ ఆర్యవైశ్య సంఘ నేతలు మల్లికార్జున్, పోల రఘునాథ్, పలు పార్టీల నాయకులు విగ్రహాన్ని పరిశీలించారు.
నిరసనగా జోగిపేట బంద్, శాంతి ర్యాలీ
గాంధీ విగ్రహ ధ్వంసానికి నిరసనగా జోగిపేటలో పార్టీలకు అతీతంగా బంద్‌కు పిలుపునిచ్చి, శాంతిర్యాలీని నిర్వహించారు. అనంతరం డిప్యూ టీ తహశీల్దార్ కిరణ్మయి, ఎస్‌ఐ ముఖీద్‌పాషలకు వినతిపత్రాలు సమర్పించారు. ధ్వంసమైన గాంధీ విగ్రహానికి గ్రామ పెద్దలు క్షీరాభిషేకం చేశారు.
కేసు నమోదు : సీఐ సైదానాయక్
విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటనలో నిందితులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సైదానాయక్ తెలిపారు.
డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి ఖండన
జోగిపేటలో మహత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వం సం చేయడాన్ని డిప్యూటీ సీఎం దామోద రాజ నర్సింహ, మాజీ మంత్రి బాబూమోహన్ ఖం డించారు. ఫోన్ ద్వారా సంఘటన వివరాలు తెలుసుకున్న వారు ఈ చర్యను ఖండించారు. విగ్రహ పునర్నిర్మాణానికి అవసరమైన నిధుల ను సమకూర్చేందుకు డిప్యూటీ సీఎం హామీ ఇ చ్చినట్లు మాజీ మార్కెట్ డెరైక్టర్ రాములు, వెంకటేశం తెలిపారు. మాజీ మంత్రి బాబూమోహన్ ఫోనులో మాట్లాడుతూ విగ్రహం ఏ ర్పాటుకు తన సహకారం ఉంటుందన్నారు.
మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం
Published Thu, Jan 16 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement
Advertisement