premkumar
-
వరి విత్తనాలు వేసే డ్రోన్ వచ్చేసింది!
డ్రోన్లతో వరి సహా అనేక పంటలపై పురుగుమందులు, ఎరువులు చల్లటం ద్వారా కూలీల ఖర్చును, సమయాన్ని రైతులు ఆదా చేసుకుంటూ ఉండటం మనకు తెలుసు. వరి విత్తనాలను వెద పెట్టడానికి ఉపయోగపడే డ్రోన్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ మారుత్ డ్రోన్స్ ఇతర రంగాల్లో డ్రోన్ల వినియోగంతో పాటు వ్యవసాయంలో డ్రోన్ సేవలపైనా విశేషమైన ప్రగతి సాధించింది.తాజాగా వరి విత్తనాలు వేసే డ్రోన్‌ను రూపొందించింది. పేటెంట్ హక్కులు కూడా పొందింది. పిజెటిఎస్ఎయు, నాబార్డ్ తోడ్పాటుతో క్షేత్రస్థాయి ప్రయోగాలను పూర్తి చేసుకొని వెద పద్ధతిలో వరి విత్తనాలను వరుసల్లో విత్తే డ్రోన్లను ఇఫ్కో తోడ్పాటుతో రైతులకు అందుబాటులోకి తెస్తోంది. డిజిసిఎ ధృవీకరణ పొందిన ఈ డ్రోన్ల కొనుగోలుకు బ్యాంకు రుణాలతో పాటు సబ్సిడీ ఉండటం విశేషం.గాలిలో ఎగిరే చిన్న యంత్రం డ్రోన్. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. అంటే, మనిషి పొలంలోకి దిగకుండా గట్టుమీదే ఉండి వ్యవసాయ పనులను సమర్థవంతంగా చేసుకోవడానికి ఉపయోగపడే అధునాతన యంత్రం. ఇప్పుడు వ్యవసాయంలోని అనేక పంటల సాగులో, ముఖ్యంగా వరి సాగులో, కీలకమైన అనేక పనులకు డ్రోన్ ఉపయోగపడుతోంది. రైతులకు ఖర్చులు తగ్గించటం, కూలీల అవసరాన్ని తగ్గించటం వంటి పనుల ద్వారా ఉత్పాదకతను, నికరాదాయాన్ని పెంపొందించేందుకు డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి.దోమల నిర్మూలన, ఔషధాల రవాణా వంటి అనేక ఇతర రంగాలతో పాటు వ్యవసాయంలో ఉపయోగపడే ప్రత్యేక డ్రోన్లను అభివృద్ధి చేయటంలో మారుత్ డ్రోన్స్ విశేష కృషి చేస్తోంది. ప్రేమ్ కుమార్ విస్లావత్, సాయి కుమార్ చింతల, ఐఐటి గౌహతి పూర్వవిద్యార్థి సూరజ్ పెద్ది అనే ముగ్గురు తెలుగు యువకులు 2019లో మారుత్ డ్రోన్స్ స్టార్టప్‌ను ్రపారంభించారు. డేటా ఎనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతలతో వ్యవసాయ డ్రోన్లను రూపొందించటంపై ఈ కంపెనీ దృష్టి సారించింది.ప్రొ. జయశకంర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పిజెటిఎస్ఎయు), అగ్రిహబ్, నాబార్డ్ తోడ్పాటుతో రైతుల కోసం ప్రత్యేక డ్రోన్లను రూపుకల్పన చేస్తోంది. నల్గొండ జిల్లా కంపసాగర్‌లోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో 50 ఎకరాల్లో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో గత రెండున్నరేళ్లుగా మారుత్ డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. స్థానిక రైతులు పండించే పంటలకు అనువైన రీతిలో ఉండేలా ఈ డ్రోన్లను అభివృద్ధి చేశారు. వరి పంటపై డ్రోన్ల ద్వారా పురుగుమందులు చల్లటానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్స్(ఎస్.ఓ.పి.ల)ను గతంలోనే ఖరారు చేశారు.వరి పంటపై పురుగుల మందు పిచికారీ..ప్రస్తుతం వెద వరి పద్ధతిలో ఆరుతడి పంటగా వరి విత్తనాలను నేరుగా బురద పదును నేలలో విత్తుకోవడానికి ఉపయోగపడేలా డ్రోన్‌ను రూపొందించారు. ఇప్పటికే నాలుగైదు డ్రోన్ ప్రొటోటైప్‌ల ద్వారా వరి విత్తనాలను వరుసల్లో వెద పెట్టడానికి సంబంధించిన ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఒకటి, రెండు నెలల్లో దీనికి సంబంధించిన ఎస్.ఓ.పి.లు పూర్తవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.డ్రోన్ల సేద్యానిదే భవిష్యత్తు!తక్కువ నీరు ఖర్చయ్యే వెద పద్ధతిలోనే భవిష్యత్తులో వరి సాగు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. వెద వరిలో విత్తనాలు వేయటం, ఎరువులు చల్లటం, చీడపీడలను ముందుగానే గుర్తించటం, పురుగుమందులు చల్లటం వంటి అనేక పనులకు డ్రోన్లు ఉపయోగపడతాయి. డ్రోన్ ధర రూ. పది లక్షలు. ఒక్క డ్రోన్‌తోనే పంట వివిధ దశల్లో ఈ పనులన్నీ చేసుకోవచ్చు.డిజిసిఎ ధృవీకరణ ఉండటం వల్ల డ్రోన్ కొనుగోలుకు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద 6% వడ్డీకే అనేక పథకాల కింద బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. రైతుకు 50% సబ్సిడీ వస్తుంది. ఎఫ్పిఓ లేదా కస్టమ్ హైరింగ్ సెంటర్లకైతే 75% వరకు సబ్సిడీ వస్తుంది. పది డ్రోన్లు కొని అద్దె సేవలందించే వ్యాపారవేత్తలకైతే రూ. 2 కోట్ల వరకు రుణం కూడా దొరుకుతోంది. గ్రామీణ యువతకు డ్రోన్ సేవలు ఏడాది పొడవునా మంచి ఉపాధి మార్గం చూపనున్నాయి.– ప్రేమ్ కుమార్ విస్లావత్, వ్యవస్థాపకుడు, సీఈఓ, మారుత్ డ్రోన్స్డ్రోన్ విత్తనాలు వెద పెట్టేది ఇలా..వరి నారు పోసి, నాట్లు వేసే సంప్రదాయ పద్ధతితో పోల్చితే విత్తనాలు వెదజల్లే పద్ధతి అనేక విధాలుగా మెరుగైన ఫలితాలను ఇస్తున్న విషయం తెలిసిందే. వెద వరిలో అనేక పద్ధతులు ఉన్నాయి. పొలాన్ని దుక్కి చేసిన తర్వాత పొడి దుక్కిలోనే ట్రాక్టర్ సహాయంతో సీడ్ డ్రిల్‌తో విత్తనాలు వేసుకోవటం ఒక పద్ధతి.బురద పదును నేలలో ఎక్కువ నీరు లేకుండా డ్రమ్ సీడర్‌ను లాగుతూ మండ కట్టిన వరి విత్తనాలను చేనంతా వేసుకోవటం రెండో పద్ధతి. ఈ రెండు పద్ధతుల కన్నా.. బురద పదును నేలలో డ్రోన్ ద్వారా వరి విత్తనాలను జారవిడవటం మరింత మేలైన పద్ధతి. తక్కువ శ్రమ, తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పని పూర్తవుతుందని మారుత్ డ్రోన్స్ వ్యవస్థాపకులు చెబుతున్నారు.ఎకరంలో వరి విత్తటానికి 20 నిమిషాలు..ఈ విధానంలో వరి నారుకు బదులు దమ్ము చేసిన పొలంలో డ్రోన్ సాయంతో వరి విత్తనాలను క్రమ పద్ధతిలో జారవిడుస్తారు. ఇందుకోసం ఆ డ్రోన్‌కు ప్రత్యేకంగా రూపొందించిన పైప్లాంటి సీడ్ డిస్పెన్సింగ్ డివైస్‌ను అమర్చుతారు. ఆ డివైస్‌కు డ్రోన్‌కు నడుమ వరి విత్తనాలు నిల్వ వుండేలా బాక్స్‌ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా 5 వరుసల్లో వరి విత్తనాలు బురద పదునుగా దమ్ము చేసిన పొలంలో విత్తుతారు. వరి మొక్కల మధ్య 10 సెం.మీ.లు, వరుసల మధ్య 15 సెం.మీ.ల దూరంలో విత్తుతారు.సాధారణంగా నాట్లు వేసే పద్ధతిలో ఎకరానికి 20–25 కిలో విత్తనం అవసరమైతే ఈ పద్ధతిలో 8–12 కిలోల విత్తనం సరిపోతుంది. సన్న రకాలైతే 10–11 కిలోల విత్తనం చాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 20 నిమిషాలకు ఒక ఎకరం చొప్పున రోజుకు ఒక డ్రోన్ ద్వారా 20 ఎకరాల్లో విత్తనాలు వెదపెట్టవచ్చు. సాళ్లు వంకర్లు లేకుండా ఉండటం వల్ల కలుపు నివారణ సులువు అవుతుందని, గాలి బాగా సోకటం వల్ల చీడపీడల ఉధృతి కూడా తగ్గుతుందని చెబుతున్నారు. వెదపద్ధతి వల్ల తక్కువ నీటితోనే వరి సాగు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.హెక్టారుకు రూ.5 వేలు ఆదా..వెద వరి (డైరెక్ట్ సీడిండ్ రైస్– డిఎస్ఆర్) సాగు పద్ధతిలో డ్రోన్లను వాడటం ద్వారా కూలీల బాధ లేకుండా చప్పున పని పూర్తవ్వటమే కాకుండా సాగు ఖర్చు సీజన్‌కు హెక్టారుకు రూ. 5 వేలు తగ్గుతుందని మారుత్ డ్రోన్స్ సీఈవో ప్రేమ్ కుమార్ విస్లావత్ అంచనా. డ్రోన్ సాయంతో సకాలంలో పురుగుమందులు సకాలంలో చల్లటం వల్ల చీడపీడల నియంత్రణ జరిగి హెక్టారుకు 880 కిలోల ధాన్యం అధిక దిగుబడి వస్తుందన్నారు. రైతుకు హెక్టారుకు రూ.21,720 ఆదనపు ఆదాయం వస్తుందని ఆయన చెబుతున్నారు.700 మందికి డ్రోన్ పైలట్ శిక్షణ..మారుత్ డ్రోన్స్ పిజెటిఎస్ఎయుతో కలసి ఏర్పాటు చేసిన అకాడమీ ద్వారా డ్రోన్ల నిర్వహణపై శిక్షణ ఇస్తోంది. రైతులు, స్వయం సహాయక బృందాల మహిళలకు, ఎఫ్పిఓ సభ్యులకు, వ్యవసాయ పట్టభద్రులకు, పదో తరగతి పాసైన యువతీ యువకులు ఈ శిక్షణకు అర్హులు. ఈ అకాడమీ ద్వారా ఇప్పటికే 700 మంది శిక్షణ పొందారు. అందులో 150 మంది స్వయం సహాయక బృందాల మహిళలు కూడా ఉన్నారు.డిజిసిఎ ఆమోదం వున్న ఈ వారం రోజుల శిక్షణ పొందిన వారికి పదేళ్ల పైలట్ లైసెన్స్ వస్తుంది. వ్యవసాయ సీజన్లో డ్రోన్ పైలట్‌కు కనీసం రూ. 60–70 వేల ఆదాయం వస్తుందని ప్రేమ్ వివరించారు. ఈ డ్రోన్ పైలట్ శిక్షణ పొందిన వారు వ్యవసాయంతో పాటు మరో 9 రంగాల్లో డ్రోన్లను వినియోగించవచ్చు. ఏడాది పొడవునా ఉపాధి పొందడానికి అవకాశం ఉంది.– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
కుమారుడిని చూడనివ్వలేదని.. జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య
కొత్తగూడెంటౌన్: కుమారుడిని చూడనివ్వలేదని మనస్తాపం చెంది తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన కొత్తగూడెం టూటౌన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం పరిధిలోని నేతాజీబస్తీకి చెందిన సింగారపు భరత్‌కుమార్, సుభద్రలకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు ప్రేమ్ కుమార్ (32) ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా కూడా నటిస్తున్నాడు. ఇతనికి హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన యువతితో వివాహం కాగా, వారికి ఐదేళ్ల బాబు చెర్రీ ఉన్నాడు. ప్రేమ్ దంపతుల మధ్య గొడవలు జరుగుతుండగా, భార్య ఐదు నెలల క్రితం పుట్టింటికి వెళ్లి, అక్కడే ఉంటోంది. అయితే కుమారుడిని చూసేందుకు వెళ్లగా అవమానించారంటూ ప్రేమ్ బాధపడుతుండేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ క్రమంలో మనస్తాపం చెంది ఆదివారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని తమ్ముడు రాజ్‌కుమార్ అర్ధరాత్రి నిద్రలేచి చూడగా ఉరివేసుకుని మృతి చెంది ఉన్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ప్రేమ్ కళ్లు దానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
Santosh Shobhan: నవ్వించే ప్రేమ్ కుమార్
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘ప్రేమ్ కుమార్’ అనే టైటిల్ ఖరారైంది. అభిషేక్ మహర్షిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శివప్రసాద్ పన్నీరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశీ సింగ్ హీరోయిన్. అభిషేక్ మహర్షి మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా పతాక సన్నివేశాల్లో హీరో వచ్చి స్పీచ్‌లు ఇచ్చి హీరోయిన్ను పెళ్లి చేసుకుంటాడు. అయితే అదే పెళ్లి పీటల మీద ఉన్న పెళ్లికొడుకును ఎవరూ పట్టించుకోరు. అటువంటి ఓ పెళ్లికొడుకు తనకు పెళ్లి అవ్వడం లేదనే ఫ్రస్ట్రేషన్లో ఏం చేశాడనేది కథ’’ అన్నారు. శివప్రసాద్ మాట్లాడుతూ – ‘‘అభిషేక్ మహర్షి, రచయిత అనిరుధ్ కృష్ణమూర్తి చక్కటి కథ రాశారు. కథనం నవ్విస్తుంది. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. లాక్డౌన్ తర్వాత మిగతా పూర్తి చేసి, ఆ తర్వాత పరిస్థితులను బట్టి విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. -
హృదయాన్ని హత్తుకునే జాను
శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రానికి ‘జాను’ అనే టైటిల్ ఖరారు చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిరి్మంచారు. మంగళవారం చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేశారు. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించిన ‘96’ చిత్రానికి ‘జాను’ తెలుగు రీమేక్. తమిళ ‘96’ చిత్రాన్ని తెరకెక్కించిన సి.ప్రేమ్‌కుమారే ‘జాను’కు దర్శకుడిగా వ్యవహరించారు. హీరో హీరోయిన్ల మధ్య చిన్నప్పుడు ప్రేమ చిగురించడం, కొన్ని కారణాల వల్ల కొంతకాలం ఒకరికొకరు దూరం కావడం, ఆ తర్వాత స్కూల్ రీ–యూనియన్‌లో భాగంగా కలుసుకున్నప్పుడు వారి భావోద్వేగాలు.. అనే అంశాల నేపథ్యంలో ‘96’ చిత్రకథనం ఉంటుంది. ‘‘శర్వానంద్, సమంతల కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం ఇది. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. అందమైన, హృదయాన్ని హత్తుకునే ఈ ప్రేమకథను ప్రేమ్‌కుమార్ చక్కగా తెరకెక్కించారు. గోవింద్ వసంత్ (‘96’ చిత్రం సంగీత దర్శకుడు) అందించిన సంగీతం, మహేంద్రన్ జయరాజ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు అదనపు బలం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్, పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘జాను’ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుందని తెలిసింది. -
అవార్డు తీసుకునేందుకు వెళ్తూ అనంత లోకాలకు..
- రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి - మరో ఇద్దరికి తీవ్ర గాయాలు - ప్రమాదస్థలిని పరిశీలించిన ఎస్పీ విధి నిర్వహణలో ఎంతో చురుగ్గా ఉండే కానిస్టేబుల్ ప్రేమ్‌కుమార్(40)ను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. పోలీస్ శాఖ తరఫున ప్రకటించిన అవార్డును అందుకునేందుకు విజయవాడకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. - కనగానపల్లి (రాప్తాడు) హిందూపురానికి చెందిన ప్రేమ్‌కుమార్ గోరంట్ల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఒక దోపిడీ కేసులో దొంగలను పట్టుకోవడంలో చూపించిన తెగువకు ఆయనకు పోలీసు శాఖ అవార్డు ప్రకటించింది. సోమవారం విజయవాడలో అవార్డు అందుకోవాల్సి ఉంది. దీంతో తన సమీప బంధువు అయిన మడకశిర మునిసిపల్ చైర్మన్ ప్రకాష్‌కు చెందిన స్కార్పియో వాహనం తీసుకుని మిత్రుడు రజనీకాంత్, కాండీ అనే మరో బాలుడితో కలిసి ఆదివారం సాయంత్రం హిందూపురం నుంచి అనంతపురం బయల్దేరాడు. మార్గమధ్యంలోని కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి సమీపానికి రాగానే ముందు వెళుతున్న గూడ్స్ లారీ కంటైనర్ అకస్మాత్తుగా జాతీయరహదారి పక్కన ఉన్న పార్కింగ్ స్థలం వైపు తిరిగింది. వెనుకనే వస్తున్న స్కార్పియో అదుపు కాక కంటైనర్ లారీని మధ్యభాగంలో ఢీకొట్టి దానికిందే ఇరుక్కుపోయింది. డ్రైవింగ్ సీటులో ఉన్న కానిస్టేబుల్ ప్రేమ్‌కుమార్ వాహనంలోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక వైపు కూర్చున్న రజనీకాంత్, కాండీలు తీవ్రంగా గాయపడ్డారు. కనగానపల్లి పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని క్షతగాత్రులను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య గాయత్రి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రమాద స్థలిని పరిశీలించిన ఎస్పీ రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ ప్రేమ్‌కుమార్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు హుటాహుటిన సంఘటన స్థలికి వెళ్లారు. ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్, సీఐ యుగంధర్‌తో మాట్లాడి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. అనంతరం స్కార్పియో వాహనంలోనే ఇరుక్కుపోయి మృతి చెందిన కానిస్టేబుల్ మృతదేహాన్ని బయటకు తీయించారు. తర్వాతా కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గాయపడిన ఇద్దరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. -
ప్రపంచ అంధుల క్రికెట్ జట్టుకు ప్రేమ్‌కుమార్ ఎంపిక
డోన్ టౌన్ : సీసంగుంతల గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్ ప్రపంచ అంధుల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 12 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పది దేశాల జట్ల మధ్య జరిగే పోటీల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రపంచ క్రికెట్ జట్టుకు మన రాష్ట్రం నుంచి 4 ఎంపిక కాగా అందులో ప్రేమ్‌కుమార్ ఒకరు. ఆయన ప్రముఖ సీపీఐ నేత ఎల్లయ్య, సుంకులమ్మ దంపతుల కుమారుడు. -
మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం
జోగిపేట, న్యూస్‌లైన్: జోగిపేట క్లాక్‌టవర్ సమీపంలోని జాతి పిత మహాత్మాగాంధీ పాలరాతి విగ్రహాన్ని పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు ధ్వంసం చేయడంతో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. బుధవారం రాత్రి పట్టణానికి చెందిన కొందరు యువకులు మద్యం మత్తులో ఘర్షణ పడ్డారు. ఘర్షణలో గాంధీ విగ్రహం కుడి చెయ్యి, కర్ర ధ్వంసమయ్యాయి. విగ్రహం నుదిటిపై రాయితో కొట్టడంతో మరకలు పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి చుట్టు పక్కల వారిని విచారించగా ఈ సంఘటనలో ప్రేమ్‌కుమార్, నర్సింలు అనే యువకుల హస్తం ఉన్నట్లు చెప్పడంతో అదేరోజు రాత్రి వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. గొడవపడిన వారిలో మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులకు తెలిసినా వదిలిపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విగ్రహం ధ్వంసమైన వార్త పట్టణంలో వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు క్లాక్‌టవర్ వద్దకు చేరుకున్నారు. మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రామాగౌడ్, ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు జూకంటి లక్ష్మణ్, పట్టణ ఆర్యవైశ్య సంఘ నేతలు మల్లికార్జున్, పోల రఘునాథ్, పలు పార్టీల నాయకులు విగ్రహాన్ని పరిశీలించారు. నిరసనగా జోగిపేట బంద్, శాంతి ర్యాలీ గాంధీ విగ్రహ ధ్వంసానికి నిరసనగా జోగిపేటలో పార్టీలకు అతీతంగా బంద్‌కు పిలుపునిచ్చి, శాంతిర్యాలీని నిర్వహించారు. అనంతరం డిప్యూ టీ తహశీల్దార్ కిరణ్మయి, ఎస్ఐ ముఖీద్పాషలకు వినతిపత్రాలు సమర్పించారు. ధ్వంసమైన గాంధీ విగ్రహానికి గ్రామ పెద్దలు క్షీరాభిషేకం చేశారు. కేసు నమోదు : సీఐ సైదానాయక్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటనలో నిందితులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సైదానాయక్ తెలిపారు. డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి ఖండన జోగిపేటలో మహత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వం సం చేయడాన్ని డిప్యూటీ సీఎం దామోద రాజ నర్సింహ, మాజీ మంత్రి బాబూమోహన్ ఖం డించారు. ఫోన్ ద్వారా సంఘటన వివరాలు తెలుసుకున్న వారు ఈ చర్యను ఖండించారు. విగ్రహ పునర్నిర్మాణానికి అవసరమైన నిధుల ను సమకూర్చేందుకు డిప్యూటీ సీఎం హామీ ఇ చ్చినట్లు మాజీ మార్కెట్ డెరైక్టర్ రాములు, వెంకటేశం తెలిపారు. మాజీ మంత్రి బాబూమోహన్ ఫోనులో మాట్లాడుతూ విగ్రహం ఏ ర్పాటుకు తన సహకారం ఉంటుందన్నారు. -
వెబ్సైట్లో టెన్త్ ఫలితాల విశ్లేషణ
చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తక్కువ ఉత్తీర్ణతా శాతం వచ్చిన పాఠశాలలపై మరింత దృష్టి పెట్టేందుకు జిల్లా విద్యాశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ తరహా కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ www.deochittoor.orgలో జిల్లాలోని 602 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో వచ్చిన పది ఫలితాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సమీక్షించుకునే విధంగా వెబ్సైట్లో పెట్టారు. అధికారుల లెక్కల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది 92.18 ఉత్తీర్ణతా శాతం ఉంది. చొరవ తీసుకున్న కలెక్టర్ కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ చొరవ కారణంగానే వెబ్సైట్లో ఈ వివరాలు పెట్టారు. నెల రోజుల క్రితం ఆయన విద్యాశాఖ అధికారులతో దీనిపై మాట్లాడారు. వెబ్సైట్లో విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను రూపొందించిన ప్రేమ్‌కుమార్ అనే ఉపాధ్యాయుడిని పిలిపించి టెన్త ఫలితాలకు సంబంధించి ప్రోగ్రాం రూపొందించాలని ఆదేశించారు. కలెక్టర్ సూచనల ప్రకారం 20 రోజుల పాటు కష్టపడి ప్రేమ్‌కుమార్ జిల్లా స్థాయిలో వచ్చిన ఫలితాలను, పాఠశాలలో వచ్చిన ఫలితాలతో పోలుస్తూ గ్రాఫ్‌లు రూపొందించి వెబ్సైట్లో పెట్టారు. ఇందులో మండలాల వారీగా పాఠశాలలు, గత ఏడాది అవి పది పరీక్షల్లో సాధించిన ఫలితాలు సబ్జెక్టుల వారీగా ఉంటాయి. వీటి ఆధారంగా తమ పాఠశాల విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నారో గమనించి దానిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ఏం చేయాలో ప్రణాళికలు వేసుకోవచ్చు. హెచ్‌ఎంలందరూ సమీక్ష జరపాలి ఇది జిల్లా కలెక్టర్ ఆలోచనల రూపం. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరూ www.deochittoor. org వెబ్సైట్లో పెట్టిన ఫలితాలను చూసుకొని తప్పనిసరిగా సమీక్ష చేసుకోవాలి. వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు ఎలా సన్నద్ధం అవ్వాలో ప్రణాళికలు వేసుకోవచ్చు. ముఖ్యంగా తక్కువ ఫలితాలు వచ్చిన సబ్జెక్టులో ఎందుకు ఇలా జరిగిందని ఉపాధ్యాయులతో కలిసి సమీక్షించాలి. -బి.ప్రతాప్‌రెడ్డి, డీఈవో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఈ కార్యక్రమంపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. చాలాసార్లు పిలిపించి మా ట్లాడి దీనికి ఒకరూపం తెచ్చారు. ఈ పనిచేసే సమయంలో ఎప్పటికప్పుడు పని ఎంతవరకు వచ్చిందని ఆరా తీ స్తూండేవారు. ఆయన ప్రత్యేక శ్రద్ధ తోనే ఈ వెబ్‌సైట్‌ను ఇంత త్వరగా రూపొందించాము. వచ్చే విద్యాసంవత్సరంలో టెన్తలో ఇంకా మంచి ఫలితాలు వచ్చేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. -ప్రేమ్‌కుమార్, డీఈవో కార్యాలయం అధికారిక వెబ్సైట్ రూపకర్త