సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘ప్రేమ్ కుమార్’ అనే టైటిల్ ఖరారైంది. అభిషేక్ మహర్షిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శివప్రసాద్ పన్నీరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశీ సింగ్ హీరోయిన్.
అభిషేక్ మహర్షి మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా పతాక సన్నివేశాల్లో హీరో వచ్చి స్పీచ్‌లు ఇచ్చి హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటాడు. అయితే అదే పెళ్లి పీటల మీద ఉన్న పెళ్లికొడుకును ఎవరూ పట్టించుకోరు. అటువంటి ఓ పెళ్లికొడుకు తనకు పెళ్లి అవ్వడం లేదనే ఫ్రస్ట్రేషన్‌లో ఏం చేశాడనేది కథ’’ అన్నారు.
శివప్రసాద్ మాట్లాడుతూ – ‘‘అభిషేక్ మహర్షి, రచయిత అనిరుధ్ కృష్ణమూర్తి చక్కటి కథ రాశారు. కథనం నవ్విస్తుంది. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. లాక్‌డౌన్ తర్వాత మిగతా పూర్తి చేసి, ఆ తర్వాత పరిస్థితులను బట్టి విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment