Santosh Shobhan
-
'మీరు బాదకముందే చెబుతున్నా ఆరు 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు ఉన్నాయి'
బేబీ సినిమాతో డైరెక్టర్‌గా సాయి రాజేష్‌కు గుర్తింపు వచ్చినా ఆయన మొదటగా ‘హృదయకాలేయం’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తర్వాత కొబ్బరి మట్ట సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. ఆ రెండూ సినిమాలకు సంబంధించిన మీమ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. తర్వాత కలర్ ఫోటోతో నిర్మాతగా మెప్పించాడు.బేబీ సినిమాను నిర్మాత ఎస్కేఎన్తో కలిసి సాయి రాజేష్ తెరకెక్కించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అందుకుంది. మొత్తం ఆరు ప్రేమకథలు నిర్మించబోతున్నట్లు ‘బేబి’ దర్శకుడు సాయి రాజేష్ ప్రకటించారు. (ఇదీ చదవండి: దొరికిపోయిన రతిక.. మోకాళ్లపై కూర్చుని దండం పెట్టిన అమర్!) కలర్ ఫోటో,బేబీ సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి.. మరో రెండు ప్రేమకథలు నిర్మాణంలో ఉన్నాయి. త్వరలో ఇంకో రెండు కథలు త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా కొనసాగుతున్న సాయి రాజేష్, ఎస్కేఎన్ ఇద్దరూ.. గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లో ఉంటూ చాలా రోజులుగా కలిసి పనిచేస్తున్నారు. అలా బేబీ హిట్‌తో వారిద్దరి పేర్లు సెన్సేషన్ అయ్యాయి. తాజాగా వీరి నుంచి మరో సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.. సంతోష్ శోభన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. వారి బ్యాచ్‌లో ఉన్న మరో స్నేహితుడు సుమన్ పాతూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు హిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరో తెలుగమ్మాయి.. 'బిగ్ బాస్' ఫేమ్ అలేఖ్య హారికను కథానాయకిగా పరిచయం చేయడం విషేశం. 'అమృత ప్రొడక్షన్స్' నుంచి ఇప్పటి వరకు మూడు సినిమాలు నిర్మించిగా. ఆఖరి సినిమాగా కలర్ ఫోటో వచ్చిందని సాయి రాజేష్ గుర్తు చేశారు. ఆ చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. నేనేమీ లోకేష్ కనగరాజ్ కాదు ఆ తర్వాత తాను నిర్మాతగా సినిమాలు నిర్మించలేదని సాయి రాజేష్ ఇలా చెప్పుకొచ్చాడు. ఒక మంచి కథ వచ్చినప్పుడు నేను మళ్లీ సినిమా నిర్మించాలని అనుకున్నాను. ఈ కథ ప్రేక్షకులను మెప్పిస్తుంది. సోషల్ మీడియాలో కొందరు ఎన్ని తీస్తారురా 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు అని బాదకముందే నేనే ముందుగా చెప్తున్నాను. నాది, ఎస్కేఎన్ కాంబినేషన్లో మొత్తం 6 ప్రేమకథలు రాబోతున్నాయి. వీటిలో రెండు మీరు చూసేశారు. ఒకటి కలర్ ఫోటో.. రెండోది బేబి. రెండు నిర్మాణంలో ఉన్నాయి.. వైష్ణవి, ఆనంద్ కాంబినేషన్లో రీసెంట్గా ఒక సినిమా ప్రకటించాం. ఇప్పుడు సంతోష్, హారిక కాంబినేషన్లో ఈ సినిమా రానుంది. ఇవి కాకుండా ఇంకో రెండు లవ్ స్టోరీలు ఉంటాయి. కొందరు మాత్రం ఇదేమైనా సినిమాటిక్ యూనివర్సా.. స్టోరీలో ఏమైనా లింక్ అయ్యాయా..? సీక్వెల్ ఉంటుందా..? అంటే నేనేమీ లోకేష్ కనగరాజ్ కాదు.. ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ.. మీ అందర్నీ మెప్పించేలా ఆరు ప్రేమ కథలు ఉన్నాయి. అవి నేను, ఎస్కేఎన్ కలిసి మీకు అందిస్తున్నాం. వాటిలో ఇదీ ఒకటి. ఇది నా మనసుకు చాలా దగ్గరైన ప్రేమ కథ. ఈ ప్రాజెక్ట్‌లో నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ సుమన్ పాతూరి, హారిక అలేఖ్య, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్, సుహాస్, మేమందరం చాలా సంత్సరాలుగా స్నేహితులం. ఎస్కేఎన్, నేను చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్స్. అందరం ఫ్రెండ్స్ కలిసి ఫ్రెండ్స్ కోసం చేస్తున్న సినిమా ఇది. కచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా తీస్తున్నాం.' అని సాయి రాజేష్ చెప్పారు. -
'బేబి' మూవీ టీమ్ నుంచి మరో ప్రేమకథ
సంతోష్ శోభన్, అలేఖ్య హారిక జంటగా కొత్త సినిమా షురూ అయింది. సుమన్ పాతూరి దర్శకత్వంలో అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్‌పై ఎస్కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ్రపారంభమైంది. తొలి సన్నివేశానికి డైరెక్టర్ చందూ మొండేటి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నాగచైతన్య క్లాప్ కొట్టగా, డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత రవిశంకర్ యూనిట్‌కి స్క్రిప్ట్ అందించగా, హీరో సుశాంత్, దర్శకులు హను రాఘవపూడి, రాహుల్ సంకృత్యాన్ యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లా డుతూ– ‘‘ఈ సినిమాలో మంచి ప్రేమకథ ఉంటుంది’’ అన్నారు. ‘‘నా మనసుకు దగ్గరైన కథ ఇది. నేను, ఎస్కేఎన్, సందీప్ రాజ్, అలేఖ్య.. మేమంతా ఫ్రెండ్స్. ఈ సినిమా వారితో కలిసి చేస్తుండటంతో మరింత బాధ్యతగా భావిస్తున్నా’’ అన్నారు సాయి రాజేశ్. ‘‘ఈ సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ ఇచ్చిన నా ఫ్రెండ్ సాయి రాజేశ్‌కు థ్యాంక్స్’’ అన్నారు సుమన్ పాతూరి. ‘‘హీరోయిన్గా చేయాలనే నా కల ఈ చిత్రంతో నెరవేరుతోంది’’ అన్నారు అలేఖ్య హారిక. ‘‘తెలుగు అమ్మాయిలను ్ర΄ోత్సహించాలనే నా సినిమాల్లో తెలుగు అమ్మాయిలనే హీరోయిన్గా తీసుకుంటున్నాను’’ అన్నారు ఎస్కేఎన్. ఈ చిత్రానికి కెమెరా: అస్కర్, సంగీతం: విజయ్ బుల్గానిన్, సహనిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, రమేశ్ పెద్దింటి. -
'మ్యాడ్' సినిమాలో కామెడీతో ఇచ్చిపడేశాడు.. ఈ కుర్రాడెవరో తెలుసా?
ఈ శుక్రవారం చిన్నాపెద్దా కలిపి 10 వరకు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. వాటిలో ఇంజినీరింగ్ కాలేజీ, హాస్టల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన 'MAD' మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. జూ.ఎన్టీఆర్ బావమరిది హీరోగా పరిచయమైన ఈ సినిమాలో ఓ కుర్రాడు.. తన యాక్టింగ్, కామెడీతో ఇచ్చిపడేశాడు. అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఇంతకీ ఎవరతడు? అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఈ కుర్రాడి పేరు సంగీత్ శోభన్. ప్రస్తుతం టాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోగా చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్ వాళ్ల తమ్ముడే ఇతడు. ప్రభాస్‌తో 'వర్షం' లాంటి హిట్ సినిమా తీసిన శోభన్.. సంగీత్ నాన్న. ఇలా ఇండస్ట్రీతో చిన్నప్పటి నుంచే సంబంధం ఉంది. అలా చైల్డ్ ఆర్టిస్టుగా 2011లోనే 'గోల్కోండ హైస్కూల్' సినిమాలో యాక్ట్ చేశాడు. అందులో బొద్దుగా ఉండేది ఇతడే. అప్పుడు బ్రేక్ తీసుకుని పదేళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) వెండితెరపై 'మ్యాడ్' ఫస్ట్ సినిమా అయినప్పటికీ.. మూడేళ్ల క్రితమే 'ద బేకర్ అండ్ ద బ్యూటీ' అనే వెబ్ సిరీస్‌లో సహాయ పాత్ర చేశాడు. దీనితోపాటు త్రీ రోజెస్, పిట్ట కథలు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ లాంటి తెలుగు వెబ్ సిరీసుల్లోనూ భాగమయ్యాడు. అలా ఓటీటీల్లో అదరగొట్టిన సంగీత్.. 'మ్యాడ్'లో అవకాశం దక్కించుకున్నాడు. దామోదర్ (డీడీ) అనే బీటెక్ చదివే కుర్రాడి పాత్రలో ఇరగ్గొట్టేశాడని చెప్పొచ్చు. త్వరలో 'ప్రేమ విమానం' అనే డైరెక్ట్ ఓటీటీ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న సంగీత్ శోభన్.. మంచి స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తే మాత్రం మరో జాతిరత్నం కావడం గ్యారంటీ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలా కామెడీతో హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాస్త కష్టపడితే సంగీత్.. ఆ లిస్టులోకి చేరడం పెద్ద విషయమేమి కాకపోవచ్చు! (ఇదీ చదవండి: ‘మ్యాడ్’ మూవీ రివ్యూ) -
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను– సంతోష్ శోభన్
‘‘వందేళ్ల ఇండియన్ సినిమాల్లో ఎన్నో పాత్రలు, ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకూ చెప్పని కథ, ఎవరూ చేయని పాత్రను ఎలివేట్ చేయటం అనేది ఓ ఆర్టిస్ట్‌కి కొత్తగా ఉంటుంది. అలా పెళ్లి మండపంపై మిగిలిపోయేవాడి కథే ‘ప్రేమ్ కుమార్’’ అని హీరో సంతోష్ శోభన్ అన్నారు. సంతోష్ శోభన్, రాశీ సింగ్, రుచితా సాధినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’.అభిషేక్ మహర్షి దర్శకత్వంలో శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ–‘‘అభిషేక్ కొన్ని సినిమాల్లో నటుడిగా చేశాడు. దర్శకుడు కావాలనుకున్నప్పుడు ‘ప్రేమ్ కుమార్’ కథ రాసుకుని, చక్కగా తీశాడు. వరుసగా వరుడు, పెళ్లి వంటి సినిమాలు చేస్తున్నాను. అయితే నిజ జీవితంలో నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను (నవ్వుతూ). నేనిప్పటి వరకు మంచి డైరెక్టర్స్‌తో సినిమాలు చేశాను. అయితే నేను చేసిన సినిమాలన్నీ కరెక్ట్‌గానే ఎంచుకున్నానా? అంటే లేదనే అంటాను. ‘ప్రేమ్ కుమార్’ నాకు సరైన హిట్ ఇస్తుందనుకుంటున్నాను’’ అన్నారు. -
కుటుంబంతో కలిసి చూడొచ్చు
‘‘ప్రేమ్ కుమార్’ చిత్రం ఆద్యంతం వినోద భరితంగా కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది. ఈ మూవీలో నేను, నా వైఫ్ అతిథి పాత్రల్లో కనిపిస్తాం’’ అని దర్శకుడు అభిషేక్ మహర్షి అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ–‘‘కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పని చేశాను. నా దగ్గర ఉన్న ముప్పై కథల్లో ‘ప్రేమ్ కుమార్’ కథ సెట్ అయింది. ‘కుచ్ కుచ్ హోతా హై, నువ్వే నువ్వే’ సినిమాల స్ఫూర్తితో ఈ కథను రాశాను. సినిమాల్లో పెళ్లి సీన్ లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్ పెళ్లి ఆపుతాడు. తర్వాత హీరో, హీరోయిన్లు కలిసిపోతారు. అప్పుడు ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి? చెప్పేందుకే ‘ప్రేమ్ కుమార్’ తీశాం. శివ ప్రసాద్‌గారికి సినిమాలపై ఎంతో ప్యాషన్ ఉంది’’ అన్నారు. -
కుటుంబంతో కలిసి చూడొచ్చు – దర్శకుడు అభిషేక్ మహర్షి
‘ప్రేమ్ కుమార్’ చిత్రం ఆద్యంతం వినోద భరితంగా కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది. ఈ మూవీలో నేను, నా వైఫ్ అతిథి పాత్రల్లో కనిపిస్తాం’’ అని దర్శకుడు అభిషేక్ మహర్షి అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ–‘‘కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పని చేశాను. నా దగ్గర ఉన్న ముప్పై కథల్లో ‘ప్రేమ్ కుమార్’ కథ సెట్ అయింది. ‘కుచ్ కుచ్ హోతా హై, నువ్వే నువ్వే’ సినిమాల స్ఫూర్తితో ఈ కథను రాశాను. సినిమాల్లో పెళ్లి సీన్స్ లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్స్ పెళ్లి ఆపుతాడు. తర్వాత హీరో, హీరోయిన్లు కలిసిపోతారు. అప్పుడు ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి? చెప్పేందుకే ‘ప్రేమ్ కుమార్’ తీశాం. శివ ప్రసాద్‌గారికి సినిమాలపై ఎంతో ష్యాషన్ ఉంది’’ అన్నారు. -
నవ్వించే ప్రేమ్‌కుమార్
సంతోష్ శోభన్, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకత్వంలో శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో సంతోష్ శోభన్ మాట్లాడుతూ– ‘‘దర్శక–నిర్మాతలు నమ్మడంవల్లే ఈ సినిమా ఇంత దూరం వచ్చింది. నా సినిమాల్లో నటించిన అభిషేక్ దర్శ కుడు అవుతాడని ఊహించలేదు. భవిష్యత్‌లో హ్యూమర్‌కి తనో బ్రాండ్ అవుతాడనిపిస్తోంది. ‘ప్రేమ్‌కుమార్’ రెండు గంటలు నవ్వించే చిత్రమవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా చూస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ గుర్తొస్తారు. బయట మనం ఎలా ఉంటామో అవే ΄ాత్రలను ఈ సినిమాలో చూస్తాం’’ అన్నారు అభిషేక్ మహర్షి. ‘‘ప్రేక్షకు లను నవ్వించాలని చేసిన సినిమా ఇది’’ అన్నారు శివ ప్రసాద్. -
వర్షం సినిమా చూశాక అమ్మలో సంతోషం.. మళ్లీ ఇప్పుడా పరిస్థితి
‘‘అన్నీ మంచి శకునములే’ కుటుంబమంతా కూర్చొని చూసే సినిమా. ఇంకా చూడనివారు థియేటర్స్‌కి వెళ్లి చూడండి. మా బ్యానర్లో ఇంతకుముందు వచ్చిన చిత్రాల్లానే ‘అన్నీ మంచి శకునములే’ వంటి ఓ మంచి సినిమా తీశామనే సంతృప్తి ఉంది’’ అని నిర్మాత ప్రియాంకా దత్ అన్నారు. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ప్రియాంకా దత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో నిర్మాత స్వప్నా దత్ మాట్లాడుతూ–‘‘ప్రస్తుత ట్రెండ్‌లోనూ ఇలాంటి సినిమా తీసినందుకు గర్వంగా ఉంది. మా బ్యానర్లో నటించిన ఎన్టీఆర్, నాని, విజయ్ దేవరకొండ మంచి స్టార్స్ అయ్యారు.. అలాగే సంతోష్‌కి కూడా ఆ రేంజ్ వస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘సినిమా అంటే కేవలం మాస్ కాదు.. ఫ్యామిలీ అంతా చూడగలిగే సినిమా ఇది’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘20 ఏళ్ల క్రితం నాన్నగారు (డైరెక్టర్ సంతోష్) తీసిన ‘వర్షం’ సినిమా చూశాక మా అమ్మలో సంతోషం చూశాను. ఇప్పుడు ‘అన్నీ మంచి శకునములే’ మా అమ్మలో అదే ఆనందం తీసుకువచ్చింది’’ అన్నారు సంతోష్ శోభన్ . -
సీతారామం తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్‌కాల్ తనదే: హీరో
‘‘అన్నీ మంచి శకునములే..’ ట్రైలర్, టీజర్లో పాజటివ్ ఎనర్జీ కనిపించింది. ఈ సినిమాకు ‘అన్నీ మంచి శకునములే..’. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్ముతున్నా’’ అని అన్నారు నాని. సంతోష్ శోభన్ , మాళవికా నాయర్ జంటగా నందినీరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్రవిందా మూవీస్, స్వప్నా సినిమాస్‌పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరోలు నాని, దుల్కర్ సల్మాన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో నాని ఇంకా మాట్లాడుతూ– ‘‘మంచి ఈజ్, బ్రహ్మాండమైన కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ సంతోష్. అతన్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుగా అనిపిస్తోంది. నందినీకి మరో నాని దొరికాడనిపిస్తోంది. ‘అన్నీ మంచి శకునములే’కి విజువల్స్, సాంగ్స్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగా కుదిరినట్లు అనిపిస్తోంది. ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయే ఓ స్పెషల్ చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు నాని. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘వైజయంతీ మూవీస్ నాకు ఓ ఫ్యామిలీలాంటిది. రాజేంద్రప్రసాద్‌గారికి నేను అభిమానిని. ‘మహానటి’కి ఆయనతో కలిసి వర్క్ చేశాను. ‘సీతారామం’ తర్వాత నాకు తొలి ఫోన్ కాల్ నందినీ రెడ్డిగారి నుంచి వచ్చింది. ‘అన్నీ మంచి శకునములే’ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నా లైఫ్‌లో నేను చేసిన పెద్ద సినిమా ఇది. వీకే నరేశ్, రాజేంద్రప్రసాద్, గౌతమీ, వాసుకి, ‘షావుకారు’ జానకి, అంజు.. ఇలా వీరందరూ కలిసి నేను రాసుకున్న కథను పది రెట్లు పెంచారు. ఈ సినిమాకు లైఫ్ లైన్ సంగీత దర్శకులు మిక్కీ జే మేయర్. ఫ్యామిలీ ప్రొడ్యూసర్స్‌తో కలిసి వర్క్ చేసిన ఫీలింగ్ ప్రియాంక, స్వప్నాల వల్ల కలిగింది’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘సమ్మర్‌కు మన అమ్మమ్మగారి ఇంటికి వెళ్లొచ్చిన జ్ఞాపకంలా ‘అన్నీ మంచి శకునములే’ ఉంటుంది’’ అన్నారు స్వప్నా దత్, ప్రియాంకా దత్. ‘‘చాలాకాలం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే చిత్రమిది’’ అన్నారు సంతోష్ శోభన్.. ‘‘వైజయంతీ మూవీస్ సంస్థను మా పిల్లలు (స్వప్నా, ప్రియాంక) సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. వీరి ఆలోచనలు అప్పట్లో నాకు రాలేదని ఈర్ష్యగా ఉంది’’ అన్నారు నిర్మాత అశ్వినీదత్. ‘‘అసలు మనం ఎందుకు పుట్టాం? హిందూ ధర్మంలో మనం సెంటిమెంట్‌కు ఎంత వేల్యూ ఇస్తాం. ఆ సెంటిమెంట్ వల్ల మనం ఎలా ఉన్నాం? వంటి అంశాలు ‘అన్నీ మంచి శకునములే..’లో ఉన్నాయి. ఒక అద్భుత సినిమాను చూసిన అనుభూతిని ప్రేక్షకులకు ఇస్తుందని గ్యారంటీ ఇస్తున్నాను’’ అన్నారు రాజేంద్రప్రసాద్. ‘‘పదహారు కూరల రుచుల సమ్మేళనం ఈ చిత్రం’’ అన్నారు వీకే నరేశ్. ఈ వేడుకలో దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. -
అది నాకు బోనస్: సంతోష్ శోభన్
‘‘గోల్కొండ హైస్కూల్’ (2011) చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాను. ఈ సినిమాలోని నా పెర్ఫార్మెన్స్ నాకు చాలా అవకాశాలు తెచ్చిపెడుతుందనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసినా దాదాపు నాలుగేళ్లు నాకు అవకాశాలు దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన అవకాశాలు, కొన్ని కథలు కరెక్ట్ అని భావించి కొన్ని సినిమాలు చేశాను. అవి వర్కౌట్ కాలేదు. ఇక నా కెరీర్ పరంగా ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం మంచి బిగ్‌స్క్రీన్ మూవీగా నిలుస్తుందని భావిస్తున్నాను’’ అని అన్నారు సంతోష్ శోభన్. నందినీ రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. స్వప్నామూవీస్, మిత్రవిందా మూవీస్‌తో కలిసి ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో సంతోష్ శోభన్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో రిషి పాత్రలో కనిపిస్తాను. ‘అలా..మొదలైంది’ చూసి నందినీరెడ్డిగారితో ఓ సినిమా చేయాలనుకున్నాను. అలాగే ఓ యాక్టర్‌గా నాకు తొలి అడ్వాన్స్ చెక్ ఇచ్చింది ప్రియాంకా దత్‌గారు. ఇలా.. వీరి కాంబినేషన్స్‌తో నా కెరీర్‌కు కావాల్సిన టైమ్‌లో ‘అన్నీ మంచి..’ లాంటి సినిమా వస్తుండటం లక్‌గా భావిస్తున్నాను. ఇక ఈ సినిమా అవుట్‌పుట్ బాగా రావడం నాకు బోనస్’’ అన్నారు. నేడు మదర్స్ డేని పురస్కరించుకుని శోభన్ మాట్లాడుతూ – ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లవుతోంది. నటుడిగా నాకు అవకాశాలు తగ్గినప్పుడు అమ్మ నమ్మకమే నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యంతోనే నేను సినిమాలు చేస్తున్నాను. మాకు సొంత ఇల్లు లేదు. త్వరలోనే మా అమ్మకు సొంత ఇంటిని గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు. -
ప్రేక్షకులకు ఈ సినిమా ఓ మంచి బహుమతి
‘‘సినిమా నా ఫస్ట్ లవ్. అందుకే నటిగా మాత్రమే కాకుండా సినిమాకి సంబంధించిన పలు విభాగాల్లో పని చేశాను. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ మరింత ఆసక్తికరంగా ఉంది. నేర్చుకోవడానికి చాలా ఉంది. నటిగా షూటింగ్స్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాను కాబట్టే ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ఇందుకు సంతోషంగా ఉంది. ఒక రకంగా గర్వపడుతున్నాను కూడా’’ అన్నారు గౌతమి. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. స్వప్న సినిమాస్, మిత్ర విందా మూవీస్ పతాకాలపై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో గౌతమి మాట్లాడుతూ– ‘‘అన్నీ మంచి..’లో ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసే మీనాక్షీ పాత్ర చేశాను. ఓ డ్రీమ్ మదర్, వైఫ్, ఫ్రెండ్ ఎలా ఉండాలని కోరు కుంటారో అలా ఉంటుంది మీనాక్షీ పాత్ర. నా కెరీర్ తొలినాళ్లలో నేను రాజేంద్రప్రసాద్‌గారితో యాక్ట్ చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో కలిసి నటించాను. నటన పట్ల ఆయన అంకితభావం సూపర్. వీకే నరేశ్, ‘షావుకారు’ జానకి, ఊర్వశి.. ఇలా అందరూ ఓకే సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. అసలు.. ఇంతమంది మంచి నటీనటులను దర్శకురాలు నందినీ, నిర్మాతలు స్వప్న, ప్రియాంకాగార్లు ఓ చోటకు చేర్చి సినిమా చేయడం అద్భుతం. ప్రేక్షకులకు ఈ సినిమా మర్చిపోలేని బహుమతి. స్వీయనియంత్రణ ఉన్న దర్శకురాలు నందిని. మంచి నిర్మాతలకు ఉండాల్సిన లక్షణాలు ప్రియాంక, స్వప్నగార్లలో ఉన్నాయి. ప్రస్తుతం బోయపాటిగారి సినిమాలో నటిస్తున్నాను. రెండు వెబ్ సిరీస్‌లు చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ–‘‘మా అమ్మాయి ఫిల్మ్ మేకింగ్ చదువుతోంది. తనకు కెమెరా వెనక ఉండటం ఇష్టం’’ అని చెప్పారు గౌతమి. -
అది మా అదృష్టం
‘‘ఏ సినిమానీ చిన్న సినిమా, పెద్ద సినిమా అనలేం. ఆ తేడాలు మాకు లేవు. మంచి కథ చేయడం ముఖ్యం. ప్రాజెక్ట్ కె’ (ఇందులో ప్రభాస్ హీరో) చాలా పెద్ద ప్రాజెక్ట్. కానీ మేము ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో మొదలయ్యాం. మా జీవితం ఓ మలుపు తీసుకుంది ఆ చిత్రంతోనే. సో.. మా వరకు అది బిగ్ ఫిల్మ్. ఓ మంచి కథ చెప్పాలనే ఉద్దేశంతో ‘అన్నీ మంచి శకునములే’ సినిమా తీశాం’’ అన్నారు నిర్మాత స్వప్నాదత్. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంకా దత్ చెప్పిన విశేషాలు. ► ‘అన్నీ మంచి శకునములే’ రెండు కుటుంబాల మధ్య జరిగే కథ. మంచి ఎమోషనల్ మూవీ. ఆడియన్స్ కంటతడి పెడతారు. దర్శకురాలు నందిని ఈ కథ చెప్పినప్పుడు అది కున్నూర్ బ్యాక్‌డ్రాప్‌లో లేదు. కథ రీత్యా ఆ లొకేషన్స్ అవసరం కాబట్టి అక్కడ తీశాం. హిల్‌స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ ఫ్యామిలీ కథ తీయాలనే ఆశ ‘అన్నీ మంచి శకునములే..’తో నెరవేరింది. ఈ సినిమా కోసం నందినీ విక్టోరియా అనే చిన్న ప్రదేశాన్ని సెట్ చేశారు. ఆడియన్స్‌ని మరో లోకంలోకి తీసుకెళ్లే సినిమా ఇది. ఇక ఈ సినిమాతో సంతోష్ శోభన్‌కు కొత్త ఇమేజ్ వస్తుందని నమ్ముతున్నాం. తన కెరీర్ మారుతుంది. నందినీ రెడ్డిగారి ‘అలా.. మొదలైంది’ చిత్రం యూత్‌ఫుల్ ట్రెండ్ సెట్టర్. ‘కళ్యాణ వైభోగమే’ కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కథ. ‘ఓ బేబీ’ డిఫరెంట్ స్టోరీ. ఈ కోవలో ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం ఓ డిఫరెంట్ ఫ్యామిలీ స్టోరీ. ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చుతుంది. ► దుల్కర్ పరభాష హీరో, ఖరీదైన లొకేషన్స్, మార్కెట్ ఎదురీత .. ‘సీతారామం’ సినిమా విషయంలో ఇలా ప్రతి అడుగూ ఓ సవాలే. కానీ నమ్మి చేశాం. విజయం సాధించింది. మనం నమ్మింది జరిగిందనే తృప్తి కలిగింది. ► ప్రతి సినిమాపై మాకు ఒత్తిడి ఉంటుంది. మా మనసుకు నచ్చిన కథలనే సినిమాలుగా తీస్తున్నాం. అయితే మేం ఇష్టపడి చేసిన చిత్రాలు ప్రేక్షకుల అభిరుచికి దాదాపుగా మ్యాచ్ కావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ► సినిమా ఇండస్ట్రీలో నాన్నగారు (నిర్మాత అశ్వినీదత్) 50 ఏళ్ళుగా నిలబడ్డారు. ఇప్పుడు ఆయన పిల్లలు సినిమాలు తీస్తున్నారు. ఆయన ఏ రోజూ లెక్కలు వేసుకుని సినిమాలు తీయలేదు. ఈ దారిలో మేం కూడా వెళ్తున్నాం. సినిమాల్లోకి వచ్చామంటే ప్యాషన్‌తోనే. లెక్కలు వేసుకుంటే సినిమాలు తీయలేం. ► అందరం చర్చించుకునే ఓ జడ్జ్‌మెంట్‌కు వస్తాం. ‘జాతిరత్నాలు’ సినిమాను నేను (స్వప్న) ఓటీటీకి అమ్మేద్దాం అన్నాను. కానీ నాగీ (‘మహానటి’ ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్), ప్రియాంక ఆ సినిమాను నమ్మారు. ‘ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. పోతే మొత్తం పోతుంది. థియేటర్స్‌లో రిలీజ్ చేద్దాం’ అన్నాడు నాగీ. సినిమా మంచి హిట్ అయింది. ‘మహానటి’ని నేనెక్కువగా నమ్మాను. చాలా బాధ్యతతో ఆ సినిమా చేశాం. నాగీ నిర్ణయాలు మా బ్యానర్‌కు బలం. ► నిర్మాతలుగా మీరు కష్టపడుతున్నారు. నేను కూడా ఎందుకని మా చెల్లి (స్రవంతి) అన్నారు. ఇంట్లో పిల్లలు సేఫ్‌గా ఉన్నారు, అమ్మా, చెల్లి చూసుకుంటున్నారనే ధైర్యం ఉండబట్టే మేం సినిమాలు తీస్తున్నాం. -
తగ్గేదే లేదు, స్టార్స్ సినిమాలతో కళ్యాణం కమనీయం పోటీ!
సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించిన సినిమా "కళ్యాణం కమనీయం". నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపారు దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల. ► నేను పుట్టి పెరిగింది గుంటూరులో. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండేది. చదువులు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చి ప్రయత్నాలు ప్రారంభించాను. వారాహి సంస్థలో తుంగభద్ర చిత్రానికి పనిచేశాను. ఈ లైన్ అనుకున్న తర్వాత నా స్నేహితుడు అజయ్ కుమార్ రాజు ద్వారా యూవీ క్రియేషన్స్ లో పరిచయం ఏర్పడింది. అలా ఈ సినిమాకు అవకాశం దక్కింది. ► యూవీ లాంటి పెద్ద సంస్థలో తొలి చిత్రానికి దర్శకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నాను. సంక్రాంతికి స్టార్స్ సినిమాలు విడుదలవుతున్నాయి. అయినా మా కంటెంట్ మీద నమ్మకం ఉంది. సినిమా చూసిన సెన్సార్ వారు కూడా మీరు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. ► పెళ్లైన తర్వాత మన జీవితాల్లో జరిగే ప్రతి సందర్భం కొత్తదే. అలా ఓ యువ జంట తమ వైవాహిక జీవితం ప్రారంభమయ్యాక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? వాటి నుంచి ఏం నేర్చుకున్నారు? మళ్లీ ఆ తప్పులు చేయకుండా ఎలా సరిదిద్దుకున్నారు? అనేది అన్ని ఎమోషన్స్‌తో సినిమాలో చూస్తారు. మన సొసైటీలో అమ్మాయి ఫీలింగ్స్‌ను మా కథ ప్రతిబింబిస్తుంది. ► నా దృష్టిలో సినిమా అంటే మనల్ని మనం పోల్చుకోవాలి. "కళ్యాణం కమనీయం" అలా రిలేటబుల్ మూవీ. నా జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనలు కూడా కథకు స్ఫూర్తినిచ్చాయి. అలా ఎవరి జీవితంలోనైనా ఇలాంటి సందర్భాలు ఎదురుకావొచ్చు. ► దర్శకుడిగా నాకు ఫేవరేట్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఎమోషన్ చూపించాలంటే మణిరత్నం, ఒక హైలోకి తీసుకెళ్లాలంటే రాజమౌళి, సొసైటీకి మంచి చెప్పే చిత్రాల విషయంలో శంకర్, యాక్షన్ అంటే బోయపాటి ఇలా చాలా మంది అభిమాన దర్శకులు ఉన్నారు. నాకు రొమాంటిక్ కామెడీతో పాటు యాక్షన్ జానర్ ఇష్టం. త్వరలో నా కొత్త సినిమా వివరాలు చెబుతాను. చదవండి: బిగ్‌బాస్ విన్నర్‌కు ప్రైజ్‌మనీతో పాటు బంగారం -
ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఏంటంటే..?
-
అయి బాబోయ్ బ్రహ్మజీ ది మామూలు వెటకారం కాదు..
-
చిరంజీవి చెప్పిన ఆ డైలాగ్ మా సినిమాకు హైప్ తీసుకొచ్చింది
‘‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ కథ హిలేరియస్‌గా ఉంటుంది. ట్రావెల్ బ్లాగర్స్ అయిన హీరో, హీరోయిన్ ట్రావెల్ వీడియోల చిత్రీకరణ సమయంలో ఎలాంటి ప్రమాదం ఎదుర్కొన్నారు? అనేది ఆసక్తిగా ఉంటుంది. మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని మేర్లపాక గాంధీ అన్నారు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ మాట్లాడుతూ– ‘‘ఒక యూట్యూబర్ కథ చేస్తే బావుంటుందనే ఆలోచన నుంచే ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ ఐడియా వచ్చింది. ట్రావెల్ బ్లాగర్ కష్టాలు, ప్రమాదాలు, సవాళ్లను ఈ సినిమాలో చూపించాం. ఈ కథలో ప్రతి పదిహేను నిమిషాలకు ఒక చేంజ్ ఓవర్, మలుపు ఉంటుంది. సిట్యువేషనల్ కామెడీ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా ఆయా పాత్రలకు పర్ఫెక్ట్గా సరిపోయారు. ‘వాల్తేరు వీరయ్య’ టీజర్లో చిరంజీవిగారు చెప్పిన ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ డైలాగ్ మా సినిమాకి బాగా హైప్ తీసుకొచ్చింది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు మేర్లపాక మురళిగారి కథతో ఓ సినిమా చేయాలనుంది. ‘జవాన్’ నిర్మాత కృష్ణగారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్ మెంట్లో నా తర్వాతి చిత్రాలు ఉంటాయి’’ అని చెప్పారు. -
సంతోష్‌లో నన్ను నేను చూసుకున్నా
‘‘నేను, సంతోష్ శోభన్.. ఇంద్రగంటి మోహనకృష్ణగారి స్కూల్ నుండే వచ్చాం. ‘గోల్కొండ హైస్కూల్’లో సంతోష్ నటన చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను.. పరిణితితో నటించాడు. సంతోష్‌లో నన్ను నేను చూసుకున్నానని అప్పుడే ఇంద్రగంటితో చెప్పాను’’ అని హీరో నాని అన్నారు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదలకానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘సంతోష్ వరుసగా సినిమాలు చేస్తుండటం హ్యాపీ.. తనకు వరుస విజయాలు రావాలి. వెంకట్ బోయనపల్లిగారితో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది’’ అన్నారు. ‘‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ ఘన విజయం సాధించాలి’’ అన్నారు దర్శకుడు మారుతి. ‘‘నానీగారిని తొలిసారి కలిసినప్పుడు ‘నీలో నన్ను చూసుకున్నాను’ అన్నారు.. ఇప్పటి వరకూ నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అది’’ అన్నారు సంతోష్ శోభన్. ‘‘మేర్లపాక ఈ సినిమాని బాగా తీశాడు’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. ‘‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ చాలా వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు మేర్లపాక గాంధీ. ‘‘నేను ఒత్తిడిలో ఉన్నప్పుడు మేర్లపాక గాంధీ సినిమాలే చూస్తాను’’ అన్నారు డైరెక్టర్ నందినీ రెడ్డి. ఈ వేడుకలో నటులు బ్రహ్మాజీ, సుదర్శన్, సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు పాల్గొన్నారు. -
ఇనయ, ఫైమాకు బలుపెక్కువ.. గీతూ ఇడియట్
Bigg Boss Telugu 6, Episode 57: చిట్టి ఫరియా అబ్దుల్లా డ్యాన్స్‌తో నేడు బిగ్‌బాస్ ఎపిసోడ్ పండగలా ప్రారంభమైంది. వాసి వాడి తస్సాదియ్యా అంటూ హీరోయిన్‌తో స్టెప్పులేశాడు మన్మథుడు నాగార్జున. లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫరియాతో పాటు సంతోష్ శోభన్ కూడా స్టేజీపైకి వచ్చి సందడి చేశాడు. నిన్న ఒకరు ఎలిమినేట్ అయ్యారు. మరి నేడు ఇంకెవరైనా ఎలిమినేట్ అయ్యారా? అసలేం జరిగిందనేది నేటి ఎపిసోడ్ హైలైట్స్‌లో చూద్దాం.. ఆర్జే సూర్యను శనివారమే డైరెక్ట్ ఎలిమినేట్ చేశాడు నాగ్. ఈరోజు అతడిని స్టేజీపైకి పిలిచాడు. హౌస్‌లో ఐదు ఫ్లవర్స్ ఎవరు?, ఐదు ఫైర్ బ్రాండ్స్ ఎవరు? అనేది చెప్పమన్నాడు. రేవంత్ ఫ్లవర్ అని.. ఓటమిని స్పోర్టివ్‌గా తీసుకోవాలని సూచించాడు. గీతూ కూడా ఫ్లవర్ అని.. నీ గేమ్ నువ్వు ఆడితే నీకు తిరుగే లేదన్నాడు. శ్రీహాన్‌కు గేమ్ మీద క్లారిటీ ఉందని, బాలాదిత్య మంచితనం అతడి గేమ్‌ను ఆపేస్తోందంటూ వారిద్దరినీ ఫ్లవర్ కేటగిరీలో చేర్చాడు. ఫైర్ కేటగిరీలో ఫైమా, ఇనయ, రాజ్, కీర్తిలను చేర్చాడు సూర్య. మొదట్లో ఇనయతో ఎక్కువ గొడవలయ్యేవని, పదేపదే తిట్టుకునేవాళ్లమని గుర్తు చేసుకున్నాడు. వెళ్లిపోతున్నా కాబట్టి నా గేమ్ కూడా నువ్వే ఆడి టాప్ 5లో ఉండాలని ఇనయకు చెప్పాడు. ఇక ఇనయ అందుకుంటూ నీకోసం మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నానంటూ కొరియన్ లవ్ సింబల్ చూపించింది. వీళ్ల సైన్ లాంగ్వేజ్ అర్థం కాక నాగార్జున నెత్తి పీక్కున్నాడు. కొంచెం కూడా నెగెటివిటీ లేని పర్సన్ రాజ్ అని కితాబిచ్చాడు సూర్య. నువ్వెలా ఆడుతున్నావో అలాగే ఆడంటూ కీర్తికి సలహా ఇచ్చాడు. తర్వాత అందరికీ వీడ్కోలు చెప్పాడు. సూర్య వెళ్లిపోగానే లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ హీరోహీరోయిన్లు సంతోశ్ శోభన్, ఫరియా అబ్దుల్లా స్టేజీపైకి వచ్చి సందడి చేశారు. హౌస్‌మేట్స్‌తో ఒక ఫన్ గేమ్ ఆడించారు. ఎప్పటిలాగే గెస్ట్‌గా వచ్చిన హీరోయిన్ కోసం పాట పాడాడు సింగర్ రేవంత్. ఆ పాటతో ఫిదా అయిన ఫరియా, సంతోశ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత మరో టాస్క్ ఇచ్చారు. అందులో భాగంగా కొన్ని నేమ్ప్లేట్లను ఇంటిసభ్యులకు అంకితమివ్వాలన్నాడు నాగ్. గీతూకు రచ్చ ట్యాగ్ ఇచ్చింది మెరీనా. శ్రీహాన్ అపరిచితుడు అని కీర్తి ట్యాగ్ ఇచ్చింది. ఇనయ మహానటి అని శ్రీహాన్.. శ్రీహాన్ కన్నింగ్ అని ఇనయ చెప్పుకొచ్చారు. కీర్తి శ్వేతనాగు అంది శ్రీసత్య. బాలాదిత్య వకీల్ సాబ్ అన్నాడు రేవంత్. ఆదిరెడ్డి దొంగ అని చెప్పింది గీతూ. ఇనయకు బలుపు అని వాసంతి, రాజ్ టైంపాస్ అని ఫైమా అంది. గీతూ.. ఆడంతే అదో టైపు అన్నాడు ఆది రెడ్డి. ఫైమాకు బలుపెక్కువ అన్నాడు రాజ్. గీతూ ఇడియట్ అన్నాడు బాలాదిత్య. ఇకపోతే నామినేసన్లో ఉన్న అందరూ సేఫ్ అయిపోగా చివరగా ఆది, మెరీనా మాత్రమే మిగిలారు. ఎక్కడ ఆది ఎలిమినేట్ అవుతాడోనని గుక్కపెట్టి ఏడ్చింది గీతూ. నన్ను అర్థం చేసుకునేవాళ్లే ఉండరంటూ శోకం అందుకోగా ఆమెను ఆపడం ఎవరితరం కాలేదు. మరోవైపు మెరీనా వెళ్లిపోతే తనకు మంచిమంచి బట్టలు పంపు అని భార్యను ఆదేశించాడు రోహిత్. అయితే నాగ్ మాత్రం... నో ఎలిమినేషన్, ఇద్దరూ సేఫ్ అని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ సర్ప్రైజ్తో హౌస్మేట్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. చదవండి: వరల్డ్ బిగ్గెస్ట్ ఫెమినిస్ట్.. ఫ్రీ హగ్స్ అమ్మ కోసం రూ.80 లక్షలు ఖర్చు పెట్టిన శ్రీసత్య -
ఆ లోపు పాన్ వరల్డ్ హీరోయిన్ కావాలి: ఫరియా అబ్దుల్లా
‘‘జాతిరత్నాలు’ లో నేను చేసిన చిట్టి పాత్రని అందరూ అభిమానించారు. ఈ విషయంలో ఆనందంతో పాటు బాధ్యత కూడా పెరిగింది. ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ సినిమాలో చిట్టి కాదు.. నేను చేసిన వసుధ పాత్ర మాత్రమే కనిపిస్తుంది’’ అని ఫరియా అబ్దుల్లా అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ– ‘‘నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టం. ఈ చిత్ర కథ ప్రయాణం నేపథ్యంలో ఉంటుంది. నేను ట్రావెల్ వ్లాగర్‌గా కనిపిస్తాను. నా నిజ జీవితంలో మొదటి విదేశీ ప్రయాణం ఈ సినిమా వల్లే జరిగింది. థాయిలాండ్‌లో ఒక పాట షూటింగ్ చేయడం మరచిపోలేని జ్ఞాపకం. ఈ సినిమా షూటింగ్ కోసం 20రోజులు అడవిలోనే ఉన్నాం. మొబైల్ సిగ్నల్ కూడా లేదు. ఈ మూవీలో యాక్షన్, చేజింగ్ సీన్లు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ మూవీ ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ లాంటి మంచి అనుభవం ఇచ్చింది (నవ్వుతూ). ‘జాతిరత్నాలు’ సినిమాలాగానే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. నేను హీరోయిన్గా నటించిన ‘జాతిరత్నాలు, లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ చిత్రాల ట్రైలర్స్‌ని ప్రభాస్‌గారు విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నా. సంతోష్ శోభన్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. మేర్లపాక గాంధీగారితో పని చేయడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మరో ఐదేళ్లలో పాన్ వరల్డ్ స్థాయిలో నాకు గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. నాకు దర్శకత్వంపై ఆసక్తి ఉంది.. అందుకు మరో పదేళ్లు పడుతుంది. ప్రస్తుతం రవితేజగారితో ‘రావణాసుర’, ఓ తమిళ్ మూవీ, ఓ హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నా’’ అన్నారు. -
‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’. బ్రహ్మాజీ, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ– ‘‘కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు’’ అన్నారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు’’ అన్నారు మేర్లపాక గాంధీ. ‘‘జాతిరత్నాలు’ తర్వాత అందరూ నన్ను చిట్టీ అని పిలుస్తున్నారు. ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ చూశాక నేను చేసిన వసుధ పాత్రే గుర్తుంటుంది’’ అన్నారు ఫరియా అబ్దుల్లా. ‘‘ఈ నెల 29న మా సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నాం’’ అన్నారు వెంకట్ బోయినపల్లి. నటులు బ్రహ్మాజీ, సుదర్శన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం పాల్గొన్నారు. -
'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్'మూవీ ప్రమోషన్ లో ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)
-
'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన ప్రభాస్
సంతోష్ శోభన్, జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా హీరో,హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ (LikeShareSubscribe).మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మించారు. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను వదిలారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డిజిటల్ వేదికగా ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం కామెడీగా, ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా సాగింది. ఈనెల 29న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. -
ఆసక్తి పెంచుతున్న సంతోష్ శోభన్ కొత్త మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్
విభిన్న కథలను ఎంచుకుంటూ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తు వస్తున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. గోల్కొండ హై స్కూల్ చిత్రంలో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంతోష్ తను నేను చిత్రంలో హీరోగా మారాడు. ‘ఏక్ మినీ కథ’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకు సంతోష్ శోభన్ తాజాగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం అప్డేట్ వదిలారుమ మేకర్స్. ఈ సినిమాకు ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్రైబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. కొత్తగా ఉన్న ఈ టైటిల్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ఫస్ట్‌లుక్, టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్? కాగా ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతీ రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. ఇక టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్లో సంతోష్ శోభన్, ఫరియా, సుదర్శన్ ముగ్గురు పైకి చూస్తూ కనిపించారు. ఇక సంతోష్‌కు బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన ‘ఏక్ మినీ కథ’ చిత్రాన్ని కథ అందించిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అడ్వేంచరస్ ట్రావెల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు. నిహారిక ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. An Adventurous Travel Tale filled with Joy, Thrill & Entertainment 💯😃🤞 Presenting the First Look of 𝗟𝗜𝗞𝗘👍 𝐒𝐇𝐀𝐑𝐄 🔁 & 𝑺𝑼𝑩𝑺𝑪𝑹𝑰𝑩𝑬🔔#LSS ❤️🔥@santoshshobhan @fariaabdullah2 @MerlapakaG @vboyanapalli @Plakkaraju @Ram_Miriyala #AamukthaCreations @saregamasouth pic.twitter.com/DxX0yHaDvT — Niharika Entertainment (@NiharikaEnt) September 5, 2022 -
సమంత పరిచయం చేసిన 'శ్రీదేవి శోభన్‌బాబు'.. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది ?
Samantha Launched Santosh Shoban Sridevi Shoban Babu Movie Teaser: ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలతో తనదైన నటనతో మెప్పిస్తున్నాడు యంగ్ హీరో సంతోశ్ శోభన్. పేపర్ బాయ్, ఎక్ మినీ కథ, మంచి రోజులొచ్చాయి సినిమాలతోపాటు 'బ్యూటీ అండ్ ది బేకర్' వెబ్ సిరీస్‌లో అలరించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. వరుస సినిమాలపై దృష్టి పెట్టి కెరీర్‌కు మంచి రోజులు వచ్చేలా మలుచుకుంటున్నాడు. ప్రస్తుతం సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీదేవి శోభన్‌బాబు'. ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గౌరి జి. కిషన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను స్టార్ హీరోయిన్ సమంత బుధవారం (ఏప్రిల్ 6) సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేసింది. 'ఈరోజు మనం చెప్పుకోబోయే చిత్రం..' అంటూ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంత ఆసక్తిగా సాగింది. రేడియోలో స్టోరీ చెబుతున్నట్లుగా పాత్రలను పరిచయం చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది. సంతోష్ శోభన్, గౌరి నటన బాగుంది. 'నా ఇల్లు పట్టుకుని నీ ఇల్లు అంటావేంటీ' అని హీరో చెప్పే డైలాగ్ నవ్వు తెప్పించేలా ఉంది. టీజర్ చూస్తుంటే ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్లా అనిపిస్తోంది. కమ్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నాగబాబు, రోహిణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్నారు. -
తొలి లిరికల్ సాంగ్‌తో 'ప్రేమ్ కుమార్' వచ్చేశాడు..
Santosh Shoban Prem Kumar Movie First Lyrical Song Out: పేపర్ బాయ్, ఎక్ మినీ కథ, మంచి రోజులొచ్చాయి సినిమాలతోపాటు 'బ్యూటీ అండ్ ది బేకర్' వెబ్ సిరీస్‌లో అలరించిన యంగ్ హీరో సంతోష్ శోభన్. వరుస సినిమాలపై దృష్టి పెట్టి కెరీర్‌కు మంచి రోజులు వచ్చేలా మలుచుకుంటున్నాడు. ప్రస్తుతం సంతోష్ శోభన్ నటిస్తున్న చిత్రం 'ప్రేమ్ కుమార్'. రాశీ సింగ్, కృష్ణ చైతన్య, రుచిత కీలక పాత్రధారులుగా నటిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ మహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. శివ ప్రసాద్ పన్నీరు నిర్మాత కాగా ఎస్. అనంత్ శ్రీకర్ సంగీతం అందిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌ను ప్రారంభించిన ఈ మూవీ యూనిట్ తొలిపాటను విడుదల చేసింది. 'నీలాంబరం చూసి నీ కళ్లలో మేఘామృతం.. జారే నా గుండెలో' అంటూ సాగే సాంగ్‌ను శనివారం (ఫిబ్రవరి 5)న రిలీజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ రాశారు. మెలోడీ సాంగ్ అయిన 'నీలాంబరం' సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందని నిర్మాత శివ ప్రసాద్ పన్నీరు తెలిపారు. టైటిల్ రోల్లో సంతోష్ శోభన్ కనిపిస్తాడని, పీటల మీద పెళ్లి ఆగితే ప్రేమ్ కుమార్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడన్నదే సినిమా కథ అని డైరెక్టర్ అభిషేక్ మహర్షి పేర్కొన్నారు.