
మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌లు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 4వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
‘మై వాట్సాప్ అంకుల్స్ అండ్ యూట్యూబ్ ఆంటీస్.. నా పేరు సంతోష్.. ఆనందానికి కేరాఫ్ అడ్రెస్.. వీడు అనేది నా ట్యాగ్‌లైన్’ అంటూ సంతోష్ శోభన్ తనను తాను పరిచయం చేసే సన్నివేశంతో ట్రైలర్ మొదలైంది. ఇక ‘నా కూతురు లాంటి కూతురిని కన్న ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాల్సిందే.. అంటూ అశిష్ ఘోష్ మెహ్రీన్ గురించి చెప్పే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కాగా ఎస్‌కేఎన్, వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, సప్తగిరి, వైవా హర్ష, అశిష్ ఘోష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.