ఎగ్ ప్రీజింగ్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ | Sakshi
Sakshi News home page

Mehreen: టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్

Published Tue, Apr 30 2024 12:47 PM

Actress Mehreen Pirzada Egg Freezing Video

తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన మెహ్రీన్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. పెళ్లి కాకుండానే పిల్లల్ని కనేందుకు ప్లానే చేసేసింది. అదేనండి మొన్నీ మధ్య 'ఎగ్ ఫ్రీజింగ్' అని హీరోయిన్ మృణాల్ ఠాకుర్ చెప్పిందిగా. ఇప్పుడు దాన్ని మెహ్రీన్ చేసి చూపించేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అలానే దీనికి గల కారణాల్ని కూడా చెప్పుకొచ్చింది.

'ఎగ్ ఫ్రీజింగ్' అంటే ఏంటి?
ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు పెళ్లి లేటుగా చేసుకుంటున్నారు. అయితే 30 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువ. అందుకే చాలామంది హీరోయిన్లు.. వయసులో ఉన్నప్పుడే తమ ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరుచుకుని, కావాల్సినప్పుడు పిల్లల్ని కనే ప్లాన్ చేసుకుంటున్నారు. దీన్ని 'ఎగ్ ఫ్రీజింగ్' అంటారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు 'ఎగ్ ఫ్రీజింగ్' చేసుకోగా, ఇప్పుడా లిస్టులోకి మెహ్రీన్ చేరింది.

(ఇదీ చదవండి: అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక)

మెహ్రీన్ ఏమని చెప్పింది?
'గత రెండేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నా. చివరకు ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఇది నా వ్యక్తిగత విషయం కదా దీన్ని అందరికి చెప్పాలా? వద్దా? అని ఆలోచించాను. కానీ నాలాంటి చాలామంది మహిళలు ప్రపంచంలో ఉన్నారు. పెళ్లి, బిడ్డని కనే విషయంలో వాళ్లు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. నేను మాత్రం భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యమని భావించాను. దీని గురించి మనం పెద్దగా మాట్లాడట్లేదు. కానీ టెక్నాలజీ సాయంతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం'

'తల్లి కావడమనేది నా కల. కాకపోతే అది కొన్నేళ్లు ఆలస్యం కావొచ్చు. అందుకే ఈ ఎగ్ ఫ్రీజింగ్. ఆస‍్పత్రులంటే భయముండే నాలాంటి వాళ్లకు ఇది సవాలే. ఎందుకంటే ఇంజెక్షన్స్ కారణంగా ఆస్పత్రికి వెళ్లిన ప్రతిసారీ నేను కళ్లు తిరిగి పడిపోయేదాన్ని. ఇక ఎగ్ ఫ్రీజింగ్ మంచిదా కాదా అంటే.. కచ్చితంగా మంచిదే అని చెబుతాను. మీరు ఏం చేసినా సరే మీకోసం చేయండి. అలానే ఈ జర్నీలో నాకు అండగా ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ రిమ్మీ, మా అమ్మకు థ్యాంక్స్' అని మెహ్రీన్ చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)

 

Advertisement
Advertisement