‘హనీ ఈజ్ ది బెస్ట్’ అంటూ ‘ఎఫ్ 2’లో బోలెడంత సందడి చేశారు మెహరీన్. ఈ సినిమాతో ఆమెకు టాలీవుడ్‌లో భారీగా పాపులారిటీ దక్కింది. అయితే, కొద్దిరోజుల క్రితం మెహరీన్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఒక పోస్ట్ పెట్టారు.పిల్లలు అప్పుడే వద్దని భావించే తల్లి దండ్రులకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో కొందరు సెలబ్రటీలు కూడా పెళ్లి కాకుండానే తమ అండాలను భద్రపరుచుకుంటున్నారు. ఈ విధానాన్ని ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన యువతులే కాకుండా హీరోయిన్లు కూడా ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో మెహరీన్ కూడా ఎగ్ ఫ్రీజింగ్‌ను ఎంపిక చేసుకుంది. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
అయితే, తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని మెహరీన్ ఫైర్ అయింది. ఈ అంశం గరించి తప్పుగా వార్తలను ప్రచురించిన వారు వారు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరింది. ' పలు మీడియా సంస్థల్లో పనిచేసే వారు వారి వృత్తి పట్ల చాలా గౌరవంగా ఉండాలి. ఇలాంటి అంశాలను అర్థం చేసుకుని వార్తలను అందించండి. ఎవరికితోచినట్లు వారు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో నేను పెట్టిన 'ఎగ్ ఫ్రీజింగ్' పోస్ట్‌పై కొందరు రకరకాల వార్తలు రాశారు. ఈ విధానంలో అమ్మాయిలు గర్భవతులు కావాల్సిన అవసరం లేదు. మొదట ఈ విషయాన్నిఅందరూ తెలుసుకోవాలి.
నేను ఒక సెలబ్రిటీగా అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఆ పోస్ట్ పెట్టాను. పిల్లలు అప్పుడే వద్దని భావించే వారందరికీ ఎగ్ ఫ్రీజింగ్ ఉపయోగపడుతుంది. కానీ ఇలాంటివి ఏమీ తెలుసుకోకుండా మీ స్వార్థం కోసం తప్పుడు వార్తలు రాశారు. నేను ప్రెగ్నెంట్ అని ప్రచారం చేశారు. ఇదీ చాలా తప్పుగా అనిపించలేదా..? ఇప్పటికైనా ఇలాంటి వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టిండి. మీ తప్పును తెలుసుకొని సరిచేసుకోండి లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వెంటనే నాపై పెట్టిన పోస్ట్‌లను తొలగించండి. ఆపై బహిరంగ క్షమాపణలు చెప్పండి.' అని మెహరీన్ కోరింది.
'ఎగ్ ఫ్రీజింగ్' పద్ధతి ఎందుకు పాటిస్తున్నారంటే..?
ఈ కాలంలో మహిళలు తమ కెరీర్, ఇతర కారణాల రీత్యా అమ్మతనాన్ని వాయిదా వేస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా వ్యాపారం, సినిమా రంగలో ఉండే మహిళలు పెళ్లి, అమ్మతనాన్ని వాయిదా వేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. లైఫ్‌లో అనుకున్నంతగా సెటిల్ అయ్యాక పిల్లల్ని కంటాం అని ఇప్పటికే చాలామంది దంపతులు చెప్పారు కూడా.. ఆ కోవకు చెందిన వారు తీరా పిల్లల్ని కనాలనుకునే సరికి.. వయసు దాటి పోవడం, అండాల నిల్వ, నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. అలాంటి వారికి 'ఎగ్ ఫ్రీజింగ్' పద్ధతి ఒక వరం అని చెప్పవచ్చు. 30 ఏళ్ల వయసులోపు ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన తమ అండాల్ని ఇలా భద్రపరుచుకుంటారు. ఆపై వారికి నచ్చినప్పుడు పిల్లల్ని కంటారు.
Comments
Please login to add a commentAdd a comment