Mehreen Kaur Pirzada Undergoes Acuskinlift Therapy - Sakshi
Sakshi News home page

Mehreen Pirzadaa: హీరోయిన్‌ ముఖానికి సూదులు.. ఫొటో వైరల్‌

Dec 1 2022 6:50 PM | Updated on Dec 1 2022 8:01 PM

Mehreen Kaur Pirzada Undergoes Acuskinlift Therapy - Sakshi

ఇది చూసిన మెహరీన్‌ ఫ్యాన్స్‌ ముఖానికి సూదులు గుచ్చుకోవడమేంటని కంగారుపడుతున్నారు. అయితే తన అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసమే ఇలా చేసింది మెహరీన్‌. తను ఆక్యుస్కిన్‌లఫ్ట్‌ అనే థెరపీ చేయించుకుంది.

కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది మెహరీన్‌ పిర్జాదా. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్‌ చిత్రాలతో సూపర్‌ హిట్స్‌ అందుకుంది. ఇటీవలే ఎఫ్‌ 3తో ప్రేక్షకులను అలరించిన మెహరీన్‌ తాజాగా సోషల్‌ మీడియాలో ఓ ఫొటో షేర్‌ చేయగా అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

ఇందులో మెహరీన్‌ ముఖమంతా సూదులతో గుచ్చి ఉంది. ఇది చూసిన మెహరీన్‌ ఫ్యాన్స్‌ ముఖానికి సూదులు గుచ్చుకోవడమేంటని కంగారుపడుతున్నారు. అయితే తన అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసమే ఇలా చేసింది మెహరీన్‌. తను ఆక్యుస్కిన్‌లఫ్ట్‌ అనే థెరపీ చేయించుకుంది. ఈ థెరపీ చేసి నా ముఖాన్ని మరింత కాంతివంతంగా మార్చిన వైద్యుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది.

చదవండి: జిన్నా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది
తుప్పాస్‌ పని చేశా, అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది: గీతూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement